• facebook
  • whatsapp
  • telegram

భాషా నైపుణ్యాలు

మెరుపు అట్టలతో తొలి పఠనం మొదలు!


భాష నేర్చుకోవడం, దానిపై అవగాహన పెంచుకోవడం పిల్లల్లో పూర్వప్రాథమిక, ప్రాథమిక స్థాయుల్లోనే అలవడుతుంది. వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం భాషకు మూలస్తంభాలు, భాషా నైపుణ్య సాధనాలు. వీటిని అలవాటు చేసే బాధ్యత ప్రాథమిక ఉపాధ్యాయులపై ఉంటుంది. తొలిసారి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని తీర్చిదిద్దాలంటే ఈ భాషా నైపుణ్యాలపై సమగ్ర అవగాహన ఉండాలి. నైపుణ్యాలను నేర్పించే విధానం, ఇందుకోసం ఉపయోగించే ఉపకరణాలు, ఈ క్రమంలో పిల్లల్లో గుర్తించే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలి.


1.     భాషా కౌశలాల్లో ‘గ్రహణ శీలాలు’?

1) శ్రవణం, భాషణం     2) పఠనం, లేఖనం 

3) శ్రవణం, పఠనం     4) భాషణం, లేఖనం


2.     భావ ప్రకటనకు తోడ్పడే భాషా నైపుణ్యాలు?

1) శ్రవణం, పఠనం     2) భాషణం, లేఖనం 

3) శ్రవణం, లేఖనం     4) పఠనం, భాషణం


3.     సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే?

1) వినడం 2) మాట్లాడటం 3) చదవడం 4) రాయడం


4.     భాషా నైపుణ్యాలు...

1) పరస్పరాశ్రితాలు     2) పరస్పర భిన్నాలు 

3) ఏకాశ్రితాలు     4) బహురూపాశ్రితాలు


5.     లిఖిత మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు?

1) శ్రవణం, పఠనం     2) పఠనం, లేఖనం 

3) శ్రవణం, భాషణం     4) భాషణం, లేఖనం


6.     ‘తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి’ అనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మొదటిసారిగా పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశం?

1) అక్షరాలను దిద్దించడం 

2) శిశు గేయాలు చెప్పడం

3) బోర్డుపై రాసిన అక్షరాన్ని చదవమనడం 

4) కృత్యాల ద్వారా అక్షరాలు నేర్పడం 


7.     నూతన శబ్ద పరిచయం, విషయ పరిచయం,  ఉచ్చారణ దక్షణ భావప్రకటనా కౌశలం - వీటికి ప్రాధాన్యమివ్వాల్సిన చర్య?

1) లిఖిత చర్య       2) వాచిక చర్య 

3) లోపనివారణ చర్య     4) శ్రావణ చర్య


8.     కార్ల్‌ రోజర్స్‌ ప్రకారం భావప్రసరణలో వ్యక్తి విఫలమవడానికి ప్రధాన కారణం?

1) చేతనాలోపం     2) శ్వాసలోపం 

3) శ్రవణశక్తి లోపం     4) విభాషణ లోపం


9.     కింది భాషా నైపుణ్యాల్లో ఉత్పాదక శీలాలు-

1) శ్రవణం, పఠనం     2) శ్రవణం, భాషణం 

3) పఠనం, లేఖనం      4) భాషణం, లేఖనం


10. ప్రాథమిక స్థాయిలో మొదటగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు?

1) ఛార్టులు      2) చిత్రాలు  

3) మెరుపు అట్టలు      4) బొమ్మలు


11.     చక్కని భావ వినిమయానికి ఆధారమైంది?

1) మాట   2) క్రియ   3) చేష్ఠ   4) హావం


12. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు?

1) శ్రవణం, పఠనం     2) భాషణం, లేఖనం 

3) పఠనం, లేఖనం     4) శ్రవణం, భాషణం


13. భాషా నైపుణ్యాల్లో క్రియాశీలాలను ఏమంటారు?

1) ఉత్పాదక శీలాలు      2) గ్రహణ శీలాలు 

3) బాహ్య శీలాలు     4) అంతర్గత శీలాలు


14. ఒక విధంగా ‘సద్యోభాషణం’ దీనికి చెందింది?

1) ఉక్తరచన     2) ఉక్తలేఖనం 

3) నాటకీకరణం     4) కంఠస్థం చేయడం


15. కిందివాటిలో విద్యార్థుల్లో ఉచ్చారణ దోషాలు ఏర్పడటానికి కారణం కానిది?

1) వాగింద్రియ లోపం  2) వాగింద్రియ అపరిపక్వత 

3) పరిసర ప్రభావం   4) శ్రద్ధ


16. పి.గుర్రే అనే విద్యావేత్త ప్రకారం ధ్వనుల వినియోగం, అందించదలచిన సమాచార వినిమయానికి ఉపయోగించే భాషారూపం, వ్యక్తిత్వాలు అనేవి దేనికి తోడ్పడతాయి?

1) విద్యార్థులకు మాట్లాడటంలో శిక్షణ ఇచ్చేందుకు

2) విద్యార్థులకు వినడంలో శిక్షణ ఇచ్చేందుకు

3) విద్యార్థులతో చర్చలు జరిపేందుకు

4) విద్యార్థులకు సాహిత్య విశేషాలు పరిచయం చేసేందుకు


17. భాషా నైపుణ్య సాధనాల్లో సరైన క్రమం-

1) భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం 

2) శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం

3) పఠనం, శ్రవణం, భాషణం, లేఖనం 

4) శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం


18. ఇవి విద్యార్థులు - ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలను, పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి భాషా సామర్థ్యాల అభివృద్ధికి తోడ్పడతాయి?

1) గృహం, పరిసరాలు 

2) పిల్లలు, ఉపాధ్యాయుడు 

3) పాఠశాల, గృహం 

4) సుహృద్భావపూరిత తరగతి గది, బోధనాభ్యసన కృత్యాలు


19. ఒక విషయంలో వేగంగా అమూలాగ్రంగా ఓ క్రమపద్ధతిలో కీలకమైన భావనలను గుర్తించేందుకు తోడ్పడే నైపుణ్య భేదం?

1) అంతర పఠనం     2) శీఘ్ర పఠనం 

3) కరణాలు     4) అనుగుణ్య పఠనం


20. సుతిలి - తుసిలిగాను, మిగిలిన - మిలిగిన గాను ఉచ్చరించే దోషం?

1) వేగోచ్చారణ     2) సమవేగ రాహిత్యం

3) ధారాళతా లేమి     4) వర్ణమార్పిడి


21. ఇది శ్రవణ ఉద్దేశం?

1) అవధానంలోని విషయాన్ని గ్రహించేలా చేయడం.

2) వ్యక్తిని మంచి వక్తగా తీర్చిదిద్దడం.

3) ఊనిక, స్వరభేదం పాటిస్తూ ధారాళంగా పఠించేలా చేయడం.

4) నిర్దుష్టమైన ఉచ్చారణను కలిగించడం


22. వాగింద్రియ లోపం, పరిసరాల ప్రభావం వల్ల ఏర్పడే దోషాలు?

1) రాత దోషాలు      2) ఉచ్చారణ దోషాలు  

3) భావ దోషాలు      4) లిపి దోషాలు


23. ఏ భాషా విషయంలోనైనా మొదటగా జరిగే భాషా కార్యక్రమం?

1) పఠనం 2)  లేఖనం 3) శ్రవణం 4) భాషణం


24. ఉపాధ్యాయుడు కథ చెబుతున్నప్పుడు విద్యార్థులు తల ఊపడం కాని, ఊ..... కొట్టడం కాని చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కింది సమాధానాల్లో సరైన జంటను గుర్తించండి.

అ) పిల్లవాడికి కథ ఆసక్తికరంగా లేకపోవడం.

ఆ) కథ చెప్పేటప్పుడు అభినయాన్ని జోడించడం.

ఇ) ప్రత్యక్ష వాక్యాల్లో సరళంగా, హృద్యంగా కథ చెప్పడం.

ఈ) పిల్లవాడిలో ఏకాగ్రత, వినికిడి లోపం ఉండటం.

1) ఇ, ఈ   2) అ, ఇ  3) అ, ఈ  4) అ, ఆ


25. ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన సూచనలను మౌఖికంగా ఇచ్చి, తరగతి తెలుగు వాచకం నుంచి కొన్ని పరిచిత పదాలను నెమ్మదిగా చదవగా వాటిని శ్రద్ధగా విని తప్పులు లేకుండా రాయమనడంలో ఇమిడి ఉన్న భాషా నైపుణ్య క్రమం?

1) ఉపాధ్యాయుడి భాషణం, పఠనం, విద్యార్థుల శ్రవణం, లేఖనం

2) ఉపాధ్యాయుడి పఠనం, భాషణం, విద్యార్థుల పఠనం, లేఖనం

3) లేఖనం, విద్యార్థుల శ్రవణం, లేఖనం, ఉపాధ్యాయుడి పఠనం, భాషణం

4) విద్యార్థుల శ్రవణం, పఠనం, ఉపాధ్యాయుడి లేఖనం, భాషణం


26. ప్రాథమిక దశలో భాషణాభివృద్ధికి చేపట్టదగిన చర్యల్లో ఒకటి?

1) పద్యాలు వినిపించడం 2) విరివిగా మాట్లాడించడం 

3) జట్లు చేయడం     4) ఆటలాడించడం


27. కథాకథన పద్ధతి, కథాపద్ధతి - ఇవి క్రమంగా వేటిని అభివృద్ధి చేయడానికి తోడ్పడతాయి?

1) భాషణం, పఠనం     2) భాషణం, లేఖనం  

3) శ్రవణం, పఠనం     4) భాషణం, శ్రవణం


28. ఒక అంశాన్ని కేంద్రీకృతం చేసుకుని లిఖిత రహితంగా చేసే మౌఖిక అభివ్యక్తి విధానాన్ని ఏమంటారు?

1) ఉక్తరచన     2) ఉక్తలేఖనం 

3) స్వీయరచన     4) వ్యాసరచన


29. పిల్లలు వాచికాభినయంతో పాటు ఆంగికాభినయం చేస్తూ పాడే పాటలను ఎలా పిలుస్తారు?

1) శిశు గీతాలు      2) భావ గీతాలు 

3) అభినయ గేయాలు     4) బాల గేయాలు


30. స్పష్టత, నిర్దుష్టత, నిర్దిష్టత, ధారాళత అనే లక్షణాలుండాల్సిన అంశం?

1) భాషణం     2) శ్రవణం 

3) సహృదయత     4) అనుసృజన


31. పలుకుతున్న శబ్ద స్థానం కంటే చూస్తున్న శబ్ద స్థానం ముందున్నప్పుడు దాన్ని ఇలా అంటారు?

1) తిరోగమన వాఙ్మయ సమితి 2) పురోగమన వాఙ్మయ సమితి

3) దృష్టి ఆవర్తన దోషం 4) వాఙ్మయ సమితి


32. ఒరవడి లేదా కరడాలు రాయడంలో భాగంగా ఉపాధ్యాయుడి మాదిరి లేఖనాన్ని ఆదర్శంగా తీసుకుని మంచిఫలితాల సాధనకు విద్యార్థులు రాయాల్సిన తీరు?

1) మధ్య నుంచి పైకి, కిందికి 

2) పై నుంచి కిందికి 

3) కింది నుంచి పైకి 

4) కింది నుంచి మధ్యకు, పై నుంచి మధ్యకు


33. ఒకట్రెండు తరగతులకు బోధన కోసం 278 కార్డులు సిద్ధం చేసి వాటి సాయంతో నిర్వహించిన బోధన కార్యక్రమం?

1) స్నేహమాధురి      2) స్నేహబాల 

3) చెలిమి     4) బాలచెలిమి


34. పిల్లల భాషాభివృద్ధిని పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యార్థులు అమలుపరచిన కార్యక్రమం?

1) DPEP 2) MLL 3) CLIP 4) SSA


35. వాగ్రూపంలో ఉన్న భాషకు స్థిరత్వం ఏర్పరచేది?

1) చెక్కడం  2) దిద్దడం  3) గీత   4) లేఖనం


36. పఠనం, లేఖనం క్రమంగా వేటికి చెందినవి?

1) స్తబ్దాంశం - కారకాంశం 2) కారకాంశం - దృష్టి వ్యావర్తనం 

3) దృష్టి వ్యావర్తనం - స్తబ్దాంశం 4) కారకాంశం - స్తబ్దాంశం


37. లేఖన బోధనలో అనుసరించదగిన పద్ధతి?

1) పద పద్ధతి     2) అక్షర పద్ధతి 

3) శిక్షా పద్ధతి     4) వాక్య విశ్లేషణ పద్ధతి


38. విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంతమేర చూడగలుగుతాడో అది?

1) నయన మితి     2) వినికిడి మేర 

3) వాఙ్మతి     4) పలుకు మేర


39. లేఖనం కంటే ముందు నేర్పేది?

1) శ్రవణం     2) పఠనం 

3) మౌనపఠనం     4) భాషణం


40. చూపు మేరకు, పలుకు మేరకు మధ్య సహ సంబంధం లోపిస్తే ఏర్పడే దోషం?

1) లేఖన దోషం     2) అవగాహన దోషం 

3) పఠన దోషం     4) భాషణ దోషం


41. ఒక వైపు బొమ్మ, మరో వైపు సంబంధిత పదం ఉండేలా రాసే మెరుపు అట్ట?

1) గుర్తింపు అట్ట    2) విభజన అట్ట 

3) జతపరిచే అట్ట   4) స్వయం సవరణ అట్ట


42. సంకేత రూపంలోని లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడమే..

1) పఠనం 2) శ్రవణం 3) లేఖనం 4) సంభాషణ


43. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఏమంటారు?

1) చూపు మేర     2) పలుకు మేర 

3) నయన మితి     4) దృష్టి ఆవర్తన దోషం


44. ప్రాథమిక దశలో లేఖనాభివృద్ధికి చేపట్టదగిన కింది చర్యల్లో సరైంది-

ఎ) దిన చర్యలు రాయించడం 

బి) సంభాషణలు రాయించడం

సి) లేఖ రాయించడం  

డి) అనువాదాలు చేయించడం

1) ఎ, బి, సి 2) బి, సి, డి 3) సి, డి, ఎ  4) డి, బి, ఎ


45. వర్ణమాల క్రమంలో కాకుండా ఆకార సామ్యాన్ని బట్టి ఒకే రకానికి చెందిన అక్షరాలను ఒక వర్గంగా నేర్పించే పఠన బోధనా పద్ధతి?

1) అక్షర పద్ధతి     2) వాక్య పద్ధతి 

3) పద పద్ధతి     4) నవీనాక్షర పద్ధతి


46. విద్యార్థులకు శబ్దం, అర్థం దాని వినియోగ దక్షత కిందివాటిలో దేనివల్ల అలవడుతుంది?

1) క్షుణ్న పఠనం      2) బాహ్య పఠనం 

3) విస్తార పఠనం     4) ప్రకాశ పఠనం


47. బొమ్మలతో కూడిన కథలు, పంచతంత్ర కథలు, పొడుపు కథలు, అద్భుత కథలు - ఈ దశ విద్యార్థులకు విస్తార పఠన సామగ్రి?

1) ప్రాథమికోన్నత      2) ప్రాథమిక పాఠశాల 

3) పూర్వ ప్రాథమిక     4) ఉన్నత దశ


48. పలుకు విస్తృతి నయన విస్తృతి అనే మాటలు  తారసిల్లే సందర్భం?

1) భాషణం 2) పఠనం 3) లేఖనం 4) శ్రవణం


49. బాలుర ఉచ్చారణ దోషాల్లో చేరని అంశం?

1) వేగోచ్చారణ దోషం     2) సమవేగరాహిత్య దోషం 

3) నయన మితి దోషం     4) సమస్వర రాహిత్య దోషం



సమాధానాలు

1-3, 2-2, 3-3, 4-1, 5-2, 6-2, 7-2, 8-3, 9-4, 10-3, 11-1, 12-4, 13-1, 14-1, 15-4, 16-1, 17-4, 18-4, 19-2, 20-4, 21-1, 22-2, 23-3, 24-3, 25-1, 26-2,  27-1, 28-1, 29-3, 30-1, 31-2, 32-3, 33-2, 34-3, 35-4, 36-1, 37-2, 38-1, 39-2, 40-3, 41-4, 42-1, 43-2, 44-1, 45-4, 46-1, 47-2, 48-2, 49-3.


రచయిత: సూరె శ్రీనివాసులు 
 

Posted Date : 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌