• facebook
  • whatsapp
  • telegram

అమెరికా స్వాతంత్య్ర సమరం

అమెరికాకు పేరు పెట్టింది ఆ దేశమే!

 వలస వాద అధికారాన్ని ఎదిరించి  ఆధునిక స్వయం పాలనకు మార్గాలు వేసిన అమెరికా స్వాతంత్య్ర సమరానికి ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రాధాన్యం ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య భావనలకు ఈ పోరాటం పునాదిగా మారింది. తర్వాత కాలంలో జరిగిన అనేక రాజకీయ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. సరికొత్త సమాజాల ఆవిర్భవానికి దోహదపడిన ఆ ఉద్యమ విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. పెను సామాజిక మార్పులకు కారణమైన సామాన్య పౌరుల చైతన్య శక్తిని అర్థం చేసుకోవాలి
 


1. అమెరికా సంయుక్త రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కానిది ఏది?

1) కెనడా    2) మెక్సికో  

3) పసిఫిక్‌ మహా సముద్రం  4) ఫ్రాన్స్‌2. ‘మహా సామ్రాజ్యాలకు, అల్పబద్దులకు మధ్య ఏ మాత్రం పొత్తు కుదరదు’ అని ఎవరు అన్నారు?

1) కార్ల్‌మార్క్స్‌   2) ఎడ్మెండ్‌ బర్క్‌  

3) కొలంబస్‌   4) లెనిన్‌3.  కొలంబస్‌ ఏ సంవత్సరôలో అమెరికా ఖండాన్ని కనుకున్నాడు?

1) 1492   2) 1493  3) 1494  4) 14954. కిందివారిలో ఎవరు బహమా దీవుల్లో వాట్లాండ్స్, హైతీ దీవులను చేర్చారు?

1) కొలంబస్‌    2) అమెరిగో వెస్పూచ్చి  

3) హెర్నాండో కార్టిస్‌   4) ఎవరూకాదు5.   అమెరిగో వెస్పూచ్చి పేరు మీద అమెరికా అని  పిలవాలని తొలుత ఏ దేశస్థులు సూచించారు?

1) ఇంగ్లండ్‌   2) ఫ్రాన్స్‌    3) జర్మనీ  4) ఇటలీ6. కెనడాలోని ‘న్యూఫ్రాన్స్‌’ ను ఆక్రమించిన ఫ్రెంచ్‌ వ్యక్తి ఎవరు?

1) అమెరిగో వెస్పూచ్చి      2) థామస్‌ డెల్‌  

3) కొలంబస్‌    4) జాక్వెన్‌ కార్టియర్‌7. అమెరికా ఖండంలోని ఏ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఇంగ్లిష్‌ రాజు ‘లండన్‌ కంపెనీ’ కి అనుమతించాడు?  

1) వర్జీనియా     2) మసాచుసెట్స్‌  

3) పెన్సిల్వేనియా   4) మేరీలాండ్‌8.  1611లో లండన్‌ కంపెనీ వారు ‘జేమ్స్‌టౌన్‌’కు   గవర్నర్‌గా ఎవరిని నియమించారు?

1) డీకన్‌ జాన్‌ కార్వర్‌      2) విలియం బర్క్‌లీ  

3) థామస్‌ డేల్‌      4) థామస్‌ హుకర్‌9.   అమెరికాలోని ‘జేమ్స్‌టౌన్‌’ కేంద్రంగా ఏర్పడిన ‘హౌస్‌ ఆఫ్‌ బర్జెసెస్‌’ అనేది?

1) ఒక వ్యాపార సంఘం

2) ప్రజా ప్రతినిధులతో కూడిన సభ

3) పొగాకును పండించే ఒక వ్యవసాయ క్షేత్రం

4) అమెరికాలోని ఒక నగరం పేరు10. కిందివాటిలో ‘పిలిగ్రిమ్స్‌’ అంటే?

1) ఆంగ్లికన్‌ చర్చ్‌ విధానాలతో ఏకీభవించనివారు

2) వ్యాపార పోటీలో ఫ్రాన్స్‌కు మద్దతిచ్చినవారు

3) క్యాథలిక్‌ మతాన్ని ప్రపంచ వ్యాప్తం చేసినవారు

4) అమెరికాలోని భూస్వామ్య వర్గం11. ‘పిలిగ్రిమ్స్‌’ అని పిలిచే వర్గం అమెరికాలో    మొదటగా ఏ ప్రాంతాన్ని చేరింది?

 1) వర్జీనియా   2) బే ఆఫ్‌ మసాచుసెట్స్‌  

3) కెనక్టికట్‌    4) దక్షిణ కెరోలినా12. అమెరికాలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నుకున్న మొదటి గవర్నర్‌ ఎవరు?

1) థామస్‌ డేల్‌    2) కారన్‌ వాలీస్‌   

3) జార్జి వాషింగ్టన్‌   4) డీకన్‌ జాన్‌ కార్వర్‌13. ఎవరి నాయకత్వంలో అమెరికా ప్రజలు కెనక్టికట్‌ లోయలో వలస ఏర్పరచుకున్నారు?

1) డీకన్‌ జాన్‌ కార్వర్‌  2) డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌  

3) థామస్‌ హుకర్‌     4) జార్జ్‌ కార్ట్‌రైట్‌


14. జాన్‌ వీల్‌రైట్‌ ఏ ప్రాంతంలో తన అనుచరులతో కలసి వలసలను ప్రారంభించారు?

1) పెన్సిల్వేనియా   2) మేరీలాండ్‌  

3) న్యూహాంప్‌ షైర్‌   4) జార్జియా15.  ‘డ్యూక్‌ ఆఫ్‌ యార్క్‌’ పేరు మీదుగా ఏర్పడిన న్యూయార్క్‌ నగరం పూర్వపు పేరు?

1) న్యూ ఇంగ్లండ్‌   2) న్యూ నెదర్లాండ్‌  

3) న్యూ ఫ్రాన్స్‌    4) న్యూ జర్మనీ16. ‘ఫిలడెల్ఫియా’ పదానికి అర్థం ఏమిటి?

 1) దాతృప్రేమ      

 2) సహజ అడవుల నిలయం  

3) డాల్ఫిన్‌ నివాసం  

4)  మొసళ్లు ఉండే ప్రాంతం17. ఇంగ్లండ్‌ రాజు కాల్వర్ట్‌/బాల్టిమోర్‌కు అమెరికాలో కేటాయించిన ప్రాంతం ఏది?

1) నెదర్లాండ్స్‌    2) న్యూయార్క్‌   

3) మేరీలాండ్‌   4) పెన్సిల్వేనియా       18. ‘టాలరేషన్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1649’ దేనికి సంబంధించింది?

 1) అమెరికా స్వాతంత్య్రం కోసం చేసిన చట్టం

 2) వ్యాపార లావాదేవీల కోసం చేసిన చట్టం

3) సమానత్వం కోసం చేసిన చట్టం

4) మత స్వేచ్ఛ కోసం చేసిన చట్టం19. అమెరికా ప్రధాన భూభాగంలో ఏర్పడిన చివరి వలస?

1)  జార్జియా    2)  కెరోలినా 

3)  న్యూజెర్సీ    4) మసాచుసెట్స్‌20. జార్జియాకు సంబంధించి కిందివాటిలో సరైంది?

1) దీన్ని ఇంగ్లండ్‌లోని రుణగ్రస్థులైన ఖైదీల కోసం ఏర్పాటు చేశారు.

 2) జార్జియా వ్యవహారాలను నడిపే ధర్మకర్తలకు ఎలాంటి జీతాలు ఉండవు.

3) ఇక్కడ పన్నులు విధించే పద్ధతి లేదు.

4) పైవన్నీ21. 1770 జనాభా లెక్కల ప్రకారం అమెరికా వలసల్లో ఎక్కువ జనాభా ఉండే ప్రాంతం?

1) వర్జీనియా     2) మసాచుసెట్స్‌  

3) పెన్సిల్వేనియా     4) ఉత్తర కెరోలిన్‌22. అమెరికా వలసల్లో 17 సంవత్సరాలు గడిపిన ‘క్రెవెక్యూ’ ఏ దేశానికి చెందినవాడు?

1) అమెరికా   2) ఫ్రాన్స్‌  3) జర్మనీ  4) స్పెయిన్‌23. ‘వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌’ అనే గ్రంథాన్ని రచించింది?

1) జాన్‌లాక్‌      2) మాకీయవెల్లి  

3) జార్జ్‌ వాషింగ్టన్‌     4) ఆడంస్మిత్‌24. అమెరికా వలసల్లో ఏర్పడిన మొదటి కళాశాల-

1) బోస్టన్‌ కళాశాల      2)  హార్వర్డ్‌ కళాశాల   

3) స్టాన్‌ఫోర్డ్‌ కళాశాల    4) యేల్‌ కళాశాల
25. ‘సప్తవర్ష సంగ్రామం’ ఏ దేశాల మధ్య జరిగింది?

1) ఇంగ్లండ్‌ - ఫ్రాన్స్‌      2) ఇంగ్లండ్‌ - జర్మనీ   

3) ఫ్రాన్స్‌ - స్పెయిన్‌     4) ఇంగ్లండ్‌ - కెనడా26. బ్రిటన్‌ మొదటిసారిగా నౌకా చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?

1) 1650   2) 1670   3) 1630  4) 162027. కిందివాటిని జతపరచండి.

1) ఇనుము చట్టం    ఎ) 1763

 2) మొలాసిస్‌ చట్టం    బి) 1650

3) నౌకా చట్టం    సి) 1733

4) పారిస్‌ సంధి    డి) 1750

1) 1-ఎ, 2-బి, 3-సి 4-డి   2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 

3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి  4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి


 

28. ‘రిట్స్‌ ఆఫ్‌ అసిస్టెన్స్‌ దేనికి సంబంధించింది?

1) అమెరికా వలసల్లో దొంగచాటు వ్యాపారాన్ని బహిర్గతం చేయడం

 2) అమెరికా వలసల్లో స్వేచ్ఛను, సమానత్వాన్ని చాటి చెప్పడం

3) అమెరికా వలసల్లో న్యాయస్థానాల స్థాపన

4) అమెరికా స్వాతంత్య్రాన్ని ప్రకటించడం29. అపలేషియన్‌ ఆవలి ప్రాంత భూముల్లో స్థిరపడటాన్ని నిషేధిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఎప్పుడు  ప్రకటన చేసింది?

1) 1760   2) 1761  3) 1762  4) 176330. ‘పంచదార చట్టం’ చేసిన సంవత్సరం?

1) 1764  2) 1765  3) 1766  4) 176731. అపలేషియన్‌ ఆవలి ప్రాంతంలో ఫ్రెంచ్, రెడ్‌ ఇండియన్ల దురాక్రమణలను ఆపడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏ ప్రాంతంలో సైన్యాన్ని నిలువరించింది?

1) కెనడా      2) నోవాస్కోషియా    

3) న్యూయార్క్‌   4) పైవన్నీ32. ఏ చట్టం ద్వారా ఫ్రెంచ్‌ పశ్చిమ ఇండియా దీవుల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే మొలాసిస్‌ బ్రిటిష్‌ గ్యాలన్‌కు 6 పెన్నీల పన్ను విధించింది?

1) మొలాసిస్‌ చట్టం - 1733  

 2) పంచదార చట్టం - 1764     

3) టాలరేషన్‌ చట్టం - 1649   

4) పైవన్నీ33. పంచదార చట్టం - 1764 ను ప్రవేశ పెట్టిన బ్రిటిష్‌ ప్రధాని?

1) విన్‌స్టన్‌ చర్చిల్‌      2) నార్త్‌ ప్రభువు    

3) విలియం ఫిట్‌       4) జార్జి గ్రెన్‌విల్‌34. అమెరికా వలసల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన మొదటి ప్రత్యక్ష పన్ను?

1) కరెన్సీ చట్టం    2) స్టాంప్‌ చట్టం    

3)  క్వార్టరింగ్‌ చట్టం    4) పంచదార చట్టం35. బ్రిటిష్‌వారు  క్వార్టరింగ్‌ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?

1) 1764        2) 1765   

3) 1773       4) 176836. స్టాంపు చట్టాన్ని రద్దు చేసిన బ్రిటిష్‌ ప్రధాని?

1) జార్జి గ్రెన్విల్‌   2) విలియం పిట్‌     

3) విలియం బర్క్‌లీ    4) మార్క్వెస్‌ రాకింగ్‌ హాం37. అమెరికాలో ‘సన్స్‌ ఆఫ్‌ లిబర్టీ’ అనే పేరుతో  ఏర్పడిన విప్లవ సంఘం నాయకులకు     సంబంధించి సరికానిది?

1) బోస్టన్‌లో శ్యామ్‌ ఆడమ్స్‌ నాయకత్వం వహించారు   

 2) న్యూయార్క్‌లో ఐసాక్‌ సేర్స్, జాన్‌ల్యాంబ్‌ నాయకులు

3) ఫిలడెల్ఫియాలో కాల్వర్ట్‌ నాయకులు    

4) బాల్టిమోర్‌లో శామ్యూల్‌ చెస్‌ నాయకులు38. ‘బోస్టన్‌ టీ పార్టీ’ సంఘటన జరిగిన సంవత్సరం?

1) 1773  2) 1764  3) 1765  4) 177839. అమెరికా స్వాతంత్య్ర తీర్మానాన్ని రూపొందించినవారు?

1) థామస్‌ పెయిన్‌    2) థామస్‌ జెఫర్‌సన్‌    

3) విలియం పిట్‌    4) జార్జి గ్రెన్విల్‌40. అమెరికా స్వతంత్ర చివరి దశ యుద్ధం యార్క్‌టౌన్‌ వద్ద లొంగిపోయిన బ్రిటిష్‌ సైన్యాధికారి ఎవరు?

1) కారన్‌వాలీస్‌    2) నెథాలియన్‌  3) బర్గాయిన్‌   4) వెల్లస్లీ41. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?

1) జార్జి వాషింగ్టన్‌       2) ఉడ్రోవిల్సన్‌   

3) నెల్సన్‌ మండేలా   4) అబ్రహాం లింకన్‌42. ఏ యుద్ధ విజయం తర్వాత అమెరికన్లకు ఫ్రెంచ్‌వారి ప్రత్యక్ష సహాయం అందింది?

1) యార్క్‌టౌన్‌ యుద్ధం  2) సారటోగా యుద్ధం  

3) బోస్టన్‌ యుద్ధం   4) న్యూయార్క్‌ యుద్ధం43. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనలో ప్రధాన భావాలను ఏ గ్రంథం నుంచి గ్రహించారు?

1) ద సోషల్‌ కాంట్రాక్ట్‌   

2) సెకండ్‌ ట్రీ ట్రైజ్‌ ఆన్‌ గవర్నమెంట్‌  

3) ది ప్రిన్స్‌   

4) వెల్త్‌ ఆఫ్‌ నేషన్స్‌44. ‘సెకండ్‌ ట్రీ ట్రైజ్‌ ఆన్‌ గవర్నమెంట్‌’ గ్రంథకర్త ఎవరు?

1) జార్జి వాషింగ్టన్‌    2) జాన్‌లాక్‌   

3) ఆడంస్మిత్‌       4) ఉడ్రోవిల్సన్‌45. ‘బోస్టన్‌ హత్యాకాండ’ ఎప్పుడు జరిగింది?

1) 1770   2) 1773  3) 1775  4) 1778 సమాధానాలు
 

1-4; 2-2; 3-1; 4-1; 5-3; 6-4; 7-1; 8-3; 9-2; 10-1; 11-2; 12-4; 13-3; 14-3; 15-2; 16-1; 17-3; 18-4; 19-1; 20-4; 21-1; 22-2; 23-4; 24-2; 25-1; 26-1; 27-2; 28-1; 29-4; 30-1; 31-4; 32-1; 33-4; 34-2; 35-2; 36-4; 37-3; 38-1; 39-2; 40-1; 41-1; 42-2; 43-2; 44-2; 45-1.


 

రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.