• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత 

నల్లగాజుల ప్రాంతంలో నాగలి మొదటి ఆనవాళ్లు!
 

 


ఆధునిక యుగంలో కనిపిస్తున్న పట్టణ ప్రణాళికలు, వాస్తుశిల్పం, సామాజిక పరిస్థితులు దాదాపు అయిదు వేల సంవత్సరాల క్రితమే అమలయ్యాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన సింధునాగరికత అది నిజమని నిరూపిస్తోంది. అప్పట్లో చక్కటి ప్రణాళికలతో నిర్మించిన నగరాలు, అధునాతన మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేవి. నాడు విలసిల్లిన వ్యవసాయం, వాణిజ్యం, చేతి వృత్తులు  తర్వాతి తరాలకు మార్గదర్శకాలుగా నిలిచాయి. సింధుప్రజలు ఇటుకలతో ఇళ్లు నిర్మించారు. తూనికలు, కొలతలను ఉపయోగించారు. మహాస్నానవాటికలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆ మహోన్నత కాలం గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వేల ఏళ్ల క్రితమే ఆవిర్భవించిన నాగరికత భారతీయ సంస్కృతికి పునాదులు వేసిన తీరును అర్థం చేసుకోవాలి. 1. సింధు నాగరికత విస్తీర్ణం ఎంత? 

1) 12,99,600 చ.కి.మీ.   2) 20,00,000 చ.కి.మీ. 

3) 5,00,000 చ.కి.మీ.   4) 8,00,000 చ.కి.మీ. 


2. సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం? 

1) హరప్పా    2) మొహంజొదారో 

3) కాళీభంగన్‌    4) ధోళవీర


3.  కిందివాటిలో సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం? 

1) మహారాష్ట్ర    2) గుజరాత్‌        

3) కేరళ   4) రాజస్థాన్‌ 


4.  సింధు ప్రజల లిపి? 

1) ద్రవిడ లిపి     2) బ్రహ్మి లిపి   

 3) బొమ్మల లిపి    4) ఖరోష్టి లిపి 


5. సింధు నాగరికతకు సమకాలీన నాగరికత? 

1) మెసపటోమియా  2) ఈజిప్టు   

3) చైనా    4) పైవన్నీ 


6. కిందివాటిలో సింధు నాగరికత కాలం నాటి ‘పశుపతి’ ముద్రికకు సంబంధించి సరికానిది?     

1) పశుపతి ముద్రిక మొహంజొదారోలో లభించింది.

2) ఈ ముద్రిక చతురస్రాకారంలో ఉంది.

3) ఈ ముద్రికను స్టియటైట్‌తో తయారు చేశారు.

4) పశుపతి ముద్రిక హరప్పాలో కూడా లభించింది.


7. పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు? 

1) పులి, ఖడ్గ మృగం, గేదె, ఏనుగు, జింక 

2) పులి, సింహం, జిరాఫీ, కుందేలు, జింక 

3) పులి, ఖడ్గ మృగం, జింక, కుందేలు

4) ఏనుగు, పులి, కుందేలు, నక్క, జింక


8. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం? 

1) అమ్మతల్లి    2) పశుపతి  

3) విష్ణువు    4) ఇంద్రుడు 


9. ‘మహాస్నానవాటిక’ ఏ ప్రదేశంలో లభించింది? 

1) హరప్పా   2) మొహంజొదారో   

3) కాళీభంగన్‌   4) లోథాల్‌ 


10. కిందివాటిని జతపరచండి.

1) మహాధాన్యాగారం   ఎ) మొహంజొదారో
2) పూసల తయారీ కేంద్రం   బి) చాన్హుదారో
3) ఒంటె అస్థిపంజరం  సి) కాళీభంగన్‌
4) ఓడరేవు  డి) లోథాల్‌

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి

4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి


11. కిందివాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది?

1) ఇది భారతదేశంలో మొదటి నాగరికత.

2) దీన్ని మార్షల్‌ వెలుగులోకి తీసుకువచ్చారు. 

3) ఈ నాగరికత సింధు, ఘగ్గర్, హక్రా నదీ ప్రాంతంలో ఉంది.

4) సింధు ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు.


12. సింధు ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు?

1) పట్టణ ప్రణాళిక     2) ఇటుకల నిర్మాణం 

3) తూనికలు, కొలతలు   4) పైవన్నీ 


13. భారతదేశంలో తొలి పట్టణ నాగరికత?

1) సింధు నాగరికత     2) ఆర్య నాగరికత

3) మెసపటోమియా నాగరికత     4) ఏదీకాదు 


14. ‘మహాస్నాన వాటిక’ను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు?

1) ప్రతిరోజు స్నానం చేయడానికి  

2) రాజులు, రాణులు స్నానం చేయడానికి 

3) పండుగలు, మత వ్యవహారాల్లో ప్రజలు స్నానం చేయడానికి  

4) మతపెద్దలు స్నానం చేయడానికి 


15. నాగలితో దున్నిన భూమి ఆనవాళ్లు మొదటిసారి బయటపడిన సింధు ప్రాంతం ఏది?

1) కాళీభంగన్‌    2) మొహంజొదారో    

3) లోథాల్‌   4) చాన్హుదారో


16. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన ప్రజలు ఎవరు?

1) సింధు నాగరికత ప్రజలు   

2) ఆర్య నాగరికత ప్రజలు

3) మెసపటోమియా ప్రజలు   

4) చైనా నాగరికత ప్రజలు


17. హరప్పాలో తవ్వకాలు జరిగిన సంవత్సరం?

1) 1920   2) 1921   3) 1922   4) 1923


18. టెర్రకోట బొమ్మలు అంటే?

1) చెక్కతో చేసిన బొమ్మలు  

2) కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మలు

3) సున్నంతో చేసిన బొమ్మలు 

4) విలువైన రాళ్లతో చేసిన బొమ్మలు


19. మొహంజొదారోలో లభించిన నాట్యగత్తె విగ్రహానికి సంబంధించి సరైంది?

1) ఈ నాట్యగత్తె విగ్రహాన్ని కాంస్యంతో చేశారు. 

2) ఈ విగ్రహాన్ని నగ్నంగా ఉన్నట్లు చెక్కారు.

3) ఎడమచేయిని నాట్యభంగిమలో ఉన్నట్లు చెక్కారు. 

4) ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు.


20. సింధు ప్రజల ప్రధాన వృత్తి?

1) వ్యవసాయం   2) పశుపోషణ

3) ఇటుకల పరిశ్రమ   4) దూదిని తయారుచేయడం


21. సింధు ప్రజల ప్రధాన పురుష దైవం?

1) పశుపతి  2) బ్రహ్మ 3) విష్ణు  4) ఇంద్రుడు


22. హరప్పా నాగరికత ఆర్యుల దండయాత్రల వల్ల పతనమైందని అభిప్రాయపడినవారు?

1) సర్‌ జాన్‌మార్షల్‌   2) సర్‌ మార్టిమర్‌ వీలర్‌ 

3) కెన్నెత్‌ కెన్నడీ    4) ప్రొఫెసర్‌ పెంకా


23. హరప్పా ప్రజలు పూజించిన జంతువు ఏది?

1) గుర్రం  2) ఎద్దు 

3) జిరాఫీ   4) మూపరం గల ఎద్దు


24. హరప్పా నాగరికతలోని నాలుగు దశల్లో ‘ఉజ్వల హరప్పా దశ’ అని దేన్ని పిలుస్తారు.

1) మొదటి    2) 2వ    3) 3వ    4) 4వ 


25. సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది?

1) సుత్కజెందర్‌   2) మెహర్‌ఘర్‌ 

3) దైమాబాద్‌     4) మాండా


26. సింధు ప్రజల ప్రధాన వినోదం?

1) ఎద్దుల పోటీలు   2) నాట్యం 

3) సంగీతం   4) చదరంగం


27. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది?

1) హరప్పా   2) మొహంజొదారో 

3) సుర్కటోడా   4) ధోళవీర 


28. సింధు ప్రజలు ఎక్కువగా ఎవరితో వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు?

1) మెసపటోమియా నాగరికత 

2) చైనా నాగరికత 

3) ఈజిప్టు నాగరికత        

4) గ్రీస్‌ నాగరికత


29. సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ?

1) మాతృస్వామిక వ్యవస్థ 

2) పితృస్వామిక వ్యవస్థ 

3) 1, 2      

4) చెప్పలేం 


30. సింధు నాగరికత అనంతరం ఏర్పడిన నాగరికత?

1) ఆర్య నాగరికత     2) గ్రీస్‌ నాగరికత  

3) సుమేరియన్‌ నాగరికత     4) చైనా నాగరికత 


31. సింధు నాగరికతకు ఉన్న మరొక పేరు?

1) కాంస్యయుగ నాగరికత   2) హరప్పా నాగరికత

3) మూలభారత నాగరికత   4) పైవన్నీ 


32. సింధు ప్రజలు ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి?

1) స్టియటైట్‌   2) అగేట్‌  

3) లాపీస్‌ లాజూలి    4) అమెథిస్ట్‌ 


33. కిందివాటిలో సింధు ప్రజల పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైంది? 

1) సింధు ప్రజలు రహదారులను గ్రిడ్‌ పద్ధతిలో నిర్మించారు.

2) మురుగు నీటిపారుదల వ్యవస్థ ఉంది.

3) ఇక్కడ నగరాలన్నింటినీ ప్రణాళికా బద్ధంగా నిర్మించారు.

4) పైవన్నీ 


34. సింధు ప్రజల తూనికలు, కొలతలు ఎక్కడ ఉపయోగంలో ఉండేవి?

1) పర్షియా   2) మధ్య ఆసియా 

3) 1, 2   4) చైనా


35. సింధు ప్రజలకు తెలియని లోహం?

1) కంచు 2) రాగి 3) ఇనుము 4) తగరం


36. సింధు నాగరికత కాలం నాటి అమ్మతల్లి విగ్రహాలను దేనితో తయారుచేశారు? 

1) కాంస్యం 2) ఇనుము 3) రాగి 4) మట్టి


37. సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ?

1) అమ్మతల్లి విగ్రహాలు   

2) గడ్డం ఉన్న పురుషుడి విగ్రహం 

3) కాంస్య నాట్యగత్తె విగ్రహం 

4) పైవన్నీ 


38. కాళీభంగన్‌ అంటే అర్థం?

1) ఖాళీ ప్రదేశం  2) అందమైన ముఖం 

3) నల్లని గాజులు  4) అతిపెద్ద ప్రదేశం 


39. ‘మొహంజొదారో’ అంటే అర్థం ఏమిటి?

1) మృతుల దిబ్బ     

2) నదులు ప్రవహించే స్థలం 

3) సంపన్న నగరం     

4) నల్లని గాజుల ప్రదేశం


40. కింది ఏ ప్రదేశంలో అగ్నివేదికలు లభించాయి?

1) కాళీభంగన్‌     2) లోథాల్‌ 

3) 1, 2      4) మొహంజొదారో


41. సింధు ప్రజలు పూజించిన చెట్టు?    

1) రావి  2) వేప  3) తంగేడు   4) మామిడి


42. సింధు నాగరికత పతనానికి కారణం?

1) ఆర్యుల దండయాత్ర     2) అడవులు క్షీణించడం 

3) వరదలు   4) పైవన్నీ 


43. ఏ ప్రదేశాల మధ్య రైల్వే లైన్లు వేస్తున్నప్పుడు బ్రిటిష్‌ ఇంజినీర్లు సింధు కాలం నాటి పురాతన రాళ్లను గుర్తించారు?

1) లాహోర్‌ - కరాచి     2) ముంబయి - థానే 

3) లాహోర్‌ - సింధ్‌     4) సింధ్‌ - బెలుచిస్థాన్‌


44. సింధు నాగరికత ప్రాంతానికి పాలకులు?    

1) మతాధికారులు     2) వ్యాపారస్థులు 

3) మున్సిపాలిటీ అధికారులు   4) చెప్పలేం 


45. సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) రాజస్థాన్‌   2) హరియాణా 

3) గుజరాత్‌    4) మహారాష్ట్ర 


 సమాధానాలు
 

1-1; 2-1; 3-3; 4-3; 5-4; 6-4; 7-1; 8-1; 9-2; 10-1; 11-4; 12-4; 13-1; 14-3; 15-1; 16-1; 17-2; 18-2; 19-4; 20-1; 21-1; 22-2; 23-4; 24-4; 25-3; 26-1; 27-2; 28-1; 29-1; 30-1; 31-4; 32-1; 33-4; 34-3; 35-3; 36-4; 37-4; 38-3; 39-1; 40-3; 41-1; 42-4; 43-1; 44-4; 45-3.
 


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు 

Posted Date : 22-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌