• facebook
  • whatsapp
  • telegram

విజ్ఞానశాస్త్ర చరిత్ర, స్వభావం, పరిధి, అభివృద్ధి

1. ‘విజ్ఞానశాస్త్రం ఒక పరిశోధనా విధానం’ అన్నవారు?
జ: ఎ.డబ్ల్యు. గ్రీన్‌

 

2. ‘పీడనం పెరిగితే ఘనపరిమాణం పెరుగుతుంది’ అనేది ఏ ప్రకల్పన?
జ: ప్రకటనాత్మక

 

3. కిందివాటిలో ద్రవ్యాత్మక నిర్మాణం కానిది?
1) యథార్థాలు      2) సిద్ధాంతాలు      3) భవనాలు      4) అన్వేషణ
జ: 4 (అన్వేషణ)

 

4. సత్యాల మధ్య పరస్పర సంబంధాన్ని ఏర్పరిచి నియమబద్ధం చేస్తే అది
జ: సాధారణీకరణ

 

5. విజ్ఞానశాస్త్రం సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహమని చెప్పినవారు
జ: ఫ్రెడరిక్‌ సిడ్జ్‌ ప్రోటిక్‌

6. ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి అనేది ఒక
జ: యథార్థం

 

7. ఏ వస్తువు కంపించినా ధ్వని పుడుతుంది అనేది ఒక
జ: సాధారణీకరణ

 

8. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చినవారు
జ: హెన్రీ పాయింకర్‌

 

9. సోపానాలను వైజ్ఞానిక పద్ధతిలో తెలిపినవారు
జ: కార్ల్‌ పియర్సన్‌

 

విజ్ఞానశాస్త్రం - ఉద్దేశాలు, విలువలు

10. ‘ముందే ఒదిగి ఉన్న సమన్వయమే ఈ సృష్టి’ అని పేర్కొన్నవారు?
జ: ఐన్‌స్టీన్‌

 

11. కొత్తకోణంలో ఆలోచించి, ఉన్న విషయానికి కొత్త భాష్యం చెప్పగల రవి అనే విద్యార్థిలో నెరవేరిన విలువ?
జ: సృజనాత్మక విలువ

 

12. ‘ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి’ అని సూత్రీకరించిన విద్యార్థిలో నెరవేరిన బోధనా లక్ష్యం
జ: వినియోగం

13. పొడవు, ద్రవ్యరాశి, కాలం, వేగంలలో వేగాన్ని వేరుపరిచిన విద్యార్థిలో నెరవేరిన స్పష్టీకరణ?
జ: విచక్షణ చేయడం

 

14. ‘ఆహారం వృథాను అరికట్టడానికి ఒక పాంప్లెట్‌ తయారు చేయండి’ అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుంది?
జ: ప్రశంస - విలువలు

 

15. నందిని అనే 4వ తరగతి విద్యార్థిని వివిధ పక్షుల గూళ్లను సేకరించి ఒక ఆల్బమ్‌ తయారుచేసింది. తనలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: సమాచార నైపుణ్యాలు

 

16. డాక్టర్లు జంక్‌ఫుడ్‌ తినవద్దనడానికి కారణాలు తెలిపిన రజిని అనే విద్యార్థినిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: విషయావగాహన

 

17. భావావేశరంగంలోని కింది ఏ లక్షణంలో వైఖరులు ఏర్పడతాయి?
1) గ్రహించడం     2) ప్రతిస్పందించడం   3) విలువకట్టడం   4) వ్యవస్థాపనం
జ: 3 (విలువకట్టడం)

 

18. విద్యార్థి కొత్త పరిష్కారాన్ని కనుక్కోగల స్థాయి
జ: సంశ్లేషణ

 

19. అంతరించిపోతున్న జంతువుల గురించి పాఠం విన్న 4వ తరగతి విద్యార్థి రాక్షసబల్లి పటాన్ని గీశాడు. అయితే అతడిలో నెరవేరిన నైపుణ్యం
జ: చిత్రలేఖన నైపుణ్యం

విజ్ఞాన శాస్త్రం - బోధనా పద్ధతులు

20. కిందివాటిలో క్షేత్ర పర్యటనల్లో సోపానం కానిది?
1) ప్రణాళిక      2) సిద్ధపరచడం      3) నిర్వహణ      4) నివేదిక
జ: 4 (నివేదిక)

 

21. ప్రయోగశాల పద్ధతిలో ఉపయోగించే వివిధ ఉప పద్ధతుల్లో పొదుపైంది?
జ: భ్రమణ పద్ధతి

 

22. కింది ఏ విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిలో సూచనపత్రాలు ఇవ్వనవసరం లేదు?
1) అన్వేషణ పద్ధతి      2) ప్రయోగశాల పద్ధతి      3) నియోజన పద్ధతి      4) ప్రాజెక్టు పద్ధతి
జ: 4 (ప్రాజెక్టు పద్ధతి)

 

23. పాఠ్యపుస్తకాన్ని మూసి అందులో ఏముందో కనుక్కోమనే బోధనా పద్ధతిగా విమర్శించేది?
జ: అన్వేషణ పద్ధతి

 

24. మధ్యతరగతి కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలను బోధించడానికి ఉపాధ్యాయుడిగా నీవు ఏ పద్ధతిని ఎన్నుకుంటావు?
జ: ప్రాజెక్టు పద్ధతి

 

25. జీవించడం కోసం నేర్చుకోక జీవిస్తూ నేర్చుకునే బోధనా పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి

26. అన్వేషణ పద్ధతిని కనుక్కున్న ప్రొఫెసర్‌ హెచ్‌.ఇ.ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఏ దేశానికి చెందినవారు?
జ: ఇంగ్లండ్‌

 

27. ‘సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రజలు శాస్త్రీయ పద్ధతి ద్వారా విశ్లేషించి ఒక క్రమపద్ధతిలో విషయ సేకరణ చేయడమే సర్వే’ అని పేర్కొన్నవారు?
జ: మోర్స్‌

 

28. ప్రయోగశాల పద్ధతిలో ఇచ్చే సూచనపత్రంలో ఉండని అంశం?
జ: ప్రయోగం చేసే వ్యక్తిపేరు

 

29. రాత్రి వికసించే పూలు సువాసననిస్తాయి. ఇది తెలుసుకున్న విద్యార్థి ఆ విషయాన్ని సన్నజాజి, విరజాజి లాంటి పూలకు అన్వయించి సరిచూసుకోవడం
జ: నిగమన పద్ధతి

 

విజ్ఞానశాస్త్రం - బోధనోపకరణ సామగ్రి

30. ఎల్‌.ఎల్‌. బెర్నార్డ్‌ ప్రకారం కిందివాటిలో సాంఘిక సాంస్కృతిక వనరు కానిది?
1) సమాజం       2) ఆర్థికం    3) భూ ఆవరణం  4) రాజకీయ పరిస్థితులు
జ: 3 (భూ ఆవరణం)

 

31. కిందివాటిలో భౌతిక వనరు కానిది?
1) నదులు   2) రైల్వేస్టేషన్‌   3) చారిత్రక ప్రదేశం  4) తోట
జ: 4 (తోట)

32. డాక్టర్‌ ఆర్‌.హెచ్‌. వైట్‌హౌస్‌ ఇచ్చిన ఉపన్యాస గది ప్రయోగశాల నమూనా ప్రకారం గది కొలతలు, ప్రయోగం నిర్వహించ గల విద్యార్థుల సంఖ్య వరుసగా
జ: 45' × 25', 40

 

33. మొదటి అంతర్జాతీయ సైన్సు ప్రదర్శనలో ప్రథమ బహుమతి పొందిన దేశం
జ: భారత్‌

 

34. భూచరాలు, ఉభయచరాల జీవన విధానాన్ని పరిశీలించడానికి ఉపయోగపడే కృత్యోపకరణం
జ: టెర్రేరియం

 

35. జాతీయ స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు?
జ: 7

 

36. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉండే సరిహద్దులను తెలియజేసే పటాలు
జ: రాజకీయ

 

37. సెక్టార్ల రూపంలో విషయాన్ని వివరించే గ్రాఫ్‌
జ: వృత్త గ్రాఫ్‌

 

38. పల్లపు ప్రాంతాన్ని, నిస్సారమైన భూములను సూచించే రంగులు వరుసగా
జ: ఆకుపచ్చ, పసుపు

విజ్ఞానశాస్త్రం - విద్యాప్రణాళిక

39. కింది ఏ పథకరచన బోధనాభ్యసన సామగ్రి లభించే కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలను ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది?
1) వార్షిక పథకం    2) యూనిట్‌ పథకం    3) పీరియడ్‌ పథకం   4) సంస్థాగత పథకం
జ: 1 (వార్షిక పథకం)

 

40. హెర్బార్షియన్‌ సోపానాల్లో సాధారణీకరణ ముందు ఉండే సోపానం
జ: పోలిక

 

41. హెర్బార్షియన్‌ సోపానాల్లో నిగమన ప్రక్రియలో ఇమిడి ఉన్న దశ
జ: వినియోగం

 

42. ప్రస్తుతం 3, 4, 5వ తరగతుల పాఠ్యపుస్తకాల తయారీలో ఇమిడి ఉన్న మొత్తం ఇతివృత్తాలు ఎన్ని?
జ: 13

 

43. విద్యా బోధనలో పునాదిరాయి
జ: పాఠ్యపుస్తకం

 

44. ఆధునిక పరిస్థితుల్లో ఉన్న సమాజ ఆదర్శాలు, విలువల ఆధారంగా పాఠ్యపుస్తకాలు తయారవుతున్నాయని అన్నవారు
జ: బ్రిగ్స్‌

45. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకంలోని కృత్యాల్లో చివరి కృత్యం
జ: నేనివి చేయగలనా

 

46. ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతుల భౌతికశాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించని ఇతివృత్తం
1) పదార్థాలు    2) సహజవనరులు   3) సజీవప్రపంచం  4) కదిలే వస్తువులు - ప్రజల ఆలోచనలు
జ: 4 (కదిలే వస్తువులు - ప్రజల ఆలోచనలు)

 

47. కిందివాటిలో విద్యాప్రణాళికకు సంబంధించని అంశం
1) సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తుంది.                
2) సిద్ధాంత పరమైంది.
3) బాలుడి యావత్తు శిక్షణపై దృష్టి పెడుతుంది.    
4) స్వేచ్ఛాయుతమైంది.
జ: 4 (స్వేచ్ఛాయుతమైంది.)

 

48. కిందివాటిలో బడిలో దైనందిన ఆచరణకు దర్శిని
1) విద్యా ప్రణాళిక    2) విషయ ప్రణాళిక    3) పాఠ్య ప్రణాళిక   4) యూనిట్‌ ప్రణాళిక
జ: 2 (విషయ ప్రణాళిక)

 

విజ్ఞానశాస్త్రం - మూల్యాంకనం

49. నీరు : ద్రవం : : ఆహారం : ....... అనేది ఏ ప్రశ్న?
జ: సాదృశ్య ప్రశ్న

50. కిందివాటిలో అధిక హెచ్చు విద్యుత్‌చాలక బలం గల ఘటం? 
ఎ) వోల్టా ఘటం    బి) లెక్లాంచి ఘటం   సి) నిర్జల ఘటం   డి) బైక్రోమేట్‌ ఘటం
పై ప్రశ్న ఏ రకమైన బహుళైచ్ఛిక ప్రశ్న?
జ: కచ్చిత సమాధాన రకం

 

51. విద్యార్థిలోని సృజనాత్మకత, భావవ్యక్తీకరణ సామర్థ్యాలను మదింపు చేసే ప్రశ్నలు
జ: వ్యాసరూప ప్రశ్నలు

 

52. ఆత్మాశ్రయత అతి ఎక్కువగా ఉండే ప్రశ్నలు
జ: మౌఖిక ప్రశ్నలు

 

53. రూబ్రిక్స్‌ వేటిని పోలి ఉంటాయి?
జ: రేటింగ్‌ స్కేలు

 

54. విడి దస్త్రాలను వృద్ధి చేసేది
జ: విద్యార్థులు

 

55. శక్తినిత్యత్వ నియమాన్ని చిత్రాల ద్వారా వివరించే చార్టు
జ: దృష్టాంతాల చార్టు

 

56. ఎస్‌ఎ - 2 పరీక్షలో నిహాల్‌ అనే విద్యార్థికి పరిసరాల విజ్ఞానంలో 40 మార్కులు వచ్చాయి. అతడి వివరణాత్మక సూచి?
జ: చాలా బాగుంది


57. కిందివాటిలో బ్లూప్రింట్‌ చూపించని భారత్వ పట్టిక
1) విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక           2) ప్రశ్నరూప భారత్వ పట్టిక
3) కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టిక            4) విషయరూప భారత్వ పట్టిక
జ: 3 (కాఠిన్యతా స్థాయి భారత్వ పట్టిక)

 

58. పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మదింపులో ‘ప్రశంస - విలువలు’ అనే సామర్థ్యానికి ఎన్ని మార్కులు కేటాయించాలి?
జ: 5

Posted Date : 09-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు