• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెయిల్‌లో 249 ఉద్యోగాలు

జులై 25 దరఖాస్తు గడువు 
 

ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)కు చెందిన స్టీల్‌ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో విధులు నిర్వర్తించడానికి అవకాశమొచ్చింది. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గేట్‌ స్కోరు, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.


మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 103, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 67, ఎస్సీలకు 37, ఎస్టీలకు 18, ఈడబ్ల్యూఎస్‌లకు 24 కేటాయించారు. అభ్యర్థులు పోస్టును బట్టి కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ బ్రాంచితో ఇంజినీరింగ్‌ డిగ్రీ 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది.   


దరఖాస్తుదారుల వయసు 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. 


గేట్‌-2023 స్కోరు, అంతకుముందు సంవత్సరాల స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు. ఆన్‌లైన్‌ దరఖాస్తులో గేట్‌-2024 అడ్మిట్‌ కార్డ్‌/ స్కోర్‌ కార్డ్‌ మీద ఉండే రిజిస్ట్రేషన్‌ నంబర్‌ను రాయాలి.


   గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ   


గేట్‌-2024 స్కోరు ఆధారంగా అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ)/ ఇంటర్వ్యూలకు కేటగిరీల వారీగా 1:12 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. జీడీ, ఇంటర్వ్యూల సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అభ్యర్థుల ఈమెయిల్‌/ ఫోన్‌ నంబర్లకూ తెలియజేస్తారు. 

జీడీ, ఇంటర్వ్యూల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకేలా మార్కులు వస్తే.. గేట్‌-2024లో ఎక్కువ స్కోరు సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు. 

జీడీ/ ఇంటర్వ్యూల్లో అన్‌రిజర్వుడ్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 50 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌)/ పీడబ్ల్యూబీడీలకు 40 శాతం సరిపోతుంది. 

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌)గా ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.50,000 మూలవేతనంగా అందజేస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిని అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమించి రూ.60,000 వేతనంగా చెల్లిస్తారు. దీంతోపాటుగా డియర్‌నెస్‌ అలవెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, హౌసింగ్‌/హెచ్‌ఆర్‌ఏ, ఉచిత వైద్యం లాంటి సదుపాయాలూ ఉంటాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో ప్రస్తుతం వినియోగిస్తోన్న ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లను మాత్రమే రాయాలి. వీటిని కనీసం ఏడాది మార్చకూడదు. 

ఎంపికైన వారిని దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్‌ ప్లాంట్లు, యూనిట్లు, గనుల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంది. 

ఎంపికైన వారికి నాలుగేళ్లు, డిపార్ట్‌మెంటల్‌ అభ్యర్థులకు రెండేళ్లు ఎలాంటి బదిలీలూ ఉండవు.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2024,

వెబ్‌సైట్‌: www.sail.co.in
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్‌ ఉద్యోగాలు!

‣ ప్రయత్నాలను మధ్యలో ఆపేయొద్దు! !

‣ హెచ్‌సీఎల్‌లో జూనియర్‌ మేనేజర్‌లు!

Posted Date : 10-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం