• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్షంలో అదో పిచ్చి గ్రహం! 

నక్షత్రాలు - గ్రహాలు


అనంత విశ్వంలో అసంఖ్యాక ఖగోళ వస్తువులు ఉన్నాయి, నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్‌ వంటివన్నీ అందులో భాగమే. స్వయం ప్రకాశకాలైన నక్షత్రాలు, వాటి చుట్టూ నిర్ణీత కక్ష్యల్లో పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలన్నీ విశ్వంలోనే విస్తరించి ఉంటాయి. భౌతికశాస్త్ర ప్రాథమిక సూత్రాలపై సరైన అవగాహన పెంపొందించుకోవాలంటే ఆ ఆకాశమండలం గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంతరిక్ష స్థూల స్వరూపాన్ని అర్థం చేసుకుంటే  సౌరకుటుంబ అమరిక, అందులోని నక్షత్రాలు, గ్రహాలకు ఉన్న ప్రత్యేకతలు, గ్రహణాలు తదితరాలపై పట్టుపెరుగుతుంది. 



1.    ఆకాశంలో ఒక ప్రదేశంలో కనిపించే సూర్యచంద్రులిద్దరూ తిరిగి అదే ప్రదేశాన్ని చేరడానికి పట్టే సమయంలో వ్యత్యాసం (నిమిషాల్లో)?

1) 40    2) 50    3) 60    4) 30


2.     చంద్రుడి అంచుల భాగంలో ఉండే పలుచని నీడ వల్ల ఏర్పడే సూర్యగ్రహణం? 

1) సంపూర్ణ సూర్యగ్రహణం  2) వలయాకార సూర్యగ్రహణం 

3) పాక్షిక సూర్యగ్రహణం   4) మిశ్రమ సూర్యగ్రహణం 


3.     ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చూడగలిగే నక్షత్ర మండలాలు- 

1) సప్తర్షి మండలం     2) షర్మిష్ట రాశి 

3) ఒరియన్‌     4) పైవన్నీ 


4. సప్తర్షి మండలంలోని నక్షత్ర మండలాల సంఖ్య? 

1) 7     2) 8     3) 6     4) 4 


5.     షర్మిష్ట రాశి ఆకాశంలో ఏ ఆకారంలో కనిపిస్తుంది? 

1) M    2) W     3) S    4) Z 


6.     షర్మిష్ట రాశిలో ఉన్న నక్షత్రాల సంఖ్యను గుర్తించండి.

1) 9     2) 6     3) 4     4) 7 


7.     సాధారణంగా గ్రహాలు, ఏ వైపు నుంచి ఏ వైపునకు తిరుగుతాయి?

1) తూర్పు నుంచి పడమర         2) పడమర నుంచి తూర్పు

3) ఉత్తరం నుంచి దక్షిణం      4) దక్షిణం నుంచి ఉత్తరం


8.     ధ్రువ నక్షత్రం స్థానం మారకుండా, స్థిరంగా ఉండటానికి కారణమేంటి? 

1) అది నక్షత్ర మండలంలో ఉంటుంది    2) అదొక పెద్ద నక్షత్రం 

3) భూమి భ్రమణాక్షంపై ఉంటుంది     4) భూమి భ్రమణాక్షానికి దూరంగా ఉంటుంది


9.     భూమి మీద ఒక మీటరు పొడవున్న కర్రను నాటినప్పుడు అది ఏర్పరిచే అతి తక్కువ పొడవున్న నీడ ఏ దిశలను సూచిస్తుంది?

1) ఉత్తరం     2) దక్షిణం 

3) తూర్పు, పడమర     4) ఉత్తరం, దక్షిణం 


10. మన పూర్వీకులు సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించిన గడియారం?

1) పరమాణు గడియారం     2) క్వార్ట్జ్‌ గడియారం

3) నీడ గడియారం     4) సీజియం గడియారం 


11. కిందివాటిలో సౌరకుటుంబానికి చెందనిది? 

1) గ్రహాలు     2) ఉల్కలు 

3) తోకచుక్కలు     4) గెలాక్సీ 


12. సౌరకుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం?

1) శుక్రుడు  2) బుధుడు 3) భూమి 4) కుజుడు


13. సౌరకుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి.

1) భూమి, శుక్రుడు     2) బుధుడు, కుజుడు

3) బుధుడు, శుక్రుడు     4) శుక్రుడు, యురేనస్‌


14. సౌరకుటుంబంలో అత్యంత ప్రకాశమంత గ్రహాన్ని గుర్తించండి. 

1) శుక్రుడు  2) కుజుడు 3) శని 4) బృహస్పతి 


15. ‘మార్నింగ్‌ స్టార్, ఈవినింగ్‌ స్టార్‌’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? 

1) శని  2) కుజుడు  3) శుక్రుడు  4) యురేనస్‌ 


16. శుక్రుడుపై సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? 

1) తూర్పు  2) పడమర  3) ఉత్తరం 4) దక్షిణం 


17. సౌరకుటుంబంలో అత్యంత వేడి గ్రహం? 

1) బృహస్పతి    2) బుధుడు 

3) కుజుడు     4) శుక్రుడు 


18. నీలిగ్రహంగా దేన్ని పిలుస్తారు? 

1) శని  2) నెప్ట్యూన్‌  3) భూమి  4) యురేనస్‌ 


19. భూమి తర్వాత జీవరాశి ఉండటానికి అనుకూలమైన గ్రహం? 

1) కుజుడు     2) యురేనస్‌ 

3) నెప్ట్యూన్‌     4) బృహస్పతి 


20. ‘అరుణ గ్రహం’ (రెడ్‌ ప్లానెట్‌)గా పిలిచే గ్రహం? 

1) బృహస్పతి      2) శని  

3) శుక్రుడు     4) కుజుడు


21. రెండు ఉపగ్రహాలున్న గ్రహాన్ని గుర్తించండి.

1) మార్స్‌     2) వీనస్‌ 

3) జూపిటర్‌     4) యురేనస్‌ 


22. ఒకే ఒక ఉపగ్రహం ఉన్న గ్రహం ఏది? 

1) బుధుడు 2) భూమి 3) శని 4) అంగారకుడు 


23. తూర్పు నుంచి పడమర వైపు తిరిగే గ్రహాలను ఎన్నుకోండి.

1) కుజుడు, బృహస్పతి     2) శని, యురేనస్‌ 

3) శుక్రుడు, యురేనస్‌     4) శుక్రుడు, కుజుడు 


24. కిందివాటిలో ఏ రెండు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్స్‌ ఉన్నాయి?

1) కుజుడు, బృహస్పతి     2) బృహస్పతి, శని 

3) శని, యురేనస్‌     4) భూమి, అంగారకుడు 


25. సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?  

1) భూమి     2) బృహస్పతి 

3) శని     4) అంగారకుడు


26. సౌరకుటుంబంలో తన చుట్టూ తాను అత్యంత వేగంగా తిరిగే గ్రహం? 

1) బుధుడు 2) శుక్రుడు 3) శని 4) బృహస్పతి


27. తన చుట్టూ అందమైన రంగుల వలయాలున్న గ్రహం? 

1) బృహస్పతి 2) యురేనస్‌ 3) శని 4) శుక్రుడు 


28. పసుపు రంగులో కనిపించే గ్రహాన్ని గుర్తించండి.

1) శని 2) శుక్రుడు 3) బృహస్పతి 4) కుజుడు


29. నీటిలో వేస్తే తేలియాడే గ్రహం- 

1) బుధుడు  2) శుక్రుడు  3) శని  4) కుజుడు


30. అక్షం ఎక్కువగా వంగి ఉండే ప్రత్యేకత ఉన్న గ్రహం?    

1) శుక్రుడు 2) యురేనస్‌ 3) బృహస్పతి 4) శని 


31. తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు దొర్లుతున్నట్లు కనిపించే గ్రహం?     

1) నెప్ట్యూన్‌     2) శని 

3) బృహస్పతి     4) యురేనస్‌ 


32. కిందివాటిలో అంతర గ్రహం కానిది గుర్తించండి. 

1) శుక్రుడు     2) బుధుడు 

3) కుజుడు     4) బృహస్పతి 


33. కిందివాటిలో బాహ్యగ్రహం కానిది- 

1) భూమి  2) యురేనస్‌  3) శని  4) నెప్ట్యూన్‌ 


34. మానవుడు చంద్రుడిపై మొదటిసారిగా కాలు మోపిన సంవత్సరం?

1) 1979  2) 1959  3) 1969  4) 1869 


35. సౌరకుటుంబంలో చివరి గ్రహాన్ని గుర్తించండి? 

1) బృహస్పతి     2) ప్లూటో 

3) యురేనస్‌     4) నెప్ట్యూన్‌ 


36. కిందివాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం? 

1) బృహస్పతి 2) నెప్ట్యూన్‌ 3) శని 4) యురేనస్‌ 


37. కిందివాటిలో ‘షూటింగ్‌ స్టార్‌’గా పిలిచే అంతరిక్ష వస్తువు? 

1) ఆస్టరాయిడ్స్‌     2) ఉల్కలు 

3) తోకచుక్కలు     4) కృత్రిమ ఉపగ్రహాలు 


38. హేలీ అనే తోక చుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? 

1) 56     2) 65     3) 76    4) 67 


39. ‘హేలీ’ తోకచుక్క గతంలో 1986లో కనిపించింది. అది తిరిగి ఎప్పుడు కనిపిస్తుంది? 

1) 2022   2) 2062  3) 2052  4) 2061 


40. చంద్రయాన్‌-1 ముఖ్య ఉద్దేశాలు? 

1) చంద్రుడిపై నీటిజాడ గుర్తించడం    2) చంద్రుడి అట్లాస్‌ తయారు చేయడం 

3) హీలియం-3ను గుర్తించడం         4) పైవన్నీ 


41. భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం? 

1) భాస్కర-1     2) ఆర్యభట్ట 

3) ఆపిల్‌     4) కల్పన-1 


42. షూమేకర్‌-లెవీ9 అనే తోక చుక్క సౌరకుటుంబంలో ఏ గ్రహాన్ని ఢీ కొట్టింది?

1) శని     2) యురేనస్‌ 

3) భూమి     4) బృహస్పతి 


43. సైన్స్‌ పరిభాషలో ‘చుక్క తెగిపడింది’ అని దేన్ని పిలుస్తారు? 

1) తోకచుక్కలు     2) ఉల్కలు 

3) ఆస్టరాయిడ్స్‌     4) గెలాక్సీ 


44. సౌరకుటుంబంలో అతిచిన్న గ్రహం? 

1) భూమి  2) శుక్రుడు  3) బుధుడు  4) శని 


45. ధ్రువనక్షత్రాన్ని ఏ నక్షత్ర మండలంలో గుర్తించవచ్చు? 

1) ఒరియన్‌     2) లియో 

3) ఆర్సిమేజర్‌     4) షర్మిష్ట రాశి 


46. పరిభ్రమణ కాలం కంటే ఆత్మభ్రమణ కాలం అధికంగా ఉన్న గ్రహం? 

1) శుక్రుడు     2) బృహస్పతి 

3) యురేనస్‌     4) నెప్ట్యూన్‌ 


47. కిందివాటిలో గ్రహ హోదాను కోల్పోయింది?

1) యురేనస్‌  2) నెప్ట్యూన్‌  3) ప్లూటో  4) శని 


48. కిందివాటిలో అత్యధిక పరిభ్రమణ కాలం కలిగినవి? 

1) గ్రహాలు     2) ఆస్టరాయిడ్స్‌ 

3) ఉల్కలు     4) తోక చుక్కలు 


49. తోక చుక్కలు సూర్యుడి చుట్టూ ఏవిధంగా తిరుగుతాయి? 

1) గోళాకారం     2) వృత్తాకారం 

3) అతిదీర్ఘ వృత్తాకారం     4) దీర్ఘ వృత్తాకారం


50. ఆకాశంలో నాగలి/ గాలిపటం ఆకారంలో కనిపించే నక్షత్ర మండలం?

1) షర్మిష్ట రాశి       2) ఒరియన్‌  

3) లియో     4) గ్రేట్‌బేర్‌ 


51. భూమికి ఇరువైపులా సూర్యచంద్రులు ఉన్నప్పుడు ఏర్పడే అంశం?

1) సూర్యగ్రహణం       2) చంద్రగ్రహణం

3) రుతువులు       4) ఆటుపోట్లు


52. నీడ గడియారం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రాంతం?

1) ఆగ్రా       2) ముంబయి   

3) జంతర్‌మంతర్‌      4) కోల్‌కతా


53. ధ్రువ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలు ఒక్కసారిగా తిరిగి రావడానికి పట్టే సమయం?

1) 30 గంటలు       2) 20 గంటలు  

3) 15 గంటలు       4) 24 గంటలు


54. కిందివాటిలో ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం?

1) శుక్రుడు     2) మార్స్‌   

3) యురేనస్‌       4) శని


55. పిచ్చి గ్రహంగా భావిస్తున్న అంతరిక్ష వస్తువు?

1) యురేనస్‌       2) శని  

3) ప్లూటో       4) అంగారకుడు


56. బుధుడి పరిభ్రమణ కాలాన్ని గుర్తించండి.

1) 59 రోజులు       2) 88 రోజులు

3) 24 రోజులు       4) 38 రోజులు


57. చంద్రుడి వ్యాసంను గుర్తించండి.

1) 3474 కి.మీ.        2) 12,756 కి.మీ.

3) 1,39,200 కి.మీ.       4) 8683 కి.మీ.


58. సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు?

1) నైట్రోజన్‌      2) ఆక్సిజన్‌   

3) హైడ్రోజన్‌       4) హీలియం



సమాధానాలు

1-2; 2-3; 3-4; 4-1; 5-1; 6-2; 7-2; 8-3; 9-4; 10-3; 11-4; 12-2; 13-3; 14-1; 15-3; 16-2; 17-4; 18-3; 19-1;  20-4; 21-1; 22-2; 23-3; 24-1; 25-2; 26-4; 27-3; 28-1; 29-3; 30-2; 31-4; 32-4; 33-1; 34-3; 35-4; 36-2; 37-2; 38-3; 39-2; 40-4; 41-2; 42-4; 43-2; 44-3; 45-4; 46-1; 47-3; 48-4; 49-3; 50-4; 51-2; 52-3; 53-4; 54-4; 55-3; 56-2; 57-1; 58-3. 

Posted Date : 28-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌