• facebook
  • whatsapp
  • telegram

మరాఠా సామ్రాజ్యం

పక్క రాజ్యాల ప్రజల నుంచి పన్నుల వసూళ్లు!


భారతదేశంలో మొగల్‌ సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించి, దీటుగా ఎదుర్కొని, దాని పతనానికి ప్రధాన కారకుల్లో ఒకరుగా నిలిచిన మరాఠాలకు చరిత్రలో గొప్ప వీరులుగా పేరుంది. దక్కన్‌ పీఠభూమిలో నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ‘హిందువుల స్వయంపాలన’ నినాదంతో మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసి జనరంజకంగా పాలించిన ఘనత వీరిది. పరిపాలనలో విలువలు, నైతికతను పాటించారు. శివాజీ నాయకత్వంలో మరాఠాల ప్రభ ఉచ్ఛస్థితికి చేరింది. ఈ సామ్రాజ్య ఆవిర్భావం, వరుస పాలకులు, వారి వంశాలు, చేసిన యుద్ధాలు, పాలనా విధానాలు, పన్నుల వ్యవస్థ గురించి పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి.

1.    శివాజీకి యుద్ధ విద్యలు, పరిపాలనలో శిక్షణ ఇచ్చింది ఎవరు?

1) దాదాజీ కొండదేవ్‌       2) సమర్థ రామదాసు   

3) మాలిక్‌ అంబర్‌        4) బాజీరావ్‌


2.     కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) అఫ్జల్‌ ఖాన్‌ - శివాజీతో పోరాడిన బీజాపుర్‌ సేనాని

2) రాజా జైసింగ్‌ - శివాజీతో పోరాడిన ఔరంగజేబు అధికారి

3) షయిస్తీ ఖాన్‌ - శివాజీతో పోరాడిన గోల్కొండ అధికారి

4) ముఖరబ్‌ ఖాన్‌ - శంభాజీని అంతం చేసిన ఔరంగజేబు సేనాని


3.     మరాఠాలు గెరిల్లా యుద్ధ పద్ధతులను ఎవరి నుంచి నేర్చుకున్నారు?

1) బహమనీ రాజ్య ప్రధానమంత్రి మహమ్మద్‌ గవాన్‌

2) గోల్కొండ అధికారులు అక్కన్న, మాదన్న

3) అహమ్మద్‌ నగర్‌ ప్రధానమంత్రి మాలిక్‌ అంబర్‌

4) అక్బర్‌ ప్రధానమంత్రి తోడర్‌మల్‌


4.     శివాజీ ఏ వంశానికి చెందినవారు?

1) సింధియా       2) హోల్కర్‌   

3) గైక్వాడ్‌       4) భోంస్లే


5.     మూడో పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1561  2) 1556  3) 1526   4) 1761


6.     పీష్వాలకు వంశ పారంపర్య హక్కులు ఇచ్చింది ఎవరు?

1) శివాజీ       2) శంభాజీ   3) సాహు       4) రాజారామ్‌


7.     మరాఠాల కాలంలో సిల్హాదార్‌ అనేది?

1) ప్రభుత్వ శాశ్వత సైన్యం      2) తాత్కాలిక సైన్యం   

3) ద్వార సంరక్షకులు       4) వ్యవసాయ పన్ను


8.     శివాజీ జన్మస్థలం?

1) శివనేరు       2) శివదుర్గం   

3) రాయ్‌గఢ్‌       4) పుణె


9.     శివాజీకి సంబంధించిన కిందివాటిని కాలానుక్రమంలో అమర్చండి.

ఎ) పట్టాభిషేకం   బి) అఫ్జల్‌ఖాన్‌ను అంతం చేయడం   సి) సూరత్‌పై తొలి దాడి 

డి) పురంధర్‌ సంధి  ఇ) షయిస్తీ ఖాన్‌తో పోరాటం

1) బి, సి, డి, ఇ, ఎ       2) బి, ఇ, సి, డి, ఎ    

3) బి, సి, ఇ, డి, ఎ       4) బి, డి, ఎ, సి, ఇ


10. శివాజీ వంశం ఏ సుల్తానుల దగ్గర పనిచేస్తూ వెలుగులోకి వచ్చింది?

1) బహమనీ       2) బీజాపుర్‌   

3) అహ్మద్‌నగర్‌       4) బీదర్‌


11. మూడో పానిపట్టు యుద్ధ సమయంలో మరాఠా పీష్వా ఎవరు?

1) బాలాజీ విశ్వనాథ్‌       2) మొదటి బాజీరావ్‌   

3) బాలాజీ బాజీరావ్‌       4) రెండో బాజీరావ్‌


12. బీజాపుర్‌ సేనాని అఫ్జల్‌ఖాన్‌ సమాధిని శివాజీ ఎక్కడ నిర్మించారు?

1) రాయ్‌గఢ్‌      2) సింహగఢ్‌   

3) పుణె       4) ప్రతాప్‌గఢ్‌


13. ఔరంగజేబు కుమారుడైన యువరాజు అక్బర్‌కు ఆశ్రయం కల్పించిన మరాఠా రాజు ఎవరు?

1) రాజారామ్‌       2) శివాజీ   

3) శంభాజీ      4) సాహు


14. శివాజీ తన రాజధానిని పుణె నుంచి ఎక్కడికి మార్చారు?

1) సతారా       2) జింజి   

3) ప్రతాప్‌గఢ్‌       4) రాయ్‌గఢ్‌


15. మరాఠా రాజ్య చివరి పీష్వా ఎవరు?

1) రెండో బాజీరావ్‌       2) నారాయణ రావ్‌    

3) మాధవ్‌రావ్‌       4) మొదటి బాజీరావ్‌


16. శివాజీని అంతం చేయడానికి వచ్చి విఫలమైన మొగల్‌ సేనాని ఎవరు?

1) రాజా జైసింగ్‌       2) షయిస్తీ ఖాన్‌   

3) అఫ్జల్‌ఖాన్‌       4) మహబత్‌ ఖాన్‌


17. కిందివాటిని జతపరచండి.

ఎ) పీష్వా 1) సేనాపతి
బి) అమాత్య 2) విదేశాంగ శాఖ
సి) సరైన్‌బత్‌ 3) ఆర్థిక శాఖ
డి) సుమంత్‌ 4) ప్రధానమంత్రి

1) ఎ-4, బి-3, సి-1, డి-2   

2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-3, బి-4, సి-2, డి-1   

4) ఎ-3, బి-4, సి-1, డి-2  


18. శివాజీ పక్క రాజ్యాల ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను ఏది?    

1) ఛౌత్‌       2) సర్దేశ్‌ముఖ్‌   

3) యుద్ధపన్ను       4) భూమిశిస్తు


19. అష్ట ప్రధానులపైన పర్యవేక్షణ అధికారాలతో 9వ మంత్రి ప్రతినిధిని నియమించింది ఎవరు?

1) శివాజీ       2) శంభాజీ   

3) రాజారామ్‌       4) సాహు


20. కిందివారిని జతపరచండి.

ఎ) కొత్వాల్‌ 1) గ్రామాధికారి
బి) కార్కున్‌ 2) పట్టణాధికారి
సి) పాటిల్‌ 3) రాష్ట్ర గవర్నర్‌ 
డి) తరఫ్‌దార్‌ 4) జిల్లాధికారి

1) ఎ-3, బి-2, సి-4, డి-1       2) ఎ-3, బి-2, సి-1, డి-4

3) ఎ-2, బి-3, సి-1, డి-4   4) ఎ-2, బి-3, సి-4, డి-1


21. శివాజీ ఎంత శాతం భూమిశిస్తు వసూలు చేశారు?

1) 33%  2) 50%   3) 40%  4) 25%


22. శివాజీ ఏ రాజపుత్ర వంశానికి చెందినవాడని ప్రకటించుకున్నాడు?

1) రాథోర్‌ వంశం       2) కచ్ఛవ వంశం       

3) శిశోడియా వంశం       4) భట్టి వంశం 


23. కిందివారిని జతపరచండి.

ఎ) మజుందార్‌ 1) కోశాధికారి
బి) ఫడ్నవీస్‌ 2) ఆడిటర్‌
సి) జమేదార్‌ 3) ఉత్తర ప్రత్యుత్తరాలు
డి) చిట్నీస్‌ 4) అకౌంట్స్‌

1) ఎ-4, బి-2, సి-3, డి-1   2) ఎ-4, బి-2, సి-1, డి-3

3) ఎ-2, బి-4, సి-3, డి-1   4) ఎ-2, బి-4, సి-1, డి-3


24. సిద్దీలతో పోరాటానికి శివాజీ నౌకా స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?

1) జింజి  2) కోలబ  3) కొంకణ్‌  4) రాయ్‌గఢ్‌


25. సిద్దీలు అనే పిలిచే ‘హబ్షిలు’ ఏ దేశానికి చెందినవారు?

1) నైజీరియా       2) మొరాకో  

3) ఎరిత్రియ       4) ఇథియోపియా


26. శివాజీ పాలకమండలి ఏ పేరుతో ప్రసిద్ధి?

1) పరిషత్‌       2) మంత్రి పరిషత్‌  

3) అష్ట ప్రధాన్‌       4) రాజ్య పరిషత్‌


27. శివాజీ ‘పురంధర్‌ సంధి’ చేసుకున్న సంవత్సరం?

1) 1650  2) 1645   3) 1660  4) 1665


28. స్వతంత్ర రాజుగా శివాజీ ఎక్కడ పట్టాభిషిక్తుడయ్యాడు?

1) రాయ్‌గఢ్‌       2) ఔరంగాబాద్‌   

3) పుణె       4) నాగ్‌పుర్‌


29. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి.

1) శివాజీ మీద మరాఠా భక్తి ఉద్యమకారుల ప్రభావం ఉంది.

2) శివాజీ సూరత్‌ను ఒక్కసారి దోచుకున్నారు.

3) శివాజీ తరువాత శంభాజీ మరాఠా రాజయ్యాడు.

4) శివాజీ ఛత్రపతి బిరుదు పొందిన మొదటి మరాఠా పాలకుడు.


30. సయ్యద్‌ సోదరులతో ‘దిల్లీ ఒప్పందం’ చేసుకున్న మరాఠా పీష్వా ఎవరు?

1) మొదటి బాజీరావ్‌       2) రెండో బాజీరావ్‌   

3) బాలాజీ బాజీరావ్‌       4) బాలాజీ విశ్వనాథ్‌


31. ‘అటక్‌ నుంచి కటక్‌’ అనే విజయవంతమైన నానుడికి కిందివారిలో దేనితో దగ్గర సంబంధం ఉంది?    

1) మొగల్స్‌       2) మరాఠా   

3) సింధియా       4) రాజ్‌పుత్‌


32. కిందివాటిలో మూడో మరాఠా యుద్ధానికి సంబంధించి సరికానిది?    

1) ఈ యుద్ధ సమయంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావ్‌. 

2) ఈ యుద్ధం అహ్మద్‌ షా అబ్దాలీతో జరిగింది.

3) మరాఠా వీరుడు సదాశివరావ్‌ మరణించాడు.

4) ఈ యుద్ధంలో గెరిల్లా తంత్రాన్ని పాటించలేదు.


33. కిందివాటిలో ఏ యుద్ధాన్ని ‘పిండారీ యుద్ధం’ అంటారు?

1) మొదటి ఆంగ్లో - మరాఠా యుద్ధం   

2) రెండో ఆంగ్లో - మరాఠా యుద్ధం

3) మూడో ఆంగ్లో - మరాఠా యుద్ధం   

4) నాలుగో ఆంగ్లో - మరాఠా యుద్ధం


34. బాలాజీ బాజీరావ్‌ అనంతరం మరాఠా పీష్వా ఎవరు?

1) బాలాజీ విశ్వనాథ్‌      2) మొదటి మాధవ్‌రావ్‌ 

3) నారాయణరావ్‌       4) రెండో బాజీరావ్‌


35. మూడో ఆంగ్లో - మరాఠా యుద్ధ సమయంలో బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

1) వారెన్‌ హేస్టింగ్‌       2) లార్డ్‌ వెల్లస్లీ    

3) లార్డ్‌ హేస్టింగ్‌       4) కారన్‌ వాలీస్‌


36. కింది పీష్వాలలో రెండో శివాజీ అని ఎవరిని పిలుస్తారు?

1) మొదటి బాజీరావ్‌       2) రెండో బాజీరావ్‌

3) బాలాజీ బాజీరావ్‌       4) మొదటి మాధవ్‌రావ్‌


37. సంగమేశ్వర్‌ యుద్ధంలో మరణించిన మరాఠా పాలకుడు?

1) శివాజీ       2) శంభాజీ    

3) రాజారామ్‌        4) సాహు


38. మూడో మరాఠా యుద్ధ ఫలితం?

1) మహారాష్ట్ర కూటమి ఓటమి చెందడం

2) మొగల్‌ బలహీనత బహిర్గతమవడం

3) ఆంగ్లేయుల విజృంభనకు దారి తీయడం  4) పైవన్నీ


39. శివాజీకి పట్టాభిషేకం జరిపిన పండితుడు ఎవరు?

1) విశ్వేశ్వర భట్‌       2) త్రయంబక్‌   

3) బాలాజీ విశ్వనాథ్‌       4) తానాజీ


40. శంభాజీ అనంతరం మరాఠా పాలకుడు ఎవరు?

1) మొదటి బాజీరావ్‌           2) సాహు   

3) రాజారామ్‌           4) తారాభాయ్‌సమాధానాలు


1-1; 2-3; 3-3; 4-4; 5-4; 6-3; 7-2; 8-1; 9-2; 10-3; 11-3; 12-4; 13-3; 14-4; 15-1; 16-2; 17-1; 18-1; 19-3; 20-3; 21-3; 22-3; 23-2; 24-2; 25-4; 26-3; 27-4; 28-1; 29-2; 30-4; 31-2; 32-1; 33-3; 34-2; 35-3; 36-1; 37-2; 38-4; 39-1; 40-3.


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 
 

Posted Date : 29-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.