• facebook
  • whatsapp
  • telegram

కోతి ఊగే మర్రి ఊడలో ఉందో బలం! 

యాంత్రిక శాస్త్రం

బంతిని విసిరినప్పుడు దానిపై కొంత బలం పని చేస్తుంది. అది నిర్దిష్ట మార్గంలో కొంత దూరం చలించడానికి కారణమవుతుంది. అదే విధంగా ఊయల ఊగినప్పుడు అటు ఇటు లోలకంలాగా కదలికలు జరగడంలో, జంప్‌ చేసినప్పుడు శరీరం పైకి, కిందకి ఎగరడంలోనూ శక్తుల ప్రమేయం ఉంటుంది. బలాల ప్రభావాలతో ఒక భౌతిక వస్తువు చలనంలో, ప్రవర్తనలో వచ్చే మార్పులను అధ్యయనం చేసేదే యాంత్రిక శాస్త్రం.  ఇది భౌతికశాస్త్రంలో ప్రధానమైన భాగం. దీని గురించి పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన కలిగి ఉండాలి. సంబంధిత భౌతిక రాశులు, త్వరణాలు, వివిధ స్థితుల్లో ఉన్న శక్తిస్వరూపాలు, స్థానభ్రంశాలకు చెందిన నియమాలు, ఘర్షణను తగ్గించే పద్ధతుల గురించి  తెలుసుకోవాలి. 


1. కిందివాటిలో అదిశరాశి కానిది గుర్తించండి.

1) పొడవు  2) ఉష్ణోగ్రత   3) పని  4) బలం


2. కిందివాటిలో సదిశరాశి కానిది-

1) వేగం      2) శక్తి  

3) స్థానభ్రంశం      4) త్వరణం


3. కిందివాటిలో ప్రాథమిక భౌతికరాశి కానిదేది?

1) పొడవు      2) ద్రవ్యరాశి  

3) కాలం     4) వైశాల్యం


4.  కిందివాటిలో ఉత్పన్న భౌతికరాశి కానిది- 

1) పని   2) బలం   3) పీడనం       4) కాలం


5. రెండు బిందువుల మధ్య నిర్దిష్ట దిశలో ఉన్న కనిష్ఠ దూరం?

1) దూరం  2) స్థానభ్రంశం  3) వడి      4) వేగం


6. ఒక సెకను కాలంలో వస్తువు పొందిన స్థానభ్రంశం?

1) వడి      2) స్థానభ్రంశం  

3) వేగం      4) త్వరణం


7.  ఒక వస్తువుపై కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు అది 90º కోణంతో స్థానభ్రంశం చెందితే జరిగిన పని?

1) ధనాత్మకం     2) రుణాత్మకం 

3) శూన్యం     4) స్థిరం


8.  త్వరణం యొక్క S.I. ప్రమాణం?

1) m-s 2) m/s 3) m/s2 4) cm/s2


9. స్టేషన్‌ నుంచి బయలుదేరిన రైలుకు ఉండే త్వరణం?

1) రుణ త్వరణం     2) ధన త్వరణం

3) సమ త్వరణం     4) శూన్య త్వరణం


10. వేగంగా వచ్చే వాహనాలు హఠాత్తుగా బ్రేకులు వేసినప్పుడు కలిగే త్వరణం?

1) రుణ త్వరణం     2) ధన త్వరణం 

3) సమ త్వరణం     4) శూన్య త్వరణం


11. సమవేగంతో ప్రయాణించే వస్తువులకు ఉండే త్వరణం?

1) ధన త్వరణం     2) రుణ త్వరణం 

3) సమ త్వరణం     4) శూన్య త్వరణం


12. భూమి ఉపరితలం వద్ద g విలువను గుర్తించండి.

1) 98 m/s2       2) 980 cm/s2

3) 9.8 m/s2      4) 9.8 cm/s2


13. ఒక వ్యక్తి ఒక బిందువు నుంచి బయలుదేరి 2 కి.మీ. దూరాన్ని వృత్తాకార మార్గంలో ప్రయాణించి, అదే బిందువును చేరాడు. అప్పుడు అతడి స్థానభ్రంశం ఎంత?  

1) 4 కి.మీ. 2) 6 కి.మీ. 3) 2 కి.మీ. 4) సున్నా


14. ఒక వస్తువు ప్రయాణించే వేగాన్ని కొలిచే పరికరం?

1) ఒడోమీటర్‌     2) స్పీడోమీటర్‌

3) అనిమోమీటర్‌     4) యుడోమీటర్‌


15. ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని కొలిచే పరికరం?

1) పల్వనోమీటర్‌        2) అల్టీమీటర్‌

3) ఒడోమీటర్‌        4) యుడోమీటర్‌


16. ప్రక్షేపక వ్యాప్తి గరిష్ఠం కావడానికి ప్రక్షేపక కోణం విలువ ఎంత ఉండాలి?

1) 90º   2) 0º   3) 60º   4) 45º


17. రోడ్లకు గట్టు కట్టడం వల్ల వాహనానికి సమకూరే బలాన్ని గుర్తించండి.    

1) అపకేంద్ర బలం     2) అభికేంద్ర బలం

3) గురుత్వాకర్షణ బలం     4) ఘర్షణ బలం


18. ఒక వస్తువుకు ఉండే ద్రవ్యరాశి కారణంగా దానిపై ఏర్పడే బలం?

1) విద్యుదయస్కాంత బలం     2) కేంద్రక బలం

3) గురుత్వాకర్షణ బలం    4) ఘర్షణ బలం


19. స్కేటింగ్‌ ఆటలో ఉపయోగపడే ఘర్షణ బలాన్ని గుర్తించండి.

1) జారుడు 2) స్థైతిక  3) దొర్లుడు 4) ప్రవాహి


20. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల మధ్య ఉన్న బలం?

1) గురుత్వాకర్షణ బలం 2) దుర్బల  అన్యోన్య బలం

3) కేంద్రక బలం         4) విద్యుదయస్కాంత బలం


21. నీటితో నిండిన బకెట్‌ను అడ్డంగా, నిలువుగా ఊపినా నీరు కిందకు పడకపోవడానికి కారణమైన బలం?

1) అభికేంద్రక బలం     2) అపకేంద్రక బలం

3) గురుత్వాకర్షణ బలం     4) కేంద్రక బలం


22. లాండ్రీ డ్రయ్యర్, వాషింగ్‌ మిషన్లలో దుస్తులు ఆరబెట్టడానికి ఉపయోగపడే బలం?

1) అభికేంద్ర బలం     2) అపకేంద్ర బలం

3) దుర్బల అన్యోన్యచర్యా బలం 4) కేంద్రక బలం


23. రంగుల రాట్నం తిరిగేటప్పుడు దాని ఊయలలు బయటకు నెట్టినట్లు జరగడానికి కారణమైన బలం-

1) గురుత్వాకర్షణ బలం 2) స్థిర విద్యుదాకర్షణ బలం

3) అపకేంద్ర బలం     4) అభికేంద్ర బలం


24. ఒక కోతి మర్రి చెట్టు ఊడ పట్టుకుని ఊగుతున్నప్పుడు ఆ ఊడలో ఏర్పడే బలం?

1) అభిలంబ బలం     2) తన్యత బలం

3) గురుత్వాకర్షణ బలం     4) దుర్బల అన్యోన్య బలం


25. సీసా మర మూతలను తిప్పడంలో ఉపయోగపడే భౌతిక రాశిని గుర్తించండి.

1) బలభ్రామకం     2) ఘర్షణ బలం

3) బలయుగ్మం     4) అభిలంబ బలం


26. కూల్‌డ్రింక్‌ సీసా మూతను ఓపెనర్‌తో సులువుగా తీయడానికి కారణమైన భౌతికరాశి?

1) బలభ్రామకం     2) బలయుగ్మం 

3) ఘర్షణ     4) అభిలంబ బలం


27. కిందివాటిలో సరళ యంత్రాలకు సంబంధించి సరికానిది?

1) కటింగ్‌ ప్లయిర్‌     2) మరజాకీ 

3) గేర్లు     4) స్పానర్‌


28. క్యారంబోర్డులో కాయిన్స్‌ సులువుగా కదలనప్పుడు పౌడర్‌ను చల్లుతారు. కారణమేంటి?

1) ఘర్షణ పెంచడానికి  2) ఘర్షణ తగ్గించడానికి

3) అభిలంబ బలం తగ్గించడానికి       4) అభిలంబ బలం పెంచడానికి


29. ఓడలు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వెళ్లకుండా అడుగు భాగాన ఇసుక బస్తాలతో నింపుతారు. కారణం ఏమిటి?

1) అస్థిర నిశ్చలస్థితి పొందడం     2) స్థిర నిశ్చలస్థితి పొందడం

3) తటస్థ నిశ్చలస్థితి పొందడం   4) పైవన్నీ


30. 1 జౌల్‌ ఎన్ని ఎర్గ్‌లకు సమానం?

1) 10-5   2) 105   3) 107   4) 10-7


31. కూరగాయలు కోసే కత్తితో పదునైన వైపు కోస్తే తెగుతాయి, తిప్పి కోస్తే తెగవు కారణమేంటి?

1) వైశాల్యం ఎక్కువ, పీడనం తక్కువ         2) వైశాల్యం తక్కువ, పీడనం ఎక్కువ

3) వైశాల్యం తక్కువ, పీడనం తక్కువ         4) వైశాల్యం, పీడనం రెండూ ఎక్కువ


32. వాహనాల వెనుక భాగాన టైర్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేస్తారు కారణం?

1) వైశాల్యం పెంచి, పీడనం తగ్గించడం    2) వైశాల్యం తగ్గించి, పీడనం పెంచడం

3) పీడనం, వైశాల్యం తగ్గించడం    4) పీడనం, వైశాల్యం పెంచడం


33. కిందివాటిలో స్పర్శీయ బలం కానిది?

1) కండర బలం     2) అభిలంబ బలం

3) తన్యత బలం     4) గురుత్వాకర్షణ బలం


34. కిందివాటిలో క్షేత్రీయ బలం కానిది?

1) అయస్కాంత బలం     2) ఘర్షణ బలం

3) గురుత్వాకర్షణ బలం     4) స్థిరవిద్యుదాకర్షణ బలం


35. బలానికి S.I. ప్రమాణం?

1) డైన్‌   2) జౌల్‌   3) న్యూటన్‌   4) ఎర్గ్‌


36. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌ ఏ శక్తిని కలిగి ఉంటుంది?

1) స్థితిశక్తి     2) గతిశక్తి 

3) యాంత్రిక శక్తి     4) పైవన్నీ


37. ఆకాశంలో ప్రయాణించే విమానానికి ఉండే శక్తి

1) స్థితిశక్తి     2) గతిశక్తి 

3) యాంత్రిక శక్తి     4) ఏదీకాదు


38. పనిచేయడానికి కావాల్సిన దారుఢ్యాన్ని ఏమంటారు?

1) బలం  2) శక్తి  3) సామర్థ్యం  4) పీడనం


39. విద్యుత్‌ మోటార్‌లోని ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది?

1) యాంత్రిక శక్తి - విద్యుత్‌ శక్తి     2) విద్యుత్‌ శక్తి - ఉష్ణ శక్తి

3) విద్యుత్‌ శక్తి - యాంత్రిక శక్తి  4) ఉష్ణ శక్తి - యాంత్రిక శక్తి
40. చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ భూమిపై గురుత్వ త్వరణంలో ఎన్నో వంతు ఉంటుంది?

 

41. కుమ్మరి చక్రానికి ఉండే చలనాన్ని గుర్తించండి.

1) స్థానాంతర చలనం     2) కంపన చలనం

3) హరాత్మక చలనం     4) భ్రమణ చలనం


42. చెక్కకు రంధ్రాలు చేసే బర్మా చలనాన్ని గుర్తించండి.

1) సరేఖీయ చలనం     2) భ్రమణ చలనం

3) హరాత్మక చలనం     4) వక్ర రేఖీయ చలనం


43. 1 H.P. ఎన్ని వాట్స్‌కు సమానం?

1) 674   2) 744   3) 746   4) 467


44. కిందివాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

ఎ) ఒక వస్తువు అధిక స్థిరత్వాన్ని పొందడానికి దాని గురుత్వ కేంద్రం ఎత్తు తక్కువగా ఉండాలి.

బి) ఒక వస్తువు అధిక స్థిరత్వం పొందడానికి ఆధార వైశాల్యం ఎక్కువగా ఉండాలి.

1) ఎ సత్యం, బి అసత్యం     2) ఎ అసత్యం, బి సత్యం

3) ఎ, బి లు అసత్యాలు     4) ఎ, బి లు సత్యాలు


45. సామర్థ్యానికి S.I. ప్రమాణం?

1) వాట్‌   2) జౌల్‌   3) ఎర్గ్‌   4) న్యూటన్‌


46. చెట్టు నుంచి రాలిన ఆపిల్‌కు ఉండే త్వరణం?

1) రుణ త్వరణం     2) ధన త్వరణం 

3) శూన్య త్వరణం     4) సమ త్వరణం


47. న్యూటన్‌ విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం విలువ?

1) 6.67 × 10−11 Nm2/kg2        2) 6.022 × 10−11 Nm2/kg2

3) 6.67 × 10−15 Nm2/kg2        4) 6.33 × 10−11 Nm2/kg2


48. కిందివాటిలో ఘర్షణను తగ్గించే పద్ధతుల్లో సరికాని అంశం గుర్తించండి.

1) గ్రీజు, కందెనలు లాంటి తైలాలు వాడటం.    

2) యంత్ర భాగాల మధ్య బాల్‌ బేరింగ్‌లు వాడటం.

3) తలాలను గరుకుగా చేయడం.

4) వస్తువుల ముందుభాగాలు మొన తేలిన ఆకారంలో తయారుచేయడం.


49. విమానాల ఎత్తును కొలిచే పరికరం?

1) పాథోమీటర్‌     2) అల్టీమీటర్‌ 

3) అనిమోమీటర్‌     4) హైగ్రోమీటర్‌


50. వేగంగా వాహనాలను నడిపేవారికి పోలీసులు దేని ఆధారంగా జరిమానా విధిస్తారు?

1) వడి     2) సరాసరి వడి 

3) సరాసరి వేగం     4) తక్షణ వడి 


సమాధానాలు

1-4; 2-2; 3-4; 4-4; 5-2; 6-3; 7-3; 8-3; 9-2; 10-1; 11-4; 12-3; 13-4; 14-2; 15-3; 16-4; 17-2; 18-3; 19-1; 20-3; 21-1; 22-2; 23-3; 24-2; 25-3; 26-1; 27-4; 28-2; 29-2; 30-3; 31-1; 32-1; 33-2; 34-2; 35-3; 36-2; 37-3; 38-2; 39-3; 40-2; 41-4; 42-2; 43-3; 44-4; 45-1; 46-2; 47-1; 48-3; 49-2; 50-4.
 

Posted Date : 10-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌