• facebook
  • whatsapp
  • telegram

వైయక్తిక భేదాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. ప్రకాశ్‌ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉదయం పూట బాగా బోధిస్తూ, మధ్యాహ్నం అనాసక్తితో బోధిస్తున్నాడు. అయితే దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు?
జ: వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు

 

2. కిందివాటిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించేది?
1) రమేష్‌ తరగతిలో అందరి కంటే ప్రజ్ఞాశాలి.
2) హరి చదవడం కంటే ఆటల్లో పాల్గొనడానికి అధిక ఆసక్తిని చూపుతాడు.
3) శ్రీనివాస్‌ తన స్నేహితుల కంటే వ్యవహార దక్షత గలవాడు.
4) రమణ తరగతిలో సమయపాలన పాటించే విద్యార్థి.
జ: 2 (హరి చదవడం కంటే ఆటల్లో పాల్గొనడానికి అధిక ఆసక్తిని చూపుతాడు.)

 

3. కిందివాటిలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదం కానిది?
1) గోవింద్‌కు ఆంగ్లం కంటే గణితంపై ఆసక్తి ఎక్కువ.    
2) ప్రశాంత్‌ తన వయసు వారికంటే ఎక్కువ ప్రజ్ఞాశాలి.
3) బాగా చదివే రాము ఆటలు కూడా బాగా ఆడటం.
4) పాటలు బాగా పాడగల రమేష్‌ డ్యాన్స్‌ కూడా బాగా చేయడం.
జ: 2 (ప్రశాంత్‌ తన వయసు వారికంటే ఎక్కువ ప్రజ్ఞాశాలి.)

 

4. వ్యక్తంతర భేదాలు అనేవి?
జ: వివిధ వ్యక్తులు వివిధ సన్నివేశాల్లో వివిధ రకాలుగా ప్రవర్తించడం.

 

5. శ్రీనివాస రామానుజన్‌ గణితంలో మేధావి అయినప్పటికీ ఆంగ్ల భాషా సామర్థ్యం లేకపోవడం...
జ: వ్యక్తంతర్గత వైయక్తిక భేదం

 

6. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణనలోనికి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగించాలని తెలిపినవారు?
జ: రూసో

 

7. కిందివాటిలో రూసో రచించిన గ్రంథం?
1) డెమొక్రసీ అండ్‌ ఎడ్యుకేషన్‌     2) ఆన్‌ మొమరీ     3) హెరిడిటరీ జీనియస్‌     4) ఎమిలీ
జ: 4 (ఎమిలీ)

 

8. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి
జ: గాల్టన్‌

 

9. ‘యాన్‌ ఎంక్వైరీ ఇన్‌టు హ్యూమన్‌ ఫ్యాకల్టీ అండ్‌ ఇట్స్‌ డెవలప్‌మెంట్‌’ గ్రంథకర్త
జ: ఫ్రాన్సిస్‌ గాల్టన్‌

 

10. అభ్యాసకుల్లో వైయక్తిక భేదాలు సాధారణం. వాటికోసం ఉపాధ్యాయుడు చేయాల్సింది?
జ: విభిన్న అభ్యసన అనుభవాలు కల్పించాలి.

 

11. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశాన్నైనా ప్రస్తుతం వైయక్తిక భేదంగా పరిగణించాలని తెలియజేసినవారు?
జ: బి.ఎఫ్‌. స్కిన్నర్‌

 

12. ఫిలాసఫీ అద్భుతంగా బోధించగల ఒక ప్రొఫెసర్‌ సైకాలజీని అంతగా బోధించలేకపోవడం
జ: వ్యక్తంతర్గత భేదం

 

13. నీ అన్నయ్య వసంత్‌ నీ కంటే అన్ని సబ్జెక్టులు బాగా చదువుతాడు. కానీ నీకు మాత్రం ఒక్క సబ్జెక్టు కూడా రాదని అనంత్‌ను అస్తమానం తిట్టే మాస్టర్‌కు అవసరమయ్యే జ్ఞానం
జ: అంతర వైయక్తిక భేదాల జ్ఞానం

 

14. మహేష్‌ చేతిరాత బాగుంటుంది. ఆంగ్లంలో అతడి నిష్పాదన సగటుగా ఉంటుంది. సహ విద్యార్థితో పోలిస్తే మొత్తం మీద అతడి నిష్పాదన బాగుంటుంది. ఇది ఏ రకమైన వైయక్తిక భేదాన్ని తెలియజేస్తుంది?
జ: వ్యక్తంతర్గత, వ్యక్తంతర

 

15. ‘బాగా చదవగల నైపుణ్యం ఉండి, చేతిరాత బాగా లేని సాయి’ అనే వాక్యం కింది ఏ భావనను వివరించడానికి సరైంది? 
1) వ్యక్తంతర తరగతి భేదం           2) అంతర వైయక్తిక భేదం 
3) వ్యక్తంతర వ్యక్తిగత భేదం         4) వ్యక్తంతర్గత వైయక్తిక భేదం
జ: 4 (వ్యక్తంతర్గత వైయక్తిక భేదం)

 

16. ప్రశాంత్‌ అనే ఉపాధ్యాయుడు ఒకే తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఒకే సాధన పరీక్షను నిర్వహించినప్పుడు ఇద్దరికీ వేర్వేరు మార్కులు వచ్చాయి. ఇలా రావడానికి గల కారణం తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి అవసరమయ్యే జ్ఞానం
జ: వైయక్తిక భేదాల జ్ఞానం

 

17. ఒక ఉపాధ్యాయుడిగా నీవు కిందివాటిలో దేన్ని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు?
1) శ్రీహరి కంటే హరి బాగా చదువుతాడు.    
2) రమణ కంటే శ్రీనివాస్‌కు సృజనాత్మకత ఎక్కువ.
3) ప్రకాష్‌ తరగతిలో పొడవైన విద్యార్థి.        
4) కిరణ్‌లో సృజనాత్మకత తక్కువైనప్పటికీ ప్రజ్ఞాస్థాయి అధికం.
జ: 4 (కిరణ్‌లో సృజనాత్మకత తక్కువైనప్పటికీ ప్రజ్ఞాస్థాయి అధికం.)

 

18. వయసు, జాతి, లింగ భేదాలు అనేవి వైయక్తిక భేదాలకు
జ: కారణమవుతాయి

 

19. అనిల్‌ నాటక ప్రదర్శనలో సంభాషణలు బాగా చెప్పినప్పటికీ పాటలు అంతగా పాడలేకపోవడం
జ: వ్యక్తంతర్గత వైయక్తిక భేదం

 

20. ‘లోకో భిన్న రుచి’ అనేది ఏ రకమైన వైయక్తిక భేదాలను సూచిస్తుంది?
జ: వ్యక్తంతర

 

21. CADV పరీక్ష ఏ రకమైంది?
జ: ప్రజ్ఞా పరీక్ష

 

22. నాగేంద్ర శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 4 సంవత్సరాలు. అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి?
జ: సగటు కంటే తక్కువ

 

23. కిందివాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని ప్రవచనం? 
1) ప్రజ్ఞ అనువంశికతపై అధికంగా ఆధారపడుతుంది.    
2) ప్రజ్ఞను జ్ఞానం ద్వారా మెరుగుపరుచుకోలేం. 
3) ప్రజ్ఞలో లింగభేదాలకు అవకాశం ఉంటుంది.        
4) ప్రజ్ఞను కలిగి ఉండటంలో వైయక్తిక భేదాలు ఉంటాయి.
జ: 3 (ప్రజ్ఞలో లింగభేదాలకు అవకాశం ఉంటుంది.)

 

24. మానవమితి ప్రయోగశాలను స్థాపించినవారు?
జ: గాల్టన్‌

 

25. ‘పిల్లలు వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల నాదేశం అభివృద్ధి చెందుతుంది’ అని పేర్కొన్నవారు?
జ: జాన్‌ డ్యూయీ

 

26. శాబ్దిక పరీక్షలు అనేవి
జ: అక్షరాస్యులకు మాత్రమే ఉద్దేశించినవి.

 

27. సామూహిక కారక సిద్ధాంతంలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య
జ: 7

 

28. దర్పిత టీవీ కార్టూన్ల పట్ల అవధానాన్ని నిలుపుతుంది. హాసిని కార్టూన్లను గీయడంలో ఆసక్తి చూపుతుంది. అయితే హాసిని, దర్పితలోని మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా
జ: సహజసామర్థ్యం, అభిరుచి

 

29. కిందివాటిలో థారన్‌డైక్‌ పేర్కొన్న ప్రజ్ఞా రకాల్లో లేనిది?
1) అమూర్త ప్రజ్ఞ     2) యాంత్రిక ప్రజ్ఞ      3) సాంఘిక ప్రజ్ఞ     4) ప్రాదేశిక ప్రజ్ఞ
జ: 4 (ప్రాదేశిక ప్రజ్ఞ)

 

30. ‘కొత్త సమస్యలకు, పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ’ అని పేర్కొన్నవారు?
జ: స్టెర్న్‌

 

31. ‘సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలోని సామర్థ్యమే ప్రజ్ఞ’ అని పేర్కొన్నవారు?
జ: స్కోడార్డ్‌

 

32. కిందివాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది.
1) సమస్యాపరిష్కార శక్తి              2) అమూర్త ఆలోచనా శక్తి
3) విభిన్న ఆలోచనా శక్తి     4) అభ్యసనా శక్తి
జ: 3 (విభిన్న ఆలోచనా శక్తి)

 

33. కిందివాటిలో ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి సరికానిది.
1) ప్రతి వ్యక్తిలో ఉండే సహజ అంతర్గత శక్తి.
2) ప్రజ్ఞకు లైంగిక పరమైన భేదం ఉండదు.
3) ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు.
4) ప్రజ్ఞ మాపనం చేసే ప్రక్రియ.
జ: 3 (ప్రజ్ఞను శిక్షణ ద్వారా మెరుగుపరచుకోవచ్చు.)

 

34. కిందివాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. 
1) లక్ష్యసాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగల సామర్థ్యం.
2) నిర్దిష్ట రంగంలో రాణించగల అంతర్గత సామర్థ్యం.
3) పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తి.
4) భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందే సామర్థ్యం.
జ: 2 (నిర్దిష్ట రంగంలో రాణించగల అంతర్గత సామర్థ్యం.)

 

35. సుదీప్‌ తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించి, వారిని మెప్పించి తనకు అనుకూలంగా వారి ప్రతిస్పందనను పొందాడు. అయితే అతడికి ఉండే ప్రజ్ఞ?
జ: సాంఘిక ప్రజ్ఞ

 

36. ప్రొఫెసర్‌ వెంకటరావు బోధనలో తత్వవేత్తల ఆలోచనలను, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, గణిత శాస్త్ర సూత్రాలను ఉపయోగించాడు. అయితే అతడిలో ఏ రకమైన ప్రజ్ఞ అధికంగా ఉందని భావించవచ్చు?
జ: అమూర్త ప్రజ్ఞ

 

37. నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎవరిలో సృజనాత్మకత పెంపొందించే ప్రయత్నం చేస్తావు?
జ: పిల్లలందరిలో

 

38. కిందివాటిలో సృజనాత్మకతను వికసింపజేసే కృత్యం
1) పాఠశాల ప్రారంభం నుంచి సాధించాల్సిన లక్ష్యాల ప్రాముఖ్యాన్ని వివరించడం. 
2) పరీక్షల్లో మంచి ఫలితాల సాధనకు శిక్షణ ఇవ్వడం.
3) వ్యవహారిక మాంద్యంలో పిల్లలకు విద్యను బోధించడం. 
4) పిల్లలు ప్రశ్నించడానికి, వారిలోని అంతర్గత శక్తులను అభివృద్ధి చేసే వాతావరణాన్ని కల్పించడం.
జ: 4 (పిల్లలు ప్రశ్నించడానికి, వారిలోని అంతర్గత శక్తులను అభివృద్ధి చేసే వాతావరణాన్ని కల్పించడం.)

 

39. సృజనాత్మకత కిందివాటిలో దేనికి సంబంధించింది? 
1) పాత్రపోషణ     2) అనుకరణ     3) విభిన్న ఆలోచన     4) సమైక్య ఆలోచన
జ: 3 (విభిన్న ఆలోచన)

Posted Date : 30-08-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్కూల్ అసిస్టెంట్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు