• facebook
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారతదేశం 

కౌలుదార్ల హక్కుల రక్షణకు ఆపరేషన్‌ బర్గా!

స్వతంత్ర భారతదేశం తొలినాళ్లలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. ప్రజలు, పరిస్థితులు, రాజకీయ వ్యవస్థ లాంటివన్నీ ప్రజాస్వామ్యంలో విజయవంతంగా ఇమిడిపోయాయి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వాల తొలి ప్రాధాన్యంగా మారింది. స్వాతంత్య్రం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకే మొదటి మూడు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాలు కట్టబెట్టిన ప్రజలు, ఆ తర్వాత ప్రత్యామ్నాయాలనూ ఆదరించారు. ఆ విధంగా సాగిన దేశ రాజకీయ గమనంపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన సీట్లు, పాకిస్థాన్, చైనాతో వరుస యుద్ధాలు, రాజకీయ చిత్రాన్ని మార్చిన ముఖ్య పరిణామాలు, ప్రాచుర్యం పొందిన నినాదాలు, బలపడిన ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రభావం చూపిన వ్యక్తులు, వేర్పాటు ఉద్యమాలు, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను సమగ్రంగా తెలుసుకోవాలి.

1. ‘ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం’ పుస్తకాన్ని ఏ సంవత్సరంలో మార్గరెట్‌ ఫిషర్, జోన్‌.వి.బాండ్యురాట్‌ రాశారు? (ప్రచురణకర్త ఇండియన్‌ ప్రెస్‌ డైజెస్ట్స్‌.)

1) 1958  2) 1959  3) 1960  4) 1961


2. 1952 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాలను జతపరచండి.

పార్టీలు   గెలిచిన స్థానాలు
1) ఐఎన్‌సీ ఎ) 37
2) స్వతంత్రులు బి) 364
3) భారత కమ్యూనిస్టు పార్టీ సి) 38
4) ఇతరులు డి) 16

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి  2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి  4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి


3. 1962 ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు, అవి గెలుచుకున్న స్థానాలను జత చేయండి. 
పార్టీలు    గెలిచిన స్థానాలు

పార్టీలు  గెలిచిన స్థానాలు
1) ఐఎన్‌సీ    ఎ) 361
2) జనసంఘ్‌   బి) 14
3) స్వతంత్రులు సి) 20
4) ఇతరులు  డి) 27
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి     2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి     4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి


4.  కిందివాటిలో సరైనవి గుర్తించండి.

1) భారతదేశ మొదటి ప్రధాని - జవహర్‌ లాల్‌ నెహ్రూ

2) మొదటి 3 సార్వత్రిక ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) ఘన విజయం సాధించింది.

3) 3 సార్వత్రిక ఎన్నికల్లో, ఇతర పార్టీల్లో ఏ ఒక్కదానికి 11% మించి ఓట్లు రాలేదు.

4) మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ 45% ఓట్లు, 70% పైగా స్థానాలు గెలుచుకుంది.

1) 1 మాత్రమే    2) 2 మాత్రమే 3) 1, 2 సరైనవి      4) అన్నీ సరైనవే


5.  కిందివాటిలో సరికానిది.

1) 1953, డిసెంబరు 29 - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ సంఘం (ఎస్‌ఆర్‌సీ) ఏర్పాటు

2) ఎస్‌ఆర్‌సీలో ఫజల్‌ అలీ, కె.ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎన్‌.కుంజ్రు సభ్యులు.

3) ఎస్‌ఆర్‌సీ ప్రకారం 14 రాష్ట్రాలు - 6 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి.

4) 1955లో పార్లమెంటు రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది.


6.  కిందివాటిలో సరైనవి-

ఎ: ఇప్పటివరకు పాకిస్థాన్‌తో 1948, 1965, 1971, 1999 ల్లో నాలుగు యుద్ధాలు జరిగాయి.

ఆర్‌: 1962లో భారత్‌-చైనా యుద్ధం జరిగింది.

1) ఎ మాత్రమే     2) ఆర్‌ మాత్రమే 

3) ఎ సరైంది, ఆర్‌ సరైంది కాదు  4) ఎ, ఆర్‌ లు రెండూ సరైనవి


7.  కిందివాటిని జతపరచండి.

1) హిందీభాషా వ్యతిరేక ఉద్యమం   ఎ) 1969

2) అస్సాంలోని ఖాసీ, జయంతియా, బి) 196869

గారో గిరిజన ప్రాంతాల్లో మేఘాలయ      రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 

3) లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణం  సి) 1963

4) పంజాబ్‌లో చండీగఢ్‌ కోసం    డి) 1966  ఉద్యమాలు జరిగిన సంవత్సరం 

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి  2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి  4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


8.   కిందివాటిని జతపరచండి.

1) గరీబీ హటావో      ఎ) పి.వి.నరసింహారావు

2) జై జవాన్‌ జై కిసాన్‌  బి) రాజీవ్‌ గాంధీ

3) బికారీ హటావో   సి) లాల్‌ బహదూర్‌ శాస్త్రి

4) దేశ్‌ బచావో, దేశ్‌ బనావో డి) ఇందిరా గాంధీ

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి  2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి  4) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
 

రాజకీయ ధోరణుల ఆవిర్భావం (1977 - 2000)


9.   కిందివాటిలో సరైంది.

A: 1977, మార్చి 26 - ఆరో లోక్‌సభకు స్పీకర్‌గా ‘నీలం సంజీవరెడ్డి’ పనిచేశారు.

R: 1977, జులై 25 - ఆరో రాష్ట్రపతిగా ‘నీలం సంజీవరెడ్డి’ పనిచేశారు.

1) A మాత్రమే     2) R మాత్రమే 

3) A సరైంది కాదు R సరైంది   4) A, R లు రెండూ సరైనవి


10. కిందివాటిని జతపరచండి.

1) ‘భారతీయ రైతులపై ప్రత్యేక    a) కాంగ్రెస్‌ (ఓ)  శ్రద్ధ అవసరం’ అన్న సోషలిస్టులతో  ఏర్పడిన పార్టీ            

2)ఇందిరాగాంధీ విధానాలను   b) శిరోమణి 

వ్యతిరేకించిన కాంగ్రెస్‌లోని    అకాలీదళ్‌

సంప్రదాయవాద వర్గం         

3) హిందూ జాతీయవాద పార్టీ     c)  భారతీయ  లోక్‌దళ్‌

4) సిక్కుల కోసం ప్రత్యేకంగా      d) జనసంఘ్‌  పనిచేస్తున్న పార్టీ                                 

1) 1-a, 2-b, 3-c, 4-d 2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-c, 2-a, 3-b, 4-d 4) 1-d, 2-c, 3-b, 4-a


11.   కిందివాటిలో సరైనవి గుర్తించండి.

ఎ) తమిళనాడులో ఉన్న పార్టీ, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, స్వయంప్రతిపత్తి కోరే పార్టీ- DMK (ద్రవిడ మున్నేట్ర కజగం)

బి) భూసంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషి చేస్తున్న పార్టీ - CPI(M)  (భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు))

1) ఎ మాత్రమే          2) బి మాత్రమే       

3) ఎ, బిలు రెండూ సరికాదు      4) ఎ, బి లు రెండూ సరైనవే


12. కిందివాటిలో సరికానిది ఏది?

ఎ) నీలం సంజీవరెడ్డి పాలనా కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్‌ సింగ్, ఇందిరా గాంధీ ప్రధాన మంత్రులుగా పనిచేశారు.

ఆర్‌) మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి - అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

1) ఎ మాత్రమే     2) ఆర్‌ మాత్రమే     

3) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది   4) ఎ, ఆర్‌ లు రెండూ సరికావు


13. కిందివాటిలో సరైంది గుర్తించండి.

ఎ) 1982లో ఎన్టీఆర్‌ తన 60వ పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)ని స్థాపించారు. 

ఆర్‌) 1982 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించింది.

1) ఎ మాత్రమే    2) ఆర్‌ మాత్రమే     

3) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది      4) ఎ, ఆర్‌ లు రెండూ సరైనవి


14. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.

ఎ) 1984, అక్టోబరు 31న ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు.

బి) 1986, ఏప్రిల్‌లో ఆకల్‌ తఖ్త్‌ వద్ద జరిగిన సమావేశంలో ఖలిస్థాన్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు.

సి) 1990, మే 21న రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యారు.

1) ఎ మాత్రమే    2) ఎ సరైంది కాదు, బి సరైంది          

3) సి సరైంది కాదు    4) ఎ, బి, సి లు సరికావు


15. భర్త నుంచి విడాకులు పొందిన షాబానో అనే మహిళ వేసిన కేసులో మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు చెప్పింది? 

 1) 1985  2) 1986  3) 1987  4) 1995


16. రాజీవ్‌గాంధీ ప్రఖ్యాతిగాంచిన ఒక ఉపన్యాసంలో ‘పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి’లో ఎన్ని పైసలు వారికి చేరడం లేదని వ్యాఖ్యానించారు?

1) 15 పైసలు      2) 20 పైసలు    

3) 30 పైసలు    4) 45 పైసలు


17. కిందివాటిలో సరైనవి గుర్తించండి. 

ఎ) 1977 లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల్లో  జ్యోతిబసు ప్రభుత్వం ఏర్పడింది.

ఆర్‌) బెంగాల్‌ ప్రభుత్వం 1978, జూన్‌లో కౌలుదార్ల హక్కులు కాపాడటానికి ‘ఆపరేషన్‌ బర్గా’ను చేపట్టింది. (కౌలుదార్లను బెంగాలీలో బర్గాదార్లు అంటారు)

1) ఎ మాత్రమే        2) ఆర్‌ మాత్రమే         

3) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది        4) ఎ, ఆర్‌ లు రెండూ సరైనవి


18. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్‌ కమిషన్‌ ముఖ్యమైన సిఫార్సును అమలు చేసిన ప్రభుత్వం?

1) నేషనల్‌ ఫ్రంట్‌      2) యునైటెడ్‌ ఫ్రంట్‌    

3) ఏన్డీయే          4) యూపీఏ 


19.  కిందివాటిలో సరికానిది గుర్తించండి.

ఎ) 73, 74 రాజ్యాంగ సవరణలను 1992లో పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టారు.

ఆర్‌) 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మొత్తం స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించారు.

ఎస్‌) 73వ రాజ్యాంగ సవరణ పట్టణ, నగరాలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ గ్రామీణ ప్రభుత్వాలకు సంబంధించింది.

1) ఎ మాత్రమే         2) ఆర్‌ మాత్రమే      

3) ఎస్‌ మాత్రమే          4) ఎ, ఆర్‌ లు సరికావు

20. కిందివాటిలో సరైన వ్యాఖ్యలు గుర్తించండి.

ఎ) 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 2 సీట్లు గెలిచింది.

బి) 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఐఎన్‌సీ 404 సీట్లు గెలిచింది.    

సి) 1984 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లు గెలిచింది.

డి) 1990లో గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం నుంచి అయోధ్య వరకు ఎల్‌.కె.ఆడ్వానీ రథయాత్ర చేపట్టారు.

1) ఎ, బి      2) ఎ, బి, సి   

3)  సి, డి    4) పైవన్నీ


21.  భారతదేశంలో సరళీకృత విధానాలను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు?

1) హెచ్‌.డి.దేవేగౌడ      2 అటల్‌ బిహారీ వాజ్‌పేయీ     

3) పి.వి.నరసింహారావు    4) వి.పి.సింగ్‌


22. అస్సాంలో ‘అస్సాం గణపరిషత్‌ ప్రభుత్వం’ ఎప్పుడు ఏర్పడింది?
1) 1984  2) 1985  3) 1986 4) 1988


23. అతిచిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి?

1) ఇందిరా గాంధీ        2) రాజీవ్‌ గాంధీ    

3) నరేంద్ర మోదీ        4) చరణ్‌ సింగ్‌

24. 1990లో గుజరాత్‌లో సోమశేఖర ఆలయం నుంచి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టిన వ్యక్తి?

1) చంద్రశేఖర్‌     2) పి.వి.నరసింహారావు    

3) ఎల్‌.కె.ఆడ్వానీ        4) హెచ్‌.డి.దేవేగౌడ

సమాధానాలు

1-1; 2-3; 3-1; 4-4; 5-4; 6-4; 7-2; 8-2; 9-4; 10-2; 11-4; 12-2; 13-4; 14-3; 15-1; 16-1; 17-4; 18-1; 19-3; 20-4; 21-3; 22-1; 23-2; 24-3;

 

 

 

 

                

అయితరాజు లక్ష్మణ్‌

 

Posted Date : 11-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.