• facebook
  • whatsapp
  • telegram

పాఠ్యపుస్తకాలు - బోధనాశాస్త్రంపై అవగాహన

* పాఠ్యపుస్తకం ప్రధానమైన భాషా వనరు. 
* ఆర్‌టీఈలోని 5వ అధ్యాయం పాఠ్యపుస్తకాల గురించి తెలియజేస్తుంది. 
* పాఠ్యపుస్తకాలు బట్టీ విధానానికి స్వస్తి చెప్పేలా, తాత్విక ఆలోచనలు కలిగించేలా ఉండాలని ఎన్‌సీఎఫ్‌ (2005) అభిప్రాయపడింది.
* భాషా ఆధారపత్రాలు 18.

 
* భాషేతర వాచకాల్లో విషయం ప్రధానమైంది.
 

భాషా వాచకాలు:
మన రాష్ట్రంలో భాషా వాచకాలు మూడు     

     1) ప్రథమ భాషా వాచకాలు (First language T.B)
     2) ద్వితీయ భాషా వాచకాలు (Second language T.B)
     3) ఉపవాచకాలు (Non - detail)

* భాషా వాచకాల్లో భాష, భాషా నైపుణ్యాలు, సాహిత్యం ప్రధానమైనవి.
* భాషా నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, క్షుణ్న పఠనం, మానసిక శక్తులను వెలికితీసేందుకు భాషావాచకాలు ఉపకరిస్తాయి.


 
* బాలగేయాలు, చిన్న చిన్న నీతి పద్యాలు సరళ గ్రాంథిక భాషలో ఉండాలి.
* ప్రాథమిక దశలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే నైపుణ్యాలు నేర్పడానికి అవసరమయ్యేది సరళ వ్యవహారిక భాష.
* ప్రాథమిక దశలోని పాఠాల్లో సరళ వ్యవహారిక భాషను ఉపయోగించాలి.
* వ్యవహారిక గద్య పాఠాలతో పాటు స్థాయికి తగిన గ్రాంథిక గద్య, పద్య పాఠాలు ఉండే దశ మాధ్యమిక దశ.
* ఉన్నత దశకు చెందిన పాఠ్యపుస్తకంలో సగం పాఠాలు వ్యవహారిక భాషలో, సగం పాఠాలు గ్రాంథిక భాషలో ఉండాలి.
* ప్రాథమిక దశలో ఒక్కో తరగతికి చెందిన వాచకం ఒక్కో రచయిత కూర్చినదై ఉండాలి. ఈ విధంగా ఉండటం వల్ల ప్రతి వాచకం రచనాశైలి ఒకే విధంగా ఉంటుంది.
* వివిధ రచయితలు రాసిన పాఠాలు మాధ్యమికోన్నత దశలో ఉండాలి. అన్ని రకాల శైలిలకు ఉన్నత దశలో అవకాశం ఇవ్వాలి.
* పొడుపు కథలు, బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడే పద్యాలు ప్రాథమిక దశలో ఉండాలి. 
* పద్య, గద్య పాఠాలతో పాటు గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలు లాంటి ప్రక్రియలకు మాధ్యమిక దశలో స్థానం ఇవ్వాలి. 
* పద్య, గద్య పాఠాలతో పాటు ఉదాత్తమైన గేయాలు, సంభాషణ పాఠాలు, వచన కవితలు, మినీ కవితలు, కథానికలు లాంటి సాహిత్య ప్రక్రియలను ఉన్నత దశలో ప్రవేశపెట్టాలి.

¤ బాలగేయాలు, చిన్న చిన్న నీతి పద్యాలు సరళ గ్రాంథిక భాషలో ఉండాలి.
¤ ప్రాథమిక దశలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనే నైపుణ్యాలు నేర్పడానికి అవసరమయ్యేది సరళ వ్యవహారిక భాష.
¤ ప్రాథమిక దశలోని పాఠాల్లో సరళ వ్యవహారిక భాషను ఉపయోగించాలి.
¤ వ్యవహారిక గద్య పాఠాలతో పాటు స్థాయికి తగిన గ్రాంథిక గద్య, పద్య పాఠాలు ఉండే దశ మాధ్యమిక దశ.
¤ ఉన్నత దశకు చెందిన పాఠ్యపుస్తకంలో సగం పాఠాలు వ్యవహారిక భాషలో, సగం పాఠాలు గ్రాంథిక భాషలో ఉండాలి.
¤ ప్రాథమిక దశలో ఒక్కో తరగతికి చెందిన వాచకం ఒక్కో రచయిత కూర్చినదై ఉండాలి. ఈ విధంగా ఉండటం వల్ల ప్రతి వాచకం రచనాశైలి ఒకే విధంగా ఉంటుంది.
¤ వివిధ రచయితలు రాసిన పాఠాలు మాధ్యమికోన్నత దశలో ఉండాలి. అన్ని రకాల శైలిలకు ఉన్నత దశలో అవకాశం ఇవ్వాలి.
¤ పొడుపు కథలు, బాలగేయాలు, శబ్ద మాధుర్యం తొణికిసలాడే పద్యాలు ప్రాథమిక దశలో ఉండాలి. 
¤ పద్య, గద్య పాఠాలతో పాటు గేయాలు, లేఖలు, సంభాషణ పాఠాలు లాంటి ప్రక్రియలకు మాధ్యమిక దశలో స్థానం ఇవ్వాలి. 
¤ పద్య, గద్య పాఠాలతో పాటు ఉదాత్తమైన గేయాలు, సంభాషణ పాఠాలు, వచన కవితలు, మినీ కవితలు, కథానికలు లాంటి సాహిత్య ప్రక్రియలను ఉన్నత దశలో ప్రవేశపెట్టాలి.
* పాఠాల సందర్భం, వాటిని రాసిన కవుల వివరాలన్నింటినీ పాఠాల పూర్వరంగం అంటారు.
* ప్రణాళిక, బోధనా పద్ధతుల గురించి ఉపాధ్యాయులకు సూచనలు చేసే విభాగం ముందుమాట.
* 2, 3 తరగతుల్లో 1, 2 వాక్యాల పేరాలు; 4వ తరగతికి 3, 4 వాక్యాల పేరాలు; 5వ తరగతికి పాఠం నిడివిని బట్టి పేరాలు ఉండాలి.
* 2, 3 తరగతుల్లో వాక్యాంత బిందువు (.); 4, 5 తరగతుల్లో వాక్యాంత బిందువుతో పాటు ఇతర విరామ చిహ్నాలు తెలియజేయాలి.
* ప్రాథమిక దశలోని వాచకాల్లో పద స్వరూపం బాగా తెలియడానికి వీలుగా విసంధి రూపాలను (సంధి చెయ్యని రూపాలు) నేర్పించాలి.
* ప్రాథమిక దశలో సత్ప్రవర్తన పెంపొందించే పద్యాలు, నీతిని బోధించే కథలు ఉండాలి. 
* మాధ్యమిక దశలో హాస్య, కరుణ, వీర, శాంతి రసాలున్న పాఠాలు ప్రవేశపెట్టాలి.
* మాధ్యమిక దశలో ఒక్కో పాఠం నాలుగు, అయిదు పీరియడ్లలో బోధించడానికి వీలుగా ఉండాలి. 
* ఉన్నత దశలో అద్భుత, హాస్య, కరుణ, వీర, రౌద్ర, శాంత రసాలకు చెందిన పాఠాలు ఉండాలి.
* మాధ్యమిక దశలో ధర్మరాజు, గౌతమ బుద్ధుడు లాంటి శాంతికాముకుల సందేశాలు ఉండే పాఠాలు; అభ్యుదయ కవుల కవితలు ఉండాలి.

* మన దేశ సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజేసే శివాజీ, శిబి చక్రవర్తి, పురుషోత్తముడికి సంబంధించిన పాఠాలు ఉన్నత దశలో ఉండాలి.
* మాతృభాషా వాచకాల్లో విజ్ఞానాత్మక విషయాల కంటే హృదయ వికాసం పెంపొందించే విషయాలుండటం ముఖ్యం.
 

ద్వితీయ భాషా వాచకం
* ద్వితీయ భాషా వాచకంలో ఉండాల్సిన అంశాలు రెండు.
     1) సాంస్కృతిక
     2) సామాజిక అంశాలు
* సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నా భారతీయులందరూ ఒకటే అన్న అంతఃసూత్రాన్ని ప్రతిబింబించేవే ద్వితీయ భాషా వాచకాలు.
* సమాజంలోని కులమతాలన్నీ సమానమనే సమతాభావాలు పెంపొందేలా ఉండాల్సినవి ద్వితీయ భాషా వాచకాలు.
* ద్వితీయ భాషా వాచకాల్లో వ్యవహారిక భాషను ఉపయోగించాలి. పరిచయానికి మాత్రమే గ్రాంథిక భాషను వాడాలి. 
* ద్వితీయ భాషా వాచకాల్లోని అభ్యాస వేదికల్లో వాక్య నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
* ద్వితీయ భాషా వాచకాలు జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను ప్రోత్సహించాలి.

 

ఉపవాచకం:
* ఉపవాచకాన్ని సహాయవాచకం లేదా అనుబంధ వాక్యపూరణ వాచకం అని కూడా అంటారు. 
* ఉపవాచకం విస్తార పఠన నైపుణ్యాన్ని, స్వీయ అభ్యసన శక్తులను పెంపొందించడానికి ఉద్దేశించింది. 
* ఇది వివిధ నిఘంటువులను పరిశీలించే నైపుణ్యంతోపాటు భాషా జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుంది. 
* 8, 9, 10 తరగతుల ఉపవాచకాల్లో జీవిత చరిత్ర/ఒక పెద్ద కథ ఉండాలి.
* చిన్న చిన్న అంశాలుండే ఉపవాచకాలు 6, 7 తరగతుల విద్యార్థులకు ఉండాలి.


 

భాషా లక్షణాలు
* ఉపవాచకంలోని భాష కింది తరగతి వాచకానికి సమానం.
* 10వ తరగతి ఉపవాచకంలోని భాష 8వ తరగతి వాచకానికి సమానం.
* 6వ తరగతిలో ప్రథమ భాషగా, 8వ తరగతిలో ద్వితీయ భాషగా ఉపవాచకాన్ని ప్రవేశపెట్టాలి.

 

పుస్తక నిధి

* పుస్తకాలను సేకరించి, భద్రపరిచి అవసరమైన వారికి అందించే స్థలం.
* పుస్తక నిధిని చిట్టి గ్రంథాలయం అంటారు. 
* పుస్తక నిధి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచడానికి ఉద్దేశించింది.

 

పుస్తక నిధి నిర్వహణలో పాటించాల్సిన మెళకువలు
* కవులు, రచయితల నుంచి ఉచిత ప్రతులు పొందాలి.
* పుస్తక ప్రచురణ సంస్థల నుంచి వచ్చే నమూనా ప్రతులను భద్రపరచుకోవాలి.
* వచ్చిన ప్రతి పుస్తకాన్ని, దాని వివరాలను రిజిస్టరులో నమోదు చేయాలి.

భాషా ప్రయోగశాల
* భాషా ప్రయోగశాలను మొదటిసారి ఉపయోగించిన దేశం యూఎస్‌ఏ. ఇది ఒక స్వయం అభ్యసన పరికరం.
* భాషా ప్రయోగశాలలో శ్రవణ, భాషణాల నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. 
* భాషా ప్రయోగశాల ద్వితీయ, తృతీయ భాషలను అభ్యసించేవారికి ప్రయోజనకారి. దీని ప్రధాన ఉద్దేశం విద్యార్థుల ఉచ్చారణ నైపుణ్యాలను మెరుగుపరచడం.


భాషా ప్రయోగశాలలో మూడు విభాగాలు ఉంటాయి.
అవి: 1) శ్రవణ అర - 20 - 30 మంది విద్యార్థులు
   2) సలహాదారు అర
  3) నియంత్రణ అర - అదనపు టేపులు, టేప్‌రికార్డర్‌
* భాషా ప్రయోగశాల క్రమీకృత, వ్యవస్థీకృత భాషాభ్యాసాలను రూపొందించి ఒకేసారి చాలా మంది విద్యార్థులకు బోధించ గల సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ పర్యాయాలు అభ్యాసం చేయడానికి దోహదపడుతుంది.


 

Posted Date : 04-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌