• facebook
  • whatsapp
  • telegram

Exams: ఏడాదికి రెండుసార్లు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి!

*  10, 12 తరగతుల షెడ్యూల్‌పై సీబీఎస్‌ఈ కసరత్తు 
 


దిల్లీ: పది, పన్నెండో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని భావిస్తున్న కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఏస్‌ఈ), వాటిని ఏ కాలావధుల్లో నిర్వహించాలన్న అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ప్రస్తుతానికైతే జనవరి-ఫిబ్రవరి, మార్చి-ఏప్రిల్, జూన్‌ నెలలను ఇందుకు పరిశీలిస్తోంది. సెమిస్టర్‌ విధానాన్నీ మరో ప్రత్యామ్నాయంగా చూస్తోంది. ప్రస్తుతం బోర్డు పరీక్షలు ఫిబ్రవరి-మార్చిలో జరుగుతున్నాయి. సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలను ఎప్పుడు ఏ ఫార్మాట్‌లో నిర్వహించాలన్న అంశంపై చర్చ జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ‘‘మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాం. ఇందులో ఒకటి సెమిస్టర్‌ విధానం.. తొలి బోర్డు పరీక్ష జనవరి-ఫిబ్రవరిలో, రెండోది మార్చి- ఏప్రిల్‌ లేదా సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలతో పాటు రెండో సెట్‌ బోర్డుపరీక్షలు జూన్‌లో నిర్వహించడం. మన విద్యా క్యాలెండర్‌ను, పోటీ పరీక్షల షెడ్యూల్‌ను పరిశీలిస్తే సెమిస్టర్‌ విధానం అంత అనుకూలంగా లేదు’’ అని ఓ అధికారి తెలిపారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.