• facebook
  • whatsapp
  • telegram

పన్నెండో షెడ్యూల్‌లో పద్దెనిమిది అధికారాలు!

స్థానిక సంస్థలు

పరిపాలనలో ప్రజల భాగస్వామ్యంతో పునాదుల నుంచి ప్రజాస్వామ్యాన్ని స్థానిక సంస్థలు పటిష్ఠం చేస్తున్నాయి. విశాలమైన భారతదేశంలో అనాదిగా అధికార వికేంద్రీకరణ అలాంటి పాలనా విభాగాల ద్వారానే అమలైంది.  మౌర్యులు మొదలు నేటి వరకు దేశంలో స్థానిక స్వపరిపాలన తీరుతెన్నులపై, కాలానుగుణంగా వచ్చిన మార్పులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. స్వాతంత్య్రానంతరం పంచాయతీ రాజ్‌ వ్యవస్థ చట్టబద్ధత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు, సవరణలు, కమిటీలు, చేసిన సిఫారసులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల స్వరూపం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.


1. 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 

1) 1992  2) 1993  3) 1994  4) 1995


2.  భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడు?

1) లార్డ్‌ కర్జన్‌     2) లార్డ్‌ ఇర్విన్‌ 

3) లార్డ్‌ రిప్పన్‌     4) లార్డ్‌ వెల్లస్లీ


3.  కిందివాటిలో సరికాని దానిని గుర్తించండి.

1) 73వ రాజ్యాంగ సవరణ - పంచాయతీరాజ్‌ సంస్థలు

2) 74వ రాజ్యాంగ సవరణ - పట్టణ స్థానిక సంస్థలు

3) మౌర్యులు - పట్టణ స్థానిక సంస్థలు 

4) చోళులు - మున్సుబ్‌దారీ వ్యవస్థ


4.  స్థానిక సంస్థల గురించి పేర్కొన్న భారత రాజ్యాంగంలోని అధికరణ?

1) 40     2) 44     3) 42     4) 41


5.  స్థానిక సంస్థలను భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో ఏ జాబితాలో చేర్చారు? 

1) కేంద్ర జాబితా     2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా     4) అవశిష్ట అధికారం


6. సామాజిక అభివృద్ధి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

1) 1953, అక్టోబరు 2     2) 1952, అక్టోబరు 2 

3) 1955, ఆగస్టు 15     4) 1952 జనవరి 26


7. జాతీయ విస్తరణ సేవా పథకాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?

1) 1952  2) 1953  3) 1955  4) 1972 


8. మూడు అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను అమలుచేసిన తొలి రాష్ట్రం?

1) రాజస్థాన్‌     2) ఆంధ్రప్రదేశ్‌ 

3) బిహార్‌     4) మధ్యప్రదేశ్‌ 


9.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు అంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఎప్పుడు అమలు చేశారు? 

1) 1958, అక్టోబరు 2     2) 1959, అక్టోబరు 2 

3) 1956, నవంబరు 1     4) 1959, ఆగస్టు 15 


10. అశోక్‌ మెహతా కమిటీని ఎప్పుడు నియమించారు? 

1) 1957  2) 1978  3) 1977  4) 1967 


11. బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీని ఎందుకు నియమించారు?

1) మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సూచించడానికి

2) రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను సూచించడానికి 

3) CDP, NESS కార్యక్రమాల పనితీరును పరిశీలించడానికి

4) ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి 


12. కిందివాటిలో అశోక్‌ మెహతా కమిటీ సూచన కానిది?

1) రెండంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ. 

2) పంచాయతీరాజ్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు. 

3) స్థానిక సంస్థలకు ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించాలి. 

4) స్థానిక సంస్థల ప్రణాళికల తయారీకి జిల్లా పరిషత్‌ కార్యనిర్వాహక వ్యవస్థగా ఉండాలి.


13. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) అశోక్‌ మెహతా కమిటీ - మొరార్జీ దేశాయ్‌

2) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ - జవహర్‌లాల్‌ నెహ్రూ 

3) ఎల్‌.ఎం.సింఘ్వి కమిటీ - రాజీవ్‌గాంధీ

4) 73, 74వ రాజ్యాంగ సవరణలు - వి.పి.సింగ్‌


14. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?    

1) ఏప్రిల్‌ 20     2) ఏప్రిల్‌ 25 

3) జూన్‌ 1     4) ఏప్రిల్‌ 24 


15. 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికాని అంశం? 

1) 9వ భాగాన్ని చేర్చారు. 

2) ఇది 243 నుంచి 243(O) వరకు 16 అధికరణలు చేర్చింది.

3) 1993, ఏప్రిల్‌ 24న అమల్లోకి వచ్చింది.

4) 1993, ఏప్రిల్‌ 22న రాష్ట్రపతి ఆమోదించారు.


16. గ్రామసభ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ? 

1) 243 (ఎ)     2) 243 (బి) 

3) 243 (1)     4) 243 (డి) 


17. కిందివాటిలో సరికాని జత ఏది? 

1) రాష్ట్ర ఆర్థిక సంఘం - 243(I) 

2) రాష్ట్ర ఎన్నికల సంఘం - 243(K) 

3) పంచాయతీ అధికారాలు, విధులు - 243(G)

4) పంచాయతీ కాలపరిమితి - 243(D) 


18. రాజ్యాంగంలో పంచాయతీరాజ్‌ సంస్థలకు ఎన్నిరకాల అధికారాలు కేటాయించారు?    

1) 20     2) 18     3) 29    4) 28 


19. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో     ఎన్నో షెడ్యూల్‌ చేర్చారు?

1) 9వ     2) 10వ    3) 11వ   4) 12వ


20. 74వ రాజ్యాంగ సవరణ ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది?

1) 1993, ఏప్రిల్‌ 24    2) 1992, జూన్‌ 1 

3) 1993, జూన్‌ 1    4) 1994, మే 31 


21. రాజ్యాంగంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అధికరణలు?

1) 18     2) 13     3) 16     4) 15 


22. రాజ్యాంగంలో 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న అధికారాలు ఎన్ని? 

1) 12     2) 16    3) 29     4) 18 


23. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం ప్రతి రాష్ట్రం, జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలి? 

1) 243(K)       2) 243(Z) 

3) 243(ZD)     4) 243(P)


24. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం - 1994 ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది?

1) 1994, మే 30     2) 1995, మే 30 

3) 1995, జనవరి 26     4) 1995, ఏప్రిల్‌ 24 


25. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 

1) 2019, ఏప్రిల్‌ 24     2) 2018, ఏప్రిల్‌ 18 

3) 2020, ఏప్రిల్‌ 18     4) 2019, ఏప్రిల్‌ 8


26. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం - 2018లోని అంశాలు?

1) 8 భాగాలు, 8 షెడ్యూళ్లు, 290 సెక్షన్లు

2) 9 భాగాలు, 8 షెడ్యూళ్లు, 297 సెక్షన్లు

3) 5 భాగాలు, 9 షెడ్యూళ్లు, 250 సెక్షన్లు

4) 10 భాగాలు, 15 షెడ్యూళ్లు, 280 సెక్షన్లు


27. తెలంగాణలో గ్రామపంచాయతీల్లో కనిష్ఠ, గరిష్ఠ వార్డు సభ్యుల సంఖ్య?

1) 5, 20  2) 3, 21  3) 5, 21  4) 5, 25 


28. గ్రామసభలోని సభ్యులు ఎవరు?

1) పంచాయతీకి ఎన్నికైన వార్డు సభ్యులందరూ. 

2) పంచాయతీకి పోటీ చేసిన వార్డు సభ్యులందరూ. 

3) ఆ పంచాయతీ పరిధిలోని ప్రజా ప్రతినిధులందరూ. 

4) ఆ పంచాయతీ ఎలక్టోరల్‌ రోల్‌లో పేరున్న వ్యక్తులందరూ.


29. తెలంగాణలో ఒక సంవత్సరంలో ఎన్ని గ్రామసభలు నిర్వహించాలి?

1) 4     2) 6     3) 8     4) 12 


30. పంచాయతీలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని సూచించిన కమిటీ?

1) ఎల్‌.ఎమ్‌.సింఘ్వి కమిటీ 2) బల్వంతరాయ్‌ మెహతా కమిటీ

3) అశోక్‌ మెహతా కమిటీ  4) రవిచంద్రన్‌ కమిటీ


31. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి సరికాని వాక్యం ఏది?    

1) 5 ఏళ్లకు ఒకసారి నియమిస్తారు.

2) కమిషన్‌లో ఒక ఛైర్మన్, ఒక కార్యదర్శి, ముగ్గురు సభ్యులు ఉంటారు.

3) ఛైర్మన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

4) సభ్యులను గవర్నర్‌ నియమిస్తారు.


32. మండలస్థాయిలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి? 

1) ఎంపీపీ     2) ఎంపీడీఓ 

3) ఎమ్మార్వో    4) జడ్పీటీసీ


33. తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ ఎంతశాతం అమల్లో ఉంది?

1) 33%   2) 50%  3) 30%   4) 34% 


34. కిందివాటిలో పంచాయతీ ఎన్నికలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతల్లో లేనిది? 

1) 21 ఏళ్ల వయసు నిండి ఉండాలి.

2) ఆ పంచాయతీలో ఓటరుగా ఉండాలి.

3) లాభదాయక పదవిలో ఉండరాదు.

4) 1995, మే 31 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండరాదు. 


35. స్థానిక సంస్థలకు సంబంధించి లార్డ్‌ రిప్పన్‌ ఏయే సంవత్సరాల్లో చట్టాలు చేశారు? 

1) 1881, 1882     2) 1882, 1883 

3) 1882, 1884     4) 1880, 1881 


36. స్థానిక సంస్థల గురించి పేర్కొన్న రాజ్యాంగాధికరణ 40 అనేది?

1) ఆదేశిక సూత్రం     2) ప్రాథమిక విధి 

3) ప్రాథమిక హక్కు     4) ఏదీకాదు 


37. మౌర్యుల పట్టణ స్థానిక సంస్థల గురించి తెలిపే గ్రంథం?

1) మనుస్మృతి     2) ఇండికా 

3) సి-యూ-కి     4) చార్వాక 


38. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన షెడ్యూళ్లు వరుసగా?

1) 9, 10     2) 11, 12 

3) 10, 11     4) 9, 12


39. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చిన భాగాలు వరుసగా?

1) 9, 10     2) 10, 11 

3) 9, 9A     4) 12, 13 


40. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం చేసిన సంవత్సరం?

1) 2018  2) 2019  3) 2016  4) 2017 


41. ఎల్‌.ఎమ్‌.సింఘ్వి కమిటీని ఎప్పుడు నియమించారు? 

1) 1980  2) 1985  3) 1986  4) 1978 


42. పట్టణ స్థానిక సంస్థల అధికారాలు, విధుల గురించి తెలిపే రాజ్యాంగంలోని ప్రకరణ?

1) 243(K)    2) 243(W)

3) 243 (O)     4) 243(Z) 


43. స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించిన భారత ప్రధాని? 

1) మొరార్జీ దేశాయ్‌        2) పి.వి.నర్సింహారావు

3) జవహర్‌లాల్‌ నెహ్రూ     4) అటల్‌ బిహారి వాజ్‌పేయీ



సమాధానాలు


1-2; 2-3; 3-4; 4-1; 5-2; 6-2; 7-2; 8-1; 9-2; 10-3; 11-3; 12-3; 13-4; 14-4; 15-4; 16-1; 17-4; 18-3; 19-3; 20-3; 21-1; 22-4; 23-3; 24-1; 25-2; 26-2; 27-3; 28-4; 29-2; 30-1; 31-3; 32-2; 33-2; 34-4; 35-3; 36-1; 37-2; 38-2; 39-3; 40-1; 41-3; 42-2; 43-2.


రచయిత: బి. ఉపేంద్ర నాయుడు 
 

Posted Date : 11-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.