• facebook
  • whatsapp
  • telegram

స్థానిక ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వం    

ఇక్కడ గ్రామసభ అక్కడ లాండ్‌ గమాండ్‌!
 


 

మన దేశంలో పరిపాలనా వికేంద్రీకరణకు, గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి ప్రత్యక్ష నిదర్శనాలు స్థానిక ప్రభుత్వాలు. సామాన్య ప్రజలకు పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించి స్వయంపాలనకు అవకాశం ఇచ్చే చట్టబద్ధ పరిపాలనా విభాగాలు. స్థానిక ప్రభుత్వాల ఏర్పాటు, పరిణామక్రమం బ్రిటిష్‌ కాలం నుంచే ప్రారంభమైంది. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం ద్వారా వ్యవస్థాగత రూపాన్ని సంతరించుకుంది. ఈ అంశాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ సంస్థల స్వరూప స్వభావాలను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి కేంద్రం తీసుకున్న చర్యలు, ఆ దిశగా పలు కమిటీలు చేసిన సూచనలు, గ్రామ పంచాయతీ నుంచి జిల్లాపరిషత్‌ వరకు ఉండే అధికారాలు, హక్కులు, బాధ్యతలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.



1.    గ్రామసభ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) ఏప్రిల్‌ 24      2) ఏప్రిల్‌ 14  

3) జూన్‌ 1     4) జులై 1



2.  సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఏవైనా మార్పులు అవసరమైతే చేసే ప్రభుత్వ ఉద్యోగి ఎవరు?

1) ప్రిసైడింగ్‌ అధికారి      

2) రిటర్నింగ్‌ అధికారి

3) బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ)     

4) అసిస్టెంట్‌ బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (ఏబీఎల్‌ఓ)


 

3.  ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి ఎంతమంది వార్డు సభ్యులు ఉంటారు? (కనిష్ఠంగా - గరిష్ఠంగా)

1) 5 -21    2) 7-23     3) 21-50    4) 9 - 20



4.     పార్లమెంటు స్థానిక సంస్థల్లో స్త్రీలకు ఎంత శాతం రిజర్వేషన్‌ కేటాయించింది?

1) 33%   2) 33.33%    3) 50%    4) 34%



5.     గ్రామ పంచాయతీ లెక్కలు, సమావేశాల విషయాలను నమోదు చేసేవారు?

 1) గ్రామ కార్యదర్శి     2) ఆర్‌డీఓ 

 3) ఎంపీడీఓ     4) జడ్పీ సీఈఓ


 

6. కిందివాటిలో పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ?

 1) అమెరికా   2) భారత్‌   3) ఇంగ్లండ్‌   4) పైవన్నీ



7. కిందివాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ?

1) స్విట్జర్లాండ్‌    2) భారత్‌ 

3) ఇంగ్లండ్‌    4) పైవన్నీ



8.     గ్రామ పంచాయతీ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారు?    

1) ఒక నెలకు      2) 6 నెలలకు 

3) 2 నెలలకు     4) ఒక సంవత్సరానికి



9.     20 గ్రామ పంచాయతీలు ఉంటే ఏం ఏర్పాటు చేస్తారు?

1) జిల్లా      2) నగర పంచాయతీ 

3) మండలం     4) మున్సిపాలిటీ


 

10. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఒక గ్రామ పంచాయతీలోని 20 మంది వార్డు సభ్యుల్లో ఎంత మంది ఒక ప్రతిపాదనను సమర్థిస్తే అది ఆమోదం పొందుతుంది?

1) 9 మంది    2) 10 మంది  

3) 11 మంది    4) 20 మంది 



11. ప్రభుత్వం ఎన్ని స్థాయిల్లో పని చేస్తుంది?

1) 2      2) 3     3) 4      4) 5 



12. కిందివాటిలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉదాహరణ?

1) భారత్‌    2) బ్రిటన్‌    3) 1, 2     4) అమెరికా 


 

13. కిందివాటిలో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి ఉదాహరణ?

1) అమెరికా  2) బ్రెజిల్‌   3) 1, 2    4) ఇంగ్లండ్‌ 



14. ఎంత జనాభా ఉంటే ఒక నగర పంచాయతీని ఏర్పాటు చేయవచ్చు? 

1) 500       2) 20,000-40,000 

3) 40,000-3 లక్షల్లోపు     4) 3 లక్షలకు పైగా



15. కిందివాటిలో పురపాలక సంఘం విధులకు సంబంధించి సరికానిది?    

 1) నీటి సరఫరా       

2) వీధిదీపాలు

3) పాఠశాలలు నడపడం   

4) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు



16. కిందివాటిలో ఏదైనా మున్సిపాలిటీ జనాభా 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే వేటిని ఏర్పాటు చేస్తారు?

1) మున్సిపల్‌ కౌన్సిల్‌     2) కార్పొరేషన్లు  

3) వార్డు కమిటీ      4) నగర పంచాయతీ


 

17. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1993, జూన్‌ 24      2) 1994, జూన్‌ 24    

 3) 1995, జూన్‌ 24     4) 1996, జూన్‌ 24



18. భారతదేశంలోని ‘గ్రామసభ’ ఏ దేశ లాండ్‌ గమాండ్‌ వ్యవస్థను పోలి ఉంటుంది?

1) కెనడా      2) బ్రిటన్‌ 

3) అమెరికా      4) స్విట్జర్లాండ్‌


 

19. గ్రామ సర్పంచ్‌ను ఎప్పటి నుంచి ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నారు?

1) 1981  2) 1992  3) 1978  4) 1968



20. గ్రామ పంచాయతీల గురించి తెలియజేసే ఆర్టికల్‌?

1) 38    2) 39    3) 40    4) 44



21. ఏదైనా కారణం వల్ల సర్పంచి పదవి ఖాళీ అయితే ఎన్ని నెలల్లోపు ఉపఎన్నికలు నిర్వహించాలి?    

1) 6 నెలలు     2) 3 నెలలు 

3) 2 నెలలు     4) 4 నెలలు


 

22. ఉపసర్పంచి పదవికి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు?

1) 6 నెలలు     2) 30 రోజులు   

3) 4 నెలలు     4) 2 నెలలు 



23. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ఎన్ని పంచాయతీ సమితుల స్థానంలో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేశారు?

1) 330   2) 333   3) 235   4) 448



24. జిల్లా పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు కానివారు?

1) జిల్లా కలెక్టర్‌     2) ఎంపీపీలు  

3) గ్రామ సర్పంచ్‌లు  4) జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌


 

25. మండల పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు కానివారు?

1) జిల్లా కలెక్టర్‌       2) జడ్పీటీసీ సభ్యులు 

3) జడ్పీ ఛైర్మన్‌     4) ఎమ్‌పీటీసీ సభ్యులు



26. స్థాయీ సంఘాలు (స్టాండింగ్‌ కమిటీలు) ఎన్ని రకాలు?

1) 5     2) 6     3) 7     4) 8



27. జిల్లా ప్రణాళిక బోర్డు/కమిటీ గురించి తెలియజేసే ఆర్టికల్‌?

1) 243(3)     2) 243 (ZD)

3) 243 (ZE)    4) 243 (Z)



28. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (CDP) ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1950, అక్టోబరు 2      2) 1952, అక్టోబరు 2

3) 1953, అక్టోబరు 2      4) 1954, అక్టోబరు 2 


 

29. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని కంటోన్మెంట్‌ బోర్డులు ఉన్నాయి?

1) 61    2) 63    3) 62    4) 64


 

30. భారతదేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థ అయిన దిల్లీ (DUDA) ఎప్పుడు ఏర్పడింది?

1) 1964   2) 1975  3) 1981  4) 2001



31. కంటోన్మెంట్‌ బోర్డులను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు?

1) 1964   2) 2006  3) 1924  4) 2001



32. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పోర్ట్‌ ట్రస్టులు ఉన్నాయి?

1) 62     2) 13     3) 9     4) 7 



33. బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

1) 1956, జనవరి 16    2) 1957, జనవరి 16 

3) 1957, నవంబరు 24    4) 1958, నవంబరు 24



34. అశోక్‌ మెహతా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? 

1) 1977, డిసెంబరు 12     2) 1978, ఆగస్టు 21 

3) 1957, జనవరి 16     4) 1958, డిసెంబరు 12



35. తాలూకా బోర్డులను ఎప్పుడు రద్దు చేశారు? 

1) 1909   2) 1919  3) 1934  4) 1935


 

36. స్థానిక ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానాన్ని ఏ చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు?

1) 1909  2) 1919  3) 1935  4) 1947


 

37. జీవీకే రావు కమిటీని ఎప్పుడు ఏర్పాటుచేశారు? 

1) 1986    2) 1984    3) 1985    4) 1988



38. లక్ష్మీమాల్‌ సింఘ్వీ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1984    2) 1985    3) 1988    4) 1986



39. భారతదేశంలో మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?

1) ఉత్తర్‌ప్రదేశ్‌      2) రాజస్థాన్‌  

3) కర్ణాటక       4) ఆంధ్రప్రదేశ్‌



40. స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో ఏ చట్టం ప్రకారం చేర్చారు?

1) 1909  2) 1919  3) 1947  4) 1935



41. కిందివాటిలో ఏ చట్టం ద్వారా స్థానిక ప్రభుత్వాలను ట్రాన్స్‌ఫర్డ్‌ జాబితాలో చేర్చారు?

1) 1909  2) 1919  3) 1935  4) 1947



42. ఉత్తర మేరూర్‌ అంటే?

1) శాసనం పేరు      2) బిల్లు పేరు  

3) గ్రామం పేరు     4) పట్టణం పేరు


43. మద్రాసు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎప్పుడు ఏర్పడింది?

1) 1687, డిసెంబరు 30      2) 1688, సెప్టెంబరు 29  

3) 1688, డిసెంబరు 30      4) 1689, డిసెంబరు 30



44. ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో (1772, మే 11న) కలెక్టర్‌ పదవిని ప్రవేశపెట్టారు?

1) చార్లెస్‌ మెట్‌ కాఫ్‌      2) లార్డ్‌ మేయో  

3) వారన్‌ హేస్టింగ్స్‌      4) లార్డ్‌ రిప్పన్‌



45. ఎక్కువ మంది రాజులు రాజ్య పరిపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడంపైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమంటారు?

1) రాజరికం     2) ప్రజాస్వామ్యం 

 3) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం    4) పరోక్ష ప్రజాస్వామ్యం



46. సమాజంలో అన్యాయం, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించే ప్రభుత్వం?

1) రాజరికం      2) ప్రజాస్వామ్యం  

3) ప్రత్యక్ష ప్రజాస్వామ్యం     4) పరోక్ష ప్రజాస్వామ్యం



47. ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం’ అని వ్యాఖ్యానించినవారు?

1) ఉడ్రో విల్సన్‌       2) కారల్‌ మార్క్స్‌  

3) అబ్రహాం లింకన్‌     4) గాంధీజీ



48. ఒక గ్రామంలో ఎంత జనాభా ఉంటే ఆ గ్రామాన్ని వార్డులుగా విభజిస్తారు?

1) 500     2) 100  200  

3) 2000      4) 2000  5000 



49. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన వారికి సార్వజనీన వయోజన ఓటు హక్కు కల్పించారు? 

1) 361   2) 324    3) 326   4) 325



50. గోండుల గ్రామ పంచాయతీని ఏమంటారు?

1) పంచ్‌    2) పంచా   3) పంచి   4) పంచె



51. గోండుల గ్రామ పెద్దను ఏమంటారు?

1) యజమాని      2) పంచాన్‌ 

3) పట్లా      4) సర్పంచ్‌ 



52. కిందివాటిలో మొదటి లోక్‌సభకు సంబంధించిన వివరాలను జతపరచండి.

1) దేశవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలు ఎ) 2,24,000

2) ఉక్కు బ్యాలెట్‌ పెట్టెలు      బి) 25,00,000

3) బ్యాలెట్‌ పత్రాలు          సి) 62,00,00,000

4) ఎన్నికలను పర్యవేక్షించినవారు  డి) 10 లక్షలు 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 

2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 

4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి


 

53. ఒక్కో వార్డుకు ఎంత మంది ఓటర్లు ఉంటారు?                     

1) 100   2) 100-200 

 3) 500   4) 300


సమాధానాలు

1-2; 2-3; 3-1; 4-3; 5-1; 6-4; 7-1; 8-1; 9-3; 10-3; 11-2; 12-3; 13-3; 14-2; 15-4; 16-3; 17-2; 18-4; 19-1; 20-3; 21-4; 22-2; 23-1; 24-3; 25-4; 26-3; 27-2; 28-2; 29-3; 30-1; 31-3; 32-2; 33-2; 34-1; 35-3; 36-1; 37-3; 38-4; 39-3; 40-4; 41-2; 42-3; 43-1; 44-3; 45-1; 46-2; 47-3; 48-4; 49-3; 50-1; 51-3; 52-1; 53-2.


 

               

 

 

 

   

 

రచయిత: అయితరాజు లక్ష్మణ్‌    

Posted Date : 30-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.