• facebook
  • whatsapp
  • telegram

జీవనాధార సేద్యం జుమ్మింగ్‌!

వ్యవసాయం

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం. అందులో సగం మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపైనే జీవిస్తున్నారు. శ్రామిక శక్తిలో ఎక్కువమందికి సాగు రంగమే ఉపాధి వనరు. అనాదిగా దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్న వ్యవసాయ రంగం స్వరూప స్వభావాలు, క్రమానుగత మార్పులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ప్రాంతాలవారీగా ప్రధాన పంటలు, వాటికి అనువైన వాతావరణ పరిస్థితులు, కమతాల విస్తరణ, కమతాల యాజమాన్యం ఆధారంగా రైతుల వర్గీకరణ వంటివన్నీ ముఖ్యాంశాలే. దేశంలో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల తీరుతెన్నులు, వ్యవస్థాపక నీటిపారుదల సౌకర్యాలు, రాష్ట్రాల వారీగా ప్రధాన ప్రాజెక్టులు, ప్రధాన పంటల పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ విప్లవాలు, తాజా గణాంకాలపై పరిజ్ఞానం ఉండాలి.


1.    సాధారణ జీవనాధార వ్యవసాయాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారు?

1) కుమారి  2) జుమ్మింగ్‌  3) బ్రింగ్‌  4) ఖిల్లా


2.     వరి పంటకు సగటు ఉష్ణోగ్రతలు ఎంత ఉండాలి?

1) 20 °C  2) 22 °C  3) 25 °C  4) 21 °C


3.     ప్రపంచంలో వరి పండిస్తున్న దేశాల్లో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది?

1) 1వ     2) 2వ     3) 3వ    4) 4వ


4.     ఉత్తర, వాయవ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట?    

1) వరి      2) జొన్న 

3) గోధుమ     4) మొక్కజొన్న


5.     పప్పుల ధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ఏ స్థానంలో ఉంది?    

1) 1వ     2) 2వ     3) 3వ    4) 4వ


6.     భారతదేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) గుజరాత్‌     2) రాజస్థాన్‌ 

3) మధ్యప్రదేశ్‌     4) కర్ణాటక 


7.     చెరకు పంటకు కావాల్సిన సగటు వర్షపాతం ఎంత?

1) 50 సెం.మీ.  70 సెం.మీ.

2) 75 సెం.మీ.  100 సెం.మీ.

3) 100 సెం.మీ.  150 సెం.మీ.

4) 200 సెం.మీ. పైన


8.     ప్రపంచంలో చెరకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?

1) చైనా      2) ఇండియా  

3) బ్రెజిల్‌      4) ఇటలీ 


9.     భారతదేశంలో చెరకు పండించే రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌     2) తెలంగాణ 

3) ఉత్తర్‌ప్రదేశ్‌     4) బిహార్‌


10. ప్రపంచంలో నూనెగింజల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?

1) చైనా      2) ఇండియా  

3) బ్రెజిల్‌      4) జపాన్‌


11.     ప్రపంచంలో మొదటిసారిగా పత్తి సాగు చేసిన దేశం?

1) భారతదేశం      2) చైనా 

3) బ్రెజిల్‌     4) జపాన్‌


12. పత్తి పంటకు కనీసం ఎన్ని రోజులు మంచురహితంగా ఉండే వాతావరణం అనుకూలం?    

1) 250   2) 210    3) 195   4) 150 


13. పత్తిని ప్రధానంగా పండించే రాష్ట్రం?

1) మహారాష్ట్ర     2) తెలంగాణ  

3) ఆంధ్రప్రదేశ్‌     4) తమిళనాడు 


14. పత్తి పంటకు అత్యంత అనుకూలమైన నేలలు ఏవి?

1) ఎర్రనేలలు     2) ఒండ్రు నేలలు  

3) నల్లరేగడి నేలలు     4) ఇసుక నేలలు


15. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ షుగర్‌కేన్‌ రిసెర్చ్‌ ఏ ప్రాంతంలో ఉంది?

1) బెంగళూరు     2) లఖ్‌నవూ  

3) నాగ్‌పుర్‌     4) ముంబయి


16. కిందివాటిలో బంగారు పీచు అంటే?

1) పత్తి     2) జనుము 

3) జొన్న     4) మొక్కజొన్న


17. 2014-15 నాటికి భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 253   2) 200   3) 175    4) 242


18. 1950-51లో భారతదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 82        2) 51    3) 754) 108


19. భారతదేశంలో మొత్తం సాగు భూమిలో దాదాపుగా ఎంత శాతానికి నీటిపారుదల వసతి ఉంది?

1) 40%  2) 70%  3) 30%  4) 80%


20. కిందివాటిలో పత్తి పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం?

1) లఖ్‌నవూ     2) హైదరాబాద్‌ 

3) నాగ్‌పుర్‌     4) ముంబయి


21. కిందివాటిలో నలుపు విప్లవం దేనికి సంబంధించింది?

1) ముడిచమురు     2) నూనెగింజలు 

3) పత్తి     4) బంగాళాదుంపలు 


22. ప్రపంచ వరి పరిశోధన కేంద్రం ఏ దేశంలో ఉంది?

1) జపాన్‌ (ఒసాకా)   2) ఫిలిప్పీన్స్‌ (మనీలా) 

3) చైనా (బీజింగ్‌)        4) ఇండొనేసియా (జకార్తా)


23. సాధారణంగా మధ్యతరహా రైతులు ఎంత భూమిని సాగు చేస్తారు?

1) 10 ఎకరాల లోపు     2) 25 ఎకరాలపైన  

3) 25 ఎకరాల లోపు     4) 30 ఎకరాల లోపు 


24. చిన్నకారు రైతులు దాదాపుగా ఎంత భూమిని సాగు చేస్తారు?

1) 5 ఎకరాలు      2) 10 ఎకరాలు  

3) 15 ఎకరాలు      4) 20 ఎకరాలు 


25. గాంధీసాగర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర     2) మధ్యప్రదేశ్‌ 

3) కర్ణాటక     4) ఉత్తర్‌ప్రదేశ్‌


26. దామోదర లోయ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించింది?

1) బిహార్‌     2) మధ్యప్రదేశ్‌  

3) పశ్చిమ బెంగాల్‌     4) మహారాష్ట్ర


27. మొక్కజొన్న ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక      2) మహారాష్ట్ర  

3) కేరళ     4) బిహార్‌ 


28. కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?

1) ఇండియా      2) చైనా 

3) బ్రెజిల్‌     4) వియత్నాం


29. శీతాకాలపు పంటను ఆంధ్రప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?

1) దాల్వ       2) పుంజ  

3) బోరో      4) నవరాయ్‌


30. కిందివాటిలో ఎరుపు విప్లవం దేనికి సంబంధించింది?

1) జనుము      2) పత్తి  

3) టమాట, మాంసం     4) పెట్రోలియం


31. 2010-11లో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్‌ టన్నులు?

1) 232   2) 242   3) 252   4) 200 


32. కింది ఏ రంగంలో 70 శాతం మహిళా కార్మికులు నిమగ్నమై ఉన్నారు?

1) వ్యవసాయ రంగం     2) పారిశ్రామిక రంగం 

3) సేవా రంగం     4) ఏదీకాదు 


33. 2011లో దాదాపుగా వ్యవసాయదారులు ఎంత శాతం ఉన్నారు?

1) 60 శాతం     2) 40 శాతం 

3) 55 శాతం     4) 45 శాతం


34. 2011లో దాదాపుగా వ్యవసాయ కూలీలు ఎంత శాతం ఉన్నారు?

1) 45    2) 55    3) 60    4) 62 


35. 1951లో దాదాపుగా ఎన్ని మిలియన్ల జనాభా వ్యవసాయ రంగంలో ఉపాధి పొందారు?

1) 199 మిలియన్లు     2) 97 మిలియన్లు 

3) 150 మిలియన్లు     4) 50 మిలియన్లు 


36. 2001 నాటికి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్న జనాభా ఎన్ని మిలియన్లు?

1) 200 మిలియన్లు     2) 234 మిలియన్లు  

3) 243 మిలియన్లు     4) 195 మిలియన్లు


37. కిందివాటిలో హరిత విప్లవం అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినవారు?

1) ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌        2) విలియం.ఎస్‌.గాండ్‌ 

3) లెస్టర్‌.ఆర్‌.బ్రౌన్‌     4) నార్మన్‌ బోర్లాగ్‌


38. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు?

1) ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌    2) నార్మన్‌ బోర్లాగ్‌    

3) విలియం.ఎస్‌.గాడ్‌   4) లెస్టర్‌.ఆర్‌.బ్రౌన్‌        


39. భారత హరిత విప్లవ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు?

1) వర్గీస్‌ కురియన్‌       2) ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌ 

3) నార్మన్‌ బోర్లాగ్‌      4) విలియం.ఎస్‌.గాడ్‌


40. ఉద్యాన పంటల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం?

1) మొదటి     2) రెండో 

3) మూడో     4) నాలుగో


41. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో దాదాపుగా ఎంత శాతం పండిస్తున్నారు?    

1) 10 శాతం     2) 13 శాతం  

3) 20 శాతం      4) 9 శాతం


42. రబ్బరు పంటకు దాదాపుగా ఎంత వర్షపాతం ఉండాలి?

1) 100 సెం.మీ.  150 సెం.మీ.    2) 70 సెం.మీ.  100 సెం.మీ.

3) 200 సెం.మీ. పైన   4) 70 సెం.మీ. కంటే తక్కువ 


43. రబ్బరు ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?

1) మహారాష్ట్ర     2) కర్ణాటక 

3) కేరళ     4) సిక్కిం


44. కింది ఏ ప్రాంతంలో కాఫీ బోర్డు ఉంది?

1) చెన్నై     2) బెంగళూరు 

3) కోల్‌కతా      4) గువాహటి


45. కిందివాటిలో దేన్ని ‘పీచుల్లో రారాజు’ అంటారు?

1) జనుము      2) పత్తి 

3) మొక్కజొన్న      4) జొన్న


46. విస్తాపన వ్యవసాయానికి ఝార్ఖండ్‌లో ఉన్న పేరు?

1) కురువ  2) పెండ 3) దహియ 4) కుమారి


47. పోడు వ్యవసాయానికి ఇండొనేసియాలో ఉన్న పేరు?

1) మసోలా  2) రే   3) లడాంగ్‌   4) రోకా


48. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర 2) గుజరాత్‌ 3) కేరళ 4) మధ్యప్రదేశ్‌


49. అగ్రికల్చర్‌ అనే పదం ఏ భాష పదాల నుంచి ఉద్భవించింది?

1) లాటిన్‌      2) గ్రీకు  

3) ఫ్రెంచ్‌      4) అరబిక్‌


50. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని అంటారు?

1) పిసికల్చర్‌         2) సెరికల్చర్‌  

3) విటికల్చర్‌         4) హార్టికల్చర్‌ 


సమాధానాలు

1-2; 2-3; 3-2; 4-3; 5-1; 6-3; 7-2; 8-3; 9-3; 10-2; 11-1; 12-2; 13-1; 14-3; 15-2; 16-2; 17-1; 18-2; 19-1; 20-3; 21-1; 22-2; 23-3; 24-1; 25-2; 26-3; 27-1; 28-3; 29-1; 30-3; 31-2; 32-1; 33-3; 34-1; 35-2; 36-2; 37-3; 38-4; 39-2; 40-1; 41-2; 42-3; 43-3; 44-2; 45-2; 46-1; 47-3; 48-2; 49-1; 50-2.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌