• facebook
  • whatsapp
  • telegram

ఉత్తర అండమాన్‌లో నార్కోండం!

భారతదేశం - భౌగోళిక స్వరూపాలు

సువిశాలమైన భారతదేశం భిన్న భౌగోళిక స్వరూపాల సమాహారం. అందులో హిమాలయాలు, గంగా-సింధూ మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరప్రాంత మైదానాలు, తూర్పు- పశ్చిమ కనుమలు, థార్‌ ఎడారి వంటివి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి, ఉత్తరాన పెట్టని కోటలా ఉండి, దేశంలోని పలు జీవనదులకు జన్మస్థానమైనవి హిమాలయాలు. ఆ సహజ సరిహద్దులోని వివిధ పర్వత శ్రేణులు, వాటి సగటు ఎత్తు, విస్తరణ తీరు, ప్రాంతాల వారీగా పేర్లు తదితరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. అదేవిధంగా దేశœంలోని ముఖ్య పర్వతశ్రేణులు, పీఠభూములు ఉన్న ప్రాంతాలు, వాటి వివరాలతో పాటు మానవనిర్మిత భౌగోళిక విశేషాలపైనా తగిన అవగాహన పెంచుకోవాలి.


1.    పూర్వాంచల్‌ పర్వతాలను అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?

1) మిజో కొండలు    2) పాట్కాయ్‌బమ్‌ కొండలు

3) లుషాయ్‌ కొండలు  4) బరైల్‌ కొండలు


2. హిమాలయాల ఆవిర్భావంలో చివరిగా ఏర్పడినవి-

1) నిమ్న హిమాలయాలు 2) ఉన్నత హిమాలయాలు        

3) బాహ్య హిమాలయాలు         4) ట్రాన్స్‌ హిమాలయాలు


3.     హిమాలయాల సరాసరి పొడవు ఎన్ని కిలోమీటర్లు?

1) 2,100 కి.మీ.        2) 3,600 కి.మీ.      

3) 4,700 కి.మీ.          4) 2,400 కి.మీ.


4.     హిమాద్రి పర్వతాలు సముద్రమట్టం నుంచి సగటున ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయి?

1) 7,500 మీ.        2) 6,100 మీ.    

3) 5,200 మీ.          4) 4,800 మీ.


5.     నిమ్న హిమాలయాలు సగటున ఎంత వెడల్పుతో విస్తరించి ఉంటాయి?

1) 30 - 50 కి.మీ.        2) 60  - 80 కి.మీ.      

3) 150 - 200 కి.మీ.   4) 15  - 30 కి.మీ.


6.     కిందివాటిలో ట్రాన్స్‌ హిమాలయాల్లో భాగం కాని పర్వతాలను గుర్తించండి.

1) కారాకోరం    2) లద్దాఖ్‌      

3) జస్కర్‌          4) పిర్‌పంజాల్‌


7.     కశ్మీర్‌ లోయ కింది ఏ శ్రేణుల మధ్య విస్తరించింది?

1) పిర్‌పంజాల్‌ - జస్కర్‌ 2) లద్దాఖ్‌ - జస్కర్‌      

3) కారకోరం - లద్దాఖ్‌   4) హిమాద్రి - హిమాచల్‌


8.     కశ్మీర్‌ లోయ విస్తీర్ణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు?

1) 4,100 కి.మీ.       2) 5,400 కి.మీ.      

3) 4,921 కి.మీ.         4) 3,482 కి.మీ.


9.     శివాలిక్‌ శ్రేణి సరాసరి ఎత్తు?

1) 3,100 మీ. - 4,800 మీ.       2) 4,100 మీ. - 5,400 మీ.      

3) 600 మీ. - 1,500 మీ.       4) 2,100 మీ. - 2,500 మీ.


10. పూర్వాంచల్‌ పర్వతాలను మిజోరంలో ఏమని పిలుస్తారు?

1) లుషాయ్‌ కొండలు    2) బరైల్‌ కొండలు     

3) జయంతియా కొండలు     4) పాట్కాయ్‌బమ్‌ కొండలు


11. కిందివాటిలో హిమాలయాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1) భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా రక్షణ కవచాలుగా విస్తరించి ఉన్నాయి.    

2) మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటున్నాయి.

3) భారత్‌లో జీవనదివ్యవస్థకు కారణమవుతున్నాయి.

4) అత్యంత పురాతన ముడుత పర్వతాలు.


12. రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారు?

1) ద్వీపం         2) ద్వీపకల్పం      

3) అంతర్వేది         4) భంగర్‌


13. కిందివాటిలో నదికి దగ్గరగా ఏర్పడే ఒండ్రు మైదానాలను ఏమంటారు?

1) భంగర్‌  2) ఖాదర్‌  3) భాబర్‌  4) టెరాయి


14. హిమాచల్, శివాలిక్‌ శ్రేణులకు మధ్య ఉండే ×గీ× ఆకారపు లోయలను ఏమని పిలుస్తారు?

1) డూన్స్‌  2) మార్గ్‌లు  3) టెరాయి 4) భాబర్‌


15. నదికి దూరంగా ఏర్పడే పురాతన ఒండ్రు మైదానాన్ని ఏమంటారు?

1) భంగర్‌  2) ఖాదర్‌  3) భాబర్‌  4) టెరాయి


16. శివాలిక్‌ పర్వత పాదాల వద్ద 8 - 16 కి.మీ.లు విస్తరించిన భూ స్వరూపాన్ని ఏమంటారు?

1) భాబర్‌  2) టెరాయి  3) భంగర్‌  4) ఖాదర్‌


17. టెరాయి నేలలు అంటే?

1) పొడి నేలలు         2) ఇసుక నేలలు      

3) చిత్తడి నేలలు         4) ఎర్ర నేలలు


18. మహాభారత్‌ పర్వతశ్రేణి కింది ఏ దేశంలో అధికంగా విస్తరించి ఉంటుంది?

1) టిబెట్‌  2) నేపాల్‌ 3) ఇండియా 4) భూటాన్‌


19. కిందివాటిలో భారతదేశానికి ఈశాన్య సరిహద్దుగా విస్తరించి ఉన్నవేవి?

1) పూర్వాంచల్‌         2) నిమ్న హిమాలయాలు

3) బాహ్య హిమాలయాలు  4) ట్రాన్స్‌ హిమాలయాలు


20. హిమాచల్, హిమాద్రి శ్రేణులకు మధ్య లోతైన లోయలో కనిపించే సన్నని దారులను ఏమంటారు?

1) డూన్స్‌     2) మార్గ్‌లు 

3) అంతర్వేది     4) భంగర్‌


21. కిందివాటిలో దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన శిఖరం?

1) దొడబెట్ట     2) కాల్సూబాయి  

3) అనైముడి     4) కుద్రేముఖి


22. నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?

1) అనైముడి     2) కాల్సూబాయి  

3) సారామతి     4) దొడబెట్ట


23. కిందివాటిలో హిమాద్రి పర్వతాల్లో భాగం కాని శిఖరాన్ని గుర్తించండి.

1) ఎవరెస్ట్‌     2) కాంచనగంగ   

3) లోత్‌ సే    4) K2 


24. పడమటి కనుమలు సరాసరి ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి?

1) 1,600 కి.మీ.     2) 2,000 కి.మీ.  

3) 1,100 కి.మీ.     4) 800 కి.మీ.


25. పళని కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?

1) కేరళ     2) కర్ణాటక  

3) తమిళనాడు     4) మహారాష్ట్ర


26. కార్డమమ్‌ కొండలు ఏ రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్నాయి?

1) తమిళనాడు     2) కేరళ  

3) కర్ణాటక     4) మహారాష్ట్ర


27. అనైముడి శిఖరం ఎత్తు ఎంత?

1) 2,965 మీ.        2) 2,637 మీ.   

3) 2,695 మీ.      4) 2,569 మీ.


28. భారతదేశంలో ఇందిరాగాంధీ కాలువ అత్యంత పొడవైంది. అయితే దీని పొడవు ఎన్ని కిలోమీటర్లు?

1) 750 కి.మీ.     2) 650 కి.మీ.   

3) 350 కి.మీ.     4) 800 కి.మీ.


29. కిందివాటిలో ఉదకమండలం ఏ పర్వతాల్లో ఉంటుంది?

1) అన్నామలై     2) నీలగిరి  

3) పళని కొండలు     4) కార్డమమ్‌ కొండలు


30. పశ్చిమ కనుమల్లో భాగం కాని కొండలు?

1) బాబా బుడాన్‌ కొండలు    2) సహ్యాద్రి కొండలు

3) పళని కొండలు         4) నల్లమల కొండలు


31. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం ఏది?

1) దొడబెట్ట          2) గాలికొండ

3) అరోమ కొండ       4) మహేంద్రగిరి


32. పూర్వాంచల్‌ పర్వతాలను మయన్మార్‌లో ఏమని పిలుస్తారు?

1) బరైల్‌ కొండలు  2) లుషాయ్‌ కొండలు

3) కచ్చర్‌ కొండలు  4) అరకాన్‌యోమా పర్వతాలు


33. కొంకణ్‌ తీరప్రాంతం కింది ఏ రాష్ట్రాలకు సంబంధించింది?

1) మహారాష్ట్ర, గోవా    2) గోవా, కర్ణాటక

3) కర్ణాటక, కేరళ    4) గుజరాత్, మహారాష్ట్ర


34. కింది ఏ రాష్ట్రం తీరప్రాంతాన్ని కళింగ తీరం అంటారు?

1) ఒడిశా        2) తమిళనాడు   

3) ఆంధ్రప్రదేశ్‌        4) కర్ణాటక


35. చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?

1) ఆంధ్రప్రదేశ్‌        2) ఒడిశా   

3) తమిళనాడు       4) తెలంగాణ


36. కెనరా తీరం కింది ఏ రాష్ట్రానికి సంబంధించింది?

1) కర్ణాటక  2) కేరళ  3) ఒడిశా 4) మహారాష్ట్ర


37. లక్షదీవుల సరాసరి విస్తీర్ణం ఎంత?

1) 42 చ.కి.మీ.       2) 32 చ.కి.మీ.

3) 52 చ.కి.మీ.       4) 45 చ.కి.మీ.


38. క్రింది ఏ దీవిలో నార్కోండం అగ్నిపర్వతం ఉంది?

1) మధ్య అండమాన్‌       2) ఉత్తర అండమాన్‌       

3) దక్షిణ అండమాన్‌       4) గ్రేట్‌ నికోబార్‌


39. బారెన్‌ అగ్నిపర్వతం ఏ దీవిలో ఉంది?

1) మధ్య అండమాన్‌      2) ఉత్తర అండమాన్‌   

3) దక్షిణ అండమాన్‌      4) గ్రేట్‌ నికోబార్‌


40. కింది ఏ దీవిలో ఇందిరా పాయింట్‌ ఉంది?

1) కార్‌ నికోబార్‌      2) దక్షిణ అండమాన్‌   

3) గ్రేట్‌ నికోబార్‌      4) మధ్య అండమాన్‌


41. తూర్పు కనుమల సగటు ఎత్తు?

1) 900 మీ.     2) 1,600 మీ.   

3) 1,800 మీ.       4) 500 మీ.


42. కింది ఏ పీఠభూమిలో అధికంగా ఖనిజ వనరులు ఉంటాయి?

1) బుందేల్‌ఖండ్‌        2) భాగేల్‌ఖండ్‌     

3) ఛోటానాగ్‌పుర్‌        4) కర్ణాటక పీఠభూమి


43. కిందివాటిలో ‘దక్షిణ భారత పైకప్పు’ అని దేన్ని పిలుస్తారు?

1) ఛోటానాగ్‌పుర్‌ పీఠభూమి 2) కర్ణాటక పీఠభూమి     

3) మాల్వా పీఠభూమి  4) మహారాష్ట్ర పీఠభూమి


44. పిర్‌పంజాల్‌ పర్వత శ్రేణి ఏ హిమాలయాల్లో భాగం?

1) ట్రాన్స్‌ హిమాలయాలు         2) హిమాద్రి హిమాలయాలు  

3) హిమాచల్‌ హిమాలయాలు  4) శివాలిక్‌ హిమాలయాలు


45. శివాలిక్‌ పర్వత శ్రేణులను అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏమని పిలుస్తారు?

1) చురియా కొండలు       2) ధూద్వా కొండలు     

3) మిష్మీ కొండలు        4) మురియా కొండలు


46. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం ఏది?

1) గుడలూరు           2) ఉదకమండలం    

3) కన్యాకుమారి        4) అన్నామలై


47. కిందివాటిలో పంచ నదుల రాష్ట్రం?

1) హిమాచల్‌ప్రదేశ్‌       2) పంజాబ్‌    

3) గుజరాత్‌       4) హరియాణా


48. కిందివాటిలో ఛోటానాగ్‌పుర్‌ పీఠభూమిలో ఎత్తయిన శిఖరం?

1) పారస్‌నాథ్‌       2) సారామతి    

3) కల్సూబాయి      4) గురుశిఖర్‌


49. పూర్వాంచల్‌ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం?

1) సారామతి       2) పారస్‌నాథ్‌     

3) బ్లూమౌంటెయిన్‌        4) కాల్సూబాయి


50. రాజస్థాన్‌లో సంవత్సర సరాసరి వర్షపాతం ఎంత?

1) 100 - 150 మి.మీ.     2) 150 - 200 మి.మీ.

3) 50 - 70 మి.మీ.      4) 150 - 300 మి.మీ.


51. కిందివాటిలో భిన్నమైన నదిని గుర్తించండి.

1) గంగా     2) సింధూ 

3) బ్రహ్మపుత్ర    4) లూనీ


సమాధానాలు


1-2; 2-3; 3-4; 4-2; 5-2; 6-4; 7-1; 8-3; 9-3; 10-1; 11-4; 12-3; 13-2; 14-1; 15-2; 16-1; 17-3; 18-2; 19-1; 20-2; 21-3; 22-4; 23-4; 24-1; 25-3; 26-2; 27-3; 28-2; 29-2; 30-4; 31-3; 32-4; 33-1; 34-1; 35-2; 36-1; 37-2; 38-2; 39-1; 40-3; 41-1; 42-3; 43-2; 44-3; 45-3; 46-1; 47-2; 48-1; 49-1; 50-1; 51-4.


రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 31-10-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు