• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్తు ప్రవాహం దాని ప్రభావాలు కాంతి చలన స్థితిని మార్చే బలం

ఆ దర్పణాలతో సైన్యం ఓడల్లో మంటలు!


సాధారణ బల్బుల కంటే ఫ్లోరోసెంట్‌ బల్బులు కాంతిమంతంగా వెలుగుతాయి. పెళ్లిళ్లు మొదలైన వేడుకల్లో అలంకరణ కోసం వినియోగించిన బల్బులు అనేక విన్యాసాలు చేస్తూ అలరిస్తుంటాయి. విద్యుత్తు ప్రవాహంలో చేసే మార్పులు, అనుసంధానాల వల్ల అవి సాధ్యమవుతాయి.  సముద్రం అడుగు భాగాన ఉండి, నీటి ఉపరితలంపై ఉన్న వస్తువులను చూడొచ్చు. కారుకు అమర్చి ఉన్న అద్దంలో నుంచి వెనుక వస్తున్న వాహనాలను కూడా స్పష్టంగా గమనించవచ్చు. దీనికి కాంతి ధర్మాల ఆధారంగా పని చేసే కటకాలు సాయపడతాయి. భౌతిక శాస్త్రం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వీటి గురించి తెలుసుకోవాలి. ఇంకా కర్బన, అకర్బన మలినాలు, వస్తువుల చలనాలకు కారణమయ్యే వివిధ బలాలపై అవగాహన పెంచుకోవాలి. 


1. కిందివాటిలో సరైన జతను ఎంచుకోండి.

  

1) ఎ-5, బి-3, సి-2, డి-1, ఇ-4

2) ఎ-5, బి-3, సి-2, డి-4, ఇ-1

3) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5

4) ఎ-3, బి-2, సి-4, డి-1, ఇ-5


2. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) స్విచ్‌ను వలయంలో ఎల్లప్పుడూ బల్బునకు   ఎడమ వైపు మాత్రమే ఏర్పాటు చేయాలి.

2) ప్రయోగాలు చేసేటప్పుడు వలయంలో విద్యుత్తు జనకంగా విద్యుత్తు ఘటాలను మాత్రమే ఉపయోగించాలి.

3) స్విచ్‌ను వలయంలో ఎక్కువ సమయంపాటు మూసి ఉన్న స్థితిలో ఉంచడం వల్ల విద్యుత్తు ఘటం త్వరగా బలహీనపడుతుంది.

4) రెండు ఘటాల అమరికలో ఒక ఘటం ధనధ్రువాన్ని మరొక ఘటం రుణధ్రువంతో కలపాలి.


3.   కిందివాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి.

1) తీగలపై ఇన్సులేషన్‌ అరిగిపోవడం లేదా చిరిగి పోవడం వల్ల వలయంలో అధిక విద్యుత్తు   ప్రవాహానికి దారితీస్తుంది.

2) అనేక విద్యుత్తు పరికరాలను ఒకే సాకెట్‌లోకి  కలపడం వలయంలో ఓవర్‌ లోడ్‌కు కారణమవుతుంది.

3) సాధారణ బల్బుల కన్నా ఫ్లోరోసెంట్, కాంపాక్ట్‌ ఫ్లోరోసెంట్‌ బల్బులు అధిక విద్యుత్తును  వినియోగించుకుంటాయి.

4) బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ న్యూదిల్లీవారు విద్యుత్‌ పరికరాలకు ఐఎస్‌ఐ చిహ్నాన్ని ఇస్తారు.


4. కిందివాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి.

1) వలయంలో అధిక పరిమాణంలో విద్యుత్తు   ప్రవహిస్తే నష్టం జరగకుండా ఈ రోజుల్లో ఫ్యూజుల స్థానంలో ఎంసీబీలను వాడుతున్నారు.

2) లఘువలయం ఏర్పడినప్పుడు ప్రమాదాన్ని   నివారించడానికి వలయంలో ఫ్యూజును రక్షణ   పరికరంగా ఉపయోగిస్తారు.    

3) విద్యుత్తు ప్రవహించే తీగలో ఏర్పడే ఉష్ణం ఆ వస్తువు పదార్థం, మందం, పొడవుపై ఆధారపడదు.

4) అల్పద్రవీభవన స్థానం ఉన్న కొన్ని ప్రత్యేక  పదార్థాలతో విద్యుత్తు ఫ్యూజును తయారుచేస్తారు.


5. కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.

ఎ) ఎలక్ట్రికల్‌ కుక్కర్, ఐరన్‌ బాక్స్, కాఫీ కెటిల్, హెయిర్‌ డ్రయ్యర్‌లు విద్యుత్తు ఉష్ణఫలితం   ఆధారంగా పనిచేస్తాయి.

బి) ఎలక్ట్రికల్‌ బెల్, జనరేటర్, ఎంఆర్‌ఐ మిషన్లు, మెటల్‌ డిటెక్టర్లు విద్యుత్తు అయస్కాంత ఫలితం ఆధారంగా పనిచేస్తాయి.

సి) కంప్యూటర్, ల్యాప్‌టాప్స్‌లో లిథియం ఘటాలను రిస్ట్‌వాచ్, లేజర్‌లైట్స్‌లో బటన్‌ సెల్స్‌ను ఉపయోగిస్తారు

డి)  డెకరేషన్‌ లైట్లను శ్రేణిసంధానంలో, ఇళ్లలోని బల్బులను సమాంతర సంధానంలో ఏర్పాటు చేస్తారు.

1) ఎ, బి    2) బి, సి    3) సి, డి    4) పైవన్నీ


6. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) సూర్యుడి వ్యాసం సుమారు 1.39 మిలియన్‌ కిలోమీటర్లు.

2) సూర్యకాంతి భూమిని చేరడానికి 8.3 నిమిషాలు పడుతుంది.

3) సూర్యుడిలో దాదాపు 75% హీలియం, 25% హైడ్రోజన్‌ వాయువులు ఉంటాయి. 

4) సూర్యుడు అతిపెద్ద సహజకాంతి వనరు.


7.  కిందివాటిలో సరికాని అంశాన్ని ఎన్నుకోండి.

1) వివిధ దిశల నుంచి ప్రయాణిస్తున్న కాంతి   కిరణాలు ఒక బిందువు వద్ద కలిసే సముదాయమే అభిసరణ కాంతికిరణ పుంజం.

2) కాంతి పరావర్తనంలో పతనకిరణం, పరావర్తన కిరణం, లంబ తలానికి ఇరువైపులా ఉంటాయి.

3) క్రమపరావర్తనం అనేది నునుపైన తలాలపై కాంతి పరావర్తనం వల్ల ఏర్పడుతుంది.

4) క్రమరహిత పరావర్తనం వల్ల వస్తువుల     ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపిస్తాయి.


8. ఇచ్చినవాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) సమతల దర్పణంలో వస్తువు, ప్రతిబింబ దూరాలు సమానం.

2) సమతల దర్పణంలో వస్తువు కంటే ప్రతిబింబ పరిమాణం పెద్దదిగా ఉంటుంది.

3) సమతల దర్పణంలో నిటారైన, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది.

4) సమతల దర్పణంలో పార్శ్వ విలోమం అనే ధర్మం ఏర్పడుతుంది.


9.  కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.

ఎ) సముద్రం అడుగున ఉన్న సబ్‌మెరైన్‌ నుంచి నీటి ఉపరితలంపైఉన్న వస్తువును పెరిస్కోపుతో చూడొచ్చు.

బి)  ఈఎన్‌టీ, దంత, కంటి వైద్యులు పుటాకార   దర్పణాలను ఉపయోగిస్తారు.

సి) వాహనాల రియర్‌ వ్యూ మిర్రర్, ఏటీఎం    మిషన్లలో, రోడ్డు కూడళ్లు, వక్ర మార్గాల్లో    కుంభాకార దర్పణాలు ఉపయోగిస్తారు.

డి) పుటాకార దర్పణాల ద్వారా ఆర్కిమెడిస్‌ రోమన్‌ సైన్యంపై, వారి ఓడల్లో మంటలు ఏర్పరిచేవాడు.

1) ఎ, సి    2) బి, సి    3) ఎ, బి, సి    4) పైవన్నీ


10. కిందివాటిలో సరైన అంశాన్ని ఎంచుకోండి.

ఎ) కుంభాకార కటకాలు కాంతి కిరణాలను   కేంద్రీకరింపజేస్తాయి.

బి) పుటాకార కటకాలు కాంతి కిరణాలను  వికేంద్రీకరింపజేస్తాయి.

సి) టీవీని చూసేటప్పుడు కంటి భద్రత నియమం 20-20-20 నియమాన్ని పాటించడం సురక్షితం.

డి) రంగులున్న సీడీని వేగంగా తిప్పడం వల్ల తెలుపు రంగులో కనిపించడాన్ని న్యూటన్‌చక్రం అంటారు.

1) ఎ, బి    2) బి, డి     3) ఎ, సి    4) పైవన్నీ 


మురుగునీరు


11. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) ఇళ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వృథానీటిని మురుగునీరు అంటారు.

2) నీటి వనరుల్లోకి నీరు ప్రవేశించే ముందు   అందులోని కాలుష్య కారకాలను తొలగించడాన్ని నీటిని శుభ్రపరచడం అంటారు.

3) ఒక మిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

4) ఐక్యరాజ్యసమితి 2005-15వ కాలాన్ని జీవం కోసం జలం కార్యాచరణ అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది.


12. కిందివాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి.

1) మానవ శరీరానికి రోజుకు 2-3 లీటర్ల నీరు అవసరం.

2) శరీరంలోని వ్యర్థ పదార్థాలను నీరు తొలగిస్తుంది. అందుకే పాఠశాలలో నీటి గంటలు ప్రవేశపెట్టారు.

3) నీటి పరిమాణాన్ని లీటర్లు, మిల్లీలీటర్లలో కొలుస్తారు.

4) మానవ శరీర బరువులో 85% నీరే ఉంటుంది.


13. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) 2005, మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు.

2) మురుగునీటి శుద్ధిలో భౌతిక, రసాయన, జీవ  సంబంధ ప్రక్రియలు ఉంటాయి.

3) మురుగునీటిని వేగంగా గ్రహించి స్వచ్ఛమైన నీటిఆవిరిని వాతావరణంలోకి విడుదల చేయడానికి మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్‌ చెట్లు పెంచుతారు.

4) 2018లో భారతదేశం ‘స్వచ్ఛభారత్‌’ అనే   ఉద్యమాన్ని ప్రారంభించింది.


14. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.

1) కర్బన మలినాలు   ఎ) టైఫాయిడ్, కలరా  

2) అకర్బన మలినాలు    బి)  ఫాస్ఫరస్, నైట్రోజన్‌

3) పోషకాలు            సి) పురుగు మందులు, కలుపు మందులు

4) బ్యాక్టీరియా      డి)  నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, లోహాలు

1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి     2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి     4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి


15. ఇచ్చినవాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) వానపాముల ద్వారా మానవవిసర్జితాలు శుద్ధిచేసే మరుగుదొడ్ల రూపకల్పన భారత్‌లో ఏర్పాటు. 

బి)  మురుగునీటిని శుద్ధి చేయడానికి మొదటగా దాన్ని, బార్‌స్క్రీన్‌ల ద్వారా పంపి కర్రముక్కలు, ప్లాస్టిక్‌ సంచులు, ఇతర పదార్థాలు తొలగిస్తారు.

సి) మురుగునీటిని వాలుగా ఉన్న ట్యాంక్‌లోకి పంపి అందులోని ఘన పదార్థాలను స్కోపర్, నీటిపైన తేలే నూనె పదార్థాలను స్కిమ్మర్‌ అనే పరికరాలతో తొలగిస్తారు.

డి)  శుద్ధిచేసిన మురికినీటిని, నీటి వనరులోకి పంపేముందు క్లోరిన్, ఓజోన్‌ లాంటి రసాయనాలు కలుపుతారు.

1) ఎ, సి     2) బి, సి    3) ఎ, సి, డి    4) పైవన్నీ 


బలం - పీడనం


16. కిందివాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి.

1) ఒక వస్తువుపై ఒకే దిశలో ప్రయోగించిన    బలాలను ఒకదాంతో మరొకటి కలపాలి.

2) ఒక వస్తువుపై రెండుబలాలు వ్యతిరేకదిశలో పనిచేస్తే, వాటిఫలితబలం వాటిమధ్య భేదమవుతుంది.

3) ఒక వస్తువుపై రెండు బలాలు మాత్రమే పనిచేస్తాయి.

4) ఒక వస్తువుపై రెండు సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే, వాటి ఫలితబలం శూన్యం అవుతుంది.


17. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) బలం అనేది ఒక వస్తువు చలనస్థితిని మార్చగ లదు.

2) బలాన్ని ప్రయోగించి వస్తువు ఆకారంలో మార్పు కలిగించవచ్చు.

3) ఒక వస్తువు నిశ్చలంగా లేదా చలనంలో ఉన్నప్పుడు ఇవి రెండూ వస్తువు చలన స్థితులు కావు.

4) బలాన్ని ప్రయోగించి వస్తువు వేగ దిశలో మార్పు కలిగించవచ్చు.


18. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) నడవడానికి, రాయడానికి, డ్రైవింగ్‌ చేయడానికి కండర బలాన్ని ఉపయోగిస్తాం.

2) దువ్వెనతో పొడి జుట్టును దువ్వినప్పుడు వాటిమధ్య ఏర్పడిన ఆకర్షణ బలాన్ని అయస్కాంత బలం అంటారు.

3) చెట్టు నుంచి రాలిన పండు భూమిని చేరడానికి కారణం గురుత్వాకర్షణ బలం.

4) గురుత్వాకర్షణ బలం భూమికి మాత్రమే ఉంటుంది.

1) ఎ, బి    2) బి, సి    3) సి, డి    4) బి, డి 


19. కూరగాయలు కోసే కత్తితో పదునైన వైపు కోసినప్పుడు మాత్రమే కూరగాయలు తెగుతాయి. తిప్పికోస్తే తెగవు. కారణం? 

1) స్పర్శాతల వైశాల్యం ఎక్కువ, పీడనం తక్కువ

2) స్పర్శాతల వైశాల్యం తక్కువ, పీడనం ఎక్కువ

3) స్పర్శాతల వైశాల్యం, పీడనం ఎక్కువ

4) స్పర్శాతల వైశాల్యం, పీడనం తక్కువ


 సమాధానాలు


1-1; 2-1; 3-3; 4-3; 5-4; 6-3; 7-2; 8-2; 9-4; 10-4; 11-3; 12-4; 13-4; 14-1; 15-4; 16-3; 17-3; 18-2, 19-1.


 

చంటి రాజుపాలెం


 

Posted Date : 21-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌