• facebook
  • whatsapp
  • telegram

మానవ హక్కులు ప్రాథమిక హక్కులు, కేంద్ర ప్రభుత్వం 

ఆచారాలను పాటించడమూ హక్కే! 


 

సమానత్వం, భావప్రకటన, వ్యక్తి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ తదితరాలు రాజ్యాంగం గుర్తించి, రక్షించే హక్కులు. ఒక పౌరుడు గౌరవంగా, స్వేచ్ఛగా బతకడానికి అవి అత్యవసరం. ప్రజాస్వామ్య  వ్యవస్థలో అంతర్భాగం. వాటినే ప్రాథమిక హక్కుల రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ హక్కుల వివరణలు, జీవించే హక్కు ప్రాధాన్యం, రాజ్యాంగ ఉద్దేశాలను పోటీ పరీక్షార్థులు అర్థం చేసుకోవాలి.  దేశ పరిపాలన, రాజకీయ వ్యవస్థల స్వరూపం, ఎన్నికల విధానం, కేంద్ర- రాష్ట్రాల అధికారాల విభజన మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి.


1. కిందివాటిని జతపరచండి.

1) 14వ ఆర్టికల్‌   ఎ) చట్టరక్షణలో సమానత్వం

2) 15వ ఆర్టికల్‌   బి) సామాజిక సమానత్వం

3) 16వ ఆర్టికల్‌   సి) అవకాశాల్లో సమానత్వం

4) 17వ ఆర్టికల్‌   డి) అస్పృశ్యత నిషేధం

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి      2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి    4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ2. కిందివాటిలో సరైంది? ప్రవచనం A : ఆర్టికల్‌-18 బిరుదుల రద్దు  గురించి తెలియజేస్తుంది.కారణం R: భారతరత్న, పరమ వీరచక్ర, పద్మ విభూషణ్‌ లాంటి పురస్కారాలు/పతకాలను బిరుదుగా ఉపయోగించుకోకూడదు.

1) A మాత్రమే సరైంది.      

2)  A సరైంది కాదు, R సరైంది.   

3) A సరైంది, R సరైంది కాదు.  

4)  A, R రెండూ సరైనవి.3. భారత రాజ్యాంగంలో 19వ అధికరణ ప్రకారం ఆరు రకాల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు కల్పించారు. వాటికి సంబంధించి కిందివాటిలో సరికానిది? 

1) వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ

2)  ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు

3)  సంఘాలు, సభలుగా ఏర్పడే హక్కు

4) జీవించే హక్కు


 

4. కిందివాటిలో జీవించే హక్కుకు సంబంధించి సరైంది?

1)  దీన్ని 21వ నిబంధన తెలియజేస్తుంది.

2)  2002లో జీవించే హక్కులో విద్యా హక్కు భాగమైంది.

3) ఈ హక్కును 20వ నిబంధన కూడా తెలియజేస్తుంది.     

4) 1, 2


5. కిందివాటిలో సరైంది?ప్రవచనం(A) : జీవించే హక్కును జపాన్‌ రాజ్యాంగం నుంచి స్వీకరించారు.

కారణం(R): అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని ఆర్టికల్స్‌ 20, 21, 21(A).

1) A మాత్రమే సరైంది.  

2) R మాత్రమే సరైంది.

3) A సరైంది, R సరైంది కాదు.    

4) A, R రెండూ సరైనవి.6. ఒక వ్యక్తిని కట్టు బానిసగా బలవంతంగా పనిచేయిస్తే అది ఏ హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది?

1) సమానత్వపు హక్కు 

2) స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు

3) పీడనాన్ని నిరోధించే హక్కు  

4) మత స్వాతంత్య్రపు హక్కు7. కిందివాటిలో 24వ ఆర్టికల్‌కు సంబంధించి సరైంది?

1) 14 ఏళ్లలోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం నిషేధం.

2) అగ్గిపెట్టెలు, టపాకాయలు, బీడీల కంపెనీల్లో పనిచేయించరాదు.

3) తివాచీల తయారీ, ముద్రణ, అద్దకం లాంటి వాటిలో పిల్లలను పని చేయించరాదు.

4) పైవన్నీ8. కిందివాటిలో మత స్వాతంత్య్రపు హక్కుకు సంబంధించి సరికానిది?

1) పౌరులందరూ ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. 

2) వ్యక్తిగా తమ మత ఆచారాలను పాటించకుండా ఎవరినీ నిషేధించలేరు.

3) లౌకికవాద స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది.

4) సతీసహగమనాన్ని ప్రోత్సహిస్తుంది.9. కిందివాటిని జతపరచండి.

1) ఇంగ్లండ్‌    ఎ) బిల్‌ ఆఫ్‌ రైట్స్‌

2) అమెరికా    బి) ప్రాథమిక హక్కులు

3) యూఎన్‌ఓ    సి) మాగ్నాకార్టా

4) ఇండియా    డి) విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటన

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    2) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి

3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి    4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ10. కిందివాటిలో పిల్‌ (పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌)కు సంబంధించి సరైంది?

ఎ) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టులో, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేయొచ్చు.

బి) పిల్‌ను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదు.

సి) ఏ వ్యక్తి అయినా ప్రజల తరఫున ప్రభుత్వం మీద దావా వేయవచ్చు.

డి) పర్యావరణ అంశాలు, ప్రభుత్వాల పారదర్శకత, కారాగారవాసులను చూస్తున్న తీరు లాంటివి పిల్‌ కింద చేపడుతున్నారు.

1) ఎ మాత్రమే    2) ఎ, సి    3) ఎ, బి, సి     4) అన్నీ సరైనవి11. కిందివాటిలో సరైంది?

ప్రవచనం (A) : 1993, అక్టోబరు 12న భారత ప్రభుత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసింది.

కారణం (R) : 1948, డిసెంబరు 10న యూఎన్‌ఓ విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన చేసింది.

1) A సరైంది, R సరైంది కాదు.   

2) R సరైంది, A సరైంది కాదు. 

3) A, R సరైనవి.   

4) A, R సరైనవి కావు.12. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్ని నియోజక వర్గాలు ఉన్నాయి?

1) 543       2)  550       3)  545       4) 552 


 

13. రాష్ట్రాల మండలి (రాజ్యసభ) ఏర్పడిన సంవత్సరం? 

1) 1952, ఏప్రిల్‌ 17    2) 1952, ఏప్రిల్‌ 3 

3) 1952, ఏప్రిల్‌ 13        4) 1952, మే 1314. దేశం మొత్తంమీద 1996 ఎన్నికల్లో 61 శాతం మంది నిరక్షరాస్యులు, పేద ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోగా, పట్టభద్రుల్లో ఎంత శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? 

1) 53%      2) 46%    3) 58%     4) 66.4%


 

15. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సరికానిది?

1) దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 

2) రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యులు పాల్గొంటారు. 

3) రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. 

4) దిల్లీ, పుదుచ్చేరి శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. 16. జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంట్‌ రూపొందించిన సంవత్సరం? 

1) 2009     2) 1986    3) 2005     4)  2010


 

17. రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులుఉంటారు? 

1) 550      2) 245      3) 250      4) 530 


 

18. 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో సోషలిస్టులు గెలుచుకున్న స్థానాలు?

1) 23        2) 12        3) 9         4) 30 


 

19. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో రామరాజ్య పరిషత్‌ గెలిచిన సీట్లు? 

1) 28        2) 12         3) 9         4) 3 20. ‘జాతీయ రహదారులు’ ఏ జాబితాలో ఉంటాయి? 

1) కేంద్ర     2) రాష్ట్ర    3) ఉమ్మడి     4) అవశిష్టాంశాలు 21. 2014-15వ లోక్‌సభ ఎన్నికల్లో సుమారుగా ఎన్ని పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు? 

1) ఒక కోటి     2)  9,30,000    

3్శ 8,051        4) 83,41,01,479 22. టెలిఫోన్, తపాలా అంశాలు ఏ జాబితాలోకి వస్తాయి? 

1) కేంద్ర      2) రాష్ట్ర     3) ఉమ్మడి     4) అవశిష్టాంశాలు23. ఏ లోక్‌సభ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడం’గా వర్ణిస్తారు? 

1) 1వ       2) 2వ      3) 11వ     4) 17వ 24. దేశం మొత్తంమీద మొదటి లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు పొటీచేశారు? 

1) 2,24,000        2) 25 లక్షలు     3) 17,500        4) 489 
25. లోక్‌సభలో జనరల్‌కు ఎన్ని స్థానాలు కేటాయించారు? 

1) 412     2)  423     3) 543   4) 550 26.    కేంద్ర కార్యనిర్వాహక శాఖకు అధిపతి? 

1) రాష్ట్రపతి     2) ఉపరాష్ట్రపతి 

3) ప్రధానమంత్రి     4) రక్షణశాఖ మంత్రి 27. కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం కానివారు? 

1) ఉపరాష్ట్రపతి     2) రాష్ట్రపతి 

3) మంత్రిమండలి     4) సభాపతి 


 

28. కిందివాటిలో పార్లమెంటుకు సంబంధించి సరికాని వాక్యం? 

1)  దేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంటు. 

2) 1986లో జాతీయ విద్యావిధానాన్ని పార్లమెంటు రూపొందించింది.

3) ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో పార్లమెంటు 2009లో బాలల హక్కు అనే చట్టాన్ని చేసింది. 

4) పార్లమెంటు అంటే లోక్‌సభ, రాజ్యసభ, ప్రధానమంత్రి.29. కిందివాటిలో పార్లమెంటుకు సంబంధించి సరికాని వాక్యం?

1) లోక్‌సభ సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవు తారు.

2) రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసన సభ్యులు ఎన్నుకుంటారు.

3) రాజ్యసభలో అత్యధికంగా 250 మంది సభ్యులు ఉండొచ్చు.

4) లోక్‌సభలో అత్యధికంగా 545 మంది సభ్యులు ఉండొచ్చు. 30. కిందివాటిలో లోక్‌సభ స్థానాలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1)  పశ్చిమ బెంగాల్‌     2) తమిళనాడు 

 3) ఆంధ్రప్రదేశ్‌     4) రాజస్థాన్‌ 31. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం? 

1) మధ్యప్రదేశ్‌     2) రాజస్థాన్‌ 

3) కర్ణాటక    4) గుజరాత్‌ 32. మొదటి లోక్‌సభ ఎన్నికలు-1952, వివిధ పార్టీలు గెలిచిన సీట్లకు సంబంధించి సరికాని అంశం? 

1) కాంగ్రెస్‌ గెలిచిన సీట్లు - 364 

2) స్వతంత్రులు గెలిచిన సీట్లు - 40

3) కమ్యూనిస్టులు, మిత్రపార్టీలు - 23 

4) సోషలిస్టులు - 12 33. కిందివాటిలో సరైనవి?

ఎ) జర్మనీలో హిట్లర్‌ లక్షలాది మందిని వేధించాడు. 

బి) ఇజ్రాయెల్‌ తమదేశంలోని ముస్లిం, క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను వేధిస్తుంది. 

సి) సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు దేవాలయాలు, చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు. 

డి) సౌదీ అరేబియాలో ముస్లిమేతరులు మత ప్రార్థనల కోసం బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడానికి వీలులేదు. 

1) ఎ మాత్రమే   2) బి, డి

3) ఎ, డి     4) అన్నీ సరైనవి 

సమాధానాలు


1-1; 2-4; 3-4; 4-4; 5-4; 6-3; 7-4; 8-4; 9-3;10-4; 11-3; 12-1; 13-2; 14-1; 15-1; 16-2; 17-3; 18-2; 19-4; 20-1; 21-2; 22-1; 23-1; 24-3; 25-1; 26-1; 27-4; 28-4; 29-4; 30-1; 31-2; 32-2; 33-4. 


 

రచయిత: అయితరాజు లక్ష్మణ్‌  

Posted Date : 09-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.