• facebook
  • whatsapp
  • telegram

ప్రవాహాలు ధర్మాలు 

నీటిలో పడవ తేలుతుందని తేల్చిన ఆర్కిమెడిస్‌!
 


 

నదిలో నుంచి సముద్రంలోకి ప్రవేశించిన ఓడ కొద్దిగా పైకి తేలుతుంది. వత్తి ద్వారా కిరోసిన్‌ పైకి చేరి దీపం వెలుగుతుంది. పెద్ద మొత్తంలో గ్యాస్‌ చిన్న సిలిండర్‌లో సంపీడ్యత చెంది సర్దుకుంటుంది. ఇవన్నీ ద్రవాలు, వాయువులు ప్రదర్శించే కొన్ని ప్రత్యేక ధర్మాల వల్ల సాధ్యమవుతాయి. వాటిని అధ్యయనం చేస్తే అణువుల కదలికలు, రసాయన చర్యల విధానం అర్థమవుతుంది. ఒక పదార్థం నుంచి మరో పదార్థాన్ని వేరుచేయడం, కొత్త పదార్థాలను తయారు చేయడం తెలుస్తుంది. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. ప్రవాహాల ధర్మాలు సరికొత్త ఆవిష్కరణలకు దోహదపడే తీరును గ్రహించాలి. 


1. ప్లవన సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త?

1) పాస్కల్‌      2) సి.వి.రామన్‌ 

3) ఆర్కిమెడిస్‌      4) న్యూటన్‌ 


2.  నీటి ఉపరితలం మీద కీటకాలు మునిగిపోకుండా సంచరించడానికి కారణం?

1) తలతన్యత       2) స్నిగ్ధత  

3) ఊర్ధ్వబలం      4) డైనికోలిఫ్ట్‌


3. వర్షం బిందువులు గోళాకారంగా ఉండటానికి కారణం?

1) నీటి స్నిగ్ధత      2) నీటి తలతన్యత 

3) బాష్పీభవనం     4) గాలి ఘర్షణ


4.  తేలుతున్న మంచుముక్క కరిగితే బీకరులోని నీటి మట్టం?

1) పెరుగుతుంది     

2) తగ్గుతుంది  

3) మార్పు చెందదు  

4) మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది 


5. నదీ జలాల నుంచి సముద్ర జలంలోకి ప్రవేశించిన ఓడ?

1) కొద్దిగా పైకి లేస్తుంది  

 2) కొద్దిగా మునుగుతుంది 

3) అదే స్థాయిలో ఉంటుంది 

4) మునగడం అనేది తయారుచేసిన పదార్థంపై  ఆధారపడి ఉంటుంది


6.  క్రికెట్‌ బంతిని స్వింగ్‌ చేయడాన్ని ఏ సూత్రం ద్వారా వివరించవచ్చు?

1) బెర్నౌలీ సిద్ధాంతం    2) ఆర్కిమెడిస్‌ సిద్ధాంతం 

3) న్యూటన్‌ సిద్ధాంతం   4) పాస్కల్‌ సిద్ధాంతం 


7.  ఆర్కిమెడిస్‌ : ప్లవన సూత్రం : : న్యూటన్‌ : ?

1) ఆపిల్‌   2) ప్రిన్సిపియా 

3) భూమ్యాకర్షణ   4) యంత్రం 


8.  పడవలో ప్రయాణిస్తున్న వారిని నిల్చోడానికి   అనుమతించరు. కారణం?

1) గురుత్వకేంద్రం ఎత్తు పెరిగి, పడవ ప్రమాదానికి గురవుతుంది.

2) గురుత్వకేంద్రం ఎత్తు తగ్గి, పడవ ప్రమాదానికి గురవుతుంది.

3) భార వ్యవస్థ మార్పు చెందుతుంది. 

4) తలతన్యత పెరుగుతుంది.


9.  వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం?

1) ఫోనోమీటర్‌      2) ఫొటోమీటర్‌ 

3) ఓడోమీటర్‌     4) మానోమీటర్‌


10. వాతావరణ పీడనంలోని మార్పులను కొలిచే సాధనం?

1) బారోగ్రాఫ్‌   2) బారోమీటర్‌ 

3) కాలిపర్‌   4) సైక్లోట్రాన్‌


11. సముద్రపు నీటిలో పడవ తేలుతుందని వివరించినవారు?    

1) న్యూటన్‌     2) సి.వి.రామన్‌ 

3) బాయిల్‌     4) ఆర్కిమెడిస్‌ 


12. హుక్‌ సూత్రం కిందివాటిలో దేంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది?

1) స్థితిస్థాపకత     2) రేడియోధార్మికత 

3) ద్రవ ఒత్తిడి     4) సాంద్రత 


13. పర్వతాల మీద ఏ ఉష్ణోగ్రత వద్ద నీరు  మరుగుతుంది? 

1) 1000C కంటే తక్కువ 

2) 1000C కంటే ఎక్కువ 

3) 1000C      4) ఏదీకాదు 


14. నీటి సాంద్రత ఎన్ని డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద  అత్యధికం?

1) 1000C   2) 40C   3) 00C    4) - 40C


15. కిరోసిన్‌ దీపంలో కిరోసిన్‌ దేనివల్ల వత్తి ద్వారా పైకి వెళుతుంది?

1) పీడనంలో తేడా      

2) కేశనాళికీయత చర్య  

3) తక్కువ చిక్కదనం ఉన్న నూనె 

4) భూమ్యాకర్షణ శక్తి 


16. స్ప్రేయర్‌లో సన్నని గొట్టం ద్వారా ద్రవంపైకి  రావడానికి కారణం?

1) కేశనాళికీయత 

2) పై భాగంలో పీడనం తక్కువ     

3) స్నిగ్ధత          

4) తలతన్యత 


17. ఒక ద్రవం బాష్పీభవన రేటు దేనిపై  ఆధారపడుతుంది? 

1) ద్రవం ఉష్ణోగ్రత     2) గాలి ఉష్ణోగ్రత 

3) ద్రవం ఉపరితల వైశాల్యం     4) పైవన్నీ  


18. నీటి మరిగే ఉష్ణోగ్రత దేనిపై ఆధారపడుతుంది?

1) ఎల్లప్పుడూ 1000C    2) వాతావరణ పీడనం  

3) సాపేక్ష ఆర్ద్రత    4) పాత్ర స్వభావం


19. కిందివాటిలో ఏది ఎమల్షన్‌? 

1) వెనిగర్‌    2) చక్కెర ద్రావణం  

3) తేనె    4) వెన్న 


20. హిమాలయాలకు వెళ్లినప్పుడు ఊపిరి బిగిసినట్లు అనుభవమవుతుంది. ఎందుకు?

1) కొండలపై గాలి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. 

2) అక్కడ చల్లగా ఉంటుంది.  

3) కొండలపై గాలి సాంద్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆక్సిజన్‌ వంతు తగ్గుతుంది. 

4) ఏదీకాదు  


21. కిందివాటిలో తలతన్యత దేనిపై ఆధారపడదు? 

1) ఉపరితల వైశాల్యం     2) ద్రవాల స్వభావం 

3) ఉష్ణోగ్రత      4) మాలిన్యాలు


22. నిలకడగా ఉన్న నీటిపైన కిరోసిన్‌ను వెదజల్లినప్పుడు దోమల గుడ్లు మునుగుతాయి. కారణం? 

1) నీటి తలతన్యత తగ్గడం    

2) నీటి తలతన్యత పెరగడం  

3) నీటి స్నిగ్ధత పెరగడం     

4) నీటి స్నిగ్ధత తగ్గడం 


23. జలాంతర్గామి పనిచేయడంలో ఉపయోగించిన సూత్రం?

1) బాయిల్‌ నియమం      

2) పాస్కల్‌ నియమం 

3) బెర్నౌలీ నియమం  

4) ఆర్కిమెడిస్‌ ప్లవన సూత్రం


24. కుక్కర్‌లో పదార్థాలు త్వరగా ఉడకడానికి కారణం? 

1) ఉష్ణం బంధించి ఉండటం    

2) ఉష్ణోగ్రత పెరగడం 

3) నీటి బాష్పీభవన స్థానం పెరగడం  

4) నీటి బాష్పీభవన స్థానం తగ్గడం 


25. తల వెంట్రుకలకు నూనె అద్దినప్పుడు అవి   పరస్పరం దగ్గరగా రావడానికి కారణంం?

1) తలతన్యత     2) కేశనాళికీయత 

3) ద్రవ పీడనం     4) గాలి పీడనం


26. బ్రామా ప్రెస్, హైడ్రాలిక్‌ బ్రేక్‌లు పనిచేసే నియమం?

1) పాస్కల్‌ నియమం    2) ఆర్కిమెడిస్‌ నియమం 

3) బాయిల్‌ నియమం   4) బెర్నౌలీ నియమం


27. నీటి అడుగున ఉన్న గాలిబుడగ పైకి  వచ్చినప్పుడు దాని పరిమాణం?

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది      

3) మారదు      4) సగమవుతుంది


28. కిందివాటిలో ఏ ద్రవం చివరగా మరుగుతుంది?

1) నీరు    2) పాదరసం

3) ఆల్కహాల్‌     4) బెంజిన్‌  


29. మరుగుతున్న నీటికి ఉప్పును చేర్చడం వల్ల ఏం జరుగుతుంది?

1) నీరు మరింత మరుగుతుంది, ఉష్ణోగ్రత పెరుగుతుంది.

2) నీరు మరగడం ఆగిపోతుంది, ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు.

3) నీరు మరగడం ఆగిపోతుంది, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది

4) నీరు మరింత మరుగుతుంది, దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది


30. ఏరోసాల్‌ కిందివాటిలో దేని సూక్ష్మ పదార్థం?

1) నీటిలో సూక్ష్మ గాలి బుడగలు 

2) గాలిలో సూక్ష్మ ద్రవ బిందువులు

3) నీటిలో సూక్ష్మ గ్రీజ్‌ కణాలు 

4) నీటిలో శుద్ధ ఇసుక కణాలు 


31. కిందివాటిలో అతి శీతలీకరణం చెందిన ద్రవం ఏది?

1) ఐస్‌క్రీమ్‌   2) గాజు 

3) కోక్‌    4) ద్రవరూపంలోని నైట్రోజన్‌ 


32. ఒక వాయువును ద్రవరూపంలోకి మార్చే  ప్రక్రియను ఏమంటారు? 

1) ద్రవీభవనం     2) సాంద్రీకరణం 

3) ఘనీభవనం     4) బాష్పీభవనం 


33. సార్వత్రిక ద్రావణం అని దేన్ని అంటారు? 

1) బెంజిన్‌      2) ఆల్కహాల్‌  

3) నీరు      4) ఈథర్‌ 


34. కిందివాటిలో కొల్లాయిడ్‌కి ఉదాహరణ? 

1) బురద నీరు    2) పంచదార కరిగిన నీరు 

3) పాలు     4) నూనెలోని నీరు 


35. కిందివాటిలో స్వచ్ఛమైన నీరు? 

1) వాన నీరు     2) నది నీరు 

3) బావి నీరు     4) సముద్రపు నీరు 


36. బెలూన్‌లో గాలి నింపి దాన్ని వేడి నీటిలో ముంచితే బుడగ ఘనపరిమాణం?

1) మార్పు ఉండదు     2) తగ్గుతుంది 

3) పెరుగుతుంది     4) చెప్పలేం  


37. నీటి పారిశుద్ధ్య ప్రక్రియలో క్రిములను తొలగించడానికి దేన్ని ఉపయోగిస్తారు? 

1) పటిక    2) బొగ్గు 

3) కిసేల్‌గర్‌       4) పొటాషియం పర్మాంగనేట్‌ 


38. ఏ శాస్త్రీయ సూత్రం వల్ల ఫౌంటేన్‌ పెన్నులో ఇంకు (సిరా) ప్రవాహం జరుగుతుంది? 

1) కేశనాళికీయత     2) గురుత్వాకర్షణ బలం 

3) పాస్కల్‌ సూత్రం     4) అపకేంద్ర బలం


39. కిందివాటిలో ఏది కాంజికాభ ద్రావణం? 

1) వెనిగర్‌     2) పెయింట్‌ 

3) బురద నీరు     4) చక్కెర ద్రావణం 


40. పీడనం పెరిగినప్పుడు ద్రవం మరగడం? 

1) పెరుగుతుంది     2) తగ్గుతుంది 

3) మారదు     4) ఏదీకాదు 


41. వాతావరణ పీడనాన్ని కొలిచేందుకు దేన్ని  ఉపయోగిస్తారు? 

1) థర్మామీటర్‌     2) బారోమీటర్‌ 

3) స్పెక్ట్రోమీటర్‌     4) పైరోమీటర్‌


42. బాయిల్స్‌ సూత్రం ఏ సందర్భంలో పనిచేస్తుంది?

1) స్థిర పరిమాణం    

2) స్థిర ఉష్ణోగ్రత 

3) స్థిర ఉష్ణోగ్రత, పరిమాణం 

4) స్థిర పీడనం, పరిమాణం


43. హైగ్రోమీటర్‌ దేని కొలమానం?  

1) ద్రవాల సాపేక్ష సాంద్రత  2) పాల నాణ్యత 

3) సాపేక్ష ఆర్ద్రత   4) గురుత్వ త్వరణం 


44. నీటి నుంచి O2 ను విడుదల చేసే మూలకం? 

1) ఫాస్ఫరస్‌  2) నైట్రోజన్‌ 

3) ఫ్లోరిన్‌    4) అయోడిన్‌ 


45. భారీ పరిమాణంలో ఉండే కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) చిన్న సిలిండర్‌లో లభ్యమవడం అనేది ఏ గుణం వల్ల సాధ్యపడుతుంది? 

1) అధిక జ్వాలన శీలత     2) సులభ లభ్యత 

3) అధిక సంపీడ్యత        4) తక్కువ సాంద్రత


సమాధానాలు
 

1-3; 2-1; 3-2; 4-3; 5-1; 6-1; 7-3; 8-1; 9-4; 10-2; 11-4; 12-1; 13-1; 14-2; 15-2; 16-1; 17-4; 18-2; 19-4; 20-3; 21-1; 22-1; 23-4; 24-3; 25-1; 26-1; 27-1; 28-2; 29-3; 30-2; 31-2; 32-2; 33-3; 34-3; 35-1; 36-3; 37-4; 38-1; 39-2; 40-2; 41-2; 42-2; 43-3; 44-1;  45-3.


 

Posted Date : 26-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌