• facebook
  • whatsapp
  • telegram

అద్దాల తయారీలో అతి శీతల ద్రవం!

పరిశ్రమలు

అలా వీధిలోకి వెళితే షాపుల్లో అనేక రంగుల్లో ఆహార పదార్థాలు కనిపిస్తుంటాయి. పదార్థాల నిల్వకు, శుద్ధికి కొన్ని రకాల రసాయనాలను వినియోగిస్తారు. సర్జరీకి ముందు రోగికి నొప్పి తెలియకుండా మత్తు ఇస్తారు. సిమెంటు బూడిద రంగులో ఉండటానికి ఆక్సైడ్‌ కలుపుతారు. ఆధునిక జీవనశైలిలో ప్రతి వస్తువులోనూ కృత్రిమ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. తినే పదార్థాలు, ఔషధాలు, పెయింట్లు, నిల్వ కారకాలు, హానికర వాయువులు, పోషకాలు, ఎరువులు, పేలుడు పదార్థాలు, గాజు, సిమెంటు వంటి నిర్మాణ సామగ్రి, మద్యం వంటి పానీయాలు తదితరాల న్నింటిలోనూ రసాయనాలు మిళితమై ఉన్నాయి. రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన  ఆ రసాయనాలు, వాటి పరిశ్రమల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


 

1.    మానసిక ఒత్తిడి, స్వల్ప లేదా తీవ్రమైన స్థాయిలో ఉండే మనోవ్యాధుల నుంచి ఉపశమనానికి ఉపయోగించే రసాయన పదార్థాలు?

1) ట్రాంక్విలైజర్లు       2) యాంటాసిడ్లు 

3) ఎనాల్జిసిక్‌లు      4) యాంటీబయాటిక్‌లు 


2.     కిందివాటిలో నొప్పి/బాధను మాత్రమే పూర్తిగా తగ్గించడం లేదా నయం చేసేవి?

1) ట్రాంక్విలైజర్లు     2) యాంటీబయాటిక్‌లు 

3) ఎనాల్జిసిక్‌లు     4) యాంటాసిడ్లు


3.     వేటిని అధికంగా సేవిస్తే మైకం, అపస్మారకస్థితి సంభవిస్తుంది?

1) నార్కోటిక్‌ ఎనాల్జిసిక్‌లు   2) ట్రాంక్విలైజర్లు

3) నాన్‌-నార్కోటిక్‌ ఎనాల్జిసిక్‌లు      4) యాంటీబయాటిక్‌లు


4.     ‘సూక్ష్మజీవులను నాశనం చేసే ధర్మాలు పెన్సీలియం బూజులో ఉన్నాయి’ అనే విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త?

1) లీవెన్‌ హుక్‌            2) రాబర్ట్‌ హుక్‌ 

3) అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌       4) యల్లాప్రగడ సుబ్బారావు


5.     కంటికి పూసే బలహీన యాంటీసెప్టిక్‌గా పనిచేసే ద్రావణం?

1) అయడోఫారం     2) బోరిక్‌ ఆమ్లం 

3) బితియనోల్‌     4) క్లోరోక్సిలెనోల్‌    


6.     ఆహారంలో వాడే కృత్రిమ రంగుల్లో అధిక భాగం ఏ పదార్థాల నుంచి తయారుచేస్తారు?

1) పెట్రో రసాయనాలు     2) కోక్‌ 

3) సెల్యులోజ్‌     4) కోల్‌తార్‌


7.     సూక్ష్మజీవుల వృద్ధి ద్వారా ఆహార పదార్థాలు చెడిపోయే ప్రమాదం నుంచి ఏవి రక్షిస్తాయి?

1) పంచదార       2) సాధారణ ఉప్పు  

3) సోడియం బెంజోయేట్‌      4) పైవన్నీ


8.     మాంసం, చేపలను శుద్ధి చేయడానికి వాడే పదార్థం-

1) ప్రొపనోయిక్‌ ఆమ్లం  2) సార్బిక్‌ ఆమ్లం 

3) ఎసిటిక్‌ ఆమ్లం     4) సోడియం బెంజోయేట్‌


9.     పండ్ల రసాల పొడులు ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు కలిపే పదార్థం?

1) పొటాషియం నైట్రేట్‌      2) సోడియం మెటా బైసల్ఫేట్‌

3) వానిల్లిన్‌            4) సార్బిక్‌ ఆమ్లం


10. మధుమేహ రోగులకు తీపి కోసం వాడే వరం లాంటి పదార్థం?

1) శాకరిన్‌     2) వానిల్లిన్‌  

3) పొటాషియం టార్టరేట్‌     4) సోడియం బైటార్టరేట్‌


11. కిందివాటిలో మలేరియాను తగ్గించడానికి వాడే పదార్థాన్ని గుర్తించండి.

1) యాంటీఎసిడిటీ రెగ్యులేటర్స్‌   2) క్లోరోక్విన్‌

3) డీటాక్సోహాల్‌             4) అనస్తీషియా


12. రక్తంలో ఆల్కహాల్‌ శాతాన్ని తగ్గించే పదార్థం?

1) డీటాక్సోహాల్‌     2) అనస్తీషియా 

3) క్లోరోక్విన్‌     4) సార్బిక్‌ ఆమ్లం


13. సర్జరీకి ముందు రోగికి నొప్పి తెలియకుండా ఏ పదార్థాన్ని ఇస్తారు?

1) డీటాక్సోహాల్‌       2) సోడియం బైటార్టరేట్‌

3) అనస్తీషియా       4) క్లోరోక్విన్‌


14. చెరకు గడలను క్రషింగ్‌ చేసినప్పుడు ఏర్పడే ‘బగాసే’ ను దేని తయారీలో ఉపయోగిస్తారు?

1) తివాచీలు     2) కాగితం    

3) దుస్తులు       4) కృత్రిమ దారాలు


15. డిఫకేషన్‌ ప్రక్రియలో ఆమ్లత్వం తొలగించడానికి చెరకు రసానికి కింది ఏ పదార్థం కలుపుతారు?

1) MgCO3 2) CaCO3

3) Ca(OH)2 4) NaOH


16. మొలాసిస్‌లోని చక్కెర శాతం?

1) 50%      2) 40%       3) 25%       4) 30%


17. మధుమేహ రోగుల రక్తంలో గూక్లోజ్‌ పరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) మిల్లి లీటర్‌     2) మిల్లీగ్రామ్‌ 

3) సెంటీలీటర్‌     4) హెక్టాగ్రామ్‌


18. బ్రాందీలో ఉండే ఆల్కహాల్‌ శాతం గుర్తించండి.

1) 35% - 60%             2) 40% - 50% 

3) 12% - 16%              4) 3.5% - 12%


19. బొగ్గు గనుల్లో పనిచేసే శ్రామికులకు కలిగే వ్యాధి?

1) సిలికోసిస్‌         2) న్యూమోకోనియోసిస్‌ 

3) వైట్‌లంగ్స్‌         4) మినిమాటా


20. మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వాయువు?

1) ఫాస్‌జీన్‌       2) క్లోరోపిక్రిన్‌     

3) ప్రొడ్యూసర్‌ గ్యాస్‌       4) మస్టర్డ్‌ గ్యాస్‌


21. ఫొటోగ్రఫీ కాగితంపై పూసే రసాయన పదార్థం?

1) సిల్వర్‌ బ్రోమైడ్‌      2) సిల్వర్‌ అయోడైడ్‌ 

3) మెర్క్యూరిక్‌ సల్ఫైడ్‌   4) పొటాషియం అయోడైడ్‌


22. కిందివాటిలో మొక్కలకు పోషకాలను అందించే ఏకమాత్ర ఎరువు కానిది?

1) NH4Cl      2) KCl

3) KNO2   4) NH4NO3


23. కిందివాటిలో మొక్కలకు పోషకాలను అందించే ద్విమాత్ర ఎరువును గుర్తించండి.

1) మోనో-టై-డై అమ్మోనియం ఫాస్ఫేట్‌      2) Ca(CO3)2

3) KCl        4) NH4Cl


24. డైనమైట్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) జూలియస్‌ విల్‌ బ్రాండ్‌      2) ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌

3) ఆస్కోరియో సోబ్రెరో       4) జోసఫ్‌ ఆస్పిడిన్‌


25. కిందివాటిలో శక్తిమంతమైన పేలుడు పదార్థం?    

1) RDX 2) TNP 3) TNT 4) TNG


26. పెయింట్‌ను ద్రవస్థితిలో ఉంచే నూనె లాంటి ద్రవం?

1) బైండర్స్‌     2) సాల్వెంట్‌  

3) డ్రైయర్‌      4) అడిటీవ్స్‌


27. సూర్యుడి వేడి, చలిగాలుల నుంచి చర్మాన్ని రక్షించే ఎమల్షన్‌?

1) పౌడర్‌     2) శీతల లేపనాలు  

3) గోళ్ల రంగు     4) రంజనాలు 


28. ద్రవ గాజుపై తేలియాడే మలినాలను ఏమని పిలుస్తారు?

1) బాచ్‌      2) కల్లెట్‌ 

3) ద్రవ గాజు      4) గాజు గాల్‌


29. కెమెరా లెన్స్‌లు, టెలిస్కోపుల్లో ఉపయోగించే గాజు?

1) పొటాష్‌ గాజు      2) పైరెక్స్‌ గాజు 

3) ప్లింట్‌ గాజు      4) వాటర్‌ గ్లాస్‌ 


30. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను శోషించుకునే స్వభావం ఉన్న గాజు?

1) ప్లింట్‌ గాజు     2) పైరెక్స్‌ గాజు

3) వాటర్‌ గ్లాస్‌     4) క్రూక్స్‌ గ్లాస్‌


31. ఊదా రంగు గాజు రావడానికి కలపాల్సిన లోహ ఆక్సైడ్‌-

1) కోబాల్ట్‌     2) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌ 

3) మాంగనీస్‌ డై ఆక్సైడ్‌     4) క్రోమిక్‌ ఆక్సైడ్‌


32. సిమెంట్‌ బూడిద రంగులో ఉండటానికి కారణమేంటి?

1) ఫెర్రిక్‌ ఆక్సైడ్‌     2) మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ 

3) ఫెర్రస్‌ ఆక్సైడ్‌     4) క్రోమిక్‌ ఆక్సైడ్‌


33. మోర్టార్‌ వేటి మిశ్రమ పదార్థం?

1) సిమెంట్, కంకర, నీరు    2) సిమెంట్, ఇసుక, రాళ్లు

3) సున్నం, ఇసుక, నీరు    4) సిమెంట్, ఇసుక, నీరు


34. పిల్లర్స్, బ్రిడ్జ్‌ నిర్మాణంలో ఉపయోగించే పదార్థం?

1) మోర్టార్‌     2) కాంక్రీట్‌ 

3) ప్రబలిత కాంక్రీట్‌      4) పైవన్నీ


35. సిరామిక్‌ అనే పదం కెరామోస్‌ అనే ఏ భాష నుంచి ఏర్పడింది?

1) గ్రీకు  2) లాటిన్‌ 3) అరబిక్‌ 4) ఇటాలియన్‌


36. మన దేశంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ అధికంగా లభించే రాష్ట్రం?

1) గుజరాత్‌      2) రాజస్థాన్‌ 

3) దిల్లీ      4) పశ్చిమ బెంగాల్‌


37. డెవలప్‌ చేసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోగ్రాఫ్‌లో నల్లగా కనిపించే లోహం?

1) కాపర్‌     2) అల్యూమినియం  

3) సిల్వర్‌     4) టిన్‌ 


38. క్లోరోఫామ్‌కు నైట్రిక్‌ ఆమ్లం కలిపి ఏ వాయువును తయారుచేస్తారు?

1) ఫాస్‌జీన్‌     2) క్లోరోపిక్రిన్‌ 

3) మస్టర్డ్‌ గ్యాస్‌      4) ప్రొడ్యూసర్‌ గ్యాస్‌


39. పాదరసం వ్యక్తుల శరీరంలోకి ప్రవేశిస్తే కలిగే వ్యాధి?

1) ఫాసీజా     2) సిలికోసిస్‌ 

3) మినిమాటా      4) సిడరోసిస్‌


40. వోడ్కాను తయారుచేయడానికి ఉపయోగించే ముడిపదార్థం?

1) ఆపిల్‌      2) ద్రాక్ష  

3) మొక్కజొన్న      4) బంగాళాదుంప


41. పెయింట్‌ను గట్టిగా, పారదర్శకంగా, స్థితిస్థాపకత ధర్మం కలిగిందిగా చేసే పదార్థం?

1) బేస్‌      2) పిగ్మెంట్‌      

3) బైండర్స్‌      4) సాల్వెంట్‌


42. కిందివాటిలో వెహికల్‌/ ‘గ్లూ’ అని ఏ పదార్థాన్ని పిలుస్తారు?

1) బైండర్స్‌        2) సాల్వెంట్‌     

3) బేస్‌         4) పిగ్మెంట్‌


43. మొదటిసారిగా మావ్‌ అనే కృత్రిమ రంగును ఆవిష్కరించిన శాస్త్రవేత్త?

1) ఆస్కారియో సోబ్రెరో     2) జూలియస్‌ బ్రాండ్‌

3) ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌     4) సర్‌ విలియం హెన్రీపెర్కిన్‌


44. కిందివాటిలో నైట్రోజన్‌ ఎరువు కానిది?

1) NH4NO3    2) NH4Cl

3) KNO3        4) NH2CONH2


45. టపాసుల పరిశ్రమలో ఆకుపచ్చ కాంతి వెదజల్లడానికి ఉపయోగించే పదార్థం?

1) సోడియం     2) బేరియం  

3) మెగ్నీషియం     4) కాపర్‌


46. కిందివాటిలో అతిశీతల ద్రవంగా దేన్ని పిలుస్తారు?

1) నీరు  2) పాదరసం  3) బ్రోమిన్‌  4) గాజు


47. సీసాలు, కిటికీ అద్దాల తయారీకి ఉపయోగించే గాజు పదార్థం?

1) ప్లింట్‌ గాజు     2) సోడా గాజు 

3) క్వార్ట్జ్‌ గాజు      4) క్రౌన్‌ గాజు 


48. సెట్టింగ్‌ ఆఫ్‌ సిమెంట్‌ నెమ్మదిగా జరపడం కోసం సిమెంట్‌కు కలిపే పదార్థం?

1) పీఓపీ      2) జిప్సం  

3) టిన్‌      4) కాల్షియం సల్ఫేట్‌


49. మృత్తిక పాత్రలను ఎన్ని డిగ్రీల సెల్సియస్‌ వద్ద తయారు చేస్తారు? 

1) 1100ºC - 1200ºC     2) 800ºC - 900ºC

3) 1400ºC - 1800ºC       4) 600ºC - 800ºC


50. వాహనాలు నడుపుతున్నప్పుడు ప్రమాద సమయంలో వెలువడే ఎయిర్‌ బ్యాగ్‌లో ఉపయోగించే పదార్థం?

1) సోడియం అజైడ్‌          2) కాడ్మియం సల్ఫైడ్‌    

3) ఆరిక్‌ క్లోరైడ్‌       4) సెలీనియం ఆక్సైడ్‌



సమాధానాలు


1-1; 2-3; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-3; 9-2; 10-1; 11-2; 12-1; 13-3; 14-2; 15-3; 16-1; 17-2; 18-1; 19-2; 20-4; 21-1; 22-3; 23-1; 24-2; 25-2; 26-1; 27-2; 28-4; 29-3; 30-4; 31-3; 32-1; 33-4; 34-3; 35-1; 36-2; 37-3; 38-2; 39-3; 40-4; 41-1; 42-1; 43-4; 44-3; 45-2; 46-4; 47-2; 48-2; 49-3; 50-1.


రచయిత: చంటి రాజుపాలెం 
 

Posted Date : 21-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌