• facebook
  • whatsapp
  • telegram

చతుర్భుజాలు

జత సమాంతర భుజాలు ఉంటే సమలంబం!


 


విస్తీర్ణాలను, చుట్టుకొలతలను కొలవడానికి, కోణాలను లెక్కగట్టడానికి, రేఖాగణిత సంబంధాలను అర్థం చేసుకోవడానికి చతుర్భుజాల గురించి తెలుసుకోవాలి. భవనాలు, వంతెనలు, యంత్రాల నిర్మాణంలో బలం, స్థిరత్వం, కదలికలను అంచనా వేయడానికీ ఈ నాలుగు రేఖాఖండాల సంవృత పటాలు సాయపడతాయి. చిత్రకళ, శిల్పకళ, వాస్తుశిల్పాల్లో సౌందర్యం, సమతౌల్యతలను సాధించడానికి చతుర్భుజాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇంజినీరింగ్, భౌతిక శాస్త్రం, రేఖాగణితం, త్రికోణమితి తదితర అనేక రంగాలకు సంబంధించి కీలకంగా ఉన్న చతుర్భుజాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రతి పోటీ పరీక్షలో తప్పకుండా వస్తున్న ఈ ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. 


1.  సమచతుర్భుజంలో భుజాల మధ్య బిందువులను కలిపితే ఏర్పడే చతుర్భుజం?    

1) సమచతుర్భుజం   2) చతురస్రం  

3) సమలంబ చతుర్భుజం  4) దీర్ఘ చతురస్రం


2. ABCD సమాంతర చతుర్భుజంలో ∠DAB = = 40అయితే ∠ABC =?

1) 800    2) 1000   3) 1200    4) 1400


3. చతుర్భుజంలోని కోణాలు కిందివాటిలో ఏ  నిష్పత్తిలో ఉండవు?

1) 3 : 1 : 5 : 6    2) 2 : 3 : 4 : 6

3) 1 : 2 : 3 : 6    4) పైవన్నీ


4. ఒక చతుర్భుజంలోని కోణాలు 2 : 3 : 4 : 6 నిష్పత్తిలో ఉంటే అ చతుర్భుజంలో పెద్దకోణం ఎంత? 

1) 480    2) 960   3) 1440   4) 1540


5. సమాంతర చతుర్భుజంలోని ఒక కోణం అతి చిన్న కోణానికి రెట్టింపు కంటే 240 తక్కువ. అయితే దానిలో పెద్ద కోణం ఎంత?

1) 1320    2) 1120   3) 1220 4) 920


6.  ABCD చతుర్భుజంలో AB = 5 సెం.మీ., CD = 8 సెం.మీ. ∠A, ∠D  కోణాల మొత్తం 1800 అయితే ABCD ఒక?

1) దీర్ఘ చతురస్రం   2) సమ చతుర్భుజం

3) సమాంతర చతుర్భుజం 4) సమలంబ చతుర్భుజం 


7.  ఒక చతుర్భుజ కోణాలు వరుసగా x0, (x + 10)0,(x + 20)0, (x + 30)0 అయితే x విలువ ఎంత?

1) 850   2) 750   3) 650   4) 450


8. సమాంతర చతుర్భుజం రెండు భుజాలు 4 : 3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత  56 సెం.మీ. అయితే ఆ రెండు భుజాల పొడవులు ఎంత? (సెం.మీ.లలో)

1) 16,12   2) 18,10   3) 15,13   4) 14,12


9.  ABCD చతుర్భుజంలో కర్ణం AC = 10 సెం.మీ. , AC = 10 పై శీర్షాలు, , B,D నుంచి గీసిన లంబాలు 5 సెం.మీ., 6 సెం.మీ. పొడవులు కలిగి ఉంటే ABCD చతుర్భుజ వైశాల్యం ఎంత?

1) 55 చ.సెం.మీ.   2) 40 చ.సెం.మీ.  

3) 35 చ.సెం.మీ.   4) 28 చ.సెం.మీ.


10. BASE దీర్ఘచతురస్ర కర్ణాలు = ‘O’ వద్ద సమద్విఖండన చేసుకుంటాయి. OB = 3x + 1, OE = 2x + 4 అయితే x విలువ ఎంత?

1) 4    2) 3   3) 2    4) 1


11.  ABCD చతురస్రంలో కర్ణాలు బిందువు 'O' వద్ద ఖండించుకుంటే ∆AOB ఒక

1) లంబకోణ సమద్విబహు త్రిభుజం 

2) సమబాహు త్రిభుజం 

3) లంబకోణ త్రిభుజం కాని సమద్విబాహు త్రిభుజం 

4) లంబకోణ విషమబాహు త్రిభుజం


12. BEST సమాంతర చతుర్భుజంలో ∠B = 1000. అయితే ∠E = ?

1) 900    2) 1800    3) 800   4) 600


13.  ఒక చతుర్భుజంలో కోణాలు వరుసగా x0, (x - 10)0, (x + 30)0, 2x0 అయితే వాటిలో చిన్న కోణం ఎంత?

1) 680    2) 580   3) 520   4) 480


14. సమాంతర చతుర్భుజం రెండు భుజాలు 5 : 4 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత  108 సెం.మీ. అయితే ఆ రెండు భుజాల పొడవులు ఎంత? (సెం.మీ.,)

1) 30, 24    2) 60, 48   3) 24, 36    4) 18, 24


15. ABCD ఒక చతుర్భుజంలోని కోణాలు A, B, C, D లు వరసగా 1 : 2 : 4 : 5 నిష్పత్తిలో ఉంటే దానిలో ఏవైనా మూడు కోణాల మొత్తం ఎంత?

1) 3000  2) 3250 3) 2800   4) 2500


16. ఒక చతుర్భుజం ఏకైకంగా ఏర్పడాలంటే కావాల్సిన కొలతల సంఖ్య?

1) 4    2) 5    3) 3    4) 4కు తక్కువ కాకుండా


17. HELP ఒక సమాంతర చతుర్భుజం. OE = 4 సెం.మీ. కర్ణాల సమద్విఖండన బిందువు O. PE కంటే HL 5 సెం.మీ ఎక్కువ. అయితే వీబీ = ?

1) 6.5 సెం.మీ.   2) 7.5 సెం.మీ.  

3) 13 సెం.మీ.   4) 15 సెం.మీ.


18. AB = 5 సెం.మీ., BC = 3.5 సెం.మీ.,  ∠A = 60కొలతలతో ABCD సమాంతర  చతుర్భుజాన్ని గీయండి. ఈ సమస్య సాధనలో నిర్మాణక్రమ సోపానాలకు ఉండాల్సిన క్రమాన్ని గుర్తించండి.

ఎ) AB రేఖా ఖండంపై A వద్ద 600  కోణరేఖ గీయండి. 

బి) D నుంచి 5 సెం.మీ., B నుంచి 3.5 సెం.మీ. ల వ్యాసార్ధంతో చాపరేఖలు గీయగా అవి C వద్ద కలుస్తాయి.   

సి) AB = 5 సెం.మీ., కొలతతో రేఖాఖండం గీయండి.

డి)  AD = 3.5 సెం.మీ., కొలతతో ∠A కోణ  రేఖపై D బిందువు గుర్తించండి.

ఇ) DC, BC లను కలపండి.

1) సి, డి, బి, ఇ, ఎ     2) సి, ఎ, డి, బి, ఇ

3) ఎ, సి, బి, ఇ, డి    4) బి, ఎ, సి, డి, ఇ


19.   ఒక చతుర్భుజంలోని కోణాలు 3 : 4 : 5 : 6 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ చతుర్భుజంలోని కనిష్ఠ కోణం ఎంత?

1) 600  2) 450   3) 300  4) 1200


20. ఒక రాంబస్‌ ఏకైకంగా ఏర్పడాలంటే కావాల్సిన కొలతల సంఖ్య?

1) 4    2) 3   3) 2   4) 1


21. ఒక జత మాత్రమే సమాంతర భుజాలు ఉండే చతుర్భుజం?

1) గాలిపటం   2) సమాంతర చతుర్భుజం   

3) సమలంబ చతుర్భుజం   4) చతురస్రం


22. చతురస్రంలో కర్ణాలు సమద్విఖండన చేసుకున్నప్పుడు ఏర్పడే కోణం ఎంత?

1) 450   2) 600    3) 900   4) 1200


23. సమాంతర చతుర్భుజంలో ఒక జత ఆసన్న కోణాల మొత్తం ఎంత?

1) సమానం    2) సంపూరకాలు  

3) పూరక కోణాలు   4) లఘు కోణాలు


24. సమాంతర చతుర్భుజంలోని రెండు ఆసన్న కోణాలు 3 : 2 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు ఎంత?

1) 1080, 360    2) 1080, 720

3) 1180, 620     4) 980, 720


25. A = (x + 2y)0, B = 1100, C = 700, D = (5x + 2y)0. A, B, C, D లు సమాంతర చతుర్భుజ అంతర కోణాలైతే (x + y) విలువ ఎంత?

1) 500    2) 400   3) 350   4) 300


26. కిందివాటిలో సరైంది?

1) దీర్ఘచతురస్రంలో కర్ణాలు అసమానంగా ఉండి సమద్విఖండన చేసుకుంటాయి.

2) రాంబస్‌లో కర్ణాలు సమానంగా ఉండి లంబ సమద్విఖండన చేసుకుంటాయి.

3) సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉండి సమద్విఖండన చేసుకుంటాయి. 

4) చతురస్రంలో కర్ణాలు సమానంగా ఉండి లంబ సమద్విఖండన చేసుకుంటాయి.


27. ABCD ఒక సమాంతర చతుర్భుజం. BC యొక్క మధ్యబిందువు E. AB, DE, లను F వరకు పొడిగిస్తే AF = ?

1) 3AB    2) AC    3) AB + AC    4) 2AB


28. ఒక చతుర్భుజంలో రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరాలైతే ఆ చతుర్భుజాన్ని ఏమంటారు?

1) చతురస్రం    2) దీర్ఘచతురస్రం  

3) సమాంతర చతుర్భుజం   4) సమ చతుర్భుజం  



30. ఒక సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 54 సెం.మీ., దాని ఆసన్న భుజాల నిష్పత్తి    2 : 7 అయితే ఆ రెండు భుజాలు ఎంత?

1) 8 సెం.మీ., 19 సెం.మీ.   

2) 10 సెం.మీ., 17 సెం.మీ.        

3) 6 సెం.మీ., 21 సెం.మీ.   

4) 13 సెం.మీ., 14 సెం.మీ.


31. ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాల్లో ఒకటి రెండో దానికి రెట్టింపు కంటే 3తక్కువ. అయితే వాటిలో పెద్ద కోణం ఎంత?    

1) 110o    2) 120o   3) 130o    4) 140o 


32. సమాన కొలతలున్న భుజాలు, అసమానంగా కర్ణాలున్న చతుర్భుజం?

1) చతురస్రం       2) సమాంతర చతుర్భుజం   

3) ట్రెపీజియం      4) రాంబస్‌


33. చతుర్భుజంలోని మూడు కోణాలు 55o, 65o, 105o అయితే నాలుగో కోణం ఎంత?

1) 25o  2) 35o   3) 45o  4) 15o


34. సమాంతర చతుర్భుజంలోని కోణ సమద్విఖండన రేఖలు దేన్ని ఏర్పరుస్తాయి?

1) చతురస్రం       2) ట్రెపీజియం  

3) రాంబస్‌       4) దీర్ఘచతురస్రం  


35. కింది వాక్యాల్లో సరైనవి?

ఎ) సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు

బి) చతురస్రాలన్నీ సమ చతుర్భుజాలు

సి) సమ చతుర్భుజాలన్నీ గాలిపటాలు

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, సి 4) ఎ, బి, సి 


36. కిందివాటిలో సరికానిది?

1) చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు.  

2) చతురస్రాలన్నీ దీర్ఘ చతురస్రాలు. 

3) గాలిపటాలన్నీ సమ చతుర్భుజాలు.

4) సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ  చతుర్భుజాలు.


37. ఒక సమాంతర చతుర్భుజంలో...

ఎ) ఎదుటి భుజాలు సమానం.

బి) ఎదురెదురు కోణాలు సమానం.

సి) కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్విఖండన చేసుకుంటాయి.

1) ఎ, బి లు సరైనవి  2) ఎ, సిలు సరైనవి  

3) బి, సి లు సరైనవి  4) ఎ, బి, సి లు సరైనవి


38. ABCD, EFGH లు పటంలో చూపిన విధంగా ఉంటే కిందివాటిలో ఏది నిజం?


39. కింది ప్రవచనాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) చతురస్రంలోని ప్రతి కర్ణం దాన్ని రెండు సర్వ సమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది. 

బి) దీర్ఘచతురస్రంలో ప్రతి కర్ణం దాన్ని రెండు సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తుంది.

1) ఎ మాత్రమే       2) బి మాత్రమే   

3) ఎ, బి     4) ఏదీకాదు 



40. సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి    కావాల్సిన కొలతల సంఖ్య ఎంత?

1) 5     2) 4     3) 2     4) 3


 సమాధానాలు
 

1-2; 2-4; 3-3; 4-3; 5-2; 6-4; 7-2; 8-1; 9-1; 10-2;  11-1; 12-3; 13-2; 14-1; 15-1; 16-2; 17-3; 18-2; 19-1; 20-3. 21-3; 22-3; 23-2; 24-2; 25-2; 26-4; 27-4; 28-3; 29-3; 30-1; 31-1; 32-4; 33-2; 34-4; 35-4;  36-3; 37-1; 38-1; 39-2; 40-4.
 


రచయిత: సి.మధు 


 


 

Posted Date : 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌