• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌

లక్ష్యాల తీర్మానమే ప్రవేశికకు ఆధారం!


నాగరిక ప్రపంచంలో పౌరుల హక్కులు, బాధ్యతలపై అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. అందుకోసం పాలిటీని అధ్యయనం చేయాలి. భారత రాజ్యాంగం, పార్లమెంటు, ఎన్నికలు వంటి వాటినీ తెలుసుకోవాలి.  రాజ్యాంగ పరిణామక్రమం, తుది నిర్మాణం, అందులోని మౌలిక అంశాలు, ప్రాథమిక హక్కులు, ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన రాజ్యాంగ సవరణల గురించి అర్థం చేసుకోవాలి. పార్లమెంటు కూర్పు, సీట్ల రిజర్వేషన్, సభా వ్యవహారాలు జరిగే తీరు, ఎన్నికల ప్రక్రియ, ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక ఎన్నికల వివరాలు, విశేషాలను గణాంకాల సహితంగా పట్టుపెంచుకోవాలి.

1.  నేపాల్‌లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం?

  1) 2004    2) 2005    3) 2006    4) 2007



2. భారతదేశ పార్లమెంట్‌లో ప్రస్తుత సభ్యుల సంఖ్య?

 1) 700   2) 740   3) 765   4) 790

3. ‘1935 చట్టానికి నకలు భారత రాజ్యాంగం’ అని విమర్శించింది?

 1) దామోదర్‌ స్వరూప్‌ సేథ్‌

 2) మౌలానా హస్రత్‌ మెహానీ

 3) సోమనాథ్‌ రంజన్‌ ఠాగూర్‌  

 4) ఎస్‌.సి.బెనర్జీ

4. భారత రాజ్యాంగ ప్రవేశిక ఆధారం?

1) మహాత్మాగాంధీ సందేశం 

2) ఆశయాలు, లక్ష్యాల తీర్మానం

3) ఐక్యరాజ్య సమితి చార్టర్‌ 

4) ఫ్రెంచి విప్లవ లక్ష్యాలు

5. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను తెలిపే  నిబంధనలు ఏవి?

1) 12-35      2) 36-51     3) 25-56     4) 32-59


 

6.  భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని పదాన్ని గుర్తించండి.

1) న్యాయం     2) స్వాతంత్య్రం 

3) సౌభ్రాతృత్వం     4) విశ్వశాంతి

7. కిందివారిలో రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యులు కానివారు?

1) సర్‌ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

2) ఎన్‌.మాధవరావు

3) కె.ఎం.మున్షీ  

4) హెచ్‌.సి.ముఖర్జీ

8.  భారత రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు చేసిన కమిటీల సంఖ్య?

 1) 18     2) 20     3) 22     4) 24

9.     భారత ముసాయిదా రాజ్యాంగంలోని అధికరణలు, షెడ్యూళ్ల సంఖ్య?

 1) 315, 8      2) 326, 8  

 3) 395, 8      4) 395, 12

10. రాజ్యాంగ సభ, రాష్ట్రాలు, సంస్థానాలకు స్థానాలను ఎవరు కేటాయిస్తారు?


    1) కేబినెట్‌ మిషన్‌ ప్లాన్‌     2) వేవెల్‌ ప్లాన్‌


    3) మౌంట్‌బాటన్‌ ప్లాన్‌     4) మిషన్‌ ప్లాన్‌

11. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ?

1) వల్లభాయ్‌ పటేల్‌ కమిటీ    2) స్వరణ్‌ సింగ్‌ కమిటీ

 3) మొరార్జీ దేశాయ్‌ కమిటీ     4) వి.వి.గిరి కమిటీ

12. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?

 1) 3వ    2) 12వ    3) 10వ    4) 11వ

13. అసృశ్యత నివారణ చట్టం-1955ను పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా ఎప్పుడు మార్చారు?    

 1) 1942     2) 1976     3) 1978     4) 1992

14. ముసాయిదా రాజ్యాంగానికి చేసిన సవరణల్లో ఆమోదం పొందినవి?

1) 2473      2) 2743     3) 2374     4) 2347

15. జీవించే హక్కును ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?

 1) అమెరికా     2) ఆస్ట్రేలియా     3) జపాన్‌     4) దక్షిణాఫ్రికా



16. ‘ఇండియా విన్స్‌ ఫ్రీడమ్‌’ గ్రంథ రచయిత?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ 

 4) మహాత్మా గాంధీ

17. ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?

1) నవంబరు 11    2) జూన్‌ 5    

 3) డిసెంబరు 10    4) జనవరి 9


18. ‘చట్టం ముందు అందరూ సమానులే’ అని ఏ ఆర్టికల్‌ తెలియజేస్తుంది?

 1) 14         2) 15      3) 16      4) 17


19. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి ఎన్నిరకాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉన్నాయి?

1) 5     2) 6     3) 7    4) 8

20. ఆరేళ్లలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య కల్పించే ఆదేశిక సూత్రం?

1) 39(ఎ)       2) 38(2)      3) 45      4) 47

21. తెలంగాణలో ఎన్ని లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి?

1) 25     2) 17    3) 80    4) 48

22. లోక్‌సభ నియోజక వర్గాల్లో షెడ్యూల్డ్‌ కులాలకు ఎన్ని స్థానాలు కేటాయించారు?

  1) 84     2) 47    3) 79    4) 41

23. లోక్‌సభలో నామినేటెడ్‌ సీట్లు ఎన్ని?

1) 12     2) 14    3) 2     4) 1

24. చండీగఢ్‌ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్ని లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి?

1) 1      2) 2     3) 3     4) 4

25. రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండొచ్చు?

1) 550      2) 543      3) 250     4) 245

26. కేంద్ర ప్రభుత్వ ఆదాయ ఖర్చులను ఎవరు ఆమోదిస్తారు?

1) పార్లమెంట్‌     2) ప్రధానమంత్రి 

3) ఉపరాష్ట్రపతి     4) ఆర్థికమంత్రి

27. రాజ్యసభలో రెండేళ్లకోసారి ఎన్నో వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు?

1) 1/5వ  2) 1/2వ  3) 1/3వ  4) 2/3వ

28. లోక్‌సభ నియోజక వర్గాల్లో షెడ్యూల్డ్‌ తెగలకు ఎన్ని స్థానాలు కేటాయించారు?

1) 84    2) 47    3) 79    4) 41

29. మొదటి లోక్‌సభలో సుమారు ఎన్ని బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు?

1) 2,24,000     2) 25 లక్షలు 

3) 62 కోట్లు     4) 10 లక్షలు

30. మొదటి లోక్‌సభలో ఎన్ని కోట్ల మందికి ఓటు హక్కు ఉంది?

1) 17.30 లక్షలు     2) 17.25 లక్షలు 

3) 18.30 లక్షలు     4) 16.30 లక్షలు

31. కరెన్సీ ఏ జాబితాలో ఉంది?    

1) రాష్ట్ర జాబితా     2) కేంద్ర జాబితా 

 3) ఉమ్మడి జాబితా     4) అవశిష్టాంశాలు

32. నీతిఆయోగ్‌ ఏర్పడిన సంవత్సరం?

1) 2014, డిసెంబరు 31    2) 2014, డిసెంబరు 30

3) 2015, జనవరి 1    4) 2016, జనవరి 1

33. 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు?

 1) 83,41,01,479     2) 83,41,01,478

3) 82,41,01,479     4) 84,41,01,479

34. 1952 మొదటి లోక్‌సభకు సంబంధించి  స్వతంత్రులు గెలిచిన స్థానాలు?

 1) 30    2) 41    3) 23    4) 12

35. కిందివాటిలో సరికానిది?

 1) సర్వసైన్యాధ్యక్షుడు - రాష్ట్రపతి

2) ఉపరాష్ట్రపతి పదవిని అమెరికా నమూనా నుంచి స్వీకరించారు

3) దేశంలో ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి

4) మంత్రిమండలి నాలుగు రకాలు

36. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు?

1) 42వ   2) 44వ   3) 61వ   4) 86వ

37. ద్రవ్య బిల్లులను రాజ్యసభ ఎన్నిరోజుల్లో ఆమోదించాలి?

1) 30 రోజులు     2) 90 రోజులు 

3) 14 రోజులు     4) 4 నెలలు

38. పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

1) రాష్ట్రపతి     2) ప్రధానమంత్రి 

3) ఉపరాష్ట్రపతి     4) లోక్‌సభ స్పీకర్‌

39. సాధారణ బిల్లులు కింది ఏ సభలో ప్రవేశపెట్టాలి?

1) లోక్‌సభ     2) రాజ్యసభ 

3) ఏ సభలోనైనా     4) విధానసభ

40. ఐక్యరాజ్య సమితి విశ్వవ్యాప్త మానవహక్కుల ప్రకటనను ఎప్పుడు జారీ చేసింది?  

1) 1945, అక్టోబరు 24     2) 1948, డిసెంబరు 10 

3) 1945, డిసెంబరు 10     4) 1947, డిసెంబరు 10 

41. జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఏర్పడిన సంవత్సరం?     

1) 1991, అక్టోబరు 10     2) 1992, అక్టోబరు 12 

3) 1993, అక్టోబరు 12     4) 1994, అక్టోబరు 12

42. జాతీయ మావనహక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?

1) నవంబరు 11     2) డిసెంబరు 10 

3) జూన్‌ 5     4) సెప్టెంబరు 5

43. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కులు జాబితా నుంచి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?

1) 42వ   2) 48వ   3) 44వ   4) 61వ 

44. ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?

1) అమెరికా  2) ఐర్లాండ్‌  3) బ్రిటన్‌  4) రష్యా

45. అంటరానితనం నేరం అని ఏ ఆర్టికల్‌ తెలియజేస్తుంది? 

1) 14    2) 15    3) 16     4) 17 

46. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే ఆర్టికల్‌? 

1) 20   2) 21    3) 21(ఎ)   4) 22

47. విద్యాహక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 

1) 2009  2) 2010  3) 2011  4) 2012 

48. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు బాల బాలికలను హానికరమైన కర్మాగారాల్లో పనిచేయించకూడదని తెలిపే ఆర్టికల్‌? 

 1) 21    2) 21(ఎ)    3) 23    4) 24 

49. పౌరశాస్త్ర పితామహుడు?

1) ప్లేటో     2) అరిస్టాటిల్‌ 

3) సోక్రటీస్‌     4) ఆడంస్మిత్‌ 

50. కిందివారిలో రాజ్యాంగ పరిషత్‌ మహిళా సభ్యురాలిగా చేయనివారు?

1) దక్షియాని వేలయుదున్‌     2) అన్ని మస్కరిన్‌

3) లక్ష్మీ సెహగల్‌      4) దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ 

51. రాజ్యాంగ సభలో మహిళల సంఖ్య?

1) 15    2) 26    3) 208    4) 93

52. కిందివారిలో రాజ్యాంగ సభలో సభ్యులు కానివారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌  

2) మహాత్మా గాంధీ  

3) డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌  

4) హెచ్‌.సి.ముఖర్జీ   

53. ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు?

1) అరిస్టాటిల్‌      2) ప్లేటో  

 3) మాఖియావెల్లి      4) రూసో

54. రాజ్యాంగ పరిషత్‌ చిహ్నం?

1) ఎద్దు  2) పులి  3) సింహం  4) ఐరావతం

55. భారతదేశ మొదటి కార్మిక శాఖా మంత్రి?

1) బాబూ జగ్జీవన్‌రాం     

 2) సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌  

3) జవహర్‌లాల్‌ నెహ్రూ 

4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


 

సమాధానాలు

1-4; 2-4; 3-2; 4-2; 5-2; 6-4; 7-4; 8-3; 9-1; 10-1; 11-2; 12-2; 13-2; 14-1; 15-3; 16-3; 17-4; 18-1; 19-2; 20-3; 21-2; 22-1; 23-3; 24-1; 25-3; 26-1; 27-3; 28-2; 29-3; 30-1; 31-2; 32-3; 33-1; 34-2; 35-4; 36-1; 37-3; 38-4; 39-3; 40-2; 41-3; 42-2; 43-3; 44-1; 45-4; 46-3; 47-2; 48-4; 49-2; 50-3; 51-1; 52-2; 53-3; 54-4; 55-1.  

Posted Date : 13-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌