• facebook
  • whatsapp
  • telegram

పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం

పిన్‌హోల్‌ కెమెరాలో దర్పణాలు లేవు!



 

పదార్థాలు కొన్ని నీటిలో కరుగుతాయి, మరికొన్ని తేలతాయి, ఇంకొన్ని అసలు కలవవు. భౌతిక ధర్మాల ఆధారంగా పదార్థాలను సమూహాలుగా వర్గీకరిస్తారు. ఈ విభజన వల్ల పదార్థాల లక్షణాలను తేలిగ్గా గుర్తించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. పదార్థాలను వేరుచేయడంలోనూ నిర్దిష్ట పద్ధతులను అవలంబిస్తారు. వీటి గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. దాంతోపాటు వస్తువుల చలనాలు, దూరాలను కొలిచే విధానాలు, కాంతి పరావర్తనాలు, విద్యుత్తు వలయాలు, అయస్కాంతత్వ ప్రభావాల గురించి అర్థం చేసుకోవాలి. 



 

పదార్థాలను సమూహాలుగా వర్గీకరించడం


1.     కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) కొన్ని పదార్థాలను కోసినప్పుడు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ద్యుతి గుణాన్ని ప్రదర్శిస్తాయి.

బి) ఏ పదార్థాలనైతే సులువుగా సంపీడనం చెందించలేమో వాటిని దృఢమైన పదార్థాలు అంటారు.

1) ఎ సత్యం, బి అసత్యం    2) ఎ అసత్యం, బి సత్యం

3) ఎ, బి లు సత్యం    4) ఎ, బి లు అసత్యం


2.     కిందివాటిలో నీటిలో కరగని ఘనపదార్థాన్ని గుర్తించండి.

1) సుద్దముక్క పొడి      2) ఉప్పు 

3) చక్కెర      4) రంపపు పొట్టు


3.     కిందివాటిలో నీటిలో కరిగే వాయువును గుర్తించండి.

1) హైడ్రోజన్‌     2) కార్బన్‌ డయాక్సైడ్‌  

3) ఆక్సిజన్‌      4) నైట్రోజన్‌


4.     కిందివాటిలో నీటిలో తేలే పదార్థాలను గుర్తించండి.

1) గ్రీజు      2) తేనెచుక్కలు  

3) థర్మాకోల్‌       4) పైవన్నీ


5.     కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) వెనిగర్‌ నీటిలో బాగా కలుస్తుంది.

బి) ఆల్కహాల్, నీరు ఒకదానితో మరొకటి బాగా కలుస్తాయి.

సి) ఆవ నూనె నీటిలో కలవదు.   డి) కిరోసిన్‌ నీటిలో కలవదు.

1) ఎ, బి      2) బి, సి 

3) ఎ, బి, సి     4) పైవన్నీ 


పదార్థాలు వేరుచేయడం - పద్ధతులు


6.     రైతులు పంటను నూర్చినప్పుడు ధాన్యంతో పాటు ఊక, తాలు మిశ్రమం లభిస్తుంది. ధాన్యం నుంచి ఊక, తాలును వేరు చేయడానికి వారు ఉపయోగించే పద్ధతి?

1) జల్లించడం      2) తూర్పారబట్టడం 

3) చేతితో ఏరివేయడం      4) వడబోత


7.     సాధారణంగా ఒక మిశ్రమంలోని పదార్థాలను వేరుచేయడానికి జల్లించే ప్రక్రియను ఎప్పుడు అవలంబిస్తారు?

1) మిశ్రమంలోని పదార్థాలు కరిగేవి, కరగనివి ఉన్నప్పుడు

2) మిశ్రమంలోని పదార్థాలు పెద్దవి, చిన్నవి ఉన్నప్పుడు

3) మిశ్రమంలోని పదార్థాలు తేలికైనవి, బరువైనవి ఉన్నప్పుడు

4) పదార్థాల పరిమాణంలో పెద్దవిగా ఉన్నప్పుడు మాత్రమే


8.     ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు, వాటిని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతులు గుర్తించండి.

1) స్వేదనం, తేర్చడం   2) జల్లించడం, వడబోయడం 

3) తేర్చడం, వడబోత 4) స్వేదనం, స్ఫటికీకరణం


9.     కిందివాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి.

ఎ) బియ్యం నుంచి రాళ్లను వేరుచేయడానికి చేత్తో ఏరివేయడం అనే పద్ధతిని ఎంచుకుంటారు.

బి) డికాషన్‌ నుంచి టీ పొడిని వేరు చేయడానికి వడబోతను ఉపయోగిస్తారు.

1)  ఎ సత్యం, బి అసత్యం  2)  ఎ అసత్యం, బి సత్యం

3) ఎ, బి లు సత్యం     4) ఎ, బి లు అసత్యం


10. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.

ఎ) సాధారణ నీటి నుంచి స్వచ్ఛమైన నీటి తయారీకి స్వేదనం ఉపయోగిస్తారు.

బి) ఉప్పు నీటి నుంచి ఉప్పు స్ఫటికాలు పొందడానికి స్ఫటికీకరణాన్ని వినియోగిస్తారు.

సి) ఉప్పు, కర్పూర మిశ్రమం నుంచి కర్పూరాన్ని వేరు చేయడానికి ఉత్పతనం పద్ధతి వాడతారు.

డి) రంగు ఉండే మిశ్రమం నుంచి వివిధ రంగులు వేరుచేయడాన్ని క్రొమటోగ్రఫీ అంటారు.

1) ఎ, బి   2) బి, సి  3) సి, డి  4) పైవన్నీ 


చలనం, దూరాల కొలతలు కాంతి నీడలు, పరావర్తనాలు


11.     కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేతి నుంచి వేలికొనల వరకు ఉండే పొడవును మూరగా ఉపయోగించేవారు.

బి) మన పూర్వీకులు చేతి చివరి నుంచి గడ్డం వరకు ఉండే పొడవును గజంగా ఉపయోగించేవారు.

సి) ఆటస్థలం పొడవు, వెడల్పు కొలవడానికి అంగలను ఉపయోగిస్తారు.

డి) చిన్న చిన్న పొడవులను కొలవడానికి మీటర్లు, సెంటీమీటర్లను; పెద్దపెద్ద పొడవులను కొలవడానికి కిలోమీటర్లను ఉపయోగిస్తారు.

1) ఎ, బి  2) ఎ, బి, సి     3) ఎ, సి  4) పైవన్నీ


12. కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) పొడవులను కొలవడానికి పొడవు వెంబడి స్కేలు ఉంచాలి.

బి) పొడవులను కొలిచేటప్పుడు స్కేలు అంచులు అరిగి, విరిగిపోయి ఉండరాదు. 

సి) పొడవులను కొలిచేటప్పుడు స్కేలు రీడింగు తీయడానికి మన కన్ను స్కేలుపై నిటారుగా ఉంచాలి.

డి) వక్రతలాల పొడవులను కొలవడానికి స్కేలు, దారం ఉపయోగిస్తారు.

1) ఎ, బి  2) బి, సి, డి 3) ఎ, సి 4) పైవన్నీ


13. కిందివాటిలో రేఖీయ చలనానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.

1) సైనికుల కవాతు   

2) తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌

3) విల్లు నుంచి వదిలిన బాణం    4) పైవన్నీ


14. కిందివాటిలో వృత్తాకార చలనానికి సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి.

1) ఫ్యాన్‌ రెక్కల చలనం  2) గడియారంలోని ముల్లుల చలనాలు

3) కుమ్మరి చక్ర చలనం         4) పైవన్నీ


15. డోలన లేదా ఆవర్తన చలనానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

1) గోడ గడియారంలోని లోలక చలనం

2) ఊయల చలనం

3) సంగీత పరికరాల తీగలు చేసే చలనాలు

4) పైవన్నీ


16. కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) కాంతి ఎల్లప్పుడూ సరళరేఖ మార్గంలో ప్రయాణించడం వల్ల నీడలు ఏర్పడతాయి.

బి) నీడలు నలుపు రంగులో మాత్రమే ఏర్పడతాయి.

సి) కొన్నిసార్లు నీడల ఆధారంగా వాటి వస్తువుల ఆకారాలను గుర్తించవచ్చు.

డి) నీడలు ఏర్పడాలంటే కాంతి జనకం పెద్దదిగా, కాంతి నిరోధం చిన్నదిగా ఉండాలి.

1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి, డి 4) పైవన్నీ


17. పిన్‌హోల్‌ కెమెరాకు సంబంధించిన సరైన అంశాన్ని ఎంచుకోండి.

1) ఇది కాంతి రుజుమార్గం ఆధారంగా పనిచేస్తుంది.

2) దీని ద్వారా చూసిన వస్తువుల ప్రతిబింబాలు తలకిందులుగా కనిపిస్తాయి.

3) దీనిలో ఎలాంటి దర్పణాలను ఉపయోగించరు.

4) పైవన్నీ


18. కిందివాటిలో పారదర్శక పదార్థం కానిదాన్ని గుర్తించండి.

1) గాలి 2) గాజు 3) నీరు 4) నూనె పూసిన కాగితం


19. కిందివాటిలో స్వయంకాంతి జనకం కానిది?

1) సూర్యుడు    2) నక్షత్రాలు

3) మినుగురు పురుగు    4) చంద్రుడు


20. ‘కిందివాటిలో నీడలు ఏర్పడతాయి’ అనే దాని ఆధారంగా నిర్వహించే ఒక కళను గుర్తించండి.

1) బుర్రకథ    2) హరికథ

3) తోలుబొమ్మలాట    4) చిత్రకళ



విద్యుత్తు, విద్యుత్తు వలయాలు అయస్కాంతంతో సరదాలు


21. విద్యుత్తు ఘటానికి సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి.

1) విద్యుత్తు ఘటంలో రసాయన శక్తి విద్యుత్తు శక్తిగా మారుతుంది.

2) ఘటంలో పైభాగాన ఉండే లోహపు మూత ధనధ్రువంగా,  లోహపు చట్రం రుణ ధ్రువంగా  పనిచేస్తాయి.

3) విద్యుత్తు ఘటాలను అలారం గడియారాలు, ట్రాన్సిస్టర్‌ రేడియోలు, కెమెరాల్లో ఉపయోగిస్తారు. 

4) పైవన్నీ


22. ఎలక్ట్రిక్‌ బల్బుకు సంబంధించి సరైన అంశాన్ని ఎంచుకోండి.

ఎ) విద్యుత్తు బల్బులో కాంతినిచ్చే సన్నని భాగాన్ని ఫిలమెంట్‌ అంటారు.

బి) ఎలక్ట్రిక్‌ బల్బులో విద్యుత్తు శక్తి కాంతి, ఉష్ణశక్తిగా మారుతుంది.

సి) సాధారణ విద్యుత్తు బల్బు విద్యుత్తు దుర్వినియోగాన్ని కలిగిస్తుంది.

డి) CFL, LED లు తక్కువ విద్యుత్తును వినియోగించుకుని విద్యుత్తు దుర్వినియోగాన్ని తగ్గిస్తాయి.

1) ఎ, సి  2) బి, సి 3) ఎ, బి, సి 4) పైవన్నీ


23. సాధారణ విద్యుత్తు వలయానికి సంబంధించి సరైన అంశాన్ని ఎంచుకోండి.

1) వలయంలో ఘటం యొక్క రెండు కొనలను బల్బు, స్విచ్‌తో కలపాలి.

2) వలయంలో విద్యుత్తు ప్రవాహ ఘటం ధన ధ్రువం నుంచి రుణ ధ్రువం వైపు ప్రవహిస్తుంది.

3) స్విచ్‌ అనేది వలయాన్ని తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది.       4) పైవన్నీ


24. కిందివాటిలో విద్యుత్తు వాహకం కానిది?

1) పాదరసం     2) అల్యూమినియం 

3) వెండి     4) వజ్రం


25. కిందివాటిలో అథమ విద్యుత్తు వాహకాన్ని గుర్తించండి.

1) ఇనుప మేకు       2) తాళం చెవి 

3) గుండుసూది      4) థర్మాకోల్‌


26. అయస్కాంతాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి.

ఎ) సహజ అయస్కాంతాన్ని మాగ్నస్‌ అనే గొర్రెల కాపరి కనుక్కున్నాడు.

బి) మాగ్నటైట్‌ అనే సహజ అయస్కాంతాల్లో ఇనుము ఉంటుంది.

సి) సహజ అయస్కాంతాలను లోడ్‌ స్టోన్స్‌ లేదా లీడింగ్‌ స్టోన్స్‌ అంటారు

1) ఎ, బి  2) బి, సి  3) సి మాత్రమే 4) పైవన్నీ


27. కిందివాటిలో అనయస్కాంత పదార్థాన్ని గుర్తించండి?

1) నికెల్‌  2) కోబాల్ట్‌  3) ఇనుము  4) తోలు


28. దిక్సూచికి సంబంధించిన సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) ఇది అయస్కాంతం దిశా ధర్మం ఆధారంగా పనిచేస్తుంది.

బి) దీన్ని చైనా సముద్ర నావికులు కనుక్కున్నారు.

సి) దీని ద్వారా భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాలను గుర్తిస్తారు.

డి) దీన్ని ఎక్కువగా ఓడలు, విమానాలు, సైనికుల కార్యకలాపాల్లో ఉపయోగిస్తారు.

1) ఎ, సి  2) సి, డి 3) ఎ, బి   4) పైవన్నీ 


29. కిందివాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి.

ఎ) దండాయస్కాంతాన్ని స్వేచ్ఛగా వేలాడదీస్తే అది భూమి ఉత్తర - దక్షిణ దిశలను సూచిస్తుంది.

బి) రెండు దండాయస్కాంతాల సజాతి ధ్రువాలు వికర్షించుకుని విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి.

సి) ఒక దండాయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా అవి తిరిగి రెండు ధ్రువాలను ఏర్పరుచుకుంటాయి.

డి) అయస్కాంతాన్ని వేడి చేసినా, రబ్బరు సుత్తితో కొట్టినా, అయస్కాంతత్వాన్ని కొంతవరకు కోల్పోతుంది.

1) ఎ, బి  2) బి, సి  3) సి, డి  4) పైవన్నీ



సమాధానాలు

1-3; 2-4; 3-3; 4-4; 5-4; 6-2; 7-2; 8-3; 9-3; 10-4; 11-4; 12-4; 13-4; 14-4; 15-4; 16-4; 17-4; 18-4; 19-4; 20-3; 21-4; 22-4; 23-4; 24-4; 25-4; 26-4; 27-4; 28-4; 29-4. 

Posted Date : 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌