• facebook
  • whatsapp
  • telegram

జీవక్రియలను నియంత్రించే రసాయన రాయబారులు!

మానవ - అంతఃస్రావక వ్యవస్థ  రసాయన సమన్వయం



మానవ శరీరంలోని వివిధ అంతఃస్రావ గ్రంథులు, అవి స్రవించే హార్మోన్లను కలిపి అంతఃస్రావక వ్యవస్థ అంటారు. జీవక్రియల నియంత్రణ, శరీర అవయవాల విధుల సమన్వయానికి అది కీలకం. రసాయనిక రాయబారులుగా పిలిచే హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులను నెమ్మదిగా అదుపు చేస్తాయి. లక్షిత అవయవాల్లోకి చేరి ప్రభావం చూపుతాయి. వయసుకు అనుగుణంగా జరిగే శరీర మార్పులకు, పరిస్థితులకు తగినట్లుగా వెల్లడయ్యే భావోద్వేగాలకు ఈ హార్మోన్లే మూలం. వాటిలో రకాలు, విధులు, మోతాదు ఎక్కువైనా, తక్కువైనా కలిగే రుగ్మతలు, చికిత్స విధానాలపై తగిన అవగాహన ఉండాలి. మొక్కల్లో ఉండే హార్మోన్లు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి.


1.     హార్మోన్లకు పేరు పెట్టిన వ్యక్తి?

1) స్టార్లింగ్‌       2) యూజెన్‌ స్టైనచ్‌   

3) థామస్‌ అడిసన్‌      4) 1, 3


2.     కిందివాటిలో రసాయనికంగా భిన్నమైంది?

1) కార్టిసాల్‌       2) ఆల్డోస్టిరాన్‌   

3) ఆక్సిటోసిన్‌       4) ప్రొజెస్టిరాన్‌


3.     కిందివాటిని జతపరచండి.

1) అమైన్‌ హార్మోన్‌ ఎ) కార్టిసాల్‌
2) పెప్టైడ్‌ హార్మోన్‌ బి) థైరాక్సిన్‌
3) ప్రొటీన్‌ హార్మోన్‌ సి) వాసోప్రెసిన్‌
4) స్టిరాయిడ్‌ హార్మోన్‌  డి) థైమోసిన్‌

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ    2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి  

3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి   4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి


4.     అంతఃస్రావక వ్యవస్థ పితామహుడు?

1) స్టార్లింగ్‌       2) యూజెన్‌ స్టైనస్‌   3) థామస్‌ అడిసన్‌      4) స్టాన్లీ


5.     కిందివాటిలో మిశ్రమ గ్రంథి?

1) పీయూష గ్రంథి       2) క్లోమం   

3) థైమస్‌       4) అధివృక్క గ్రంథి


6.     కిందివాటిలో ఏ గ్రంథిని హైపోఫైసిస్‌ అంటారు?

1) పీయూష గ్రంథి       2) క్లోమం   

3) థైమస్‌       4) కాలేయం


7.     కిందివాటిలో నాడీ స్రావకాలుగా పనిచేసేవి?

1) వాసోప్రెస్సిన్‌       2) ఆక్సిటోసిన్‌   

3) పార్స్‌ ఇంటర్మీడియా   4) 1, 2


8. రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్‌ స్థాయిలను నియంత్రించేది?

1) కాల్సిటోనిన్‌       2) కాల్సిటోసిన్‌   

3) థైరాక్సిన్‌       4) వాసోప్రెస్సిన్‌


9.     పారాథైరాయిడ్‌ గ్రంథుల సంఖ్య?

1) 1     2) 3     3) 4     4) 2


10. కిందివాటిలో మానవుడిలో వార్థక్యానికి కారణం?

1) ఎడ్రినల్‌ గ్రంథి       2) థైమస్‌ గ్రంథి   

3) పారాథైరాయిడ్‌       4) 2, 3


11.     కిందివాటిని జతపరచండి.

1) ప్రధాన గ్రంథి    ( ) ఎ) అవటు గ్రంథి
2) బాలగ్రంథి    ( ) బి) పీయూష గ్రంథి
3) అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి    ( ) సి) పీనియల్‌ గ్రంది
4) 3వ కన్ను గ్రంథి    ( ) డి) థైమస్‌ గ్రంథి

1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి   2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ   

3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ  4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి


12. కిందివాటిలో అసత్య వాక్యాన్ని ఎంచుకోండి.

1) నాడీ, అంతఃస్రావక వ్యవస్థలను అనుసంధానం చేసేది - హైపోథలామస్‌

2) జీవక్రియ సంబంధ హార్మోన్‌ - థైరాక్సిన్‌

3) H ఆకారం, సీతాకోకచిలుక ఆకారంలో ఉండే గ్రంథి - థైరాయిడ్‌ గ్రంథి

4) పీయూష గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి - పారాథైరాయిడ్‌


13. క్లోమ అంతఃస్రావక భాగంలోని లాంగర్‌ హాన్స్‌ పుటికల సంఖ్య?

1) 50 వేలు       2) 2 మిలియన్లు   

3) 3 మిలియన్లు       4) 75 వేలు


14. కిందివాటిలో ఏ హార్మోన్లు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్‌ల జీవన చర్యల్లో పాల్గొంటాయి?

1) టెస్టోస్టిరాన్‌       2) థైరాక్సిన్‌   

3) పెరుగుదల హార్మోన్‌    4) ఇన్సులిన్‌


15. కిందివాటిని జతపరచండి.

1) గ్లూకగాన్‌ ( )  ఎ) హైపర్‌ కాల్సిమిక్‌ హార్మోన్‌
2) ఇన్సులిన్‌ ( )  బి) హైపర్‌ గ్లైసిమిక్‌ హార్మోన్‌
3) పారాథార్మోన్‌ ( )  సి) పోరాట/పలాయన హార్మోన్‌
4) ఎపినెఫ్రిన్‌ ( )  డి) హైపో గ్లైసిమిక్‌ హార్మోన్‌

1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి   2) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ    

3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి  4) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి 


16. కుషింగ్స్‌ సిండ్రోమ్‌ ఏ హార్మోన్‌ లోపం వల్ల జరుగుతుంది?

1) కార్టిసాల్‌       2) గ్లూకోకార్టికాయిడ్‌   

3) వాసోప్రెస్సిన్‌       4) 1, 2


17. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

1) మెలనిన్‌ అధ్యయనాన్ని - మెలకాలజీ అంటారు.

2) యూరోపియన్లు - చర్మం నలుపు రంగులో ఉంటుంది, వీరిని ఆల్భినోలు అంటారు.

3) ఆస్ట్రేలియన్స్‌ను - ఆల్భినోలు అంటారు.

4) మెలనిన్‌ అనేది సూర్యకాంతిపై ఆధారపడదు.


18. శిశువు జన్మించాక క్షీరగ్రంథుల్లో క్షీరం ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్‌?

1) కార్టికో ట్రోపిన్‌       2) ల్యూటియో ట్రోపిన్‌   

3) ఈస్ట్రోజన్‌       4) ప్రొజెస్టిరాన్‌


19. కిందివాటిలో భిన్నమైన హార్మోన్‌ వ్యాధి?

1) క్రెటినిజం       2) గల్స్‌ వ్యాధి   

3) గ్రేవ్స్‌ వ్యాధి       4) మరుగుజ్జులు


20. అధిక మోతాదులో మూత్రం విసర్జించడాన్ని ఏమంటారు?

1) గ్లైకోనూరియా       2) గ్లైకోసూరియా   

3) హైపర్‌ గ్లైసీమియా    4) 1, 2


21. ఇన్సులిన్‌ షాక్‌ అంటే?

1) ఇన్సులిన్‌ అధికంగా ఉత్పత్తి అవడం   

2) ఇన్సులిన్‌ను అధికంగా ఎక్కించుకోవడం

3) ఇన్సులిన్‌ లోపం       4) 1, 2


22. స్త్రీలలో కంఠధ్వని మార్పుకు కారణమయ్యే హార్మోన్‌?

1) ప్రొజెస్టిరాన్‌    2) ఈస్ట్రోజెన్‌   

3) టెస్టోస్టిరాన్‌       4) 1, 2


23. ప్రొజెస్టిరాన్‌ ప్రేరేపించడం వల్ల క్షీరగ్రంథులు ఏర్పరిచిన క్షీరం నిల్వ ఉండే ప్రాంతం?

1) ఆల్వియోలై       2) క్షీరగ్రంథి విల్లే   

3) క్షీర కణజాలాలు      4) 1, 2


24. థైమస్‌ గ్రంథి బరువు?

1) 40 గ్రా.    2) 20 గ్రా.    3) 1 గ్రా.   4) 5 గ్రా.


25. శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే హార్మోన్‌?

1) థైరాక్సిన్‌       2) వాసోప్రెస్సిన్‌   

3) థైయోసిన్‌       4) ఆక్సిటోసిన్‌


26. కిందివాటిని జతపరచండి.

1) మాతృత్వ హార్మోన్‌ ( )    ఎ) రిలాక్లిన్‌
2) బర్త్‌ హార్మోన్‌ ( )    బి) ఎడ్రినలిన్‌
3) ఎమర్జెన్సీ హార్మోన్‌ ( )    సి) ఆక్సిటోసిన్‌
4) ప్రసూతి సహాయక హార్మోన్‌ ( )    డి) ప్రోలాక్టిన్‌

1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ    2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి       

3) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి   4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ


27. కిందివాటిని గమనించి సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ. 1905లో హార్మోన్స్‌ పేరు పెట్టిన వ్యక్తి - స్టార్లింగ్‌.

బి. హార్మోన్లు శరీరంలో జరిగే జీవక్రియల మీద అనేక రకాలుగా ప్రభావం చూపుతాయి.

సి. లాటిన్‌ భాషలో ఇన్సులా అంటే దీవి అని అర్థం.

డి. చనిపోయిన జంతు క్లోమం నుంచి ఇన్సులిన్‌ను వేరుచేసిన ఘనత టొరంటో, బాంటింగ్, చెస్ట్, మెక్‌లాడ్‌కు చెందుతుంది.

1) 1-ఎ, 2-సి, 3-డి    2) 1-ఎ, 2-బి, 3-సి  

3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    4) బి, డి మాత్రమే


28. కిందివాటిలో కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్‌?

1) థైరాక్సిన్‌     2) అడ్రినలిన్‌   

3) ఈస్ట్రోజెన్‌       4) థైయోసిన్‌


29. పత్రరంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించే హార్మోన్‌?

1) ఆక్సిన్స్‌       2) అబ్‌సైసిక్‌ ఆమ్లం  

3) సైటోకైనిన్‌       4) జిబ్బరెల్లిన్‌


30. కిందివాటిలో మొక్కల వృద్ధి ప్రోత్సాహకాలు కానివి?

1) ఆక్సిన్‌       2) జిబ్బరెల్లిన్స్‌   

3) సైటోకైనిన్‌       4) ఇథిలీన్‌


31. మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను కనుక్కున్నవారు?

1) వెంట్‌       2) చార్లెస్‌ డార్విన్‌ 

3) జె.సి.బోస్‌       4) 1, 3


32. మొక్కల పెరుగుదల రేటును కనుక్కునే పరికరం?

1) అమినో మీటర్‌       2) ఎనియోమీటర్‌   

3) ఆక్సినో మీటర్‌       4) 2, 3


33. కిందివాటిలో జిబ్బరెల్లిన్స్‌ విధి కానిది?

1) పెరుగుదల       2) విత్తన అంకురణ   

3) అనిషేక జననం       4) విత్తన సుప్తావస్థ


34. మొక్కలకు సంబంధించి ఒత్తిడి హార్మోన్‌?

1) సైటోకైనిన్స్‌       2) అబ్‌సైసిక్‌ ఆమ్లం   

3) ఆక్సిన్‌       4) సైటోకైనిన్‌


35. కృత్రిమంగా ఫలాల పక్వాన్ని ప్రోత్సహించే హార్మోన్‌?

1) ఇథిలీన్‌  2) ఆక్సిన్‌  3) సైటోకైనిన్స్‌ 4) 1, 2


36. కిందివాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.

ఎ) ఇథిలీన్‌ అనేది ఏకైక వాయు రూప హార్మోన్‌.

బి) జియాటిన్‌ అనే మొక్క నుంచి సైటోకైనిన్‌ను కనుక్కున్నారు.

సి) జిబ్బరెల్లిన్స్‌ను మొదటిసారిగా జిబ్బరెల్లా ప్యూజికొరై అనే శిలీంధ్రంలో కనుక్కున్నారు.

డి) కాంతి అనుచలనం అంటే కాండం కాంతి వైపు పెరగడం.

1) ఎ, బి సత్యం       2) ఎ, సి, డి సత్యం   

3) ఎ, బి, సి సత్యం       4) పైవన్నీ 


37. ఎ) వాదన: మొక్కల్లో మొదటగా కనుగొన్న సహజ హార్మోన్‌ ఆక్సిన్‌

బి) కారణం: దీనిని వెంట్‌ కనుగొన్నారు

1) ఎ సరైంది, బి సరికాదు 2) ఎ సరికాదు, బి సరైంది

3) ఎ, బి సరైనవి. కానీ ఎ కు బి సరైన వివరణ కాదు

4) ఎ, బి సరైనవి. ఎ, బి కు సరైన వివరణ


38. మొక్కల్లో ఉండే సహజ ఆక్సిన్‌?  

1) 2, 4-D 2) IAA 3) IBA 4) 2, 4, 5-T


39. మొక్కల్లో ఆక్సిన్‌ విధి?

1) పెరుగుదల       2) అగ్రాధికత్య   

3) కాంతి అనువర్తనం       4) అన్నీ


40. కిందివాటిలో కణ విభజనను ప్రేరేపించే హార్మోన్‌?

1) సైటోకైనిన్‌      2) జిబ్బరెల్లిన్‌   

3) ఇథిలీన్‌       4) 1, 3


41. కిందివాటిలో మెలనోసైట్స్‌కు వచ్చే క్యాన్సర్‌?

1) సార్కోమా     2) మయోమా   

3) మెలనోమా       4) లింపోమా


42. స్త్రీ బీజకోశాల నుంచి విడుదలయ్యే హార్మోన్లు?

1) ఈస్ట్రోజెన్‌       2) ప్రొజెస్టిరాన్‌   

3) ఆండ్రోజన్‌       4) 1, 2


43. అంతఃస్రావక గ్రంథుల అధ్యయనాన్ని ఏమంటారు?

1) ఎండోక్రైనాలజీ       2) క్రైనిసాలజీ   

3) క్రోనాలజీ       4) ఏదీకాదు


44. హార్మోన్లకు సంబంధించి అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి.

1) హార్మోన్లను దేహదూర సంకేత పదార్థాలు అంటారు.

2) హార్మోన్లను కణాంతర వాహకాలు అంటారు.

3) హార్మోన్లు చర్య జరిపే భాగాన్ని లక్ష్య అంగం అంటారు.

4) హార్మోన్లను కనుక్కున్న వారు థామస్‌ అడిసన్‌.




సమాధానాలు


1-1; 2-3; 3-1; 4-3; 5-2; 6-1; 7-4; 8-1; 9-3; 10-2; 11-1; 12-2; 13-2; 14-1; 15-3; 16-4; 17-3; 18-2; 19-4; 20-2; 21-4; 22-2; 23-1; 24-1; 25-3; 26-1; 27-3; 28-2; 29-2; 30-4; 31-2; 32-3; 33-4; 34-2; 35-1; 36-4; 37-4; 38-2; 39-4; 40-1; 41-3; 42-4; 43-1; 44-4.

రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌