• facebook
  • whatsapp
  • telegram

ప్రత్యేక హార్మోన్లు - వాటి విధులు

పోరాటానికి.. పలాయనానికి ఒకటే ప్రేరణ!


 రోజూ నిద్ర పడుతుంది. సమయానికి మెలకువ వస్తుంది. రకరకాల ఇన్‌ఫెక్షన్లను, వ్యాధులను తట్టుకుని శరీరం రోగనిరోధకశక్తిని ప్రదర్శిస్తుంటుంది. ఆకలి, దాహం వేస్తాయి. ఏదైనా తినగానే తాగగానే తగ్గిపోతాయి. ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నట్లు కనిపించినప్పటికీ, మానవ శరీరంలోని కొన్ని గ్రంథులు ప్రత్యేక హార్మోన్లను విడుదల చేస్తూ ఈ విధులను నిర్వర్తిసుంటాయి. ఆ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లు, వాటి ప్రత్యేకతలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు వివిధ హార్మోన్ల ప్రభావాలను, అవి ప్రేరేపించే లక్షణాలను అర్థం చేసుకోవాలి. 


 

మానవుడిలో హార్మోన్లు అంతఃస్రావ గ్రంథుల నుంచే కాకుండా ఇతర భాగాల నుంచి కూడా విడుదలవుతాయి. హార్మోన్లను స్రవించే అంతఃస్రావ గ్రంథులు కాని గ్రంథులు థైమస్‌ గ్రంథి, పీనియల్‌ గ్రంథి, హైపోథలామస్‌లు, జీర్ణవ్యవస్థలోని భాగాలు.


మాదిరి ప్రశ్నలు 



1.     థైమస్‌ గ్రంథికి సంబంధించి సరైంది? 

ఎ) ఇది గుండెకు పై భాగంలో ఉంటుంది.

బి) చిన్నపిల్లల్లో క్రియావంతంగా, వృద్ధుల్లో క్షీణించి ఉంటుంది.

సి) ఇది థైమోసిన్‌ హార్మోన్‌ను స్రవిస్తుంది. 

డి) థైమోసిన్‌ హార్మోన్‌ T - లింఫోసైట్‌లు ఏర్పడటానికి, వాటి పనితీరుకు ఉపయోగపడుతుంది. 

1) ఎ, బి, సి      2) బి, సి, డి  

3) ఎ, బి, సి, డి       4) డి మాత్రమే


2. కిందివాటిలో పీనియల్‌ గ్రంథికి సంబంధించి సరికానిది? 

ఎ) ఈ గ్రంథి మెదడులో ఉంటుంది.

బి) మెలటోనిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది. 

సి) పీనియల్‌ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి.

డి) దీన్ని పీనియల్‌ దేహం అని కూడా అంటారు.

1) ఎ, బి    2) సి    3) డి    4) బి, సి


3.    కిందివాటిని జతపరచండి. 

ఎ) థైమోసిన్‌ హార్మోన్‌ ఎక్కువైతే 1) మయోస్థీనియా గ్రేవిస్‌
బి) మెలటోనిన్‌ హార్మోన్‌ 2) కుషింగ్‌ సిండ్రోమ్‌
సి) హైపోథలామస్‌ 3) హ్యూమన్‌ కోరియానిక్‌ గొనాడోట్రోపిన్‌ను స్రవిస్తుంది
డి) జరాయువు 4) న్యూరో హార్మోన్లను స్రవిస్తుంది
ఇ) కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువైతే 5) జీవ గడియారాన్ని స్రవిస్తుంది  

1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1 

2) ఎ-4, బి-2, సి-1, డి-3, ఇ-5  

3) ఎ-1, బి-5, సి-4, డి-3, ఇ-2 

4) ఎ-5, బి-3, సి-2, డి-1, ఇ-4


4.    కిందివాటిలో ఇన్సులిన్‌ హార్మోన్‌కు సంబంధించి సరైంది? 

ఎ) క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ను స్రవిస్తాయి. 

బి) దీనిలో జింక్‌ అంతర్భాగంగా ఉంటుంది.

సి) దీని లోపం వల్ల ‘డయాబెటిస్‌ మిల్లిటస్‌’ అనే వ్యాధి కలుగుతుంది. 

డి) దీని వల్ల ప్రొటీన్‌లు కొవ్వులుగా మారతాయి.  

ఇ) ఇది గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌గా మారుస్తుంది. 

1) ఎ, బి, సి, ఇ      2) బి, సి, డి, ఇ  

3) సి, డి, ఇ     4) బి, సి


5. హైపోథలామస్‌ ఏ హార్మోన్‌లను స్రవించదు?

ఎ) థైరో ట్రోపిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ 

బి) ప్రొలాక్టిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ 

సి) గ్రోత్‌ హార్మోన్, రిలీజింగ్‌ హార్మోన్‌ 

డి) ఇన్సులిన్, గ్లూకాగాన్‌ 

1) ఎ, బి    2) బి, సి    3) సి    4) డి


6. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) హైపోథలామస్‌ న్యూరో హార్మోన్‌లను స్రవించి పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది. 

బి) మెలటోనిన్‌ హార్మోన్‌ జీవ గడియారాన్ని, జీవనలయలను నియంత్రిస్తుంది. 

సి) సొమటోస్టాటిన్‌ను గ్రోత్‌ హార్మోన్, ఇన్‌హిబిటింగ్‌ హార్మోన్‌ అని కూడా అంటారు.

డి) మూత్రపిండాలు ఉత్పత్తి చేసిన ఎరిథ్రోపాయిటిన్‌ ప్రొటీన్‌ ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. 

1) ఎ, బి      2) బి, సి  

3) సి, డి      4) ఎ, బి, సి, డి


7. జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తయ్యే హార్మోన్‌లకు సంబంధించి సరైన జత?     

ఎ) గ్యాస్ట్రిన్‌ 1) ఆకలిని తగ్గిస్తుంది
బి) పాంక్రియోజైమిన్‌ 2) ఆకలిని పెంచుతుంది
సి) విల్లికైనిన్‌ 3) జఠరరస ఉత్పత్తిని పెంచుతుంది
డి) గ్రెలిన్‌ 4) క్లోమరస ఉత్పత్తిని పెంచుతుంది
ఇ) లెప్టిన్‌ 5) చూషకాల కదలికను పెంచుతుంది

1) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2    

2) ఎ-3, బి-4, సి-5, డి-2, ఇ-1  

3) ఎ-5, బి-1, సి-3, డి-2, ఇ-4   

4) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5


8.    అడ్రినల్‌ గ్రంథులకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 

ఎ) ఇవి మూత్రపిండాలపైన ఉంటాయి.

బి) వీటిని అత్యవసర గ్రంథులు, ఒత్తిడిని నియంత్రించే గ్రంథులు అంటారు.

సి) వీటి హార్మోన్లు గాయాలు మానడానికి, పొడవు పెరగడానికి ఉపయోగపడతాయి.

డి) ఇవి గ్లూకో కార్టికాయిడ్స్‌ను, మినరల్‌ కార్డికాయిడ్స్‌ను స్రవిస్తాయి. 

1) ఎ మాత్రమే     2) సి మాత్రమే 

3) బి, సి     4) సి, డి


9. కిందివాటిలో కార్టిసాల్‌ హార్మోన్‌కు సంబంధించి సరైంది? 

ఎ) కార్టిసాల్‌ను ఒత్తిడిని నియంత్రించే హార్మోన్‌ అంటారు.

బి) ఈ హార్మోన్‌ ఎక్కువైతే ‘కుషింగ్‌ సిండ్రోమ్‌’ అనే వ్యాధి కలుగుతుంది. 

సి) ఇది కార్బోహైడ్రేట్‌ జీవక్రియను నియంత్రిస్తుంది. 

డి) అడ్రినల్‌ గ్రంథికి చెందిన వల్కలం కార్టిసాల్‌ను స్రవిస్తుంది. 

1) ఎ, బి, సి, బి   2) బి, సి, డి  

3) ఎ, సి, డి     4) సి, డి


10. కిందివాటిలో అడ్రినలిన్‌ హార్మోన్‌కు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి.

ఎ) దీన్ని అడ్రినల్‌ గ్రంథి వల్కలం స్రవిస్తుంది. 

బి) అడ్రినలిన్‌ను ఎపినెఫ్రైన్‌ అని కూడా అంటారు.

సి) అడ్రినలిన్‌ ఆకలి, దప్పిక, నిద్రను నియంత్రిస్తుంది. 

డి) ఈ హార్మోన్‌ను యాంటీ డయాబెటిక్‌ హార్మోన్‌ అని కూడా అంటారు.

1) ఎ, బి   2) సి, డి   3) ఎ, సి   4) బి, సి


11.    ఇన్సులిన్‌ హార్మోన్‌ లోపం వల్ల కలిగే డయాబెటిస్‌ మిల్లిటస్‌ వ్యాధిలో ఏ లక్షణాలు కనిపిస్తాయి? 

ఎ) రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పెరుగుతాయి. 

బి) మూత్రం ఎక్కువగా ఉత్పత్తవుతుంది. 

సి) మూత్రం ద్వారా గ్లూకోజ్‌ బయటకు వెళుతుంది. 

డి) మూత్రంలో కీటోన్‌ దేహాలు ఏర్పడతాయి. 

ఇ) దాహం ఎక్కువగా అవుతుంది. 

1) ఎ, బి, సి, ఇ      2) ఎ, సి, డి  

3) ఎ, బి, సి, డి, ఇ      4) సి, డి, ఇ


12. హార్మోన్‌ల ప్రభావం, పనితీరుకు సంబంధించి సరైన జతను గుర్తించండి.

ఎ) టెస్టోస్టిరాన్‌ 1) స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు
బి) ఈస్ట్రోజెన్‌ 2) పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది
సి) ప్రొజెస్టిరాన్‌ 3) గ్లైకోజన్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది 
డి) ఇన్సులిన్‌ 4) గ్లూకోజ్‌ను గ్లైకోజెన్‌గా మారుస్తుంది
ఇ) గ్లూకాగాన్‌ 5) పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు

1) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5  

2) ఎ-5, బి-4, సి-1, డి-2, ఇ-3 

3) ఎ-5, బి-1, సి-2, డి-4, ఇ-3  

4) ఎ-1, బి-4, సి-3, డి-5, ఇ-2


13. అడ్రినల్‌ గ్రంథుల నుంచి వెలువడే అడ్రినలిన్‌ హార్మోన్‌కు సంబంధించి సరైన వాక్యాలు? 

ఎ) దీన్ని ఎపినెఫ్రైన్‌ అని కూడా పిలుస్తారు.

బి) దీన్ని పోరాడటానికి, పలాయనం చిత్తగించడానికి తోడ్పడే హార్మోన్‌ అంటారు.

సి) ఈ హార్మోన్‌ లోపం వల్ల ‘అడ్రినలిజమ్‌’ అనే వ్యాధి కలుగుతుంది. 

డి) ఇది ఎక్కువైతే కుషింగ్‌ సిండ్రోమ్‌ ఏర్పడుతుంది. 

1) ఎ, బి  2) బి, సి  3) ఎ, డి  4) సి, డి


14. క్లోమంలోని అంతఃస్రావ భాగంలో ఉండే కణాలు, అవి స్రవించే హార్మోన్‌లకు సంబంధించి సరైన జత.    

ఎ) బీటా కణాలు 1) గ్రెలిన్‌ హార్మోన్‌
బి) ఆల్ఫా కణాలు 2) పాంక్రియాటిక్‌ పాలిపెప్టయిడ్‌
సి) డెల్టా కణాలు 3) ఇన్సులిన్‌
డి) ఎప్సిలాన్‌ కణాలు 4) గ్లూకాగాన్‌
ఇ) పి-పి కణాలు 5) సొమాటోస్టాటిన్‌

1) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5  

2) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2 

3) ఎ-4, బి-3, సి-2, డి-5, ఇ-1 

4) ఎ-5, బి-2, సి-3, డి-1, ఇ-4


15. మెలటోనిన్‌ హార్మోన్‌ గురించి కింది వాక్యాల్లో సరైనవి? 

ఎ) ఈ హార్మోన్‌ను పీనియల్‌ గ్రంథి స్రవిస్తుంది. 

బి) ఇది మెదడులోని జీవ గడియారాన్ని నియంత్రిస్తుంది. 

సి) దీన్ని ‘హార్మోన్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అంటారు.

డి) ఇది జీవన లయలను నియంత్రిస్తుంది. 

1) ఎ, బి     2) ఎ, బి, సి 3) సి, డి     4) ఎ, బి, సి, డి


16. కిందివాటిలో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) కార్టిసాల్‌ హార్మోన్‌ను ఒత్తిడి నియంత్రించే హార్మోన్‌ అంటారు.

బి) ఇన్సులిన్‌ను ‘అత్యవసర హార్మోన్‌’ అంటారు.

సి) కార్టిసాల్‌ హార్మోన్‌ ఎక్కువైతే కుషింగ్‌ సిండ్రోమ్‌ కలుగుతుంది. 

డి) అడ్రినలిన్‌ను యాంటీ డయాబెటిక్‌ హార్మోన్‌ అంటారు.

1) ఎ, బి   2) బి, డి   3) సి, డి  4) ఎ, డి


17. బీజకోశాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి, సరైన సమాధానాన్ని గుర్తించండి.

ఎ) పురుష బీజకోశాలు ముష్కాలు, స్త్రీ బీజకోశాలు అండాశయాలు.

బి) స్త్రీ, పురుషుల్లో బీజకోశాలు వేర్వేరుగా ఉంటాయి.

1) ఎ, బి లు సరైనవి. ఇవి ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి.  

2) ఎ సరైంది, బి సరైంది కాదు. ఇవి రెండూ వేర్వేరు వాక్యాలు.

3) ఎ, బి లు రెండూ సరైనవి కావు. ఇవి రెండూ వేర్వేరు వాక్యాలు. 

4) ఎ సరైంది కాదు, బి సరైంది. ఇవి రెండూ ఒకే అంశానికి సంబంధించినవి.


18. కిందివాటిలో సరైన వాక్యాలను గమనించండి.    

ఎ) సొమాటోస్టాటిన్‌ హార్మోన్‌ను ‘గ్రోత్‌ హార్మోన్‌’, ‘పనిని నిరోధించే హార్మోన్‌’ అంటారు.

బి) మూత్రపిండాలు విడుదల చేసే రెనిన్‌ ద్రవాభిసరణ క్రమతను నియంత్రిస్తుంది. 

సి) గుండె నుంచి విడుదలయ్యే ఏట్రియల్‌ నేట్రియూరిటిక్‌ పెప్టైడ్‌ రక్త పరిమాణం, రక్తపోటును నియంత్రిస్తుంది. 

1) ఎ, బి, సి         2) బి, సి 

3) ఎ, సి         4) బి మాత్రమే



 

సమాధానాలు

1-3; 2-2; 3-3; 4-1; 5-4; 6-4; 7-2; 8-2; 9-1; 10-2; 11-3; 12-3; 13-1; 14-2; 15-4; 16-2; 17-1; 18-1.


రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 
 

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌