• facebook
  • whatsapp
  • telegram

భూచలనాలు, రుతువులు

ఆ దేశంలో అర్ధరాత్రి సూర్యోదయం!

భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న విషయం తెలిసిందే. భూభ్రమణం, భూపరిభ్రమణంగా పిలిచే ఈ చలనాల వల్లే రాత్రి, పగలు, గ్రహణాలు, రుతువులు ఏర్పడుతున్నాయి. సముద్ర ప్రవాహాలు, పవనాల్లో మార్పులూ వాటి ప్రభావమే. భూమిపై ఆ సహజ సిద్ధ పరిణామాలు, మారే కాలాల గురించి అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. దేశ, ప్రపంచ భౌగోళిక స్థితిగతులతో పాటు అయనాంతాలు, విషవత్తులు సంభవించే ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవాలి.


1.    కిందివాటిలో భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న దేశాలను గుర్తించండి.

1) చిలీ     2) దక్షిణాఫ్రికా 

3) ఆస్ట్రేలియా     4) పైవన్నీ


2.     కిందివాటిలో భూమధ్యరేఖకు ఉత్తరాన, దక్షిణాన విస్తరించిన ఖండం ఏది? 

1) ఆఫ్రికా     2) దక్షిణ అమెరికా 

3) 1, 2     4) ఐరోపా


3. భూమి అక్షం కక్ష్యతలంపై ఎంత కోణంతో ఉంటుంది? 


4. భూమి ఎన్ని డిగ్రీల మేర వంగి ఉంటుంది? 


5. సూర్యకిరణాలు కర్కటరేఖపై నిటారుగా ఏ తేదీన ప్రసరిస్తాయి?

1) జూన్‌ 21    2) జులై 21    

3) డిసెంబరు 22    4) మార్చి 21

6.     సూర్యకిరణాలు మకరరేఖపై నిటారుగా ఏ తేదీన సంభవిస్తాయి?

1) మార్చి 21     2) జూన్‌ 21 

3) డిసెంబరు 22     4) జులై 21


7.     కర్కటరేఖ నుంచి మకరరేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?     

1) ఉష్ణమండలం     2) సమశీతోష్ణ మండలం

3) 1, 2     4) ఏదీకాదు 


8.     భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిటారుగా ఏ తేదీల్లో సంభవిస్తాయి? 

1) మార్చి 21     2) సెప్టెంబరు 23 

3) 1, 2     4) జూన్‌ 21 

9.     కిందివాటిలో విషవత్తులు సంభవించే రోజు?

1) మార్చి 21     2) సెప్టెంబరు 23 

3) 1, 2     4) డిసెంబరు 23 


10. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ఏ మండలంలో ఉన్నాయి? 

1) ఉష్ణమండలం     2) సమశీతోష్ణ మండలం

3) ఉప ఉష్ణమండలం     4) ఏదీకాదు


11. దిల్లీ ఏ మండలంలో ఉంది?

1) ఉష్ణమండలం     2) సమశీతోష్ణ మండలం

3) ఉప ఉష్ణమండలం     4) ఏదీకాదు

12. భూమధ్యరేఖకు ఉత్తరాన ఉన్న ఖండాన్ని గుర్తించండి.

1) ఐరోపా     2) దక్షిణ అమెరికా 

3) ఆఫ్రికా     4) ఏదీకాదు


13. కిందివాటిలో భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న ఖండం ఏది?

1) దక్షిణ అమెరికా     2) ఆఫ్రికా 

3) ఆస్ట్రేలియా     4) ఆసియా


14. కిందివాటిలో రుతువులు వేటి వల్ల ఏర్పడతాయి?

1) భూభ్రమణం     2) భూ పరిభ్రమణం 

3) భూచలనం     4) ఏదీకాదు

15. కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

1) జూన్‌ 21 నాటికి ఉత్తరార్ధ గోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది.

2) జూన్‌ 21 నాటికి ఉత్తరార్ధ గోళం సూర్యుడికి దూరంగా ఉంటుంది.

3) జూన్‌ 21న సూర్యకిరణాలు మకరరేఖపై నిటారుగా పడతాయి.   4) ఏదీకాదు 


16. డిసెంబరు 22 నాటికి ఉత్తరార్ధ గోళంలో ఏ కాలం ఉంటుంది?

1) శీతాకాలం     2) వేసవికాలం 

3) శరదృతువు     4) ఏదీకాదు 


17. మార్చి 21 నాటికి దక్షిణార్ధ గోళంలో ఏ రుతువు ఉంటుంది?

1) శరదృతువు     2) వసంత రుతువు 

3) వేసవికాలం     4) శీతాకాలం


18. జూన్‌ 21 నాటికి ఉత్తరార్ధ గోళంలో ఏ కాలం ఉంటుంది? 

1) శీతాకాలం     2) వేసవికాలం 

3) శరదృతువు     4) ఏదీకాదు


19. డిసెంబరు 22 నాటికి దక్షిణార్ధ గోళంలో ఏ కాలం ఉంటుంది?     

1) శీతాకాలం     2) వేసవికాలం 

3) శరదృతువు     4) ఏదీకాదు


20. సెప్టెంబరు 23 నాటికి ఉత్తరార్ధ గోళంలో ఏ రుతువు ఉంటుంది? 

1) శీతాకాలం     2) వేసవికాలం 

3) శరదృతువు     4) ఏదీకాదు 


21. జూన్‌ 21 నాటికి దక్షిణార్ధ గోళంలో ఏ కాలం ఉంటుంది? 

1) వేసవికాలం     2) శీతాకాలం     

3) శరదృతువు     4) ఏదీకాదు 

22. భూమి కక్ష్య సుమారు ఎన్ని కిలో మీటర్లు?

1) 956 మిలియన్‌ కి.మీ. 2) 965 మిలియన్‌ కి.మీ.

3) 966 మిలియన్‌ కి.మీ.     4) ఏదీకాదు 


23. భూమికి, సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే ఏ గ్రహణం సంభవిస్తుంది? 

1) చంద్రగ్రహణం     2) సూర్యగ్రహణం 

3) 1, 2     4) ఏదీకాదు


24. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది? 

1) చంద్రగ్రహణం     2) సూర్యగ్రహణం 

3) 1, 2     4) ఏదీకాదు

25. కిందివాటిలో సూర్యగ్రహణానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి.  

1) సూర్యగ్రహణం అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. 

2) అన్ని అమావాస్య రోజుల్లో సూర్యగ్రహణం సంభవించదు.

3) భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తే సూర్యగ్రహణం సంభవిస్తుంది. 4) పైవన్నీ


26. లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 

1) 28     2) 29    3) 27     4) 30 


27. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు భూమికి, సూర్యుడికి మధ్య కనిష్ఠ దూరాన్ని ఏమంటారు?

1) అపహేళి     2) పరిహేళి 

3) ఉత్తరాయణం     4) ఏదీకాదు 

28. భూ పరిభ్రమణ సమయంలో జులై 4న ఏం సంభవిస్తుంది? 

1) పరిహేళి     2) అపహేళి 

3) దక్షిణాయణం     4) ఉత్తరాయణం 


29. జూన్‌ 21 నాటికి కర్కటరేఖపై ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయి? 

1) ఎక్కువ వేడిగా ఉంటాయి    2) అత్యంత చల్లగా ఉంటాయి    

3) మధ్యస్థంగా ఉంటాయి         4) ఏదీకాదు 


30. డిసెంబరు 22 నాటికి మకరరేఖపై ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏవిధంగా ఉంటాయి?

1) తక్కువ వేడిగా ఉంటాయి     2) ఎక్కువ వేడిగా ఉంటాయి     

3) మధ్యస్థంగా ఉంటాయి         4) ఏదీకాదు

31. భూపరిభ్రమణ సమయంలో జనవరి 3న ఏం సంభవిస్తుంది?     

1) పరిహేళి     2) అపహేళి 

3) ఉత్తరాయణం     4) దక్షిణాయణం 


32. భూమి పరిభ్రమణ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య గరిష్ఠ దూరాన్ని ఏమంటారు? 

1) పరిహేళి     2) అపహేళి 

3) దక్షిణాయణం     4) ఏదీకాదు 


33. కింది ఏ తేదీల్లో భూమి అంతటా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి?

1) మార్చి 21     2) సెప్టెంబరు 23 

3) 1, 2     4) జూన్‌ 21 

34. దక్షిణార్ధ గోళంలో సెప్టెంబరు 23 నాటికి ఏ కాలం ఉంటుంది? 

1) వేసవికాలం     2) శీతాకాలం 

3) వసంతకాలం     4) శరదృతువు 


35. ఉత్తరార్ధ గోళంలో మార్చి 21 నాటికి ఏ కాలం ఉంటుంది? 

1) శరదృతువు      2) వసంతకాలం 

3) వేసవికాలం     4) శీతాకాలం   


36. అపహేళి సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎంత? 

1) 152 మిలియన్‌ కి.మీ.     2) 147 మిలియన్‌ కి.మీ. 

3) 150 మిలియన్‌ కి.మీ.     4) 145 మిలియన్‌ కి.మీ.

37. పరిహేళి సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య దూరం ఎన్ని కిలో మీటర్లు?

1) 149 మిలియన్‌ కి.మీ.     2) 150 మిలియన్‌ కి.మీ.

3) 147 మిలియన్‌ కి.మీ.     4) 155 మిలియన్‌ కి.మీ.


38. కిందివాటిలో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? 

1) జర్మనీ 2) పోలండ్‌ 3) నార్వే 4) ఉక్రెయిన్‌


39. ప్రాచీన సంస్కృతి సాహిత్యం ప్రకారం ఒక సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా విభజిస్తారు? 

1) 3      2) 4     3) 6      4) 5 


40. కిందివాటిని జతపరచండి.

కాలం ఆంగ్ల నెలలు 
ఎ) వసంతకాలం 1) సెప్టెంబరు - అక్టోబరు
బి) గ్రీష్మకాలం 2) జులై - ఆగస్టు
సి) వర్షాకాలం 3) మే - జూన్‌
డి) శరత్కాలం 4) మార్చి - ఏప్రిల్‌

1) ఎ-2, బి-3, సి-4, డి-1 

2) ఎ-4, బి-3, సి-2, డి-1 

3) ఎ-1, బి-2, సి-3, డి-4   

4) ఎ-1, బి-4, సి-2, డి-3


41. ఏ కాలంలో భారతదేశంలో అనేక వర్గాల ప్రజలు తమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వివిధ రకాల పండుగలు చేసుకుంటారు?    

1) వసంతకాలం     2) శీతాకాలం 

3) వేసవికాలం     4) శరత్కాలం 


42. బిహు ఏ రాష్ట్ర పండుగ?

1) అరుణాచల్‌ప్రదేశ్‌     2) అస్సాం 

3) సిక్కిం     4) మేఘాలయ 

43. హోలీ, గుడిపడ్వా, బిహు, ఉగాది లాంటి పండుగలను ఏ కాలంలో చేసుకుంటారు?

1) శీతాకాలం     2) శరత్కాలం 

3) వేసవికాలం     4) వసంతకాలం 


44. కింది ఏ రుతువులో చలి అధికంగా ఉంటుంది?

1) శిశిరరుతువు     2) వసంతరుతువు 

3) గ్రీష్మరుతువు     4) శరదృతువు  


45. ఏ రుతువులో దసరా, దీపావళి పండుగలు చేసుకుంటారు?

1) వసంతరుతువు 2) శరదృతువు 

3) గ్రీష్మరుతువు         4) శిశిరరుతువు 


సమాధానాలు

1-4; 2-3; 3-2; 4-4; 5-1; 6-3; 7-1; 8-3; 9-3; 10-1; 11-2; 12-1; 13-3; 14-2; 15-1; 16-1; 17-1; 18-2; 19-2; 20-3; 21-2; 22-2; 23-2; 24-1; 25-4; 26-2; 27-2; 28-2; 29-1; 30-2; 31-1; 32-2; 33-3; 34-3; 35-2; 36-1; 37-3; 38-3; 39-3; 40-2; 41-1; 42-2; 43-4; 44-1; 45-2.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 

Posted Date : 23-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌