• facebook
  • whatsapp
  • telegram

ఆ బిల్లులకు స్పీకర్‌ ధ్రువీకరణ అక్కర్లేదు!

కేంద్ర ప్రభుత్వం - రాష్ట్ర ప్రభుత్వం - న్యాయవ్యవస్థ



భారత ప్రజాస్వామ్యానికి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూలస్తంభాలు. అవి ప్రజల ఆక్షాంక్షలు నెరవేర్చే, దేశాన్ని ముందుకు నడిపించే రాజ్యాంగ వ్యవస్థలు. కేంద్రం తరహాలోనే ప్రతి రాష్ట్రంలోనూ ఆ మూడు విభాగాలు ఉంటాయి. వాటి నిర్మాణం, కూర్పుపై పోటీ పరీక్షార్థులకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రాల్లో అసెంబ్లీల విధులతో పాటు రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్‌లకు ఉండే సాధారణ, ప్రత్యేక అధికారాలు, ప్రధాని, ముఖ్యమంత్రులకు ఉన్న ప్రాధాన్యం, సంబంధిత రాజ్యాంగ అధికరణలు, సవరణలను గుర్తుంచుకోవాలి.


1.    ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది ఎవరు?

1) లోక్‌సభ స్పీకర్‌       2) రాజ్యసభ ఛైర్మన్‌  

3) రాష్ట్రపతి       4) ప్రధానమంత్రి


2.     కిందివాటిలో రాష్ట్రపతి అధికారం కానిది?

1) లోక్‌సభను రద్దు చేయగలరు.

2) ప్రతి సంవత్సరం మొదటి పార్లమెంటు సమావేశంలో ప్రసంగించగలరు.

3) 12 మంది సభ్యులను లోక్‌సభకు నామినేట్‌ చేయగలరు.

4) పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టం కావాలంటే దానిని రాష్ట్రపతి ఆమోదించాలి.


3.     పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతికి ఆర్డినెన్సు జారీ చేసే అధికారాన్ని ఇచ్చిన ప్రకరణ ఏది?

1) 213   2) 123   3) 321   4) 125


4.     అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని ప్రాథమిక హక్కుల ప్రకరణలు?

1) 20, 21  2) 18, 20  3) 21, 23  4) 30, 32


5.     మన దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి?

1) ద్రౌపది ముర్ము       2) ఇందిరా గాంధీ   

3) ప్రతిభా పాటిల్‌       4) సుష్మాస్వరాజ్‌


6.     రాష్ట్రపతి విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్ని నెలల్లోపు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి?

1) నెల 2) 3 నెలలు 3) 2 నెలలు 4) 6 నెలలు


7.     ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభలు వరుసగా ఏ మెజారిటీతో ఆమోదించాలి?

1) సాధారణ, ఎఫెక్టివ్‌       2) రెండు సభలూ సాధారణ మెజారిటీ   

3) రెండు సభలూ ఎఫెక్టివ్‌ మెజారిటీ       4) ఎఫెక్టివ్, సాధారణ


8.     ప్రకరణ 74 ప్రకారం రాష్ట్రపతి తన విధులను ఎవరి సలహా ప్రకారం నిర్వర్తిస్తారు?

1) ప్రధానమంత్రి   2) ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి

3) హోంమంత్రి       4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి


9.     భారత రాజ్యాంగంలో కేబినెట్‌ అనే పదాన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?

1) 42వ   2) 44వ   3) 40వ   4) 38వ


10. మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?

1) ప్రధానమంత్రి       2) లోక్‌సభ   

3) రాజ్యసభ       4) రాష్ట్రపతి


11.     లోక్‌సభ నిర్మాణం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552, ప్రస్తుత సభ్యుల సంఖ్య 543.

2) లోక్‌సభకు రాష్ట్రాల నుంచి 524 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 19 మంది ప్రాతినిధ్యం వహిస్తారు

3) లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు వరుసగా 84, 47 సీట్లు రిజర్వు చేశారు.

4) లోక్‌సభ సభ్యులు సార్వత్రిక ప్రాతినిధ్య ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు.


12. కిందివాటిలో రాజ్యసభ ప్రత్యేకాధికారం గురించి తెలియజేయని అధికరణ?

1) 249    2) 312    3) 67(b)    4) 81


13. కిందివాటిలో ద్రవ్యబిల్లు లక్షణం కానిది?

1) ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం.

2) ద్రవ్యబిల్లు అని స్పీకర్‌ ధ్రువీకరించాలి.  

3) ద్రవ్యబిల్లును లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి.

4) ద్రవ్యబిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ప్రతిష్టంభన ఏర్పడితే ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు.


14. ఏ బిల్లు విషయంలో ఇప్పటివరకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయలేదు?

1) వరకట్న నిషేధం బిల్లు       2) బ్యాంకింగ్‌ సేవల కమిషన్‌ (తొలగింపు)

3) పోటా బిల్లు       4) పార్లమెంటు సభ్యుల జీతాల బిల్లు


15. కిందివాటిలో ఏ పార్లమెంటు కమిటీకి స్పీకర్‌ ఎక్స్‌-అఫీషియో ఛైర్మన్‌గా పనిచేయరు?    

1) నిబంధనల కమిటీ       2) బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ

3) జనరల్‌ పర్పస్‌ కమిటీ   4) పాలనా కమిటీ


16. సుప్రీంకోర్టుకు సంబంధించి సరికాని అంశం ఏది?    

1) ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు ఉంటారు.

2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

3) కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తులు ఉంటారు.

4) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాష్ట్రపతి ముందు ప్రమాణస్వీకారం చేస్తారు.


17. కిందివాటిలో సరైన వాక్యం?

1) గవర్నర్‌ను ప్రధానమంత్రి నియమిస్తారు.

2) ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు.

3) భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

4) రాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి నియమిస్తారు.


18. రాష్ట్ర శాసనమండలి ఏర్పాటు, రద్దుకు సంబంధించిన అధికరణ

1) 168   2) 179   3) 169   4) 170


19. రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడు-

1) గవర్నర్‌       2) రాష్ట్రపతి   

3) ముఖ్యమంత్రి       4) ప్రధానమంత్రి


20. కిందివారిలో గవర్నర్‌ నియమించనివారు ఎవరు?

1) రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్‌  

2) రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌

3) రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌   

4) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌


21. రాష్ట్ర విధాన సభ సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత శాతానికి మించరాదు?

1) 10%  2) 12%  3) 20%  4) 15%


22. కిందివాటిలో సరికాని వాక్యం?

1) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తి జీతాలు వరుసగా రూ.2,80,000, రూ.2,50,000.

2) హైకోర్టు న్యాయమూర్తులు 62 సంవత్సరాలు నిండే వరకు పదవిలో ఉంటారు.

3) 226వ అధికరణ ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేయవచ్చు.

4) హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారు.


23. కిందివాటిలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు ఉండాల్సిన అర్హత కానిది?

1) భారత పౌరుడై ఉండాలి.

2) భారత భూభాగ పరిధిలోని న్యాయస్థానంలో కనీసం 10 సంవత్సరాలు అనుభవం ఉండాలి.

3) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైకోర్టుల్లో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.

4) గవర్నర్‌ దృష్టిలో ప్రముఖ న్యాయకోవిదుడై ఉండాలి.


24. తెలంగాణ శాసనమండలి స్థానాల సంఖ్య?

1) 60    2) 58    3) 40    4) 45


25. కిందివాటిలో శాసనమండలి లేని రాష్ట్రం?

1) ఉత్తర్‌ప్రదేశ్‌    2) బిహార్‌    

3) మధ్యప్రదేశ్‌    4) మహారాష్ట్ర


26. దేశంలో అతితక్కువ అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రం?

1) సిక్కిం  2) మిజోరాం 3) త్రిపుర 4) మణిపుర్‌


27. భారత రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేసే భాగం ఎన్నోది?

1) V 2) VI 3) IV 4) VIII


28. అండమాన్‌ నికోబార్‌ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?

1) ముంబయి 2) చండీగఢ్‌ 3) చెన్నై 4) కోల్‌కతా 


29. శాసనమండలిలో ఎన్నో వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు?


30. శాసనమండలిలో కనీస సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గరాదు?

1) 60    2) 40     3) 50     4) 30


31. రాష్ట్ర విధానసభ, శాసన మండలికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన కనీస వయసులు వరుసగా?

1) 30, 25 2) 30, 21 3) 25, 30 4) 25, 25


32. తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది?

1) 2020  2) 2019  3) 2021  4) 2022


33. కిందివాటిలో ఏ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్య భిన్నంగా ఉంది?

1) త్రిపుర    2) మణిపుర్‌

3) మేఘాలయ     4) అస్సాం


34. మంత్రిమండలి సభ్యుల సంఖ్యపై పరిమితిని విధించిన రాజ్యాంగ సవరణ?

1) 93వ   2) 91వ  3) 96వ  4) 89వ 


35. ‘గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి ఒక మంత్రి మండలి ఉండాలి’ అని చెప్పే అధికరణ?

1) 164   2) 165   3) 155   4) 163


36. కిందివాటిలో సాధారణ బిల్లుకు సంబంధించి సరికానిది?

1) పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.

2) రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు.

3) స్పీకర్‌ ధ్రువీకరణ అవసరం లేదు.

4) ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుకు వీల్లేదు.


37. లోక్‌సభ స్పీకర్లకు సంబంధించి సరికాని వాక్యం?

1) మొదటి లోక్‌సభ స్పీకర్‌ జి.వి.మౌలాంకర్‌.

2) అత్యధిక కాలం స్పీకర్‌గా పనిచేసినవారు బలరాం జక్కర్‌.

3) మొదటి మహిళా స్పీకర్‌ మీరాకుమార్‌.

4) లోక్‌సభకు ఇంతవరకు ముగ్గురు మహిళలు స్పీకర్లుగా పనిచేశారు.


38. ప్రజాప్రాతినిధ్య చట్టం చేసిన సంవత్సరం?

1) 1954  2) 1953  3) 1951  4) 1952


39. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ?

1) 75    2) 73    3) 72     4) 58


40. కింది ఏ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం?

1) ద్రవ్యబిల్లు 2) రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లు    

3) రాజ్యాంగ సవరణ బిల్లు    4) 1, 2 


41. కిందివారిలో ఎవరు రెండుసార్లు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు?

1) నీలం సంజీవ రెడ్డి   2) జ్ఞానీ జైల్‌సింగ్‌

3) మహ్మద్‌ హమీద్‌ అన్సారీ        4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌


42. కిందివారిలో ఏ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పని చేయలేదు?

1) ఆర్‌.వెంకట్రామన్‌      2) కె.ఆర్‌.నారాయణన్‌

3) డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌     4) గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌


 

సమాధానాలు

1-3; 2-3; 3-2; 4-1; 5-3; 6-3; 7-1; 8-2; 9-2; 10-4; 11-1; 12-4; 13-4; 14-4; 15-4; 16-3; 17-3; 18-3; 19-3; 20-4; 21-4; 22-1; 23-4; 24-3; 25-3; 26-1; 27-2; 28-4; 29-4; 30-2; 31-3; 32-2; 33-4; 34-2; 35-4; 36-4; 37-4; 38-3; 39-3; 40-4; 41-3; 42-4.

రచయిత: బి. ఉపేంద్ర నాయుడు 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.