• facebook
  • whatsapp
  • telegram

పారిశ్రామిక విప్లవం

ఆవిరియంత్రం ఆవిష్కరణతో విప్లవం మొదలు! 


 ప్రపంచ సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చిన పరిణామం పారిశ్రామిక విప్లవం. వినియోగ వస్తువుల తయారీలో యంత్రాల రాకతో నిరంతర వృద్ధికి బాటలు పడ్డాయి. పారిశ్రామిక, సాంకేతిక ఆవిష్కరణలతో ప్రగతి ఊపందుకుంది. కార్మిక వర్గం పెరుగుదల పరోక్షంగా జనాభా వృద్ధికి దారితీసింది. సగటు ఆదాయం  పెరగడంతో మధ్యతరగతి విస్తరించింది. పాశ్చాత్య దేశాల్లో జీవన ప్రమాణాలు పెరిగి, సంపద పోగవడంతో అసమానతలు ఏర్పడి వలసవాదానికి బీజాలు పడ్డాయి. ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రధాన మలుపు అయిన పారిశ్రామిక విప్లవం పూర్వాపరాల గురించి పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ఇంగ్లండ్‌లో ఈ విప్లవానికి దారి తీసిన పరిస్థితులు, అనంతర పరిణామాలు, అప్పటి కార్మికవర్గం స్థితిగతులను తెలుసుకోవాలి.


 

1.     పారిశ్రామిక విప్లవం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది?

1) 18వ  2) 19వ  3) 20వ  4) 21వ 


2.     పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన దేశం?

1) ఫ్రాన్స్‌      2) ఇంగ్ల్లండ్‌  

3) ఇటలీ      4) జర్మనీ


3.     పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఇంగ్లిష్‌లో సూచించిన మొదటి తత్వవేత్త ఎవరు?

1) ఆర్నాల్డ్‌ టాయిన్‌బీ      2) ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌

3) జార్జి మిచెలెట్‌       4) హెన్రీ కానట్‌


4. పారిశ్రామిక విప్లవానికి ముందు యంత్రాలు దేనితో నడిచేవి?

1) విద్యుత్‌చ్ఛక్తి      2) ఆవిరి శక్తి  3) జలశక్తి      4) ఏదీకాదు


5.    పారిశ్రామిక విప్లవం ఆవిర్భావం ఏ దేశంలో జరిగింది?

1) ఫ్రాన్స్‌      2) అమెరికా  

3) ఇంగ్లండ్‌      4) జపాన్‌


6.     ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం సంభవించడానికి కారణం?

1) రాజకీయ స్థిరత్వం

2) వస్త్ర పరిశ్రమకు అనువైన వాతావరణం

3) సమృద్ధిగా బొగ్గు, ఇనుము లభ్యత

4) పైవన్నీ


7.     పారిశ్రామిక విప్లవం తొలుత ఏ రంగంలో ప్రారంభమైంది?

1) ఉక్కు       2) తోలు   

3) వస్త్రం       4) పైవన్నీ


8.     స్పిన్నింగ్‌జెనీ అనే యంత్రాన్ని అభివృద్ధి పరిచింది?

1) జేమ్స్‌హర్‌ గ్రీవ్స్‌        2) విలియం ఆడమ్‌  

3) రిచర్డ్‌ ఆర్క్‌రైట్‌      4) జాన్‌ విల్కిన్‌సన్‌


9.     కిందివాటిని జతపరచండి.

ఎ) ఫ్లయింగ్‌ షటిల్‌ 1) జాన్‌కే
బి) వాటర్‌ఫ్రేమ్‌ 2) రిచర్డ్‌ ఆర్క్‌రైట్‌
సి) మ్యూల్‌ యంత్రం 3) శ్యామ్యుల్‌ మూల్‌
డి) పవర్‌లూమ్‌ 4) ఎడ్మండ్‌ కార్ట్‌రైట్‌

1) ఎ-1, బి-2, సి-3, డి-4     2) ఎ-1, బి-2, సి-4, డి-3

3) ఎ-4, బి-3, సి-2, డి-1   4) ఎ-4, బి-3, సి-1, డి-2


10. ప్రపంచంలోనే మొదటి ఇనుప వంతెన ఏ నదిపై నిర్మించారు?

1) మెర్సీ       2) సెవర్న్‌   

3) పెన్నార్‌      4) నైలు


11.     సేఫ్టీలాంప్‌ను కనుక్కున్నవారు?

1) థామస్‌ మెట్‌కాఫ్‌ 2) థామస్‌ అల్వా ఎడిసన్‌  

3) హంఫ్రిడేవి       4) రిచర్డ్‌ ఆర్క్‌రైట్‌


12. ఇంగ్లండ్‌లోని మిగతా ప్రాంతాల కంటే లాంక్‌షైర్‌ నూలు ఉత్పత్తికి అనువైన ప్రదేశంగా మారడానికి కారణం?

1) లాంక్‌షైర్‌ అధిక వర్షపాతం కలిగి ఉండటం  2) గాలిలో తేమ ఉండటం

3) పినైన్, రోసందై నదీ లోయలు నీటిశక్తిని అందించడం  4) పైవన్నీ


13. కిందివాటిలో ఇనుప పరిశ్రమకు సంబంధించి  సరికానిది?

1) రెండో డర్బీ దుక్క ఇనుమును తయారు చేశాడు

2) హెన్రీ కార్ట్‌ రోలింగ్‌ మిల్లును కనుక్కున్నాడు

3) నెలిసన్‌ ఇనుము తయారీకి నూతన కొలిమి  కనుక్కున్నాడు

4) ఆర్క్‌రైట్‌ విద్యుత్‌ కొలిమి కనుక్కున్నాడు


14. కిందివారిలో ఒకరు ఆవిరి యంత్రం ఆవిష్కర్త కాదు?

1) థామస్‌ సావోరి      2) జేమ్స్‌ న్యూకామెన్‌  

3) జాన్‌మాక్‌ ఆడమ్‌      4) జేమ్స్‌వాట్‌


15. జేమ్స్‌వాట్‌ ఆవిష్కరించిన ఆవిరి యంత్రం ప్రస్తుతం ఏ మ్యూజియంలో ఉంది?

1) విక్టోరియా మ్యూజియం        2) ఎడింబరా మ్యూజియం  

3) వరల్డ్‌ మ్యూజియం   4) లండన్‌ మ్యూజియం


16. కంకర రోడ్డు నిర్మించే పద్ధతిని కనుక్కున్నవారు?

1) జాన్‌మాక్‌ ఆడమ్‌       2) పెశ్రమార్టిన్‌   

3) రెండో చార్లెస్‌       4) థామస్‌ సావోరి


17. జేమ్స్‌వాట్‌ ఆవిరి యంత్రం తయారీ గుత్తాధిపత్యాన్ని పొందినవారు?

1) ఆర్క్‌రైట్, వాట్‌       2) మాథ్యూబౌల్టన్, వాట్‌  

3) చార్లెస్, వాట్‌       4) స్టీవెన్‌సన్, వాట్‌


18. జేమ్స్‌వాట్‌ ఆవిరి యంత్రం ఏ సంవత్సరంలో తయారు చేశారు?

1) 1765  2) 1769  3) 1770  4) 1785


19. మొదటి ఇంగ్లిష్‌ కాలువ అయిన వర్ల్సీ కాలువను దేని కోసం నిర్మించారు?

1) వస్త్రాలను రవాణా చేయడానికి  

2) మాంచెస్టర్‌కు బొగ్గును చేరవేయడానికి

3) చేపల పెంపకాన్ని ప్రోత్సహించడానికి

4) యార్క్‌షెర్‌ను లింకాషెర్‌తో కలపడానికి


20. ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఏ    ప్రాంతాలకు వేశారు?

1) స్టాక్‌టన్, డార్లింగ్‌టన్‌       2) మాంచెస్టర్, బర్మింగ్‌హోమ్‌

3) మాంచెస్టర్, స్టాక్‌టన్‌  4) లివర్‌పూల్, మాంచెస్టర్‌


21. కిందివారిలో ఎవరిని రైల్వే లోకోమోట్‌ల పిత అని పిలుస్తారు?

1) రాబర్ట్‌ స్టీఫెన్‌సన్‌      2) ఫ్రాన్సిస్‌ ఎగార్టన్‌   

3) విలియం హ్యాడ్లి      4) జేమ్స్‌ వాట్‌


22. ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస శృంఖలాలు తప్ప’ అనే నినాదం ఇచ్చిన వారెవరు?

1) ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌       2) కారల్‌ మార్క్స్‌  

3) జేమ్స్‌ న్యూకామెన్‌      4) లెనిన్‌


23. కారల్‌ మార్క్స్‌ ఏ దేశానికి చెందినవారు?

1) జర్మనీ      2) ఇంగ్లండ్‌  

3) ఇటలీ      4) స్పెయిన్‌


24. దేని ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది?

1) ఆవిరి యంత్రం          2) టెలిఫోన్‌   

3) టెలివిజన్‌           4) 1, 2


25. కిందివాటిని జతపరచండి.

ఎ) ఆవిరి యంత్రం 1) జేమ్స్‌ వాట్‌
బి) కాటన్‌ జిన్‌ 2) అంటీవిట్నీ
సి) టెలిఫోన్‌ 3) అలెగ్జాండర్‌ గ్రహంబెల్‌
డి) ఎలక్ట్రికల్‌ బల్బ్‌ 4) థామస్‌ ఎడిసన్‌

1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-1, బి-4, సి-3, డి-2 

3) ఎ-1, బి-3, సి-4, డి-2    4) ఎ-4, బి-3, సి-2, డి-1


26. కిందివాటిలో పారిశ్రామిక విప్లవం ప్రభావం ఏది?

1) వనరుల దోపిడీ       2) సుదీర్ఘ పనిగంటలు  

3) మధ్యతరగతి విస్తరణ    4) పైవన్నీ


27. కిందివాటిలో కారల్‌ మార్క్స్‌ రచన ఏది?

1) దాస్‌ కాపిటల్‌  2) కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో  

3) 1, 2        4) సోషల్‌ కాంట్రాక్ట్‌


28. పారిశ్రామిక విప్లవం చివరిగా వచ్చిన దేశం?

1) ఇంగ్లండ్‌ 2) జర్మనీ 3) అమెరికా 4) రష్యా


29. మహిళలు పని చేసే సమయాన్ని 10 గంటలకు తగ్గించిన చట్టం?

1) 1819 చట్టం       2) 1833 చట్టం   

3) 1847 చట్టం      4) 1860 చట్టం


30. కారల్‌ మార్క్స్‌ కమ్యూనిస్ట్‌ మ్యానిఫెస్టో గ్రంథాన్ని ఎవరితో కలిసి రచించాడు?

1) ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌       2) రూసో   

3) రెండో చార్లెస్‌      4) లెనిన్‌


31. రాబర్ట్‌ పుల్టన్‌ ఏ నౌకపై 1807లో హడ్సన్‌ నదిపై ప్రయాణించాడు?

1) క్లెర్‌మాంట్‌       2) ది గ్రేట్‌ వెస్టర్స్‌  

3) దబ్లచర్‌      4) పప్పింగ్‌ డెవెల్‌


32. కిందివాటిని జతపరచండి.

ఎ) శామ్యూల్‌ మోర్స్‌ 1) ఇనుము నుంచి గంధకం వేరు చేయడం
బి) సీమెన్స్‌   2) కాలువల నిర్మాణం
సి) జేమ్స్‌ బ్రాండ్లీ 3) విద్యుత్‌ కొలిమి
డి) పెర్సీగిల్‌ క్రిస్ట్‌ 4) టెలిగ్రాఫ్‌

1) ఎ-1, బి-2, సి-3, డి-4       2) ఎ-4, బి-3, సి-2, డి-1 

3) ఎ-1, బి-4, సి-2, డి-3      4) ఎ-4, బి-1, సి-3, డి-2


33. ‘ఇన్‌ మాన్‌ఫ్యాక్చరింగ్‌ టౌన్‌’ అనే గ్రంథాన్ని  రచించింది ఎవరు?

1) కారల్‌ మార్క్స్‌       2) ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌   

3) ఎడ్వర్డ్‌ కార్పెంటర్‌       4) రిచర్డ్‌ ఆర్క్‌రైట్‌ 


34. ‘పీటర్లూ మారణకాండ’కు సంబంధించి సరికానిది?

1) ఇది 1819లో జరిగింది.

2) మాంచెస్టర్‌లోని సెయింట్‌ పీటర్‌ ఫీల్డ్స్‌ వద్ద  జరిగింది.

3) రాజకీయ సమావేశాలు, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగింది.    4) పీటర్లు బ్రిటన్‌లో సైనిక వర్గం.


35. లుద్దిజం లక్ష్యం ఏమిటి?

1) కనీస వేతనాలు, స్త్రీలు, మహిళలపై పనిభారం తగ్గించడం

2) యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి

3) కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు  4) పైవన్నీ


36. లుద్దిజం నాయకుడు?

1) జనరల్‌ లూడ్‌       2) కారల్‌ మార్క్స్‌   

3) రూసో      4) ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌


37. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం?

1) భారత్‌ 2) చైనా 3) జపాన్‌  4) ఇండొనేసియా


38. ఫ్రాన్స్‌లో పారిశ్రామికీకరణ అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది?

1) నెపోలియన్‌      2) లూయీ ఫిలిప్‌   

3) మూడో నెపోలియన్‌      4) రెండో చార్లెస్‌


39. ఇంగ్లండ్‌ ‘మెరినో ఉన్ని’ని ఎక్కడ నుంచి దిగుమతి చేసుకుంది?

1) స్పెయిన్‌  2) ఐర్లాండ్‌  3) భారత్‌  4) చైనా


40. ఆర్క్‌రైట్‌ ఎవరితో కలిసి డెర్బిషైర్‌లోని క్రాయ్‌ ఫోర్డ్‌లో నూలు ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాడు?

1) జేమ్స్‌హర్‌ గ్రీవ్‌           2) విలియం ఆడమ్‌  

3) జేడీడీ యాష్వట్‌           4) శ్యామ్యూల్‌ క్రాంప్టన్‌సమాధానాలు

1-1, 2-1, 3-1, 4-3, 5-3, 6-4, 7-3, 8-1, 9-1, 10-2, 11-3, 12-4, 13-4, 14-3, 15-2, 16-1, 17-2, 18-2, 19-2, 20-1, 21-1, 22-2, 23-1, 24-1, 25-1, 26-4, 27-3, 28-4, 29-3, 30-1, 31-1, 32-2, 33-3, 34-4, 35-4, 36-1, 37-3, 38-3, 39-1, 40-3.రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 
 

Posted Date : 09-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.