• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్సై, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ ఖాళీలు


 

ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ) సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌నర్స్‌), అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌-మహిళలు) గ్రూప్‌-బీ, సీ నాన్‌గెజిటెడ్, నాన్‌మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.


మొత్తం ఉద్యోగాల్లో అన్‌రిజర్వుడ్‌కు 14, ఓబీసీలకు 7, ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఎస్సీలకు 4, ఎస్టీలకు 3 కేటాయించారు. ఖాళీల సంఖ్య, విద్యార్హతల వివరాలు..

1. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌నర్స్‌)-10: 10+2, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌-వైఫరీ పాసవ్వాలి. కేంద్ర/రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. నర్సుగా మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 21-30 సంవత్సరాలు ఉండాలి. 

2. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌)-5: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2, ఫార్మసీ డిప్లొమా పాసై, ఫార్మసిస్ట్‌గా నమోదు చేసుకోవాలి. వయసు 20-28 ఏళ్లు ఉండాలి. 

3. హెడ్‌ కానిస్టేబుల్‌- (మిడ్‌వైఫ్‌-మహిళలు)-14: పదోతరగతి, ఆగ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ కోర్సు పాసవ్వాలి. కేంద్ర/ రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదుకావాలి. వయసు 18-25 సంవత్సరాలు ఉండాలి.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడు నుంచి ఎనిమిదేళ్లు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రిక్రూట్‌మెంట్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్, ప్రాక్టికల్‌ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్టీ): సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌నర్స్‌), అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌) పోస్టులకు పురుష అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ., చాతీ 77-82 సెం.మీ. ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థుల ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి. మహిళలు 150 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష, మహిళా అభ్యర్థులు ఎత్తు, వయసుకు తగ్గ బరువు ఉండాలి. 

హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌-మహిళలు) పోస్టుకు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ కేటగిరీకి చెందినవాళ్లు 147.5 సెం.మీ ఉంటే సరిపోతుంది. 

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ): సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుకు: పురుషులు 100 మీటర్ల రేస్‌ను పదహారు సెకన్లలో, 1.6 కి.మీ. పరుగును ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ముగించాలి. 

మహిళలు 100 మీటర్ల రేస్‌ను పద్దెనిమిది సెకన్లలో, 800 మీటర్ల రేస్‌ను 4 నిమిషాల 45 సెకన్లలో పూర్తిచేయాలి. 

అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫార్మసిస్ట్‌), హెడ్‌ కానిస్టేబుల్‌ (మిడ్‌వైఫ్‌) పోస్టులకు:  పురుషులు 1.6 కి.మీ. పరుగును ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ముగించాలి. పదకొండు అడుగుల లాంగ్‌  జంప్, మూడున్నర అడుగుల హైజంప్‌లకు మూడు అవకాశాలు ఇస్తారు. 

మహిళలు 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల 45 సెకన్లలో పూర్తిచేయాలి. తొమ్మిది అడుగుల లాంగ్‌జంప్, మూడు అడుగుల హైజంప్‌లకు మూడు అవకాశాలు ఇస్తారు. 

దీంట్లో అర్హత సాధించనివారిని ఎంపిక చేయరు. ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు పీఈటీ ఉండదు. పీఎస్‌టీ, రాతపరీక్ష, స్కిల్‌/ప్రాక్టికల్, వైద్య పరీక్షల్లో అర్హత సాధించాలి. 


  రాతపరీక్ష  

ఆబ్జెక్టివ్‌ విధానంలో వంద మార్కులకు ఉంటుంది. సీబీటీ/ ఓఎంఆర్‌ విధానంలో నిర్వహిస్తారు. వ్యవధి రెండు గంటలు. 

ఐదు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ పది ప్రశ్నలకు పది మార్కులు. 

జనరల్‌ అవేర్‌నెస్‌ పది ప్రశ్నలు - పది మార్కులు.

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ పది ప్రశ్నలు - పది మార్కులు. 

ఇంగ్లిష్‌/ హిందీ కాంప్రహెన్షన్‌ - పది ప్రశ్నలు - పది మార్కులు. 

ట్రేడ్‌/ ప్రొఫెషన్‌కు సంబంధిత ప్రశ్నలు అరవై - అరవై మార్కులు. 

నెగెటివ్‌ మార్కులు లేవు. 

ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) 33 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. 

దీంట్లో అర్హత సాధించినవారి ధ్రువపత్రాలను పరిశీలించి ప్రాక్టికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి వంద మార్కులు. వైవావోస్‌కు-40, ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఐడెంటిఫికేషన్‌కు-30, ప్రొసీజర్సుకు-30. కనీసార్హత మార్కులు 50 శాతం. దీంట్లో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. 


  సన్నద్ధత  

వీలైనని మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. రోజువారీ టైమ్‌టేబుల్‌ వేసుకుని కచ్చితంగా పాటించాలి. 

కనీసం పదిపన్నెండు మాక్‌ టెస్టులు రాసి ఫలితాలను విశ్లేషించుకోవాలి. తక్కువ మార్కులు వస్తోన్న అంశాలకు అదనపు సమయాన్ని కేటాయించాలి. 

ట్రేడ్‌/ ప్రొఫెషనల్‌ టెస్టుకు ఎక్కువ మార్కులు కేటాయించారు. సిలబస్‌ను వివరాలను ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ అంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 

నెగెటివ్‌ మార్కులు లేవు కాబట్టి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడానికి ప్రయత్నించాలి. ముందుగా బాగా తెలిసినవాటికి.. ఆ తర్వాత తెలియని వాటికి ప్రయత్నించాలి. దీంతో సమయం వృథా కాదు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 28.07.2024

వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Posted Date : 17-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం