• facebook
  • whatsapp
  • telegram

ఉష్ణం - ఉష్ణోగ్రత

వేడి నీటి కంటే ఆవిరి ప్రమాదకరం!

వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు   ప్రసరించే శక్తి స్వరూపమే ఉష్ణం. ఒక వస్తువు లేదా పదార్థం వేడిగా లేదా చల్లగా ఉండటం అనేది అందులోని ఉష్ణం వల్ల తెలుస్తుంది. ఆ ఉష్ణం తీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణం లక్షణాలు, ప్రసార రకాలు, ఉష్ణోగ్రతను కొలిచే పరికరాలు, ప్రమాణాలపై  అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ద్రవాలు, లోహాలు, వాయువులపై ఉష్ణం చూపే ప్రభావాల గురించి నిత్యజీవిత అనువర్తనాల కోణంలో తెలుసుకోవాలి.

1.     డిగ్రీ ఫారన్‌హీట్, డిగ్రీ సెల్సియస్‌ ఏ ఉష్ణోగ్రత వద్ద సమతా స్థితిలో ఉంటాయి?

ఎ) -40    బి) 40    సి) 37    డి) -37


2.     పీడనం పెంచితే మైనం ద్రవీభవన స్థానంలో జరిగే మార్పు?

ఎ) పెరిగి తగ్గుతుంది       బి) తగ్గుతుంది   

సి) పెరుగుతుంది       డి) మారదు


3.     పరిసరాల్లో ఉష్ణోగ్రతలను తెలపడానికి ఉపయోగించే థర్మామీటర్‌?

ఎ) సెల్సియస్‌ థర్మామీటర్‌  బి) కెల్విన్‌ థర్మామీటర్‌   

సి) ఫారన్‌హీట్‌ థర్మామీటర్‌ డి) సిక్స్‌ థర్మామీటర్‌


4.     వేడి నీటి కంటే వేడి ఆవిరి ఎక్కువ ప్రమాదకరం. కారణమేంటి?

ఎ) ఆవిరికి విశిష్టోష్ణం ఎక్కువ       బి) ఆవిరికి గుప్తోష్ణం ఎక్కువ

సి) ఆవిరికి ఉష్ణదక్షత ఎక్కువ       డి) ఆవిరికి గుప్తోష్ణం తక్కువ


5.     పాలను వేడి చేస్తే ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది?

ఎ) ఉష్ణవహనం       బి) ఉష్ణసంవహనం   

సి) ఉష్ణవికిరణం       డి) ఉష్ణదక్షత


6.     రిఫ్రిజిరేటర్‌లో ఫ్రీజర్‌ ఛాంబర్‌ పైభాగంలోనే ఉంటుంది. కారణమేంటి?

ఎ) కంప్రెషర్‌ వెనుక ఉండటం   బి) కంప్రెషర్‌ కింద ఉండటం

సి) చల్లని గాలి తేలికగా ఉండి పైకి వెళ్లడం   డి) చల్లని గాలి బరువుగా ఉండి కిందకు రావడం


7.     శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తారు. ఎందుకంటే అవి..

ఎ) ఉష్ణాన్ని గ్రహిస్తాయి      బి) ఉష్ణాన్ని శోషిస్తాయి

సి) ఉష్ణాన్ని బంధిస్తాయి       డి) చల్లని గాలిని ఆవిరిగా మారుస్తాయి


8.     ఎండలో ఉన్న వ్యక్తి శరీరం వేడెక్కడానికి కారణమైన ఉష్ణ ప్రసార పద్ధతి?

ఎ) ఉష్ణ సంవహనం       బి) ఉష్ణ వికిరణం   

సి) ఉష్ణ వహనం       డి) ఉష్ణ దక్షత


9.     సీసాను పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డ కట్టిస్తే అది పగలడానికి కారణం?

ఎ) మంచు ఘనపరిమాణం పెరగడం       బి) మంచు ఘనపరిమాణం తగ్గడం

సి) సీసా తలాలు పలుచగా ఉండటం       డి) సీసాలో పీడనం తగ్గడం


10. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత?

ఎ) 273 °K       బి) 373 °K   

సి) 0 °K       డి) 310 °K

11. కిందివాటిలో ఉత్తమ ఉష్ణవాహకం కానిది

ఎ) వెండి     బి) బంగారం  

సి) గాజు      డి) పాదరసం


12. కర్పూరాన్ని వేడి చేస్తే నేరుగా వాయుస్థితిని పొందే ప్రక్రియ?

ఎ) ద్రవీభవనం       బి) స్ఫటికీకరణం   

సి) స్వేదనం       డి) ఉత్పతనం

13. అతితక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్‌?

ఎ) పైరోమీటర్‌            బి) క్రయో థర్మామీటర్‌

సి) డిజిటల్‌ థర్మామీటర్‌     డి) కెల్విన్‌ థర్మామీటర్‌


14. కిందివాటిలో ఉత్తమ విద్యుత్తు వాహకం కానిది, ఉత్తమ ఉష్ణ వాహకం అయినదేది?

ఎ) గాజు     బి) గ్రాఫైట్‌ 

సి) అభ్రకం     డి) ఆస్‌బెస్టాస్‌


15. ద్రవపదార్థాల్లో మంచి ఉష్ణవాహక పదార్థాన్ని గుర్తించండి.

ఎ) పాదరసం బి) బెంజిన్‌ సి) నీరు డి) ఆల్కహాల్‌


16. నక్షత్రాలు, సూర్యుడిలోని అధిక ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్‌?

ఎ) థర్మిష్టర్‌ థర్మామీటర్‌         బి) రాయమర్‌ థర్మామీటర్‌

సి) సిక్స్‌ థర్మామీటర్‌     డి) ఆప్టికల్‌ పైరోమీటర్‌


17. ఇన్వర్ట్‌ స్టీలును ఏ పరికరాల తయారీకి ఉపయోగిస్తారు?

ఎ) గడియారం ముళ్లు     బి) మీటర్‌ స్కేలు 

సి) శృతిదండాలు     డి) పైవన్నీ


18. ఇనుప గోళాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏ భౌతిక రాశిలో మార్పు జరుగుతుంది?    

ఎ) వైశాల్యం     బి) ఘనపరిమాణం 

సి) వెడల్పు     డి) ద్రవ్యరాశి


19. సముద్ర అడుగు భాగాన ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం?    

ఎ) బాతోమీటర్‌     బి) పాథోమీటర్‌ 

సి) మానోమీటర్‌     డి) పల్వనో మీటర్‌


20. వాయు పదార్థ ఉష్ణోగ్రత మాపకం ద్వారా కొలిచే అంశాన్ని గుర్తించండి.

ఎ) తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ కచ్చితంగా     బి) ఎక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ కచ్చితంగా

సి) తక్కువ పీడనాన్ని ఎక్కువ కచ్చితంగా    డి) ఎక్కువ పీడనాన్ని ఎక్కువ కచ్చితంగా


21. వెలుగుతున్న వేడి బల్బుపైన చల్లని నీటిని చల్లినప్పుడు అది పగలడానికి కారణం?

ఎ) గాజు పొరల మధ్య అసమాన వ్యాకోచం    బి) గాజు పొరల మధ్య అసమాన సంకోచం

సి) గాజు పొరల మధ్య సమాన వ్యాకోచం    డి) గాజు పొరల మధ్య సమాన సంకోచం


22. రోగి శరీర ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్‌?

ఎ) రెసిస్టెన్స్‌ థర్మామీటర్‌     బి) థర్మిష్టర్‌ థర్మామీటర్‌

సి) క్లినికల్‌ థర్మామీటర్‌         డి) సెల్సియస్‌ థర్మామీటర్‌


23. మధ్యలో రంధ్రం ఉన్న ఒక ప్లాస్టిక్‌ ప్లేట్‌ను వేడి చేస్తే రంధ్రం వ్యాసంలో కలిగే మార్పు?

ఎ) పెరుగుతుంది     బి) తగ్గుతుంది సి) మార్పు ఉండదు     డి) పెరిగి తగ్గుతుంది


24. కిందివాటిలో గరిష్ఠ వ్యాకోచం కలిగి ఉండే పదార్థం?

ఎ) స్టీలు బి) పాదరసం సి) హైడ్రోజన్‌ డి) ప్లాస్టిక్‌25. ఉష్ణం అత్యధిక వేగంతో ప్రసరించే పద్ధతిని గుర్తించండి.

ఎ) ఉష్ణ దక్షత           బి) ఉష్ణ వహనం  

సి) ఉష్ణ వికిరణం       డి) ఉష్ణ సంవహనం

26. కింది ఏ థర్మామీటర్‌లో ఆల్కహాల్‌ను తక్కువగా, పాదరసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు?

ఎ) ప్రయోగశాల థర్మామీటర్‌           బి) రాయమర్‌ థర్మామీటర్‌

సి) డిజిటల్‌ థర్మామీటర్‌   డి) సిక్స్‌ థర్మామీటర్‌


27. ఆల్కహాల్‌ థర్మామీటర్‌ను ఏ ప్రాంతంలో వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు?

ఎ) ఉష్ణమండల ప్రాంతం బి) భూమధ్యరేఖ ప్రాంతం  

సి) శీతల ప్రాంతం                    డి) సమశీతోష్ణ మండల ప్రాంతం


28. విద్యుత్తు పరంగా మంచు విద్యుత్తు వాహకం అయితే ఉష్ణం దృష్ట్యా...?

ఎ) ఉష్ణ వాహకం            బి) ఉష్ణ బంధకం

సి) అర్ధ వాహకం         డి) తటస్థం


29. చలికాలంలో వాహనాల రేడియేటర్లు పగలడానికి కారణం?

ఎ) నీటి అసంగత వ్యాకోచం       బి) నీటి అసంగత సంకోచంసి) తడిగాలి వ్యాకోచం       డి) తడిగాలి సంకోచం

30. క్రిమికీటలకాల ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటర్‌-

ఎ) సిక్స్‌ థర్మామీటర్‌       బి) ఆప్టికల్‌ థర్మామీటర్‌

సి) ఆల్కహాల్‌ థర్మామీటర్‌            డి) సిబెక్‌ ఉష్ణ విద్యుత్తు థర్మామీటర్‌


31. ఒక ఇంధనం నుంచి వెలువడే కెలోరిఫిక్‌ ఉష్ణాన్ని కొలిచే పరికరం?

ఎ) యుడో మీటర్‌          బి) బోలో మీటర్‌

సి) బాంబ్‌ కెలోరిమీటర్‌        డి) అయస్కాంత థర్మామీటర్‌


32. ఒక వెండిపాత్రలో వేడి కాఫీని నింపి ఇనుప    బల్లపై ఉంచితే అది చల్లారడానికి కారణమైన ఉష్ణ ప్రసారం?

ఎ) వహనం మాత్రమే  బి) సంవహనం, వికిరణం

సి) వికిరణం, వహనం  డి) వహనం, సంవహనం


33. ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఉపయోగించే థర్మోస్టాట్‌ను ఏ లోహాలతో తయారుచేస్తారు?

ఎ) ఐరన్, సిల్వర్‌          బి) ఐరన్, ఇత్తడి

సి) ఐరన్, కంచు          డి) ఐరన్, రాగి


34. థర్మామీటర్‌ కనిష్ఠ రీడిండ్‌ విలువ ఎల్లప్పుడూ దేనికి సమానం?

 ఎ) పాదరస ఉష్ణోగ్రత      బి) ఆల్కహాల్‌ ఉష్ణోగ్రత

 సి) మంచు ఉష్ణోగ్రత       డి) నీటిఆవిరి ఉష్ణోగ్రత


35. నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానికి కలపాల్సిన ద్రవం?

ఎ) ఇథైల్‌ గ్లైకాల్‌      బి) ఆల్కహాల్‌

సి) ఫారాఫిన్‌ మైనం        డి) గ్యాసోలిన్‌


36. విద్యుత్తు ఇస్త్రీ పెట్టెను కనుక్కున్న శాస్త్రవేత్త?

ఎ) నిక్సన్‌ బి) హెన్రీ షీలే సి) కషెల్నికోవ్‌ డి) సింగర్‌


37. ఒకే లోహంతో సమాన వ్యాసం ఉండేలా ఒక  ఘనగోళం, ఒక బోలు గోళం తయారుచేసి వాటిని సమాన ఉష్ణోగ్రతకు వేడి చేస్తే దేని వ్యాకోచం ఎక్కువ?

ఎ) ఘన గోళం    బి) బోలు గోళం

సి) రెండు గోళాలు సమాన వ్యాకోచంతో ఉంటాయి.

డి) రెండు గోళాలు అసమాన వ్యాకోచంతో ఉంటాయి.


38. పాదరస థర్మామీటర్ల వినియోగాన్ని నిషేధించిన దేశం?

ఎ) ఇండియా బి) జర్మనీ    సి) అమెరికా డి) జపాన్‌


39. బెక్‌మన్‌ థర్మామీటర్‌ను కిందివాటిలో దేనికోసం ఉపయోగిస్తారు?

ఎ) శరీర ఉష్ణోగ్రత      బి) నీటిఆవిరి ఉష్ణోగ్రత

సి) కీటకాల ఉష్ణోగ్రత             డి) ప్రయోగశాల పదార్థాల ఉష్ణోగ్రత


40. అతిశీతల ప్రదేశాల్లో జంతువులు వాటి శరీరాన్ని ముడుచుకుని పడుకోవడానికి కారణం?

ఎ) వాటి శరీరం కోల్పోయే ఉష్ణరాశిని తగ్గించుకోవడానికి 

బి) వాటి శరీరం కోల్పోయే ఉష్ణరాశిని పెంచుకోవడానికి

సి) పరిసరాల నుంచి ఉష్ణాన్ని గ్రహించడానికి

డి) పరిసరాల్లోకి ఉష్ణాన్ని విడుదల చేయడానికి


41. నీటి అసంగత వ్యాకోచాన్ని కొలిచే పరికరం?

ఎ) బాంబ్‌ కెలోరిమీటర్‌        బి) ఆంత్రోమీటర్‌

సి) హైడ్రోమీటర్‌            డి) డైలటోమీటర్‌


42. ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఉపయోగించే థర్మామీటర్లు?

ఎ) థర్మిష్టర్‌ థర్మామీటర్‌     బి) పాదరస థర్మామీటర్‌

సి) డిజిటల్‌ థర్మామీటర్‌     డి) పైవన్నీ


43. ఫారన్‌హీట్‌ థర్మామీటర్‌లో అధో, ఊర్థ్వ స్థిర స్థానాల మధ్య ఉండే భాగాలు?

ఎ) 273    బి) 32    సి) 212   డి) 180


44. పరమ శూన్య ఉష్ణోగ్రత అంటే...?

ఎ) -459.69 °F    బి) 0 °F    సి) -273.16 °C    డి) పైవన్నీ


45. వంటపాత్రలకు అడుగు భాగాన రాగి పూత పూయడానికి కారణం?

ఎ) పాత్రలు అందంగా ఉండటానికి    బి) పాత్రలు శుభ్రం చేయడానికి సులభంగా ఉంటుంది    సి) రాగి ఉత్తమ ఉష్ణవాహకం    డి) పాత్రలు త్వరగా పాడవకుండా ఉండటానికి సమాధానాలు

1-ఎ; 2-సి; 3-డి; 4-బి; 5-బి; 6-డి; 7-సి; 8-బి; 9-ఎ; 10-డి; 11-సి; 12-డి; 13-బి; 14-సి; 15-ఎ; 16-డి; 17-డి; 18-బి; 19-ఎ; 20-ఎ; 21-బి; 22-సి; 23-బి; 24-సి; 25-సి; 26-డి; 27-సి; 28-బి; 29-ఎ; 30-డి; 31-సి; 32-డి; 33-బి; 34-సి; 35-ఎ; 36-బి; 37-సి; 38-సి; 39-బి; 40-ఎ; 41-డి; 42-డి; 43-డి; 44-డి; 45-సి. 

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌