• facebook
  • whatsapp
  • telegram

మొదటి సామ్రాజ్యాలు

చక్రవర్తి అధీనంలో పాటలీపుత్రం!


 ప్రాచీన భారతదేశంలో తొలి రాజ్యాలు, సామ్రాజ్యాల ఆవిర్భవానికి ముందు తెగల సమూహంతో ఉన్న జనపదాలు, మహాజనపదాలు ఉండేవి.  శక్తిమంతులైన పాలకుల కారణంగా ఆ ప్రాంతాలు సువిశాల రాజ్యాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఉత్తరాదిన గుప్తులు, మౌర్యులు, దక్షిణాదిన శాతవాహనులు, పల్లవులు మహా సామ్రాజ్యాలను నిర్మించారు. పురావస్తు, విదేశీ ఆధారాలతో రూఢీ అయిన భారతీయ తొలి సామ్రాజ్యాల ఆసక్తికర చారిత్రక విశేషాలు, వాటి పరిధి, నాటి గొప్ప పాలకులు, వివిధ రంగాల ప్రముఖులు, వారి విశిష్టతల గురించి పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆనాటి పాలనా విధానాలు, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను తెలుసుకోవాలి.

1.     ఉత్తర, దక్షిణ భారత భూభాగాలను ఏకం చేసి పరిపాలించిన గుప్తుల రాజధాని నగరం?

1) ప్రతిష్ఠానపురం     2) ఫైఠాన్‌ 

3) పాటలీపుత్రం     4) రాజగృహ


2.     కిందివారిని వరుసలో అమర్చండి.

ఎ) సముద్రగుప్తుడు     బి) చంద్రగుప్తుడు      సి) విక్రమాదిత్యుడు

1) ఎ, బి, సి       2) బి, సి, ఎ   

3) బి, ఎ, సి       4) సి, బి, ఎ


3.     సముద్రగుప్తుడికి సంబంధించి సరికాని వాక్యాలు?

ఎ) ఇతడిని భారతదేశ నెపోలియన్‌ అంటారు.

బి) ఇతడు ఉత్తర భారతదేశంలో 12 మంది రాజులను ఓడించాడు.

సి) ఇతడు దక్షిణ భారతదేశంలో 9 మంది రాజులను ఓడించాడు.

డి) దక్షిణ భారతదేశంలో 12 మంది రాజులను, ఉత్తర భారతదేశంలో 9 మంది రాజులను ఓడించాడు.

1) ఎ, బి   2) ఎ, బి, సి  3) ఎ, డి 4) బి, సి


4.     నవరత్నాల్లో ప్రముఖుడు?

1) శంకు     2) క్షేపణికుడు  

3) కాళిదాసు     4) ఆర్యభట్ట


5.     నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

1) చంద్రగుప్తుడు      2) రెండో చంద్రగుప్తుడు  

3) చంద్రగుప్త మౌర్యుడు      4) ఉపగుప్తుడు 


6.     కిందివాటిని జత చేయండి.

1) శంకు ఎ) భవన నిర్మాణదారు
2) అమరసింహుడు బి) నిఘంటు కర్త
3) వరాహమిహిర సి) ఖగోళ శాస్త్రవేత్త
4) ధన్వంతరి డి) ఆయుర్వేద వైద్యుడు
  ఇ) మంత్ర శాస్త్రవేత్త

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-బి, 2-ఇ, 3-డి, 4-ఎ

3) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి    4) 1-ఇ, 2-బి, 3-సి, 4-డి


7. గుప్తుల కాలం నాటి పెయింటింగ్‌లు, వాస్తుశిల్పకళ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?

ఎ) అజంతా     బి) ఎల్లోరా      సి) బొర్రా      డి) బెలూమ్‌

1) ఎ, బి, సి, డి     2) ఎ, సి  

3) ఎ, బి      4) ఎ, సి, డి


8. కిందివాటిలో ఆర్యభట్ట శాస్త్రవేత్తకు సంబంధించి సరికానివి?

1) ఆర్యభట్ట ప్రముఖ ఖగోళ, గణిత శాస్త్రవేత్త.

2) బీజగణితాన్ని ఇతడి కంటే ముందే ఉపయోగించారు.

3) 1-9 సంఖ్యలకు గుర్తులు కనుక్కున్నారు.

4) అల్గారిథమ్స్‌ను రూపొందించారు.


9. సౌర సంవత్సరాన్ని (సోలార్‌ ఇయర్‌) కచ్చితంగా లెక్కించినవారు?

1) ఆర్యభట్ట     2) బ్రహ్మగుప్తుడు  

3) వరాహమిహిర     4) శంకు


10. భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించడానికి ఎవరి దాడులు ప్రధాన కారణమయ్యాయి?

1) కుషాణులు     2) శాతవాహనులు 

3) హూణులు     4) గ్రీకులు


11. పల్లవులు మధ్య, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కాలం?

1) క్రీ.శ.300 - 600    2) క్రీ.శ.300 - 900

3) క్రీ.శ.600 - 900    4) క్రీ.శ.900 - 1200 


12. పల్లవుల రాజధాని?

1) వీరయ్యూర్‌       2) తంజావూరు  

3) కాంచీపురం      4) కాశి


13. పల్లవులు పరిపాలించిన ప్రధాన భూభాగం?

1) దక్షిణ ఆంధ్ర - ఉత్తర తమిళనాడు   

2) ఉత్తర ఆంధ్ర - దక్షిణ తమిళనాడు

3) ఆంధ్ర - తమిళనాడు మొత్తం       

4) పశ్చిమ ఆంధ్ర - తూర్పు తమిళనాడు


14. కిందివారిని వరుసలో అమర్చండి.

ఎ) జయసింహుడు      బి) మహేంద్ర వర్మ     సి) నరసింహ వర్మ

1) ఎ, బి, సి      2) ఎ, సి, బి   

3) బి, సి, ఎ       4) సి, బి, ఎ  


15. నూతన ద్రవిడ వాస్తు శిల్పకళను..... అని కూడా అంటారు.

1) మహేంద్రరీతి      2) మహామల్లరీతి   

3) రాజసింహుడిరీతి      4) ఏదీకాదు


16. ‘మహామల్లుడు’ అని పేరొందిన రాజు?

1) మహేంద్రవర్మ      2) ఒకటో నరసింహవర్మ      3) రెండో నరసింహవర్మ      4) రాజసింహుడు


17.    ‘మహాబలిపురం’ అనే రేవు పట్టణాన్ని ఎవరు నిర్మించారు?

1) ఒకటో నరసింహవర్మ    2) రెండో నరసింహవర్మ     

3) ఒకటో మహేంద్రవర్మ     4) రెండో మహేంద్రవర్మ


18.    మెత్తని మట్టి, రాయితో దేవాలయాలను నిర్మించినవారు?

1) ఒకటో నరసింహవర్మ     2) రెండో నరసింహవర్మ     

3) రాజసింహుడు       4) ఒకటో మహేంద్రవర్మ


19. దక్షిణ, మధ్య భారతదేశంలో చాళుక్యుల పరిపాలన కాలం?

1) క్రీ.శ.600  - 1200   2) క్రీ.శ.900  - 1200    

3) క్రీ.శ.600 - 900    4) క్రీ.శ.300  - 1200 


20. ఐహోలు శాసనాన్ని వేయించినవారు?

1) రెండో పులకేశి      2) ఒకటో పులకేశి  

3) రవికీర్తి      4) విక్రమాదిత్యుడు


21.    దక్షిణ భారతదేశంలోని ‘ద్రవిడ’, ఉత్తర భారతంలోని ‘నగారా’ వాస్తు శిల్పకళ సమ్మేళనం?

1) గాంధార  2) వెశారా  3) మధుర  4) కళింగ


22. ‘పట్టడకల్‌’ అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది?

1) కర్ణాటక     2) ఆంధ్రప్రదేశ్‌  

3) తమిళనాడు      4) కేరళ


23. మగధలో మౌర్య వంశ స్థాపకుడు?

1) చంద్రగుప్త మౌర్యుడు    2) అశోకుడు      

3) బింబిసారుడు    4) అజాత శత్రువు


24. చంద్రగుప్త మౌర్యుడి మనుమడు?

1) బింబిసారుడు      2) బిందుసారుడు  

3) అశోకుడు      4) అజాతశత్రువు


25. కిందివాటిని సరైన క్రమంలో రాయండి.

ఎ) హార్యంక బి) నంద  సి) శిశునాగ డి) మౌర్య

1) ఎ, బి, సి, డి      2) ఎ, సి, బి, డి   

3) ఎ, బి, డి, సి       4) బి, డి, సి, ఎ 


26. కిందివారిని సరైన క్రమంలో రాయండి.

ఎ) బిందుసార      బి) బింబిసార       సి) మహాపద్మనంద      డి) అశోకుడు

1) ఎ, బి, సి, డి      2) డి, సి, బి, ఎ   

3) బి, ఎ, డి, సి    4) బి, సి, ఎ, డి


27. పెద్ద రాజ్యాలను పాలించిన రాజులను ఏమంటారు?

1) పెద్ద రాజులు      2) గొప్ప రాజులు  3) చక్రవర్తులు      4) రాజాధిరాజా


28. కిందివాటిలో సరికాని వాక్యం?

ఎ) మగధ సామ్రాజ్యంలో హిందూకుష్‌ పర్వతాలున్నాయి.

బి) భారతదేశపు పెద్ద ఎడారి మగధ సామ్రాజ్యంలో ఉంది.

సి) మగధ సామ్రాజ్యంలో మాల్వా పీఠభూమి ఉంది.

డి) కృష్ణ, తుంగభద్ర, గోదావరి లోయలు మగధలో ఉన్నాయి.

1) ఎ, బి, సి       2) బి, సి, డి   

3) ఎ, బి, సి, డి      4) ఎ, డి


29. మగధ సామ్రాజ్యంలో సారవంతమైన మైదానాలు?

1) మాల్వా 2) కృష్ణా నది 3) పంజాబ్‌ 4) పైవన్నీ


30. మగధలో పాటలీపుత్రం ఎవరి అధీనంలో ఉండేది?

1) రాజు 2) యువరాజు 3) చక్రవర్తి 4) పై అందరూ


31. మగధలో చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేవారిని ఏమంటారు?

1) దూతలు  2) వేగులు 3) 1, 2  4) సేవకులు


32. కిందివాటిలో మగధ సామ్రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) చక్రవర్తి ప్రాదేశిక రాజధానులు పాలించడానికి రాజకుమారులను పంపేవారు.

బి) రాజకుమారులు సొంత సైన్యం నియమించుకునేవారు.

సి) గవర్నర్‌లు దూతలు చెప్పిన నియమాలు అమలు చేయాల్సిన అవసరం లేదు.

డి) రాజకుమారులను గవర్నర్‌ అని పిలిచేవారు.

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, డి   

3) సి, డి      4) బి, సి, డి


33. మగధలో విదేశీ వస్తువులు అధికంగా దొరికే ప్రాంతం?

1) సువర్ణగిరి 2) తక్షశిల 3) కౌశాంబి 4) పైవన్నీ


34. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథంలో పేర్కొన్న అంశాలు?

ఎ) రాజు రాజ్యాలను ఎలా జయించాలి?

బి) రాజు రాజ్యాలను ఎలా పరిపాలించాలి?

సి) వృత్తి పనివారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలి?

డి) భారత ఉపఖండంలో లభించే వనరులు ఏమిటి?

1) ఎ, బి, సి, డి    2) బి, సి, డి   

3) సి, డి      4) ఎ, బి, సి


35. రాజనీతి అర్థశాస్త్రం గ్రంథం రచించింది?

1) మెగస్తనీస్‌       2) చాణక్యుడు (కౌటిల్యుడు)  

3) గుణాఢ్యుడు      4) విశాఖదత్తుడు


36. ‘ఇండికా’ గ్రంథాన్ని రచించిన మెగస్తనీస్‌ ఏ ప్రాంత రాయబారిగా పని చేశారు?

1) పర్షియా      2) గ్రీకు  

3) అరేబియా      4) ఇంగ్లండ్‌


37. భారతదేశంలో శాసనాలు వేయించిన మొదటి రాజు?

1) చంద్రగుప్తుడు      2) అశోకుడు  

3) ఒకటో డారియస్‌      4) రెండో డారియస్‌


38. అశోకుడి శాసనాలు ఏ భాష, లిపిలో ఉన్నాయి?

1) ప్రాకృత  2) బ్రాహ్మీ 3) సంస్కృతం 4) 1, 2


39. అశోకుడు రాజైన ఎన్ని సంవత్సరాలకు కళింగను జయించాడు?

1) 6      2) 7     3) 8     4) 10


40. ‘అశోక ధర్మ’ అంటే ఏమిటి?

1) అశోక ధర్మలో జంతుబలులు లేవు

2) తండ్రి పిల్లలకు బోధించినట్లు తను ప్రజలకు బోధించాడు

3) 1, 2    4) ఏదీకాదు


41. అశోకుడు ధర్మ ప్రచారానికి నియమించిన మంత్రులు?

1) పెద్ద మంత్రులు      2) ధర్మ మంత్రులు  

3) ధర్మ మహామంత్రులు    4) అందరూ


42. అశోకుడు బౌద్ధ ధర్మాన్ని/అశోక ధర్మాన్ని ఏ ప్రాంతాలకు ప్రచారం చేశాడు?

1) సిరియా      2) ఈజిప్టు  

3) శ్రీలంక      4) పైవన్నీ


 

సమాధానాలు

1-3; 2-3; 3-4; 4-3; 5-2; 6-1; 7-3; 8-2; 9-2; 10-3; 11-2; 12-3; 13-1; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-1; 20-3; 21-2; 22-1; 23-1; 24-3; 25-2; 26-4; 27-3; 28-3; 29-4; 30-3; 31-1; 32-2; 33-2; 34-1; 35-2; 36-2; 37-2; 38-4; 39-3; 40-3; 41-3; 42-4. 

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌