• facebook
  • whatsapp
  • telegram

యూరోపియన్‌ల రాక

మొదట వచ్చారు.. చివర వెళ్లారు!


వ్యాపారం కోసం భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టి మరీ వచ్చిన ఐరోపావాసులు ఇక్కడి రాజుల అనుమతితో వర్తక స్థావరాలను నెలకొల్పారు. వ్యాపార ఆధిపత్యం కోసం మొదట్లో వారిలో వారే యుద్ధాలకు దిగారు. సుశిక్షిత సైన్యం, వ్యూహ    రచనలో మేటిగా ఉన్న బ్రిటిష్‌ సైన్యం అందులో విజయం సాధించింది. ఆ తర్వాత ఆంగ్లేయులు స్వదేశీ పాలకులను ఓడించి మొత్తం దేశాన్ని వలసరాజ్యంగా చేసుకున్నారు. ఈ పరిణామక్రమంలో జరిగిన యుద్ధాలు, మలుపు తిప్పిన సంఘటనలు, ఒప్పందాలు, వాటిలో భాగస్వాములైన ఐరోపా   అధికారులు, స్థానిక పాలకుల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో దేశ పాలనావిధానాల్లో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి.


1.    పోర్చుగీసు దేశానికి చెందిన వాస్కోడిగామా భారతదేశంలో మొదటిసారిగా చేరిన ప్రదేశం ఏది?

1) గోవా      2) సూరత్‌   

3) కాలికట్   4) పాండిచ్చేరి (నేటి పుదుచ్చేరి)


2.     భారతదేశంలో బలపడిన యూరోపియన్లు ఎవరు?

1) పోర్చుగీసువారు     2) డచ్‌వారు  

3) బ్రిటిష్‌వారు      4) ఫ్రెంచ్‌వారు 


3.     భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి?

1) పోర్చుగీసు - డచ్‌      2) డచ్‌ - బ్రిటిష్‌

3) బ్రిటిష్‌ - ఫ్రెంచ్‌       4) బ్రిటిష్‌ - పోర్చుగీసు


4.     భారతదేశంలో పోర్చుగీసు ప్రధాన వర్తక స్థావరం?

1) గోవా  2) కొచ్చి  3) సూరత్‌  4) మద్రాస్‌


5.     అల్బూకర్క్‌ ఏ రాజు సహాయంతో బీజాపుర్‌  సుల్తాన్‌ను ఓడించాడు?

1) రెండో దేవరాయలు     2) శ్రీకృష్ణదేవరాయలు     

3) జహంగీర్‌           4) షాజహాన్‌


6.     భారతదేశంలో యూరోపియన్ల ప్రధాన వర్తక స్థావరాల్లో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి.

1) బ్రిటిష్‌ - మద్రాస్‌      2) ఫ్రెంచ్‌ - సేరంపుర్‌  

3) పోర్చుగీసు - గోవా      4) డచ్‌ - పులికాట్


7.     ‘నీలి నీటి విధానం’ను ప్రవేశపెట్టిన పోర్చుగీసు గవర్నరు?

1) ఫ్రాన్సిస్‌ - డి - అల్మిడా     2) ఆల్ఫన్సో - డి - అల్బూకర్క్‌      

3) నీనా - డ - కున్హా      4) ఫ్రాంకోయిస్‌ మార్టిన్‌


8.     భారతదేశంలో బ్రిటిష్, ఫ్రెంచ్‌ వారికి మధ్య జరిగిన రెండో కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం?

1) సప్తవర్ష సంగ్రామం        

2) అంబోయానా సంఘటన

3) ఆస్ట్రియా వారసత్వ యుద్ధం  

4) దక్షిణ భారత్‌లో వారసత్వ పోరు


9.     ‘నాంథోమ్‌’ యుద్ధం ఏ పోరులో భాగంగా జరిగింది?

1) మొదటి కర్ణాటక యుద్ధం       2) రెండో కర్ణాటక యుద్ధం

3) మూడో కర్ణాటక యుద్ధం  4) నాలుగో మైసూర్‌ యుద్ధం


10. వాస్కోడిగామా భారత్‌కు చేరిన సంవత్సరం?

1) 1498   2) 1502   3) 1600   4) 1664


11.     భారతదేశంలో పోర్చుగీసు వారి పతనానికి కారణం?

1) మతమార్పిడిలను ప్రోత్సహించడం

2) పోర్చుగీసు స్పెయిన్‌ దేశంలో విలీనం కావడం

3) ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్‌ వర్తక సంఘాల విజృంభన   4) పైవన్నీ


12. ‘ప్లాసీ’ యుద్ధ కాలంలో బెంగాల్‌ నవాబు ఎవరు?

1) అలీవర్ధీ ఖాన్‌      2) సర్ప్‌రాజ్‌ ఖాన్‌  

3) ఘజాఉద్దీన్‌    4) సిరాజ్‌-ఉద్‌-దౌలా


13. ‘యుద్ధం, వ్యాపారం ఒకేచోట సహజీవనం చేయలేవు’ అని చెప్పిన బ్రిటిష్‌ రాయబారి?

1) విలియం హాకిన్స్‌      2) సర్‌ థామస్‌ రో  

3) రాబర్ట్‌ క్లైవ్‌      4) కారన్‌ వాలీస్‌


14. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది?

1) 1757, జూన్‌ 23      2) 1756, జూన్‌ 4 

3) 1758, అక్టోబరు 2     4) 1780, జులై 14


15. మీర్‌జాఫర్‌ అనంతరం బెంగాల్‌ నవాబు ఎవరు?

1) సిరాజ్‌-ఉద్‌-దౌలా     2) అలీవర్ధీ ఖాన్‌   

3) మీర్‌ ఖాసీమ్‌      4) సర్ప్‌రాజ్‌ ఖాన్‌


16. ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌-ఉద్‌-దౌలా ఓటమికి కారణం?

1) సిరాజ్‌ అత్యంత బలహీనుడు కావడం

2) ప్రజలు బ్రిటిష్‌ వారికి మద్దతివ్వడం

3) రాబర్ట్‌ క్లైవ్‌ అత్యంత బలవంతుడు కావడం

4) మీర్జాఫర్‌ నమ్మకద్రోహం చేయడం


17. ‘కలకత్తా చీకటి గది సంఘటన’కు ప్రధాన కారకుడు?

1) రాబర్ట్‌ క్లైవ్‌       2) సిరాజ్‌-ఉద్‌-దౌలా  

3) మహ్మద్‌ షా      4) అలీవర్ధీ ఖాన్‌


18. బక్సార్‌ యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1764   2) 1765   3) 1766   4) 1767


19. ‘బక్సార్‌ యుద్ధం’లో పాల్గొన్న రాజు?

1) బెంగాల్‌ మాజీ నవాబు మీర్‌ ఖాసీం      2) మొగల్‌ చక్రవర్తి షా ఆలం

3) అవద్‌ నవాబు ఘజా ఉద్దౌలా      4) పైవారందరూ


20. ఏ యుద్ధానంతరం ‘అలహాబాద్‌ ఒప్పందం’   జరిగింది?

1) ప్లాసీ యుద్ధం      2) బక్సార్‌ యుద్ధం 

3) శాంథోమ్‌ యుద్ధం      4) అడయార్‌ యుద్ధం 


21. డచ్‌వారు భారత్‌లో మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారు?

1) మచిలీపట్నం      2) నర్సాపురం  

3) కాలికట్      4) సూరత్‌ 


22. కిందివాటిలో సరికాని దానిని గుర్తించండి.

1) మొదటి కర్ణాటక యుద్ధ సమయంలో డూప్లే ఫ్రెంచ్‌ గవర్నరు

2) రెండో కర్ణాటక యుద్ధం ఆంగ్లేయులకు అనుకూలించింది

3) మూడో కర్ణాటక యుద్ధం ఫ్రెంచ్‌ వారికి అనుకూలం  

4) కర్ణాటక యుద్ధాల్లో దక్షిణ భారతం కీలకపాత్ర పోషించింది


23. ‘పోర్చుగీసు రాబర్ట్‌ క్లైవ్‌’ అని ఎవరిని పిలుస్తారు?

1) ఫ్రాంకోయిస్‌ మార్టిన్‌      2) ఆల్ఫన్సో-డి-అల్బూకర్క్‌

3) నీనా-డ-కున్హా      4) ఫ్రాన్సిస్‌-డి-అల్మిడా 


24. బెంగాల్‌లో ‘ద్వంద్వ ప్రభుత్వాన్ని’ ప్రవేశపెట్టిన బ్రిటిష్‌ అధికారి?

1) సర్‌ ఐవర్‌ కూట్      2) రాబర్ట్‌ క్లైవ్‌  

3) కారన్‌ వాలీస్‌      4) వారెన్‌ హేస్టింగ్‌ 


25. ‘దివానీ అధికారం’ అంటే ఏమిటి?

1) రెవెన్యూ వసూలు చేయడం      2) న్యాయ అధికారం  

3) పోలీస్‌ అధికారం      4) పైవన్నీ


26. భారత దేశానికి మొదటిగా వచ్చి, చివరగా వెళ్లిన యూరోపియన్లు ఎవరు?

1) పోర్చుగీసువారు      2) ఆంగ్లేయులు  

3) డచ్‌ వారు      4) డేనిష్‌ వారు


27. ‘చిన్సూరా యుద్ధం’ ఎవరెవరి మధ్య జరిగింది?

1) బ్రిటిష్‌ - ఫ్రెంచ్‌        2) బ్రిటిష్‌ - పోర్చుగీసు  

3) బ్రిటిష్‌ - డేనిష్‌      4) బ్రిటిష్‌ - డచ్‌


28. ప్లాసీ యుద్ధం అనంతరం బెంగాల్‌ నవాబు?

1) అలీవర్ధీ ఖాన్‌      2) మీర్‌ ఖాసీమ్‌  

3) మీర్జాఫర్‌      4) ముర్షిద్‌ ఖులీ ఖాన్‌


29. ‘‘ప్లాసీ విజయం నన్ను ఎలాంటి పరిస్థితిలో ఉంచిందో చూడండి! ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు: ఒక సంపన్న నగరం నా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది’’ అని తనను తాను ప్రశంసించుకున్న బ్రిటిష్‌ గవర్నరు?

1) రాబర్ట్‌ క్లైవ్‌      2) కారన్‌ వాలీస్‌  

3) లార్డ్‌ వెల్లస్లీ      4) కెప్టెన్‌ హాకీన్స్‌


30. కింది వాటిలో సరికానిది ఏది?

1) బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీని 1600లో  స్థాపించారు.

2) ఈ కంపెనీ స్థాపించిన సమయంలో మొగల్‌  చక్రవర్తి అక్బర్‌.

3) ఈ కంపెనీ హెక్టార్, గ్లోబ్‌ నౌకల ద్వారా భారత్‌ చేరుకుంది.

4) ఈ కంపెనీ మొదట కేరళ తీరాన్ని చేరింది.


31. ‘మైసూర్‌ పులి’ అని ఎవరిని పిలుస్తారు?

1) హైదర్‌ అలీ      2) టిప్పుసుల్తాన్‌  

3) అలీవర్ధీ ఖాన్‌      4) ముర్షిద్‌ ఖులీ ఖాన్‌


32. యూరోపియన్లు భారత దేశానికి వచ్చిన కాలాన్ని అనుసరించి క్రమంలో పెట్టండి.

1) పోర్చుగీసు - బ్రిటిష్‌ - డచ్‌ - ఫ్రెంచ్‌ - డేనిష్‌ 

2) పోర్చుగీసు - డచ్‌ -  బ్రిటిష్‌ - డేనిష్‌ - ఫ్రెంచ్‌

3) పోర్చుగీసు - డచ్‌ - డేనిష్‌ - బ్రిటిష్‌ - ఫ్రెంచ్‌

4) పోర్చుగీసు - ఫ్రెంచ్‌ - డేనిష్‌ - బ్రిటిష్‌ - డచ్‌


33. గోవా, డామన్, డయ్యూలను భారత్‌లో విలీనం చేయడం కోసం జరిపిన సైనిక చర్య పేరు?

1) ఆపరేషన్‌ పోలో      2) ఆపరేషన్‌ బ్లూ స్టార్‌  

3) ఆపరేషన్‌ భారత్‌      4) ఆపరేషన్‌ విజయ్‌ 


34. మొదటి కర్ణాటక యుద్ధానికి ప్రధాన కారణం?

1) ఆస్ట్రియా వారసత్వ యుద్ధం            2) సప్తవర్ష సంగ్రామం

3) దక్షిణ భారతదేశంలో వారసత్వ పోరు       4) ప్లాసీ యుద్ధ విజయం


35. బ్రిటిష్‌ వారు ‘బంగారు ఫర్మానా’ను ఏ మొగల్‌ చక్రవర్తి నుంచి పొందారు?

1) జహంగీర్‌      2) ఫరూక్‌ సియర్‌  

3) షా అలం      4) బహదూర్‌ షా


36. భారతదేశంలో నిర్మించిన కోటలను, అవి ఉన్న ప్రదేశాలతో జతపరచండి.        

ఎ) మద్రాస్‌    1) విలియం కోట

బి) పులికాట్   2) పోర్ట్‌ గెల్రియో

సి) కలకత్తా    3) సెయింట్‌ జార్జ్‌

డి) కడలూర్‌   4) సెయింట్‌ డేవిడ్‌ కోట

1) ఎ-3, బి-2, సి-1, డి-4         2) ఎ-3, బి-1, సి-4, డి-2

3) ఎ-1, బి-2, సి-3, డి-4    4) ఎ-4, బి-3, సి-2, డి-1


37. మూడో కర్ణాటక యుద్ధ కాలంలో ఫ్రెంచ్‌ గవర్నర్‌?

1) ఫ్రాంకోయిస్‌ మార్టిన్‌     2) డూప్లే  

3) కౌంట్ డి లాలి      4) ఫ్రాన్సిస్‌-డి-అల్మిడా


38. భారత్‌లో ఫ్రెంచ్‌ వారి పలుకుబడిని తుద ముట్టించిన యుద్ధం?

1) ప్లాసీ యుద్ధం     2) బక్సార్‌ యుద్ధం   

3) అడయార్‌ యుద్ధం      4) వందవాసి యుద్ధం


39. ‘వందవాసి యుద్ధం’ జరిగిన సంవత్సరం?

1) 1757   2) 1760   3) 1764   4) 1770


40. చందా సాహెబ్, అన్వరుద్దీన్‌ మధ్య పోరు ఏ ప్రాంత సింహాసనం కోసం జరిగింది?

1) కర్ణాటక        2) మైసూర్‌ 

3) హైదరాబాద్‌     4) బెంగాల్‌ 



సమాధానాలు

1-3, 2-3; 3-3; 4-1; 5-2; 6-2; 7-1; 8-4; 9-1; 10-1; 11-4; 12-4; 13-2; 14-1; 15-3; 16-4; 17-2; 18-1; 19-4; 20-2; 21-1; 22-3; 23-2; 24-2; 25-1; 26-1; 27-4; 28-3; 29-1; 30-4; 31-2; 32-2; 33-4; 34-1; 35-2; 36-1; 37-3; 38-4; 39-2; 40-1.


రచయిత: కె.వెంకటేశ్వర్లు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌