• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Designing Course: తెలుగు వర్సిటీలో ప్రత్యేక డిజైనింగ్‌ కోర్సు

* మంచి భవిష్యత్తు ఉంటుందంటున్న ఆచార్యులు
 


తెలుగు భాషా బోధన..పరిశోధనకు అనుబంధంగా డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ కోర్సులకు దీటుగా డిజైనింగ్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోని భిన్న సంప్రదాయాలకు సంబంధించిన కళాకృతులు, ఉత్పత్తులను ప్రస్తుత, భవిష్యత్‌ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులతోనే తయారుచేయించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కోర్సులో చేరేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కోర్సులో భాగంగా ఫ్యాషన్, టెక్స్‌టైల్స్, ఇంటీరియర్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, విజువల్‌ కమ్యూనికేషన్‌ వంటి విభాగాల్లో శిక్షణ ఇస్తామని, ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు సంప్రదాయ ఇంజినీరింగ్‌ కోర్సులకు భిన్నంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సును పూర్తిచేస్తే భిన్నమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

* ఇంటర్‌ ఉత్తీర్ణతే.. అర్హత
 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో చేరేందుకు ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు అర్హులు. నాలుగేళ్ల ఈ కోర్సులో మెరిట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. కోర్సు వ్యవధి రెండేళ్లు. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో ఫ్యాషన్‌ టెక్నాలజీ, ఇంటీరియర్‌ డిజైన్, ప్రొడక్ట్‌ డిజైన్, విజువల్‌ కమ్యూనికేషన్‌లలో ఒకదాన్ని మాత్రమే ఎంపిక చేసుకునేందుకు వీలుంటుంది. అన్నింటిలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన, శిక్షణ అందిస్తారు. రెండో సంవత్సరం నుంచే విద్యార్థులతో స్వయంగా కళాకృతులను తయారుచేయించడంతోపాటు వాటిని జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో ఉంచుతున్నారు. ప్రధానంగా ఫ్యాషన్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్‌ కోర్సులకు సంబంధించిన ప్రదర్శనలు ఎక్కువగా ఏర్పాటుచేస్తున్నారు. ‘‘బహుళజాతి సంస్థలు ప్రస్తుతం తమ ఉత్పత్తుల గిరాకీ పెంచుకునేందుకు కొత్త డిజైన్లు, బ్రాండ్లు సృష్టించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటి డిజైన్లు రూపొందించే దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. ఆయా ఆకృతులను మట్టితో రూపొందించేలా శాలివాహనులతో ప్రయోగాత్మక శిక్షణ ఇప్పిస్తున్నాం. లోగోలు లేదా తమ ఉత్పత్తుల నిల్వ, రవాణాకు ఉపయోగించే సీసాలు, సంచుల డిజైన్లు రూపొందించాలంటూ వివిధ కంపెనీలు ఇచ్చే ప్రకటనలకు అనుగుణంగా వాటిని తయారుచేసేలా విద్యార్థులకు ప్రోత్సహిస్తున్నాం. ఉత్తమమైన నమూనాలను పోటీకి పంపుతాం. తద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే ఆత్మస్థైర్యాన్ని కల్పిస్తాం. కళాకృతులను ప్రదర్శనలకు పంపడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాం’ అని వర్సిటీ ఆచార్యులు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల కానుందని తెలిపారు.


-------------------------------------------------------------------------


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Posted Date : 17-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం