• facebook
  • whatsapp
  • telegram

జీవశాస్త్రం - ఆధునిక పోకడలు

బయోరియాక్టర్‌ పంట గోల్డెన్‌ రైస్‌!జీవుల పుట్టుక, నిర్మాణం, లక్షణాలు, వర్గీకరణ, మనుగడ గురించి అధ్యయనం చేసే జీవశాస్త్రం పరిధి విస్తృతం. కంటికి కనిపించని సూక్ష్మజీవుల నుంచి ఆవరణ వ్యవస్థల వరకు ఎన్నో వర్గీకరణలు ఇందులో ఉన్నాయి. జీవుల లక్షణాలను జీవకణాల స్థాయిలో విశ్లేషించి ఎన్నో సమస్యలకు, వ్యాధులకు పరిష్కారాలను చూపుతుంది. బయోటెక్నాలజీతో జీవ ఎరువులు, ఇంధనాలు, మేలు రకం వంగడాలు, వైరస్‌ల పనిపట్టే టీకాల తయారీ సాధ్యమవుతోంది. పునరుత్పత్తి, ఫలదీకరణం సమస్యలను అధిగమించే విధంగా టెస్ట్‌ట్యూబ్‌ బేబీ విధానం వచ్చింది. జీవిని పోలిన జీవిని ప్రతిసృష్టించే క్లోనింగ్‌ ప్రక్రియ సంచలనాలను సృష్టిస్తోంది. జీవశాస్త్రంలో జరుగుతున్న ఇలాంటి ఆధునిక ఆవిష్కరణలపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. జన్యువులు, కణజాలాలపై ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలు, వాటిపై తలెత్తిన ఆందోళనలతో పాటు దేశంలో సాధించిన పురోగతి గురించీ తెలుసుకోవాలి.

1.    బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినవారు?

1) కార్ల్‌ ఎరిక్‌      2) జాన్సన్‌  

3) విలియం హార్వే      4) జాకారియస్‌


2. బయోటెక్నాలజీకి సంబంధించి సమాచారాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు?

1) 2వ    2) 4వ    3) 6వ     4) 9వ


3. కిందివాటిలో ఎక్కువగా ఉపయోగించిన జీవ   సాంకేతిక శాస్త్ర బ్యాక్టీరియా?

1) స్ట్రెప్టోకోకస్‌       2) బ్యాక్టీరియం పుటిడే   

3) ఆర్కి బ్యాక్టీరియా       4) ఈ.కోలై


4. కిందివాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి.

ఎ) గ్రీన్‌ టెక్నాలజీ - వ్యవసాయ అనువర్తిత్వం

బి) బ్లూ టెక్నాలజీ - జల సంబంధ అనువర్తిత్వం

సి) రెడ్‌ టెక్నాలజీ - వైద్యరంగ అనువర్తిత్వం

డి) వైట్‌ టెక్నాలజీ - పారిశ్రామిక అనువర్తిత్వం

1) ఎ, బి      2) ఎ, బి, సి  

3) ఎ, సి, డి      4) ఎ, బి, సి, డి


5. ప్రపంచవ్యాప్తంగా ఉండే జన్యువుల్ని భద్రపరిచే ఇంటర్నేషనల్‌ ప్లాంట్‌ ఎక్కడ ఉంది?

1) జర్మనీ   2) రోమ్‌   3) అమెరికా  4) చైనా


6. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ను ప్రవేశపెట్టినవారు?

1) పాల్‌బర్గ్‌       2) జాన్సన్‌   

3) కార్ల్‌ ఎరిక్‌       4) జోసఫ్‌ జాన్సన్‌


7. కిందివాటిలో బయోఫర్టిలైజర్‌గా ఉపయోగపడనివి?

1) శైవలాలు      2) శిలీంధ్రాలు 

3) బ్యాక్టీరియాలు     4) ప్రోటోజోవన్స్‌


8. రైజోబియం బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఎంజైమ్‌?

1) హైడ్రోజినేజ్‌       2) నైట్రోజినేజ్‌  

3) ఫాస్ఫరిలేజ్‌       4) 1, 2


9. కిందివాటిని జతపరచండి.

జాబితా-1 జాబితా -2
ఎ) నాస్టాక్‌ 1) పొటాషియం
బి) ఎండోగాన్‌ 2) బయోడీజిల్‌
సి) గ్లామస్‌ 3) జీవఎరువులు
డి) జట్రోఫా 4) ఫాస్ఫరస్‌

1) ఎ-3, బి-4, సి-1, డి-2    2) ఎ-3, బి-4, సి-2, డి-1

3) ఎ-3, బి-1, సి-2, డి-4    4) ఎ-3, బి-2, సి-1, డి-4


10. ప్రపంచంలో జీవ ఎరువులను తొలుత ఉపయోగించిన సంవత్సరం?

1) 1961   2) 1962   3) 1957  4) 1974


11. బయోడీజిల్‌ అనేది ఒక... ?

1) సమ్మేళనం      2) ఎస్టర్‌  

3) సరళ సమీకృతం      4) 1, 2


12. హీమోఫీలియాలో ఉపయోగించే ఫ్యాక్టర్‌-8 అనే ప్రొటీన్‌ను ఏ జీవి నుంచి సేకరిస్తారు?

1) మేక     2) పంది      3) ఆవు   4) ఒంటె


13. కణజాలవర్ధనాన్ని ప్రవేశపెట్టినవారు?

1) హెబర్‌లాండ్‌      2) సతీష్‌ మహేశ్వరి  

3) బిమాంట్‌      4) హార్వే


14. కిందివాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) కణంలోని అంతర్గత సామర్థాన్ని టోటీపొటెన్సీ అంటారు.

బి) టోటీపొటెన్సీని మోర్గాన్‌ కనుక్కున్నాడు.

సి) టోటీపొటెన్సీని ఉపయోగించిన మొదటి వ్యక్తి ఎఫ్‌.సి. స్టీవార్డ్‌

డి) మనదేశంలో కణజాలవర్ధనాన్ని సతీష్‌ మహేశ్వరి, గుహ ప్రవేశపెట్టారు.

1) ఎ, బి    2) సి, డి    

3) ఎ, బి, సి        4) ఎ, బి, సి, డి


15. ఫాదర్‌ ఆఫ్‌ జెనిటిక్‌ ఇంజినీరింగ్‌?

1) పాల్‌బర్గ్‌  2) ముల్లర్‌  3) స్టాన్లీ  4) బోలివేల్‌


16. కిందివాటిలో పొటాషియం, జింక్‌ ఎరువులుగా ఉపయోగించేది?

1) ఎండోగాన్‌    2) గ్లామస్‌        

3) కాండిడా    4) యూటాలిస్‌


17. కిందివాటిలో ఫాస్ఫరస్‌ ఎరువుగా వాడే శిలీంధ్రం?    

1) ఎండోగాన్‌    2) గ్లామస్‌    

3) కాండిడా    4) యూటాలిస్‌


18. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌    2) న్యూదిల్లీ    

3) దెహ్రాదూన్‌    4) 1, 2


19. కిందివాటిలో బయోరియాక్టర్‌ పంట?

ఎ) అరటిలో Hep-B వైరస్‌ను తట్టుకునే BARC ని ఉత్పత్తి చేయడం.

బి) బొప్పాయిలోని రింగ్‌స్పాట్‌ వైరస్‌ను తట్టుకునే రకం.

సి) వరిలో గోల్డెన్‌ రైస్‌    డి) బీటీ పద్ధతిలో పత్తి

1) ఎ, బి    2) బి, సి, డి    

3) ఎ, సి, డి     4) ఎ, బి, సి, డి 


20. కిందివాటిలో సరికానిది?

1) అమెరికాలో సోయాబీన్స్‌తో బయోడీజిల్‌ తయారు చేస్తారు.

2) యూరప్‌లో సన్‌ఫ్లవర్‌తో బయోడీజిల్‌ తయారు చేస్తారు.

3) బయోగ్యాస్‌లో 90% కార్బన్‌డైఆక్సైడ్‌ ఉంటుంది.

4) బయో ఇథనాల్‌ తయారీలో ఇమిడి ఉన్న సూత్రం - అంశిక స్వేదనం.


21. కిందివాటిని జతపరచండి.

i) డాలి a) పోషక యానకంలో కణాల గుంపు
ii) మ్యూల్‌ b) అగార్‌ - అగార్‌
iii) జిలెడియం c) మొదటి క్లోనింగ్‌ జీవి
iv) కాలస్‌ d) కంచర గాడిద

1) i-a, ii-b, iii-c, iv-d

2) i-c, ii-d, iii-b, iv-a

3) i-c, ii-d, iii-a, iv-b

4) i-d, ii-c, iii-a, iv-b


22. కణజాలవర్ధనం ద్వారా ఎక్కువ మొత్తంలో మొక్కలు ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు?

1) మైక్రోప్రోపగేషన్‌    2) మార్ఫోజెనిస్‌

3) స్వరూపోత్పత్తి    4) 1, 2


23. కిందివాటిలో సత్య వాక్యం?

ఎ) క్లోనింగ్‌ అంటే గ్రీకు భాషలో రెమ్మా అని అర్థం. 

బి) క్లోనింగ్‌ పితామహుడు ఇయాన్‌ విల్మట్‌.

సి) డాలి అనేది మొదట క్లోనింగ్‌ చేసిన క్షీరదం. 

డి) కృత్రిమ విత్తనాల తయారీలో సోడియం ఆల్జీనేట్‌ను ఉపయోగిస్తారు. 

1)  ఎ, బి    2) బి, సి    

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి


24. మానవ పిండాన్ని క్లోనింగ్‌ చేసేందుకు అనుమతి ఇచ్చిన దేశం?

1) ఇండియా  2) అమెరికా    3) బ్రిటన్‌    4) 2, 3


25. ఆడ సింహం, మగ పులి మధ్య సంకరణం వల్ల లభించే జీవి?

1) టైగాన్‌  2) మ్యూల్‌     3) హెన్ని  4) లైగర్‌


26. నానోటెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినవారు?

1) హెబర్‌లాండ్‌    2) విల్మట్‌    

3) హెన్‌మాన్‌    4) హెర్నెస్ట్‌ హెకెల్‌


27. కిందివాటిని జతపరచండి.

 జాబితా - I జాబితా - II
i) టాడ్‌పోల్‌ లార్వా a) యూఎస్‌ఏ
ii) కార్ఫ్‌     b) చైనా 
iii) యాంగ్‌-యాంగ్‌ c) తాలిబన్‌
iv) గంఫా d) మేక
v) ఈవ్‌ e) చేప

1) i-b, ii-c, iii-d, iv-a, v-e

2) i-c, ii-e, iii-d, iv-b, v-a

3) i-c, ii-e, iii-b, iv-d, v-a

4) i-c, ii-e, iii-d, iv-a, v-b


28. ఇండియాలో మొదటిసారి టెస్ట్‌ట్యూబ్‌ బేబీలను రూపొందించిన వ్యక్తి?

1) లూయిస్‌ బ్రౌన్‌    2) పాట్రిక్‌ మాన్‌సన్‌

3) విలియం హార్వే    4) ఫిరోజ్‌ ఫాసిక్‌


29. విషపదార్థాల అధ్యయన శాస్త్రం?

1) టాక్సికాలజీ    2) పాథాలజీ    

3) ఫార్మకాలజీ     4) అగ్రస్టాలజీ


30. క్లోనింగ్‌ ద్వారా భారతదేశంలో ఎన్‌డీఆర్‌ఐ ద్వారా రూపొందించిన జంతువులు? 

1) సంరూప   2) గరిమ  3) డాలి    4) 1, 2


31. శాస్త్రవేత్తలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఉపయోగిస్తున్న రసాయనాలు?

1) యాంటీపైరేటిక్స్‌     2) నార్కోటిక్స్‌        

3) సెడెటిక్‌    4) 1, 2


32. జీవుల్లో టీకాల ప్రధాన లక్ష్యం?

1) ఇమ్యూనిటీ     2) ప్రతిజనకం    

3) ప్రతిరక్షకం     4) 1, 3


33. కిందివాటిలో ఫింగర్‌ ప్రింట్‌ టెక్నాలజీలో సమాచార సేకరణకు ఉపయోగించే కణాలు?

1) ఎర్రరక్త కణాలు     2) తెల్లరక్త కణాలు    

3) నాడీకణాలు    4) నెఫ్రాన్స్‌


34. కిందివాటిని జతపరచండి.

జాబితా - I జాబితా - II
1) లైఫ్‌సెల్‌ ఎ) సూడోమోనాస్‌ పుటిడా
2) పరీక్ష నాళికలో ఫలదీకరణం బి) హెబర్‌లాండ్‌
3) బయోడీజిల్‌ సి) జాతిజీవులు గుర్తించేందుకు
4) సూపర్‌బగ్‌ డి) అడవి ఆముదం
5) ఫెరమోన్‌ ఇ) బొడ్డుతాడు మూలకణాలు

1) 1-ఇ, 2-బి, 3-డి, 4-ఎ, 5-సి     

2) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి, 5-ఎ

3) 1-ఇ, 2-బి, 3-ఎ, 4-డి, 5-సి     

4) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-బి


35. భారత ప్రభుత్వం జట్రోఫా సాగుకు ప్రారంభించిన పథకం?

1) ఆపరేషన్‌ ఫ్లడ్‌     2) నీడ్‌ స్ప్రే    

3) వైడ్‌ స్ప్రెడ్‌       4) వైట్‌ స్ప్రే


36. ఎ) వాదన: కృత్రిమ గర్భధారణ అంటే స్త్రీ, పురుష బీజకణాలను పరీక్షనాళికలో ఫలదీకరణం చెందించి, పిండాన్ని ఏర్పరచి స్త్రీ జీవిలో ప్రవేశపెట్టడం.

బి) ప్రతిపాదన: దీన్ని టెస్ట్‌ట్యూబ్‌ బేబీ అంటారు.

1) ఎ సత్యం, బి అసత్యం 2) ఎ అసత్యం, బి సత్యం

3) ఎ, బి లు సత్యం 

4) ఎ సత్యం, కానీ బికి సరైన వాదన కాదు


37. కిందివాటిలో మానవ క్లోనింగ్‌ను బహిష్కరించిన దేశం?

1) అమెరికా   2) డెన్మార్క్‌    3) కెనడా  4) చైనా


38. నిల్వ ఉంచిన వేరుశనగలో ఉండే క్యాన్సర్‌ కారకం?

1) టోమ్యులిన్‌     2) హీమోటాక్సిన్‌    3) ఆప్లాటాక్సిన్‌     4) న్యూరోటాక్సిన్‌


39. రెడ్‌ డేటా అంటే..?

1) అంతరించిపోతున్న మొక్కలను భద్రపరిచే గ్రంథం

2) ప్రమాదస్థితిలో ఉన్న మొక్కలను భద్రపరిచే గ్రంథం

3) నూతన మొక్కలను భద్రపరిచే గ్రంథం

4) కలుపు మొక్కలను భద్రపరిచే గ్రంథం

1) 1, 2    2) 2, 3    3) 1, 2, 3  4) పైవన్నీ


40. కిందివాటిలో విటమిన్‌-ఎ అధికంగా ఉండే వంగడం?

1) వరి         2) కంది  

3) వేరుశనగ    4) శనగ
సమాధానాలు

1-1; 2-3; 3-4; 4-4; 5-2; 6-1; 7-4; 8-2; 9-1; 10-3; 11-2; 12-2; 13-1; 14-3; 15-1; 16-2; 17-1; 18-3; 19-4; 20-3; 21-3; 22-1; 23-4; 24-3; 25-1; 26-3; 27-2; 28-4; 29-1; 30-4; 31-1; 32-4; 33-2; 34-1; 35-3; 36-3; 37-1; 38-3; 39-1; 40-3.

 

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌