• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక విద్యకు వారే ఆద్యులు!

భారతదేశ విద్యా చరిత్ర

జ్ఞానానికి, వివేకానికి మార్గం చూపేదే విద్య. భారతీయ సమాజంలో అనాది కాలం నుంచి చదువుకు ఎంతో ప్రాధాన్యం ఉంది.  ప్రజల అక్షరాస్యత, విజ్ఞానంపై  సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ప్రాచీనకాలం నుంచి ఆధునిక యుగం వరకు భారతదేశ విద్యా చరిత్ర పరిణామ క్రమం అంతా విద్యాదృక్పథాల అధ్యయనంలో కీలక భాగంగా ఉంది. ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాసే అభ్యర్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బ్రిటిష్‌ కాలంలో  ఏర్పాటు చేసిన విద్యాకమిషన్లు, అవి తెచ్చిన మార్పులతో పాటు అప్పట్లో విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం జాతీయ నాయకులు చేసిన కృషి గురించి అవగాహన పెంచుకోవాలి.



1. త్రిధ్రువ విద్యా ప్రక్రియకు సంబంధించి సరైంది-

1) ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, విద్యార్థులు

2) విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజం

3) విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజం

4) ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం


2. ఇస్లాం విద్యావిధానంలో గురువులను ఏమని పిలిచేవారు?    

1) మౌల్వి  2) అతిగురు  3) ప్రవక్త  4) ఆచార్య


3. మొదటి మక్తబ్‌ను మహ్మద్‌ ఘోరీ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు?

1) ఔరంగాబాద్‌     2) అమృత్‌సర్‌ 

3) అహ్మదాబాద్‌     4) అజ్మీర్‌


4. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల-

1) మక్తాబ్‌     2) మదరసా 

3) మదరసా ఐలా     4) పైవన్నీ


5. కంపెనీకి ఉన్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకే కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం?

1) వడపోత సిద్ధాంతం     2) అధోముఖ వడపోత సిద్ధాంతం

3) విద్యా సిద్ధాంతం     4) ఏదీకాదు


6. ఛార్లెస్‌ గ్రాంట్‌ అబ్జర్వేషన్స్‌ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే కింది చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు?

1) ఆంగ్ల భాష     2) విద్యను అందించడం

3) క్రైస్తవ మత వ్యాప్తి     4) పైవన్నీ


7.‘భారతదేశంలో ఉన్న పుస్తకాలన్నీ ఐరోపా ఖండంలో ఒక గ్రంథాలయంలోని ఒక అలమరాకు కూడా సరిపోవు’ అని పేర్కొంది ఎవరు?

1) ఉడ్‌     2) లార్డ్‌ మెకాలే 

3) హంటర్‌     4) ఛార్లెస్‌ గ్రాంట్‌


8. ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘసంస్కర్త-

1) కందుకూరి వీరేశలింగం    2) రాజా రామ్మోహన్‌ రాయ్‌

3) ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌       4) అందరూ


9. కింద పేర్కొన్న విషయాల్లో ఉడ్‌ తాకీదు ఫలితం కానిది?

1) రాష్ట్రాల విద్యాశాఖల ఏర్పాటు    

2) బొంబాయి విశ్వవిద్యాలయం ఏర్పాటు

3) మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు

4) తటస్థ మత విధానాన్ని అనుసరించడం


10. భారతదేశ చరిత్రలో ‘ప్రజ్ఞావంతుల కాలం’గా గుర్తించిన కాలం?

1) 1814-1845     2) 1813-1834 

3) 1823-1944     4) 1803-1824


11. ‘భారతదేశ ఆధునిక విద్యకు పోర్చుగీసు వారే ఆద్యులు’ అని అభిప్రాయపడింది ఎవరు?

1) సెయింట్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌    2) రాజా రామ్మోహన్‌ రాయ్‌

3) క్యాంప్‌ బెల్‌    4) ఎస్‌.ఎస్‌.ముఖర్జీ


12. ఇస్లాం విద్యా విధానానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) ఇస్లాం విద్య బిస్మిల్లా అనే వేడుకతో ప్రారంభమవుతుంది.

2) ఇస్లాం కాలంలో అందరికీ విద్యా సౌకర్యం ఉంది

3) ఈ విద్యాబోధనా భాషలు ఉర్దూ, అరబిక్‌

4) ఉపాధ్యాయులకు దండించే అధికారం ఉండేది


13. కిందివాటిలో సరైన జతను గుర్తించండి.

1) సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఎ) 1857
2) అబ్జర్వేషన్‌ బి) ఫ్రాన్సిస్‌ జేవియర్‌
3) ఆధునిక విద్యా ప్రారంభకులు సి) 1854
4) మద్రాస్‌ విశ్వవిద్యాలయం డి) ఛార్లెస్‌ గ్రాంట్‌
  ఇ) ఉడ్‌
  ఎఫ్‌) పోర్చుగీసు

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ             2) 1-బి, 2-డి, 3-ఇ, 4-ఎఫ్‌

3) 1-బి, 2-డి, 3-ఎఫ్, 4-ఎ     4) 1-సి, 2-డి, 3-ఎఫ్, 4-ఎ


14. ప్రాథమిక విద్యలో ఒక ప్రధాన అవరోధంగా హర్టాగ్‌ కమిటీ దేన్ని గుర్తించింది?

1) పాఠశాల భవనాల కొరత     2) మరుగుదొడ్ల కొరత

3) వ్యర్థత, నిలుపుదల     4) తాగునీటి సౌకర్యం లేకపోవడం


15. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) CABE - 1921     2) బేసిక్‌ ఎడ్యుకేషన్‌ - 1935

3) గోఖలే తీర్మానం - 1911     4) ఆర్థిక మాంద్యం - 1929


16. కేంద్ర విద్యా సలహామండలి(సీఏబీఈ)ని 1929లో రద్దు చేసి తిరిగి ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1930  2) 1932  3) 1934  4) 1935


17. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్‌ను నియమించిన గవర్నర్‌ జనరల్‌-

1) రిప్పన్‌  2) హర్టాగ్‌ 3) కర్జన్‌ 4) ఎవరూ కాదు


18. ఉపాధ్యాయులుగా శిక్షణ పొందినవారే ఉండాలని చెప్పిన మొదటి కమిషన్‌-

1) ఉడ్‌  2) సార్జంట్‌  3) హంటర్‌  4) సాడ్లర్‌


19. హలక్‌ బందీ అనే పాఠశాలను ఎక్కడ స్థాపించారు?

1) కలకత్తా  2) మద్రాసు 3) ఆగ్రా 4) బొంబాయి


20. తొలి భారతీయ విద్యా కమిషన్‌ అని దేన్ని అంటారు?

1) హంటర్‌ కమిషన్‌     2) హర్టాగ్‌ కమిటీ

3) భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్‌    4) సార్జంట్‌ కమిషన్‌


21. దిల్లీలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి దేని ఫలితంగా ఏర్పడింది?

1) సార్జంట్‌ నివేదిక     2) హంటర్‌ కమిషన్‌

3) హర్టాగ్‌ కమిటీ     4) సాడ్లర్‌ కమిషన్‌


22. అన్ని విద్యా కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల్లో భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని సార్జంట్‌కమిటీ పేర్కొంది?

1) 40    2) 30    3) 50    4) 60


23. బ్రిటిష్‌ కాలంలో భారతదేశంలో ప్రతి ప్రావిన్స్‌లో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ స్థాపించాలని ప్రతిపాదించినవారు?

1) హంటర్‌ కమిషన్‌     2) ఉడ్స్‌ డిస్పాచ్‌

3) లార్డ్‌ రిప్పన్‌     4) విలియం బెంటింక్‌


24. అధోముఖ వడపోత సిద్ధాంతం అని దేనికి పేరు?

1) 1813 ఛార్టర్‌ చట్టం     2) లార్డ్‌ మెకాలే ప్రతిపాదనలు

3) యశ్‌పాల్‌ కమిటీ      4) సాడ్లర్‌ కమిషన్‌


25. ‘ఎంప్లాయిమెంట్‌ బ్యూరో’ను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?

1) ఉడ్స్‌ డిస్పాచ్‌     2) హర్టాగ్‌ కమిటీ

3) హంటర్‌ కమిటీ     4) సార్జంట్‌ కమిటీ


26. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఎప్పుడు స్థాపించారు? 

1) 1917  2) 1919  3) 1918  4) 1920


27. ప్రైవేట్‌ పాఠశాలలకు ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించింది ఎవరు?

1) ఛార్లెస్‌ ఉడ్‌     2) హంటర్‌ 

3) సాడ్లర్‌     4) సార్జంట్‌


28. గుణాత్మక విద్య కోసం పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించిన కమిటీ-

1) ఉడ్స్‌ డిస్పాచ్‌         2) హర్టాగ్‌ కమిటీ

3) హంటర్‌ కమిటీ       4) సార్జంట్‌ కమిటీ


29. బేసిక్‌ విద్యా విధానానికి ఉన్న మరో పేరు-

1) సెకండరీ విద్యా విధానం    2) పూర్వ ప్రాథమిక విద్యా విధానం

3) వార్ధా విద్యా విధానం    4) ప్రాథమిక విద్యా విధానం


30. భారతీయ భాషల అభివృద్ధికి రూ.లక్ష గ్రాంటు ఇవ్వాలని సిఫారసు చేసిన చట్టం-

1) 1815 చట్టం    2) 1814 చట్టం

3) 1816 చట్టం    4) 1813 చట్టం


31. ‘‘రంగులో, రక్తంలో భారతీయులుగా, వారి ఆలోచన జ్ఞానం, జీవన విధానాల్లో మాత్రం ఇంగ్లిష్‌ వారిగా ఉండాలి’’ అని వ్యాఖ్యానించింది ఎవరు?

1) సార్జంట్‌    2) ఛార్లెస్‌ గ్రాంట్‌ 

3) లార్డ్‌ రిప్పన్‌     4) లార్డ్‌ మెకాలే


32. ‘మక్తబ్‌’ అనే పదాన్ని ఏ భాష నుంచి గ్రహించారు? 

1) పర్షియన్‌     2) అరబిక్‌ 

3) ఇటాలియన్‌      4) ఉర్దూ  


33. ఇస్లామిక్‌ విద్యా నిర్వహణలో నేటి కళాశాలలతో పోల్చదగిన విద్యాలయాలను ఏమని పిలుస్తారు?

1) మదరసాలు     2) మదరసా ఐలా 

3) మక్తబ్‌     4) ఏదీకాదు


34. కేంద్రంలో విద్యాశాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1944  2) 1945  3) 1946  4) 1951


35. కిందివాటిలో విశ్వవిద్యాలయ కమిషన్‌ సిఫారసు కానిది?

1) విశ్వవిద్యాలయాల అధ్యాపకులు మూడు రకాలుగా ఉండాలి

2) విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి మతాల్లో నైతికతను బోధించాలి

3) స్త్రీ విద్య కోసం మహిళా కళాశాలలు స్థాపించాలి

4) గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు


36. 3-6 సంవత్సరాల పిల్లలకు పూర్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ?

1) సార్జంట్‌     2) హంటర్‌ 

3) ఉడ్‌ నివేదిక     4) హర్టాగ్‌


37. భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

1) విలియం బెంటింక్‌     2) కర్జన్‌ 

3) లార్డ్‌ మెకాలే     4) డల్హౌసీ


38. హర్టాగ్‌ కమిటీ దేనికి ఉప కమిటీ?

1) సాడ్లర్‌ కమిటీ     2) సైమన్‌ కమిటీ 

3) సార్జంట్‌ కమిటీ     4) హంటర్‌ కమిటీ


39. కింది అంశాల్లో సార్జంట్‌ నివేదికలో లేనిది ఏది?

1) దివ్యాంగులకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించడం

2) ఉపాధి కల్పన కార్యాలయాలను స్థాపించడం

3) విశ్వవిద్యాలయ విరాళాల కమిటీని ఏర్పాటు చేయడం

4) బేసిక్‌ విద్య ఏర్పాటు


40. సాంకేతిక సంబంధ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించిన విద్యా కమిషన్‌-

1) హర్టాగ్‌     2) ఉడ్‌ నివేదిక 

3) అబాట్‌ ఉడ్‌     4) సార్జంట్‌ 


41. ప్రతిపాదిక విద్యను ఎక్కడ అమలు చేశారు?

1) వార్ధా     2) సబర్మతి 

3) పోరుబందర్‌     4) బొంబాయి


42. ఛార్లెస్‌ ఉడ్‌ విద్యను ఎన్ని స్థాయులుగా సూచించారు?

1) 3     2) 4    3) 5      4) 6


43. ప్రాథమిక పాఠశాలలను స్థానిక సంస్థలకు బదలాయించాలని పేర్కొన్న కమిషన్‌?

1) ఉడ్‌ నివేదిక     2) హంటర్‌ కమిషన్‌ 

3) సార్జంట్‌ కమిషన్‌     4) శాండ్విచ్‌


44. కేంద్ర విద్యా సలహామండలిని రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?

1) జాతీయ ఉద్యమం     2) ఆర్థిక మాంద్యం

3) కంపెనీ నిధుల కొరత    4) పైవన్నీ


45. విద్యార్థి విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు బడికి వచ్చి మిగిలిన రోజులు రాకపోవడం వల్ల అతడు అదే తరగతిలో కొనసాగుతాడు. దీన్ని ఏమంటారు?

1) అభ్యసన లోపం 2) స్తబ్దత 3) వృథా 4) విద్యా లోపం


46. సూచించిన కార్యక్రమాలు అమలు జరిగితే భారతదేశం ఏ సంవత్సరం నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించగలదని సార్జెంట్‌ పేర్కొన్నాడు.

1) 1980 2) 1982 3) 1984 4) 1985


47. గాంధీజీ ప్రతిపాదించిన ‘బేసిక్‌ విద్యా విధానం’ వేటికి ప్రాధాన్యం ఇస్తుంది?

1) పని విద్య 2) విద్యార్థి ఆసక్తి గుర్తించడం  3) వృత్తి విద్య 4) పైవన్నీ


48. విద్యారంగంలో సంక్షోభాన్ని నివారించడం కోసం ‘చీకటి కాలం’ తర్వాత నియమించిన విద్యా కమిషన్‌-

1) అబాట్‌ ఉడ్‌ కమిటీ 2) సార్జంట్‌ కమిటీ

3) విశ్వవిద్యాలయాల కమిషన్‌ 4) సాడ్లర్‌ కమిషన్‌


49. భారతదేశ విద్యా చరిత్రలో ఏ కమిషన్‌ నివేదికను యుద్ధానంతర విద్యా ప్రణాళిక అని పేర్కొంటారు?

1) సార్జంట్‌ కమిటీ 2) విశ్వవిద్యాలయ కమిషన్‌

3) హార్టాగ్‌ కమిటీ 4) అబాట్‌ ఉడ్‌ కమిటీ


50. ఇస్లాం విద్యావిధానంలో గురువులను ఏమని పిలిచేవారు?

1) మౌల్వి  2) అతిగురు  3) ప్రవక్త  4) ఆచార్య


51. మొదటి మక్తబ్‌ను మహమ్మద్‌ గోరి భారతదేశంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు?

1) ఔరంగాబాద్‌ 2) అమృత్‌సర్‌ 3) అహ్మదాబాద్‌  4) అజ్మీర్‌


52. ఏ విద్యా విధానంలో శిశువును దండించే అధికారం గురువుకు ఉంది?

1) ఇస్లాం విద్య  2) బౌద్ధ విద్య   3) వేద విద్య  4) ఆధునిక విద్య



సమాధానాలు

1-3; 2-1; 3-4; 4-1; 5-2; 6-4; 7-2; 8-2; 9-3; 10-2; 11-4; 12-2; 13-3; 14-3; 15-2; 16-4; 17-3; 18-3; 19-3; 20-1; 21-1; 22-1; 23-2; 24-2; 25-4; 26-3; 27-1; 28-2; 29-3; 30-4; 31-4; 32-2; 33-2; 34-2; 35-4; 36-1; 37-1; 38-2; 39-4; 40-4; 41-1; 42-3; 43-2; 44-2. 45-3; 46-3; 47-4; 48-2; 49-1; 50-1; 51-4; 52-1. 

Posted Date : 19-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.