• facebook
  • whatsapp
  • telegram

పౌరుల సర్వతోముఖాభివృద్ధికి సాధనాలు!

ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు - విధులు

భారత రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను ఇచ్చింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, గౌరవ ప్రదమైన జీవనాన్ని   గడిపేందుకు, సర్వతోముఖాభివృద్ధిని సాధించేందుకు అవి దోహదపడతాయి. అదేవిధంగా ప్రతిఒక్కరూ తమ బాధ్యతలను గుర్తించి నడుచుకోవడానికి ప్రాథమిక విధులను నిర్దేశించింది. వీటితోపాటు ప్రభుత్వాలకు కూడా కొన్ని ఆదేశాలిచ్చింది. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమ రాజ్య స్థాపన లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చేసిన ఆ మార్గదర్శకాలే ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగంలోని ఈ విశిష్ట అంశాలు, వాటి స్వభావం గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు ఉన్న భాగాలు, సంబంధిత అధికరణలతోపాటు వాటి ఉద్దేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో  జరిగిన మార్పులను, చేసిన చట్టాలను అర్థం చేసుకోవాలి. 



1.    కిందివాటిలో ప్రాథమిక హక్కుల లక్షణం కానిది?

1) కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి.       2) ఇవి నిరపేక్షమైనవి.

3) వీటికి న్యాయపరిహార యోగ్యత ఉంది.     4) వీటిలో కొన్ని సంప్రదాయ హక్కులు కూడా ఉన్నాయి.


2. ప్రాథమిక హక్కుల గురించి వివరించే రాజ్యాంగంలోని భాగం, అధికరణలు ఏవి?

1) IIవ భాగం, 1 - 11 వరకు ఉన్న అధికరణలు

2) IIIవ భాగం, 25 - 36 వరకు ఉన్న అధికరణలు

3) IVవ భాగం, 12 - 35 వరకు ఉన్న అధికరణలు

4) Vవ భాగం, 124-147 వరకు ఉన్న అధికరణలు


3. ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛా హక్కును తెలిపే  అధికరణలు?

1) 14 నుంచి 18 వరకు        2) 25 నుంచి 28 వరకు

3) 29 నుంచి 30 వరకు   4) 19 నుంచి 22 వరకు


4. ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?

1) 42వ   2) 43వ   3) 44వ   4) 48వ 


5. ‘అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు హాజరుపరచాలి’ అని చెప్పే రిట్‌?

1) మాండమస్‌     2) హెబియస్‌ కార్పస్‌

3) కోవారంటో     4) ప్రొహిబిషన్‌


6. ‘భారత పౌరుల మధ్య ఉద్యోగ నియామకాల్లో విచక్షణ చూపరాదు’ అని తెలిపే అధికరణ?

1) 15వ   2) 16వ   3) 20వ    4) 21వ 


7. ‘6 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి’ అని చెప్పే అధికరణ?

1) 21వ   2) 21(ఎ)   3) 17వ   4) 22వ


8. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులుఉన్నాయి?

1) 7     2) 5      3) 6     4) 8


9. ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు?

1) జవహర్‌లాల్‌ నెహ్రూ    2) బి.ఆర్‌.అంబేడ్కర్‌

3) జె.బి.కృపలాని    4) కృష్ణమాచారి


10. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల గురించి తెలిపే భాగం ఎన్నోది?

1) 2వ    2) 3వ    3) 4వ     4) 4(ఎ)


11. అస్పృశ్యత నివారణ గురించి తెలిపే రాజ్యాంగంలోని అధికరణ?

1) 18వ   2) 13వ   3) 17వ   4) 21వ 


12. గతంలో ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది?

1) 11వ   2) 12వ   3) 10వ   4) 9వ


13. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ?

1) 41వ   2) 44వ   3) 40వ   4) 42వ


14. కిందివాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చని అధికరణ?

1) 39(ఎ)  2) 43(ఎ)  3) 48(ఎ) 4) 39(2)


15. కిందివాటిలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక  సూత్రాలకు మధ్య ఉండే భేదాల్లో సరికానిది?

1) ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చట్టాలు చేస్తే వాటిని కోర్టులు రద్దు చేయవచ్చు. కానీ ఆదేశిక సూత్రాలకు ఆ రక్షణ లేదు.

2) ప్రాథమిక హక్కులు సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తే, ఆదేశిక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

3) ప్రాథమిక హక్కులను తప్పనిసరిగా అమలు చేయాలి. కానీ ఆదేశిక సూత్రాలు సలహాపూర్వకమైనవి మాత్రమే.

4) ప్రాథమిక హక్కులు ప్రధానంగా నకారాత్మకమైనవి. ఆదేశిక సూత్రాలు ప్రధానంగా సకారాత్మకమైనవి.


16. మౌలిక రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎన్ని?

1) 10    2) 11     3) 8    4) ఏదీకాదు


17. 11వ ప్రాథమిక విధిని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?

1) 42వ    2) 44వ   3) 76వ   4) 86వ


18. ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు?

1) స్వరణ్‌సింగ్‌ కమిటీ      2) కృపలాని కమిటీ

3) నెహ్రూ రిపోర్టు         4) సప్రూ కమిటీ


19. ప్రాథమిక విధుల దినోత్సవం-

1) డిసెంబరు 12         2) అక్టోబరు 2

3) జనవరి 3            4) నవంబరు 5


20. ప్రాథమిక విధుల గురించి తెలిపే అధికరణ-

1) 51(ఎ)     2) 51వ   3) 52వ   4) 49వ


21. కిందివాటిలో ప్రాథమిక విధి కానిది?

1) భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రోత్సహించిన ఆదర్శాలను గౌరవించాలి.

2) అవసరమైతే భారతదేశానికి సేవ చేయడానికి  ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.

3) మన దేశ మిశ్రమ సంస్కృతి, వారసత్వాల    నిరంతర మార్పునకు దోహదపడాలి.

4) ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడాలి, హింసను విడనాడాలి.


22. కిందివాటిలో సరైన వాక్యం?

1) ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి, ప్రాథమిక విధులు ప్రజలకు.

2) ప్రాథమిక విధులు ప్రభుత్వానికి, ఆదేశిక సూత్రాలు ప్రజలకు

3) రెండూ ప్రభుత్వానికి        4) రెండూ ప్రజలకు


23. కిందివాటిలో ఆదేశిక సూత్రం కానిది?

1) గ్రామ పంచాయతీల ఏర్పాటు   2) కుటీర పరిశ్రమల ఏర్పాటు

3) గోవధ నిషేధం    4) అస్పృశ్యతను నివారించడం


24. ఆరేళ్ల లోపు పిల్లలకు పూర్వ బాల్యదశ విద్యను అందించాలని చెప్పే అధికరణ?

1) 46వ   2) 45వ   3) 44వ   4) 49వ


25. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?

1) 3   2) 4    3) 2    4) వర్గీకరించలేదు


26. కిందివాటిలో న్యాయ, అర్ధన్యాయ సంస్థలపై  విధించగల రిట్‌?
1) మాండమస్‌        2) కోవారంటో    

3) సెర్షియోరరీ        4) 1, 3 


27. ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ రద్దు చేయడానికి వీల్లేని అధికరణలు?

1) 19, 21      2) 19, 20  

3) 19, 20, 21      4) 20, 21


28. ‘14 సంవత్సరాల్లోపు పిల్లలను గనులు, కర్మాగారాల్లో పని చేయించరాదు’ అని తెలిపే అధికరణ?

1) 23వ   2) 21వ   3) 24వ   4) 22వ


29. ప్రాథమిక హక్కులను ఏ దేశం నుంచి గ్రహించారు?

1) అమెరికా      2) జర్మనీ 
3) రష్యా     4) ఆస్ట్రేలియా


30. కిందివాటిలో స్వేచ్ఛా హక్కులో లేనిది?

1) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ 

2) సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ

3) భారత భూభాగంలో ఎక్కడైనా నివసించే స్వేచ్ఛ 

4) భారత భూభాగంలో ఎక్కడైనా, ఎంతైనా ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ


31. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా రాజ్యాంగంలో చేసిన మార్పు?    

1) 6-14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం

2) 11వ ప్రాథమిక విధిని చేర్చడం

3) ఆరేళ్ల లోపు పిల్లలకు ఈసీసీఈ (ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌)ను అందించడాన్ని ఆదేశిక సూత్రంగా పొందుపరచడం

4) పైవన్నీ


32. కిందివాటిలో ఆదేశిక సూత్రాల లక్షణం కానిది?

1) వీటికి న్యాయ సంరక్షణ ఉండదు 

2) ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి

3) వీటి అమలుకు ప్రత్యేకంగా చట్టాలు చేయాలి 

4) వీటిని జాతి ఆదర్శాలుగా చెబుతారు


33. ‘పని ప్రదేశాల్లో స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి’ అని చెప్పే అధికరణ?

1) 40వ   2) 41వ   3) 44వ    4) 42వ 


34. ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

1) అమెరికా      2) రష్యా  

3) బ్రిటన్‌     4) ఆస్ట్రేలియా


35. ఉమ్మడి పౌరస్మృతి ఏర్పాటు చేయాలని చెప్పే అధికరణ?

1) 45వ   2) 43వ   3) 48వ   4) 44వ


36. జతపరచండి.

     అధికరణలు         వివరణలు
1) 41వ ఎ) గోవధ నిషేధం
2) 47వ బి) ఉచిత న్యాయ సహాయం
3) 48వ సి) మద్యపాన నిషేధం
4) 39(ఎ) డి) పనిహక్కు కల్పన

1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి    2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి   4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ


37. కిందివాటిలో ఆదేశిక సూత్రాలను వర్గీకరించినవారు?

1) గాంధీజీ       2) ఎం.పి.శర్మ  

3) జె.బి.కృపలాని      4) ఎవరూకాదు


38. కిందివాటిలో ఆస్తి హక్కుకు సంబంధించి సరికానిది?

1) దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

2) ప్రస్తుతం ఇది చట్టబద్ధమైన హక్కు మాత్రమే.

3) ఇది ప్రస్తుతం 300(ఎ) అధికరణలో ఉంది.

4) ప్రస్తుతం ఇది 11వ భాగంలో ఉంది. 


39. కిందివాటిని జతపరచండి.

    రిట్లు      అర్థాలు
1) హెబియస్‌ కార్పస్‌  a) టు బి సర్టిఫైడ్‌
2) మాండమస్‌ b) ఏ అధికారంతో
3) కోవారంటో   c) శరీరాన్ని కలిగి ఉంటూ
4) సెర్షియోరరీ d) మేం ఆదేశిస్తున్నాం

1) 1-d, 2-b, 3-c, 4-a        2) 1-a, 2-c, 3-d, 4-b
3) 1-c, 2-b, 3-d, 4-a        4) 1-c, 2-d, 3-b, 4-a


40. భారత రాజ్యాంగంలో స్వేచ్ఛా హక్కులో భాగంగా ఎన్ని రకాల స్వేచ్ఛలు కల్పించారు?

1) 5      2) 7     3) 8     4) 6


41. విశ్వమానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది?

1) 1948  2) 1944  3) 1949   4) 1947


42. మన రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

1) జపాన్‌     2) జర్మనీ 

3) ఐర్లాండ్‌     4) అమెరికా



 

సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-3; 5-2; 6-2; 7-2; 8-3; 9-3; 10-3; 11-3; 12-2; 13-3; 14-4; 15-2; 16-4; 17-4; 18-1; 19-3; 20-1; 21-3; 22-1; 23-4; 24-2; 25-4; 26-3; 27-4; 28-3; 29-1; 30-4; 31-4; 32-2; 33-4; 34-2; 35-4; 36-1; 37-2; 38-4; 39-4; 40-4; 41-1; 42-3.


రచయిత: బి.ఉపేంద్ర నాయుడు  

Posted Date : 20-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.