• facebook
  • whatsapp
  • telegram

విజయనగర రాజులు

రాయల సైన్యంలో ముస్లిం పోరాట యోధులు! 

 
దక్షిణ భారతదేశ చరిత్ర, సంస్కృతిపై చెరగని ముద్ర వేసిన విజయనగర రాజులు సైనిక పరాక్రమాలకు, నిర్మాణ అద్భుతాలకు ప్రసిద్ధి చెందారు. సాహిత్యం, కళలను విశేషంగా ఆదరించారు. అనేక మంది పండితులను పోషించారు. సాంస్కృతిక పునరుజ్జీవానికి దోహదపడ్డారు. ఆర్థిక శ్రేయస్సును పెంపొందించి, స్థిరమైన పాలనను సాగించారు. హిందూ సంప్రదాయాలను ఆచరిస్తూ, పర మతాలను ఆదరించి, ఔన్నత్యాన్ని చాటిన ఆ చక్రవర్తుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. తర్వాత వచ్చిన రాజవంశాలకు ఆదర్శంగా నిలిచిన విజయనగర పాలకుల పాలనా విశిష్టతలపై అవగాహన పెంచుకోవాలి. 



1. విజయనగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు?

1) నర్మద     2) కృష్ణా    3) తుంగభద్ర   4) పైవన్నీ



2. విజయనగర సామ్రాజ్యాన్ని ఏ స్వామి ఆశీస్సులతో నిర్మించారు?

1) మల్లికార్జున స్వామి    2) విద్యారణ్య స్వామి   

3) నరసింహ స్వామి   4) పైవారందరూ



3 . విజయనగర సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు  వర్ధిల్లింది?

1) 200     2) 300    3) 400    4) 900



4. కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి. 

ఎ) సాళువ   బి) సంగమ   సి) అరవీటి   డి) తుళువ

1) ఎ, బి, సి, డి    2) బి, ఎ, డి, సి   

3) డి, సి, బి, ఎ    4) సి, బి, ఎ, డి



5.  తుంగభద్ర నదికి ఉత్తరాన స్థాపించిన సామ్రాజ్యం?

1) విజయనగర  2) బహమనీ   

3) కాకతీయ    4) చోళులు 



6.  బహమనీ సామ్రాజ్యానికి రాజధాని?

1) హంపి   2) గుల్బర్గా    3) కర్ణాటక    4) బెంగళూరు



7.  బహమనీ సామ్రాజ్యం ఎన్ని చిన్న రాజ్యాలుగా  విడిపోయింది?

1) మూడు    2) నాలుగు   3) అయిదు    4) రెండు



8.  బహమనీ సామ్రాజ్యాన్ని ఏ ప్రాంతం నుంచి వచ్చిన యోధులు పాలించారు?

1) ఇరాన్‌ - అరేబియా   2) పర్షియా - ఇరాన్‌   

3) అరేబియా - టర్కీ   4) అరేబియా - ఈజిప్టు



9.  కిందివాటిని జతపరచండి. 

ఎ) 1420    1) నికోలో-డి-కాంటి

బి) 1443    2) అబ్దుల్‌ రజాక్‌

సి) 1520   3) డోమింగో పెయిజ్‌

డి) 1537    4) న్యూనిజ్‌

1) ఎ-2, బి-4, సి-1, డి-3    2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-1, బి-2, సి-3, డి-4    4) ఎ-1, బి-2, సి-4, డి-3



10. విజయనగర నిర్మాణంలో కలిసి ఉన్న ఆలయం?

1) విరుపాక్ష ఆలయం  2) పంపాదేవి ఆలయం    

3) 1, 2      4) విద్యారణ్య స్వామి ఆలయం



11. అబ్దుల్‌ రజాక్‌ విజయనగరం ఎన్ని వలయాల్లో ఉందని రాశారు?

1) 3    2) 4    3) 5   4) 7



12. కిందివాటిలో డోమింగో పెయిజ్‌కు సంబంధించి సరికానిది?

ఎ) ఈయన విజయనగరం శత్రు దుర్భేధ్యమైన కోటలు కలిగి ఉందని రాశారు.

బి) కోట లోపల అందమైన భవనాలు ఉన్నాయని తెలిపారు. 

సి) సాయంత్ర సమయాల్లో వీధుల వెంబడి సంతలు నిర్వహించే వారని రాశారు.

డి) ఈ నగరం నాలుగు వలయాల్లో ఉందని రాశారు.

1) ఎ      2) సి    3) బి, సి     4) డి



13. కిందివాటిని జతపరచండి. (విజయనగర నిర్మాణం)

ఎ) 1వ భాగం   1) సామాన్యుల నివాసాలు

బి) 2వ భాగం   2) రాజ భవనాలు

సి) 3వ భాగం   3) ఆలయాలు

డి) 4వ భాగం   4) పంట పొలాలు

1) ఎ-1, బి-2, సి-3, డి-4

 2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-3, బి-4, సి-1, డి-2

4) ఎ-3, బి-2, సి-1, డి-4



14. విజయనగర రాజలు మేలిరకం గుర్రాలను ఎక్కడ నుంచి ఎగుమతి చేసుకునేవారు?

1) అరేబియా   2) ఇరాన్‌  3) ఇరాక్‌   4) 1, 2



15. ముస్లిం పోరాట యోధులను సైన్యంలో  నియమించిన విజయనగర రాజు?

1) శ్రీకృష్ణ దేవరాయలు   2) రెండో దేవరాయలు  

3) హరిహర రాయలు     4) బుక్కరాయలు



16. విజయనగర సైన్యంలో తుపాకులు, ఫిరంగులను ప్రవేశపెట్టినవారు?

1) శ్రీకృష్ణ దేవరాయలు   2) రెండో దేవరాయలు  

3) హరిహర రాయలు    4) వెంకటపతి రాయలు



17. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించినవారు?

1) న్యూనిజ్‌    2) నికోలో-డి-కాంటె 

3) అబ్దుల్‌ రజాక్‌    4) డోమింగో పెయిజ్‌



18. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉన్న అశ్వదళం?

1) 35000   2) 45000  3) 55000 4) 65000



19. కిందివాటిలో భిన్నమైంది?

1) ప్రభువు వర్గం నుంచి సైనిక దళ అధికారులను నియమించేవారు.

 2) వీరు గ్రామాల్లో లక్షల కొద్ది బంగారు నాణేలు వసూలు చేసేవారు. 

3) సైనిక దళాధిపతులు సైన్యం ఆధారంగా బంగారు నాణేలు వసూలు చేసేవారు.

4) సైనిక దళాధిపతులు పన్ను రూపంలో వచ్చిన ఆదాయం మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకునేవారు.



20. ‘అమరం’ అంటే?

1) ఒక గ్రామం    2) ఒక నగరం  

3) ఒక రెవెన్యూ ప్రాంతం 4) రాజుపాలన ప్రాంతం



21. అమర నాయకులు అధికంగా ఏ భాషను మాట్లాడేవారు?

1) తమిళం   2) కన్నడ  

3) మలయాళం   4) తెలుగు



22. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) విజయనగర సైన్యంలో తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉండేవారు.   

బి) అమర నాయకులు చెరువులు, కాలువలను నిర్మించారు.

సి) వీరు నేటి ఆంధ్ర, తమిళనాడులో స్థిరపడ్డారు.

డి) నాయకులు పెద్ద మొత్తంలో భూమిని    సేద్యంలోకి తెచ్చారు.

1) ఎ, బి, సి, డి   2) బి, సి, డి  

3) సి, డి      4) ఎ, సి, డి



23. తిరుమలకు 300 బంగారు నాణేలను దానం  చేసినవారు? 

1) తిమ్మయ్య - దండనాయకుడు   

2) నరస నాయకుడు

3) శ్రీకృష్ణ దేవరాయలు         

4) వెంకటపతి రాయలు



24. విజయనగర రాజులు ప్రధానంగా ఎవరితో వ్యాపారం చేసేవారు?

1) అరబ్బులు    2) యూదులు   

3) అర్మేనియా    4) పైవన్నీ



25. విజయనగర రాజుల ప్రధాన ఎగుమతులు?

1) సుగంధ ద్రవ్యాలు       2) వస్త్రాలు   

3) చేతివృత్తుల ఉత్పత్తులు   4) పైవన్నీ



26. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం?

1) 1509-1529     2) 1515-1539   

3) 1510-1529   4)1509-1530



27. విజయనగర రాజైన శ్రీకృష్ణ దేవరాయలు ఎవరికి వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపారు?

1) బహమనీ   2) గజపతులు  

3) 1, 2     4) కాకతీయులు



28. శ్రీకృష్ణ దేవరాయలు ఏ ప్రాంతపు రేవు      పట్టణాలపై నియంత్రణ సాధించారు?

1) దక్షిణ ప్రాంతం   2) కృష్ణా నది  

3) తూర్పు ప్రాంతం  4) 1, 2



29. శ్రీకృష్ణ దేవరాయలు ఎవరితో స్నేహ సంబంధాలు కలిగి ఉండేవారు?

1) డచ్చి     2) ఇంగ్లండ్‌  

3) పోర్చుగీసు   4) పైవారందరూ



30. కిందివాటిలో భిన్నమైంది. 

ఎ) ప్రతి సంవత్సరం విజయదశమి రోజున పెద్ద పండుగ జరిగేది.

బి) విజయదశమి రోజు సైనిక కవాతు నిర్వహించేవారు.

సి) రాజు విజయదశమి రోజున నాయకులకు  కానుకలు ఇచ్చేవాడు.

డి) కృష్ణ దేవరాయలు తన సామ్రాజ్యంలోని  దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.

1) ఎ, బి   2)  సి, డి   3) ఎ   4) సి



31. కృష్ణ దేవరాయలు ఏ దేవాలయాలకు విరివిగా దానాలు చేసేవారు?

1) తిరుపతి     2) శ్రీశైలం  

3) అహోబిలం  4) పైవన్నీ



32. దేవాలయాల ముందున్న గోపురాలను  ఏమంటారు?

1) గాలి గోపురం   2) పెద్ద గోపురం  

3) రాయి గోపురం   4)  దేవాలయం



33. ఆండాళ్‌ ఏ భాషకు చెందిన భక్త కవయిత్రి?

1) తమిళం    2) కన్నడ  3) తెలుగు  4) పైవన్నీ



34. కృష్ణ దేవరాయలు రాసిన గ్రంథం

1) ఆండాళ్‌   2) ఆమూక్తమాల్యద

3) యశోభూషణం   4) పాండురంగ మహాత్మ్యం



35. అష్ట దిగ్గజాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు?

1) రామరాయలు    2) శ్రీకృష్ణ దేవరాయలు

3) నరసింహ రాయలు    4) చంద్రగుప్తుడు 



36. కిందివారిలో అష్ట దిగ్గజాల్లో లేనివారు?

1) తిక్కన  2) రామకృష్ణ  3) పెద్దన  4) తిమ్మన



37.  రక్కసి తంగడి యుద్ధంలో ఎంత మంది బహమనీ సుల్తానులు పాల్గొన్నారు?

1) ఇద్దరు      2) ముగ్గురు  

3) నలుగురు  4) అయిదుగురు



38. రక్కసి తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది?

1) 1556   2) 1655   3) 1557  4) 1565



39. తళ్లి కోట యుద్ధంలో ఓడిపోయిన విజయనగర రాజు?

1) అళియ రామరాయలు   2) శ్రీకృష్ణ దేవరాయలు

3) నరసింహ రాయలు   4) వెంకటపతి రాయలు 



40. 1565 తళ్లికోట యుద్ధం తర్వాత వారి రాజధాని?

1) విజయనగరం   2) అనిగోండి  

3) తిరుపతి   4) చంద్రగిరి



41. మధుర విజయం అనే గ్రంథాన్ని రాసినవారు?

1) శ్రీకృష్ణదేవరాయాలు   2) కంపన

3) గంగాదేవి   4) పెద్దన



42. విజయనగర సామ్రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించారు?

1) 1336   2) 1333    3) 1347    4) 1436



43. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రపంచంలో రెండో పెద్ద నగరం?

1) హంపి    2) మధుర   

3) విజయవాడ    4) ఢిల్లీ



44. విజయనగరంలో ఉన్న ప్రముఖ దేవాలయాలు?

1) విఠలాలయం   2) హజరా రామాలయం 

3) 1, 2       4) రుద్రేశ్వర ఆలయం



45. సంగమ వంశంలో గొప్పరాజు?

1) రెండో దేవరాయలు   2) కంపన  

3) రామరాయలు   4) బుక్కరాయలు



46. అబ్దుల్‌ రజాక్‌ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించారు?

1) మొదటి దేవరాయలు  2) రెండో దేవరాయలు  

3) 1, 2   4) బుక్కరాయలు


 సమాధానాలు
 

1-3; 2-2; 3-2; 4-2; 5-2; 6-2; 7-3; 8-1; 9-3; 10-3; 11-4; 12-4; 13-2; 14-4; 15-2; 16-2,17-4; 18-1; 19-4; 20-3; 21-4; 22-1; 23-1; 24-4; 25-4; 26-1; 27-3; 28-4; 29-3; 30-4; 31-4; 32-3; 33-1; 34-2; 35-2; 36-1; 37-4; 38-4; 39-1; 40-4; 41-3; 42-1; 43-1; 44-3; 45-1; 46-2. 


 

Posted Date : 18-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌