• facebook
  • whatsapp
  • telegram

ఆమోదానికి ముందు అవన్నీ బిల్లులే!

రాష్ట్ర ప్రభుత్వం

సమాఖ్య వ్యవస్థలోని రెండు ప్రధాన పరిపాలనా విభాగాల్లో కేంద్రం మొదటిదైతే రెండోది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాల సమాఖ్య అయిన మన దేశంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట అధికారాలు, విధులు ఉంటాయి. కేంద్రం తరహాలోనే శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల నిర్మాణం ఉంటుంది. సాధారణ పరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రజలతో ఎక్కువ అనుబంధం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కూర్పు, విధి విధానాలు, ఇందుకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలను అభ్యర్థులు తెలుసుకోవాలి. రాష్ట్రాల్లో శాసనసభ, శాసన మండళ్ల నిర్మాణం, ఎన్నికల యంత్రాంగంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ స్వరూపం, ముఖ్య పదవులు చేపట్టిన వారి గురించి అవగాహన ఉండాలి.

1.    ఆంధ్రప్రదేశ్‌ ధూమపాన నిషేధం, ఆరోగ్య పరిరక్షణ చట్టం చేసిన సంవత్సరం?

1) 2000   2) 2001   3) 2002  4) 2004


2.     తెలంగాణ శాసనసభలో ఎంత మంది సభ్యులు ఉన్నారు?

1) 119   2) 175   3) 403   4) 294


3.     ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని సభ్యుల సంఖ్య-

1) 119   2) 175    3) 294   4) 288


4.     తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో నియోజక వర్గంలో సుమారు ఎంత మంది ఓటర్లు ఉన్నారు?

1) 1,65,000     2) 1,72,000 

3) 2,80,000     4) 1,70,000


5.     సాధారణంగా ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను ఎవరు జారీ చేస్తారు?

1) పోలింగ్‌ బూత్‌ అధికారి        2) ఎలక్షన్‌ కమిషన్‌

3) ప్రిసైడింగ్‌ అధికారి       4) రిటర్నింగ్‌ అధికారి


6.     రాష్ట్ర మంత్రిమండలిలోని సభ్యులకు వివిధ శాఖలను ఎవరు కేటాయిస్తారు?

1) ముఖ్యమంత్రి     2) గవర్నర్‌  

3) విధానసభ స్పీకర్‌      4) శాసనమండలి స్పీకర్‌ 


7.     తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఏ సంవత్సరం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాయి?

1) 2014  2) 2015  3) 2013  4) 2012


8.     భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడటం రాష్ట్రంలో ఎవరి బాధ్యత?

1) ముఖ్యమంత్రి        2) గవర్నర్‌    

3) రాష్ట్రపతి       4) ప్రధానమంత్రి


9.     భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో ఎవరికి కార్యనిర్వహణాధికారాలను కల్పించారు?

1) గవర్నర్‌       2) ముఖ్యమంత్రి    

3) రాష్ట్రపతి       4) ప్రధానమంత్రి


10. ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎంత మంది సభ్యులు ఉన్నారు?

1) 119    2) 175    3) 58     4) 40


11. తెలంగాణ శాసనమండలిలో ఎంత మంది సభ్యులున్నారు?

1) 119    2) 175    3) 58    4) 40


12. గవర్నర్‌ పదవీ కాలం ఎన్నేళ్లు?

1) అయిదేళ్లు   2) ఆరేళ్లు  

3) నాలుగేళ్లు   4) రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు 


13. భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు?

1) జ్యోతిబసు           2) పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 

3) నవీన్‌ పట్నాయక్‌  4) జగదాంబిక పాల్‌


14. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం గవర్నర్‌ రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా పని చేయొచ్చు?    

1) 42వ, 1976        2) 44వ, 1978       

3) 86వ, 2002        4) 7వ, 1956


15. విధానసభలో మంత్రిమండలి 15% కు మించరాదు. అలాగే ఎంత మందికి తగ్గరాదు?    

1) 10     2) 18     3) 26     4) 12


16. గవర్నర్‌తో ఎవరు ప్రమాణస్వీకారం చేయిస్తారు?

1) రాష్ట్రపతి                         2) హైకోర్టు ప్రధాన న్యాయయూర్తి

3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి        4) ప్రధానమంత్రి


17. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఎన్ని?    

1) 19     2) 12     3) 29     4) 7


18. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీలకు కేటాయించిన నియోజకవర్గాలు?

1) 19     2) 12     3) 29     4) 7


19. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు?

1) 19     2) 12     3) 29     4) 7


20. తెలంగాణ అసెంబ్లీలో ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు?

1) 19     2) 12     3) 29     4) 7


21. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్‌?

1) సుచేత కృపలానీ       2) ప్రతిభా పాటిల్‌ 

3) సరోజినీ నాయుడు     4) శారదా ముఖర్జీ


22. భారతదేశంలో మొదటి మహిళ ముఖ్యమంత్రి?

1) ద్రౌపది ముర్ము         2) ప్రతిభా పాటిల్‌ 

3) ఇందిరా గాంధీ         4) సుచేత కృపలానీ


23. శాసనసభ ఆమోదం పొందక ముందు చట్టాన్ని ఏ విధంగా పిలుస్తారు?

1) శాసనం     2) చిత్తుప్రతి      3) బిల్లు     4) గెజిట్‌


24. ధూమపాన నిషేధం - ఆరోగ్య పరిరక్షణ చట్టం-2002ను సుప్రీంకోర్టు ఎప్పుడు జారీ చేసింది?

1) 2001, నవంబరు 2       2) 2002, నవంబరు 2

3) 2003, నవంబరు 2   4) 2000, నవంబరు 2 


25. శాసన మండలి 1958లో ఏర్పాటై 1985 వరకు పనిచేసింది. మళ్లీ తిరిగి ఎప్పుడు ఏర్పాటైంది?

1) 2005  2) 2006  3) 2007  4) 2008


26. శాసనమండలికి పట్టభద్రుల నుంచి ఎన్నో వంతు సభ్యులను ఎన్నుకుంటారు?


27. భారత రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు?

1) రాష్ట్రపతి                     2) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి       4) ప్రధానమంత్రి


28. కిందివాటిలో ద్విసభా విధానం అమల్లో లేని రాష్ట్రం?

1) ఉత్తర్‌ప్రదేశ్‌         2) మహారాష్ట్ర    

3) కర్ణాటక        4) మధ్యప్రదేశ్‌


29. విధానమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సంవత్సరాలు పనిచేయలేదు?

1) 21    2) 22    3) 23     4) 24 


30. భారతదేశంలో అతి తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి?

1) కె.రోశయ్య     2) నాదెండ్ల భాస్కరరావు 

3) జగదాంబిక పాల్‌     4) యడ్యూరప్ప


31. శాసనమండలికి గవర్నర్‌ ఎన్నో వంతు సభ్యులను నామినేట్‌ చేస్తారు?


32. విధాన మండలికి ఎన్నో వంతు మంది ఉపాధ్యాయులను ఎన్నుకుంటారు?


33. రాష్ట్ర గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?

1) ముఖ్యమంత్రి 2) ప్రధానమంత్రి   

3) రాష్ట్రపతి    4) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి


34. శాసనమండలి సభ్యుల పదవీ కాలం ఎంత?

1) అయిదేళ్లు        2) ఆరేళ్లు     

3) శాశ్వతం     4) నాలుగేళ్లు


35. విధానసభ పదవీ కాలం?

1) అయిదేళ్లు        2) ఆరేళ్లు     

3) శాశ్వతం     4) నాలుగేళ్లు


36. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో విధానసభ కాలపరిమితిని పార్లమెంటు ఎన్నేళ్లకు పొడిగించొచ్చు?

1) 6 నెలలు     2) ఏడాది  

3) 2 సంవత్సరాలు      4) 5 నెలలు


37. హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి?

1) టంగుటూరి ప్రకాశం పంతులు        2) కాశీనాథరావు వైద్య

3) బూర్గుల రామకృష్ణారావు            4) నీలం సంజీవరెడ్డి


38. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తి?

1) పవన్‌కుమార్‌ చామ్లింగ్‌     2) నవీన్‌ పట్నాయక్‌ 

3) జ్యోతిబసు       4) జగదాంబిక పాల్‌


39. నాగాలాండ్‌ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎస్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించారు?

1) 58     2) 59     3) 54    4) 55


40. భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన విధానసభ స్పీకర్‌?

1) ఎన్‌.వెంకట్రామయ్య     2) పి.సూర్యచంద్రరావు

3) హాషీం అఋ్దల్‌ హలీమ్‌        4) బి.వి.సుబ్బారెడ్డి


41. కిందివాటిలో ద్విసభా విధానం అమల్లో ఉన్న రాష్ట్రం?    

1) జమ్ము-కశ్మీర్‌        2) మధ్యప్రదేశ్‌     

3) రాజస్థాన్‌        4) తెలంగాణ


42. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి మొదటి ఛైర్మన్‌?

1) మాడపాటి హనుమంతరావు         2) ఎన్‌.వెంకట్రామయ్య 

3) అయ్యదేవర కాళేశ్వరరావు     4) కల్లూరి సుబ్బారావు


43. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విధాన సభ మొదటి స్పీకర్‌?

1) మాడపాటి హనుమంతరావు     2) ఎన్‌.వెంకట్రామయ్య 

3) అయ్యదేవర కాళేశ్వరరావు     4) కల్లూరి సుబ్బారావు


44.     భారతదేశంలో, ఏపీలో తొలి దళిత ముఖ్యమంత్రి?

1) మాయాదేవి                   2) దామోదరం సంజీవయ్య   

3) ఇ.ఎమ్‌.ఎస్‌.నంబూద్రి పాద్‌        4) కె.ఆర్‌.నారాయణన్‌ 


45. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదవిలో ఉండగా మరణించిన ముఖ్యమంత్రి?

1) వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి     2) ఎన్‌.టి.రామారావు

3) నీలం సంజీవరెడ్డి     4) మర్రి చెన్నారెడ్డి 


46. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి?

1) మొరార్జీ దేశాయ్‌     2) వై.వి.గిరి 

3) ఇ.ఎమ్‌.ఎస్‌.నంబూద్రి పాద్‌     4) ఎన్‌.టి.రామారావు


47. ఏ ఆర్టికల్‌ ప్రకారం గవర్నర్‌ను రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు?

1) 158      2) 158(a)  

3) 158(2a)     4) 158(3a)


48. కిందివాటిలో ఏ ఆర్టికల్‌ ప్రకారం గవర్నర్‌ తన విధులను నిర్విర్తించడంలో సహాయపడటానికి, సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండాలి?

1)163    2) 163(1)   3) 163(2)   4) 163(3) 


49. శాసనమండలి సభ్యుల్లో ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు?


సమాధానాలు


1-3; 2-1; 3-2; 4-4; 5-2; 6-1; 7-1; 8-2; 9-1; 10-3; 11-4; 12-4; 13-2; 14-4; 15-4; 16-2; 17-3; 18-1; 19-4; 20-2; 21-3; 22-4; 23-3; 24-1; 25-3; 26-2; 27-1; 28-4; 29-2; 30-3; 31-3; 32-2; 33-3; 34-2; 35-1; 36-2; 37-3; 38-2; 39-2; 40-3; 41-4; 42-1; 43-3; 44-2; 45-1; 46-3; 47-4; 48-2; 49-1.


ర‌చ‌యిత‌: అయిత‌రాజు ల‌క్ష్మ‌ణ్‌
 

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.