• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు

వ్యత్యాసాలు తెలిస్తే బోధన సులువు!
 


విద్యార్థులు అందరూ ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. వారిలో అభ్యసన అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తిగత వ్యత్యాసాలను అర్థం చేసుకుని ఉపాధ్యాయులు సమర్థంగా బోధన సాగించాలి.  అందుకోసం సమ్మిళిత అభ్యసన వాతావరణాన్ని సృష్టించాలి. అభ్యసన వైకల్యాలు లేదా ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థులను గుర్తించాలి. తగిన బోధనా వ్యూహాలను రూపొందించుకోవాలి. కాబోయే టీచర్లకు ఆ వైయక్తిక భేదాలపై అవగాహన ఉంటేనే నాణ్యమైన విద్యను పిల్లలకు అందించగలుగుతారు. పిల్లల్లో ప్రజ్ఞను, సృజనాత్మకతను పెంపొందించగలుగుతారు. 



1.  గార్డెనర్‌ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం దేనికి ప్రాధాన్యత ఇచ్చింది?

1) సాధారణ ప్రజ్ఞ

2) పాఠశాలలో అవసరమైన సాధారణ సామర్థ్యాలు

3) వ్యక్తి విలక్షణ సామర్థ్యాలు

4) విద్యార్థి నిబంధిత నైపుణ్యాలు


2.  విభిన్నమైన అభ్యసనా అలవాట్లు ఉన్న తన  విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయురాలు వేర్వేరు రకాలైన అభ్యసనా పరిస్థితులను సృష్టిస్తుంది. ఆమె ఏ సిద్ధాంతం ద్వారా ప్రభావితం అయ్యింది?

1) కోల్‌బర్గ్‌ - నైతిక వికాస సిద్ధాంతం

 2) గార్డెనర్‌ - బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం

3) వైగోట్‌ స్కీ - సామాజిక, సాంస్కృతిక సిద్ధాంత

4) పియాజే - సంజ్ఞానాత్మక సిద్ధాంతం


3. పాఠశాలలోని వైయక్తిక విభేదాలను ఏ విధంగా నిర్వహించాలి?

1) విద్యార్థుల వైయక్తిక సామర్థ్యాల మధ్య  అంతరాన్ని పూరించాలి.

2) విద్యార్థుల సామర్థ్యాలు, నిష్పాదనను  సమపరచాలి.

3) విద్యార్థులు అభ్యసించడాన్ని లేదా అభ్యసించలేకపోవడాన్ని అవగాహన చేసుకోవాలి.

4) ప్రతి విద్యార్థి తాను ఇతరుల నుంచి ప్రత్యేకంగా భావించే ఏర్పాటును చేయాలి.


4.   వైయక్తిక విభేదాలను సమాధానపరచడంలో   పాఠశాల ఎలాంటి సహాయం చేయగలదు?

1) శిశుకేంద్రీకృత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధాలైన అభ్యసన అవకాశాలు కల్పించాలి.

2) విద్యార్థుల్లోని వైయక్తిక విభేదాలు తొలగించడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించడం.

3) మంద అభ్యాసకులను ప్రత్యేక పాఠశాలలో    చేరమని చెప్పాలి.

4) విద్యార్థులందరికీ ఒకే రకమైన పాఠ్యప్రణాళికను అనుసరించాలి.


5.   అభ్యాసకుల్లో వైయక్తిక భేదాలు సాధారణం. వాటి కోసం ఉపాధ్యాయుడు ఏం చేయాలి?

1) విభిన్నమైన అభ్యసన అనుభవాలను కల్పించాలి.

2) కఠినమైన క్రమశిక్షణను నెలకొల్పాలి.

3) పరీక్షల సంఖ్యను పెంచాలి.

4) అభ్యసనంలో ఏకరీతిని నెలకొల్పడానికి ప్రయత్నించాలి.


6.  కిందివాటిలో బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం పట్ల ప్రధాన విమర్శ?

1) పరిశోధనాధారితం కాదు.

2) భిన్న వ్యక్తుల విభిన్న ప్రజ్ఞలు పలు రకాల   పద్ధతులను డిమాండ్‌ చేస్తాయి.

3) ప్రతిభావంతులు కేవలం ఒకే రంగంలో శ్రేష్ఠత కలిగి ఉంటారు.

4) శాస్త్రీయమైన ఆధారం లేదు.


7.  కిందివాటిలో పిల్లల సృజనాత్మకతను వికసింపజేసే కృత్యం?

1) పాఠశాల ప్రారంభం నుంచి సాధించాల్సిన లక్ష్యాల ప్రాముఖ్యతను వివరించడం.

2) పరీక్షల్లో మంచి ఫలితాల సాధనకు శిక్షణ ఇవ్వడం.

3) మôచి విద్యావ్యావహారిక మూల్యాన్ని పిల్లలకు బోధించడం.

4) పిల్లలు ప్రశ్నించడానికి, వారి అంతర్గత శక్తులను అభివృద్ధి చేయడానికి తగిన వాతావరణాన్ని  ఏర్పరచడం.


8.  తరగతి గదిలోని విద్యార్థుల వైయక్తిక భేదాలు?

1) ఉపాధ్యాయులు వైవిధ్యమైన తరగతి గదిని నియంత్రించాల్సి ఉంటుంది. కాబట్టి లాభకరం కాదు.

2) హానికరమైనవి. ఎందుకంటే విద్యార్థుల మధ్య వివాదాలకు అవకాశం ఇస్తుంది.

3) అనవసరమైనవి. ఎందుకంటే మంద అభ్యాసకులకు కూడా పాఠ్యప్రణాళికలో చేరాలనే దృక్పథం సమయాన్ని హరింపజేస్తుంది.

4) లాభకరమైనవి. ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృతమైన సంజ్ఞానాత్మక నిర్మితులను  అన్వేషించాల్సి ఉంటుంది.


9.  కిందివాటిలో ఏది ప్రజ్ఞావంతుడి లక్షణం కాదు?

1) తన ఆలోచనను అమూర్తరీతిలో కొనసాగించడం.

2) నూతన పరిస్థితుల్లో తనను తాను సర్దుబాటు చేసుకోవడం.

3) సుదీర్ఘమైనవ్యాసాన్ని కూడా త్వరగా బట్టీపట్టడం. 

4) వాక్చాతుర్యంతో సందేశాన్ని సరైన రీతిలో   అందించడం.


10. సృజనాత్మకత దేంతో సంబంధం కలిగి ఉంటుంది?

1) సమైక్య ఆలోచన     2) విభిన్న ఆలోచన

3) పాత్రపోషణ     4) అనుకరణం


11. హోవార్డ్‌ గార్డెనర్‌ కిందివాటిలో ఏ ఒకటి తప్ప మిగతావాటిని ప్రజ్ఞారకాలుగా  సిద్ధాంతీకరించారు?

1) శాబ్దిక     2) సృజనాత్మకత

3) అంతర వ్యక్తిత్వ నైపుణ్యాలు

4) వ్యక్తి అంతర నైపుణ్యాలు


12. 16 సంవత్సరాల పిల్లవాడి ప్రజ్ఞాలబ్ధి 75. అతడి మానసిక వయస్సు ఎన్నేళ్లు?

1) 8     2) 14     3) 15    4) 12 


13. పిల్లల సృజనాత్మకతను అభివృద్ధి చేయడంలో సహాయ పడనిది?

1) ఆటలు    2) ఉపన్యాసం

3) కథలు రాసే పోటీలు

4) నిర్మాణ సంబంధ క్రియలు


14. ప్రజ్ఞా లబ్ధి గణాంకాలు సాధారణంగా ఏ విద్యావిషయక సాధనతో సహసంబంధాన్ని చూపుతాయి?

1) పరిపూర్ణమైన (Perfectly)

2) హెచ్చుగా (Highly)

3) మధ్యస్థంగా (Moderatly)

4) తక్కువ (Least)


15. ఒక పిల్లవాడి ప్రజ్ఞా లబ్ధి 105గా ఉంటే, అతడిని ఏమని పిలవొచ్చు?

1) అత్యున్నత ప్రజ్ఞావంతుడు

2) సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞావంతుడు

3) సగటు ప్రజ్ఞావంతుడు

4) మందబుద్ధి గలవాడు


16. రావన్స్‌ ప్రొగ్రసివ్‌ మాట్రిసెస్‌ అనేది ఏ పరీక్షకు ఉదాహరణ?

1) శాబ్దిక ప్రజ్ఞాపరీక్ష

2) అన్ని సంస్కృతుల వారికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష

3) వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్ష

4) మూర్తిమత్వపు పరీక్ష


17. వైయక్తిక భేదాలను సంతృప్తిపరచడంలో ఒక  ఉపాధ్యాయుడి పాత్ర ఏ విధంగా ఉండాలి?

1) పిల్లల సహజ సామర్థ్యాలు, అభిరుచులు,  వైఖరులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

2) పిల్లల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సరిదిద్దాలి.

3) 1, 2    4) ఏదీకాదు


18. ప్రజ్ఞలో వైయక్తిక భేదాలు ఏర్పడటానికి కారణం?

1) పరిసర కారకాలు మాత్రమే

2) అనువంశిక కారకాలు మాత్రమే

3) అనువంశిక, ఆర్థికపరమైన కారకాలు

4) అనువంశిక, పరిసర కారకాలు


19. ప్రజ్ఞకు సంబంధించి సరైన ప్రవచనం?

1) సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం

2) అభ్యసించే సామర్థ్యం

3) అమూర్తంగా వివేచించే సామర్థ్యం

 4) పైవన్నీ


20. ఎల్‌.ఎమ్‌.టర్మన్‌ ప్రకారం ప్రజ్ఞ అంటే?

1) లక్ష్యసాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యం

2) అమూర్త ఆలోచనా సామర్థ్యం

3) భౌతిక సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం

4) పరస్పర సంబంధాలను నెలకొల్పే అంతర్గత శక్తి


21. గార్డెనర్‌ పేర్కొన్న ఏడు రకాలైన ప్రజ్ఞాపట్టికలో లేనిది?

1) ప్రాదేశిక ప్రజ్ఞ      2) ఉద్వేగప్రజ్ఞ

3) వ్యక్త్యంతర ప్రజ్ఞ    4) భాషా సంబంధిత ప్రజ్ఞ


22. ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థంగా చిత్రాలు గీయడానికి కారణం ఆ విద్యార్థి-

1) వైఖరి    2) సహజసామర్థ్యం

3) అభిరుచి    4) అనుభవం


23. థారన్‌డైక్‌ ప్రకారం వ్యక్తిలోని చలన కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం?

1) ద్వారగోర్ధం     2) ముందు మెదడు

3) వెనుక మెదడు    4) మధ్యమెదడు


24. గార్డెనర్‌ ప్రకారం క్రీడాకారులకు ఉండే ప్రజ్ఞ?

1) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ  

2) వ్యక్త్యంతర ప్రజ్ఞ

3) ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ 

4)  దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ


25. కిందివాటిలో ఏ అంశానికి సృజనాత్మకతతో అధిక సహసంబంధం ఉంది?

1) ఆర్థికాంశం  2) శారీరక ఆకృతి    

3) హాస్యం  4) కాఠిన్య స్వభావం


26. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పని ఇచ్చాడు. అక్కడ     ఉపాధ్యాయుడు పరిగణించింది?

1) వైయక్తిక భేదాలు   2) సాధన

3) ఆసక్తులు   4) కుటుంబ నేపథ్యం


27. ఒక ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాలను రచించడంలో ఏ విధమైన పరీక్షలు ఎక్కువగా ఉపయోగపడతాయి?

1) సాంఘిక మితి పరీక్షలు  

2) మూర్తిమత్వ పరీక్షలు     

3) సృజనాత్మకత పరీక్షలు       

4) ప్రజ్ఞా పరీక్షలు


28. ప్రజ్ఞా లబ్ధి గణనల విస్తీర్ణం?

1) స్త్రీ, పురుషుల మధ్య సగటులో తేడాలను  తెలుపుతుంది.

2) 100 తర్వాత హఠాత్తుగా పడిపోతుంది.

3) సుమారు సాధారణ లేదా గంట ఆకారం.

4) చాలామంది 80 - 100 మధ్య ఉంటారని   తెలుపుతుంది.


29. గిల్‌ఫర్డ్‌ ప్రకారం ప్రజ్ఞను నిర్ధారించే కారకాలు?

1) ఆలోచన, గ్రహణం, వివేచన

2) విషయం, ప్రదాలకాలు, ఉత్పన్నాలు

3) ప్రదాలకాలు, ప్రక్రియలు, వ్యవస్థలు

4) ప్రక్రియలు, ప్రదాలకాలు, ఉత్పన్నాలు


30. ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది?

1) సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం.

2) వనరులను సమంగా ఉపయోగించగలిగే సామర్థ్యం.    

3) అనుగుణ్యతా సామర్థ్యం.

4) సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం.


31. ఆటల పోటీల్లో మంచి నిష్పాదన చూపే పిల్లవాడిలో ప్రజ్ఞ ఏ విధమైన ఉచ్ఛస్థితిలో ఉంది?

1) ప్రాదేశిక ప్రజ్ఞ     

2) తార్కిక గణిత ప్రజ్ఞ

3) శారీరక - గతి సంవేదన ప్రజ్ఞ

4) అంతర వ్యక్తిత్వ ప్రజ్ఞ


32. స్వీయ నేర్పరులకు ఉండే ప్రజ్ఞ?

1) వ్యక్త్యంతర ప్రజ్ఞ   2) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ

3) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ   4) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ


33. సృజనాత్మకత వికసింపజేయడంలో ఉపయోగపడేది?

1) పార్శ్వపు ఆలోచన   2) విభిన్న ఆలోచన  

3) సమైక్య ఆలోచన   4) అమూర్తపు ఆలోచన  


సమాధానాలు
 

1-3; 2-2; 3-1; 4-1; 5-1; 6-3; 7-4; 8-4; 9-3; 10-2; 11-2; 12-4; 13-2; 14-2; 15-3; 16-2; 17-3; 18-4; 19-2; 20-2; 21-2; 22-2; 23-4; 24-1; 25-3; 26-1; 27-4; 28-2; 29-2; 30-4; 31-3; 32-3; 33-3.
 


రచయిత: కోటపాటి హరిబాబు  

Posted Date : 20-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌