• facebook
  • whatsapp
  • telegram

ఆవరణ శాస్త్రం, వ్యవస్థ

కాంతిరహిత మండలంలో త్రిపాద చేపలు!
 

 మన చుట్టూ ఉండే పర్యావరణంలోని అన్ని జీవ, నిర్జీవ కారకాలన్నింటితో ఆవరణ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇందులో భూ, జల సంబంధ జీవావరణ వ్యవస్థలు ప్రధానమైనవి. వేటికవే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండే ఆ సహజ, కృత్రిమ ఆవరణ వ్యవస్థల నిర్మాణం, నివసించే జీవులు, ఆహారపు గొలుసులు, పిరమిడ్లు, వాతావరణ పరిస్థితుల అనుకూలతల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. నిర్దిష్ట జీవావరణ వ్యవస్థ ఉన్న ప్రాంతాలు, అక్కడి జాతులు, జరిగిన పరిశోధనలు, సంబంధిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి.

1.     భారతదేశ ఆవరణ శాస్త్ర పితామహుడు?

1) యూజిన్‌ ఓడమ్‌     2) రామ్‌దేవ్‌ మిశ్రా 

3) స్లాతో     4) ప్లాటా


2.     కిందివాటిలో బయోటా అంటే?

1) సాధారణ వృక్షసంపద ఉన్న కాలం

2) వృక్షసంపద లేని ప్రదేశం     3) జంతుసంపద లేని ప్రదేశం

4) ఒక ప్రాంతంలోని జంతు, వృక్ష జాతుల సముదాయం


3.     కిందివాటిని జతపరచండి.

1) ఆవరణ శాస్త్రం ఎ) యూజిన్‌ ఓడమ్‌
2) ఆవరణ శాస్త్రపిత బి) ఎర్‌హార్ట్‌
3) బయోస్టాసీ సి) జోసఫ్‌ గ్రిన్నెల్‌
4) నిచ్‌ డి) రీటర్‌

1) 1డి, 2ఎ, 3బి, 4సి        2) 1డి, 2బి, 3సి, 4ఎ

3) 1డి, 2సి, 3ఎ, 4బి       4) 1డి, 2ఎ, 3సి, 4బి


4.     కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యే జాతులను ఎండమిక్‌ జాతులు అంటారు.

బి) వాతావరణ కాలుష్యాన్ని పసిగట్టే జీవజాతికి ఉదాహరణ - లైకెన్స్‌

సి) పులి, రైనో, ఏనుగును పతాకస్థాయి జాతి జీవులు అంటారు.

డి) ఒక నిర్దిష్ట జీవావరణ వ్యవస్థలో ఉండే ఒకే జాతి జీవుల సమూహాన్ని జనాభా అంటారు.

1) ఎ, బి        2) ఎ, సి, డి     

3) ఎ, డి         4) ఎ, బి, సి, డి 


5.     జీవావరణం నిచ్‌ను అధికారికంగా ఉపయోగించిన వ్యక్తి?

1) గ్రిన్నెల్‌     2) షెల్‌ ఫోర్డ్‌ 

2)  టాన్స్‌లే      4) రాచల్‌ కార్సన్‌


6.     కిందివాటిలో అసత్య వాక్యం?

1)  కొలను ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు -  యూగ్లీనా, సైక్లాప్స్‌

2) కొలను ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులు - రైజోపస్, పెన్సిలీయం

3)  సరస్సు ఆవరణ వ్యవస్థలో ప్రొఫండల్‌ అనేది తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతం.

4) జీవ అనుఘటకాల్లో ప్రముఖ పాత్ర పోషించేవి స్వయంపోషితాలు, పరపోషితాలు.


7.    భావన - A:  సముద్ర మట్టం నుంచి ఎత్తయిన ప్రదేశంలో నివసించేవారు లోనయ్యే సాధారణ అపశ్రుతిని ‘ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌’ అంటారు.

భావన - B: ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌ ప్రధాన కారణం అతి తక్కువ స్థాయిలో వాతావరణ పీడనం, తక్కువ ఆక్సిజన్‌ లభ్యత.

1) A, B లు సత్యం.    2) A సత్యం, B అసత్యం. 

3) A సత్యం    4) A, B లు సత్యం. కాని A కి B సరైన వివరణ కాదు.


8.     సహభోజకత్వానికి ఉదాహరణ-

1) మైకోరైజా         2) ప్లాస్మోడియం  

3) ఇ.కొలై బ్యాక్టీరియా 4) సీ అనిమోన్‌


9.     కిందివాటిలో ఎడారి జీవుల అనుకూలనం కానిది?

1) ఎడారి మొక్కల పత్రాలు కంటకాలుగా మారడం.

2) ఎడారిలో నివసించే ఒంటె పొడవైన కనుబొమ్మలు కలిగి ఇసుక నుంచి రక్షణ పొందుతుంది.

3) కడుపులోని క్రాప్‌ భాగంలో నీటిని దాచుకునేది  గోల్డెన్‌ లిజార్డ్‌.

4) ఇసుకలో గెంతే జీవి సాండ్‌ డైవింగ్‌ లిజార్డ్‌.


10. కిందివాటిలో నిశాచరి కాని జీవి?

1) మానవుడు        2) చిల్కా గేదె    

3) గుడ్లగూబ        4) గబ్బిలం


11.     రోమాలు/బొచ్చుతో కప్పి ఉండే ఫెన్నిస్‌ ఫాక్స్‌ ఆవాసం?

1) మంచు        2) నీటిలో   

3) ఎడారి        4) ధ్రువ ప్రాంతం


12. కింది ఏ జీవుల్లో శరీర ప్లవనాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు సహాయపడతాయి?

1) తిమింగలం       2) సీల్‌    

3) చేపలు        4) 1, 2 


13. కిందివాటిలో ఏ జీవులు కాంతిరహిత మండలంలో నివసిస్తాయి?

1) సీ అనిమోన్లు      2) కోమటి సంచులు  

3) త్రిపాద చేపలు       4) 1, 2 


14. కిందివాటిని జతపరచండి.

1) యూఫోటిక్‌ ఎ) సముద్ర దోసకాయ
2) బెథియల్‌ బి) అంగుళ చేప 
3) అబైసల్‌  సి) డాఫ్నియా, సైక్లాప్స్‌
4) లిమ్నాటిక్‌ డి) డాల్ఫిన్‌

1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి    2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి

3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ    4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి


15. సముద్రంలో దాదాపు 80% మొక్కలు కలిగిన మండలం?

1) బెథియల్‌        2) అబైసల్‌   

3) యూఫోటిక్‌        4) లిమ్నాటిక్‌ 


16. కిందివాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి.

1) అబైసల్‌ మండలంలో భక్షక జీవులు ఉంటాయి.

2) ఈల్‌ చేప దాదాపు 600 కిలో వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి చేయగలదు.

3) రే ఫిష్‌కు తక్కువ వెలుతురులో కూడా చూడగల పెద్ద కళ్లు ఉంటాయి.

4) సరస్సు ఒడ్డున తక్కువ లోతున్న భాగాన్ని వేలాంచల మండలం అంటారు.


17. ఆవరణ పిరమిడ్లను ప్రవేశపెట్టింది?

1) చార్లెస్‌ ఎల్టన్‌       2) ప్రాస్టెస్‌  

3) ఓడమ్‌       4) రాచెల్‌ కార్సన్‌


18. సైలెంట్‌ స్ప్రింగ్‌ గ్రంథకర్త?

1) రాచెల్‌ కార్సన్‌       2) ఎల్టన్‌    

3) ప్రాస్టెస్‌        4) ఓడమ్‌ 


19. మంచినీటి జీవావరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు?

1) లిథాలజీ       2) అగ్రస్టాలజీ    

3) లిమ్నాలజీ        4) హైడ్రాలజీ


20. ‘జీవులకు, పరిసరాలకు మధ్య సంబంధాన్ని తెలిపే శాస్త్రం ఆవరణ శాస్త్రం’ అని అన్నదెవరు?

1) ఎర్నెస్ట్‌ హెకెల్‌        2) వార్మింగ్‌    

3) ఓడమ్‌        4) ఎల్టన్‌


21. కిందివాటిలో సత్య వాక్యం?

1) కణం, కణజాలం, అవయవం, జనాభా, సముదాయం, ఆవరణ వ్యవస్థ

2) కణం, అవయవం, కణజాలం, జనాభా, సముదాయం, ఆవరణ వ్యవస్థ

3) కణం, అవయవం, జనాభా, సముదాయం, ఆవరణ వ్యవస్థ

4) జీవి, జనాభా, సముదాయం, బయోస్‌


22. జీవ సంబంధపరంగా ఆవరణ వ్యవస్థలో భిన్నమైంది ఏది?

1) మృత్తిక        2) గాలి    

3) నీరు        4) పూతికాహారులు 


23. జీవ సందీప్తిని ప్రదర్శించే ప్రొటీన్‌?

1) ల్యూసిన్‌        2) ల్యూసిఫెరిన్‌     

3) లోకోఫెరాల్‌       4) 1, 2


24. డ్రాసోఫిలాలో ఉదయం పూట ఇమాగో దశ ఏర్పడేందుకు కారణం?

1) జీవక్రియలపై కాంతి ప్రభావం    2) సర్కేడియన్‌ లయ  

3) దిన క్రియలు        4) 2, 3


25. భ్రమణ రూప విక్రియకు ఉదాహరణ?

1) డాఫ్నియా        2) నాస్టాక్‌    

3) ఫైసేలియా        4) కోమటి సంచులు


26. సుప్తావస్థ కాలంలో చర్మ శ్వాసక్రియను జరిపే జీవులు?

1) కప్పలు         2) సాలమాండర్స్‌    

3) సిసిలియన్లు        4) 1, 2 


27. కిందివాటిలో ఆర్కిడ్‌ మొక్క స్వభావం?

1) సహభోజకత్వం    2) పరాన్నజీవనం

3) సహజీవనం    4) 1, 2


28. విచ్ఛిన్నకారుల విచ్ఛిన్న ప్రక్రియలో లేని దశ?

1) శకలీకరణం    2) విక్షాళనం

3) హ్యూమిఫికేషన్‌    4) శక్తిప్రసరణ


29. డెట్రిటిస్‌ ఆహారపు గొలుసులో మొదటి మెట్టు?

1) వానపాము    2) మృతజీవులు

3) ఈగలు    4) సర్పాలు


30. కిందివాటిలో ఏ పిరమిడ్‌ తలకిందులుగా ఉంటుంది?

1) సంఖ్యా పిరమిడ్‌         2) శక్తి పిరమిడ్‌

3) జీవ ద్రవ్యరాశి పిరమిడ్‌     4) 1, 3


31. సాగరంలో ఏ పిరమిడ్‌ తలకిందులుగా ఉంటుంది?

1) సంఖ్యా పిరమిడ్‌    2) శక్తి పిరమిడ్‌

3) ద్రవ్యరాశి పిరమిడ్‌    4) 1, 2


32. Q10 విలువను ప్రతిపాదించిన వ్యక్తి?

1) ఎల్టన్‌    2) వాంట్‌ హాఫ్‌

3) విలియం హార్వే    4) రాచెల్‌ కార్సన్‌


33. డాఫ్నియాలో తలముందు భాగం హెల్మెట్‌గా రూపాంతరం చెందే కాలం-

1) ఎండాకాలం    2) శీతాకాలం    

3) వసంతకాలం    4) వానాకాలం


34. కోరింగ మాంగ్రూవ్‌ అడవుల్లో ఉత్పత్తిదారులు?

1) మడ అడవులు    2) స్పైరోగైరా

3) యూగ్లీనా    4) పైవన్నీ


35. కిందివాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ కానిది-

1) సరస్సు ఆవరణ వ్యవస్థ    2) పంటపొలాల ఆవరణ వ్యవస్థ

3) పారిశ్రామిక ఆవరణ వ్యవస్థ  4) అక్వేరియం ఆవరణ వ్యవస్థ


36. ఇండో పసిఫిక్‌ సముద్రంలో ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో ఎన్ని జీవ జాతులుంటాయి?

1) 3400    2) 1000    

3) 1200    4) 1500


37. భూభాగంలో దాదాపు ఎంతశాతం ఎడారి ఆవరణ వ్యవస్థ ఉంది?

1) 17%       2) 30%   

3) 40%       4) 50%


38. అనోడ్రోమస్‌ వలస చేపలకు ఉదాహరణ?

1) అంగిల్లా       2) సీల్‌   

3) హిల్సా     4) మోనోడాన్‌


39. కిందివాటిలో ఏ మండలాలకు భూతల ప్రాంతాలతో సంబంధం ఉంటుంది?

1) లిమ్నోటిక్‌    2) లెంటిక్‌    

3) లోటిక్‌    4) 2, 3


40. కిందివాటిలో సహజీవనానికి ఉదాహరణ?

1) లైకెన్స్‌           2) రైజోబియం

3) మైకోరైజా         4) పైవన్నీ



సమాధానాలు


1-2, 2-4, 3-1, 4-4, 5-1, 6-3, 7-1, 8-4, 9-3, 10-1, 11-3, 12-4, 13-3, 14-1, 15-3, 16-2, 17-1, 18-1, 19-3, 20-1, 21-1, 22-4, 23-2, 24-4, 25-1, 26-4, 27-1, 28-4, 29-2, 30-1, 31-3, 32-2, 33-3, 34-4, 35-1, 36-2, 37-1, 38-3, 39-4, 40-4. 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం
 

Posted Date : 10-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌