• facebook
  • whatsapp
  • telegram

అక్షాంశాలు - రేఖాంశాలు

* గ్లోబు మీద ఒక దాంతో ఒకటి ఖండించుకునే అనేక రేఖలు ఉంటాయి. వాటిలో కొన్ని ఉత్తర ధృవం నుంచి దక్షిణ ధృవానికి, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ఉంటాయి. ఇవి గ్లోబు మీద ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మాన చిత్రాల (మ్యాపు) రూపకర్తలు గీసిన ఊహారేఖలు.


అక్షాంశాలు
*  భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు ఉన్న ఊహా రేఖలనే అక్షాంశాలు అంటారు.
*  భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్యరేఖ అంటారు.
*  అక్షాంశాలను 'సమాంతర రేఖలు, పూర్ణ వృత్తాలు' అంటారు. ఇవి భూమికి అడ్డంగా ఒక డిగ్రీ అంతరంతో గీసిన ఊహారేఖలు.

*  భూమధ్యరేఖ పైన ఉండే అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళం, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.
*  మొత్తం అక్షాంశాలు 180.
*  భూమధ్యరేఖతో కలిపి అక్షాంశాల మొత్తం 181.
*  అక్షాంశాలన్నింటిలో 'భూమధ్యరేఖ' పెద్దది.
*  భూమధ్యరేఖకు దక్షిణంగా దక్షిణార్ధగోళంలోని 90 అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలు అంటారు.
*  ఈ భూమధ్యరేఖ ఉత్తర, దక్షిణ ధృవాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. ఇది భూమిని రెండు సమాన భాగాలుగా చేస్తుంది. కాబట్టి దీన్ని భూమధ్యరేఖ అంటారు. అక్షాంశంగా గుర్తిస్తారు.
*  అక్షాంశాలను డిగ్రీలు (0º), నిమిషాలు (1), సెకండ్లలో (11) సూచిస్తారు.
*  అక్షాంశాలను ఇంగ్లిషులో లాటిట్యూడ్ అంటారు. 'లాటిట్యూడ్' 'వెడల్పు' అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన 'లాటిట్యూడొ' నుంచి వచ్చింది.

 

భూమధ్యరేఖ:
ల అక్షాంశాన్ని భూమధ్యరేఖ అంటారు. ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల ద్వారా వెళుతుంది.
 

కర్కట రేఖ:
   ల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. ఇది ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల ద్వారా వెళుతుంది.
 

ఆర్కిటిక్ వలయం:
  ల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. ఇది ఉత్తర అమెరికా ఖండంలోని అలస్కా, కెనడా; ఆసియా ఖండంలోని రష్యా; గ్రీన్‌లాండ్, యూరప్ ద్వారా వెళుతుంది.
 

ఉత్తర ధృవం:
90ºల ఉత్తర అక్షాంశాన్ని (బిందువును) ఉత్తర ధృవం అని పిలుస్తారు.
 

మకర రేఖ:
 ల దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ అంటారు.

అంటార్కిటికా వలయం:
 ల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటికా వలయం అంటారు.

దక్షిణ ధృవం:
90º ల దక్షిణ అక్షాంశాన్ని (బిందువును) దక్షిణ ధృవం అంటారు.
 

ఉత్తరార్ధగోళం:
భూమధ్యరేఖ, ఉత్తర ధృవం మధ్య ఉన్న భూమిలో సగభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు.
( ఉత్తర అక్షాంశం నుంచి 90º ల ఉత్తర ధృవం వరకు)
* దీనిలో నుంచి 90ºల వరకు ఉత్తర అక్షాంశాలు ఉంటాయి

.

దక్షిణార్ధగోళం:
భూమధ్యరేఖ, దక్షిణ ధృవం మధ్య ఉన్న సగభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు.
(
... దక్షిణ అక్షాంశం నుంచి 90ºల దక్షిణ ధృవం వరకు)
* దీనిలో నుంచి 90ºల వరకు దక్షిణ అక్షాంశాలు ఉంటాయి. కొన్ని అక్షాంశాలకు ప్రత్యేకమైన పేర్లు కూడా ఉంటాయి.

 రేఖాంశాలు
* ఒక ధృవం నుంచి మరొక ధృవాన్ని నిలువుగా కలిపే రేఖలను 'రేఖాంశాలు' అంటారు.
* అక్షాంశాల్లా కాకుండా రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. రేఖాంశాన్ని ఇంగ్లిషులో 'లాంగిట్యూడ్' అని అంటారు. ఇది లాటిన్ పదమైన 'పొడవు' అనే అర్థాన్ని ఇచ్చే 'లాంగిట్యుడ్' నుంచి వచ్చింది.
* రేఖాంశాలు పూర్తి వృతాలు కాదు. ధృవం నుంచి ధృవం వరకు ఉండే అర్ధవృత్తాలు. ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది.
* మొత్తం రేఖాంశాలు 360º. ఈ రేఖాంశాలు నుంచి ప్రారంభమై తూర్పు పడమరలుగా రెండు సమూహాలుగా ఉంటాయి. ఈ సమూహాలు నుంచి 179ºల వరకు తూర్పు రేఖాంశాలుగా, నుంచి 179º ల వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉంటాయి.
* 180º ల రేఖాంశాన్ని తూర్పు, పశ్చిమ రేఖాంశం అంటారు.

పూర్వార్ధ గోళం:
* తూర్పు రేఖాంశం నుంచి 179º ల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పూర్వార్ధ గోళం అని అంటారు.

పశ్చిమార్ధగోళం:
*  పశ్చిమ రేఖాంశం నుంచి 179º ల పశ్చిమ రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమార్ధగోళం అని అంటారు.
* రేఖాంశాలన్నింటిలో గ్రీనిచ్ రేఖాంశం, అంతర్జాతీయ దినరేఖ ముఖ్యమైనవి.

 

గ్రీనిచ్ రేఖాంశం:
 ఇంగ్లడ్‌లోని గ్రీనివిచ్ (గ్రీనిచ్) లోని నక్షత్రశాల ద్వారా వెళ్లే రేఖాంశాన్ని మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు.

అంతర్జాతీయ దినరేఖ
180º ల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అనుసంధానిస్తూ గీసిన రేఖను అంతర్జాతీయ దినరేఖ అంటారు. ఈ రేఖ పసిఫిక్ మహాసముద్రం ద్వారా వెళుతుంది. ఈ రేఖ వద్ద తారీఖులు మారతాయి.

23º ప్రామాణిక రేఖాంశం

 0º ల రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పిలుస్తారు.
 చాలా దేశాలు తమదేశం ద్వారా వెళ్లే రేఖాంశాన్ని ల రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించాయి.
 ఇంగ్లండ్ గ్రీనిచ్ ద్వారా వెళ్లే రేఖాంశాన్ని ల రేఖాంశంగా నిర్ణయించింది. ఆ సమయంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లండ్ పరిపాలించేది. దాంతో వారు అనుసరించిన విధానాన్నే మిగిలిన వారందరూ పాటించారు.
 భారతదేశ ప్రామాణిక రేఖాంశం ల తూర్పు రేఖాంశం.
 భారత ప్రామాణిక రేఖాంశానికి, గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య 5º  గంటల వ్యత్యాసం ఉంటుంది.

రేఖాంశాలు - సమయం
* రేఖాంశాలను మెరిడియన్లు అని కూడా అంటారు. మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది 'మెరిడియానస్' అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.
* ఒక రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి. అందుకే రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు.
* భూమి స్థితి రేఖాంశం మేర జరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఒక్కో రేఖాంశం వద్ద సమయం వేర్వేరుగా ఉంటుంది.
ఉదా: 10º ల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12 : 00 (మధ్యాహ్నం), కానీ ల తూర్పు రేఖాంశం వద్ద 11 : 56. అలాగే 11º ల తూర్పు రేఖాంశం వద్ద 12 : 04 అవుతుంది. కాబట్టి ఇది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్‌కి తూర్పు, పడమరలను కలిపి మొత్తం 24 కాల మండలాలు (Time Zones) గా విభజించారు.
* ఒక్కో కాల మండలం 15º రేఖాంశాల మేర ఉంటుంది. కాబట్టి ఒక కాల మండలానికి మరొక కాల మండలానికి గంట సమయం తేడా ఉంటుంది. (15º రేఖాంశాలు × ఒక డిగ్రీ అక్షాంశానికి 4 నిమిషాలు = 60 నిమిషాలు)
* గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయాన్ని కలపాలి. పడమర వైపుకు వెళ్తుంటే సమయాన్ని తీసివేయాలి.
*  ల రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం (పగలు 12 : 00) అయినప్పుడు 180º రేఖాంశం (యాంటి మెరిడియన్) వద్ద అర్ధరాత్రి 12 : 00 గంటలు అవుతుంది. 180º రేఖాంశానికి పడమర వైపు మంగళవారం మొదలవుతుంటే తూర్పు వైపు సోమవారం పూర్తవుతూ ఉంటుంది.
* మనం తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు కోల్పోతాం. అదే పడమర నుంచి తూర్పుకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాలు అదనంగా పొందుతాం.

 దేశ ప్రామాణిక సమయం:
కొన్ని దేశాలు తమ దేశం ద్వారా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకుని ఆ రేఖాంశం వద్ద ఉండే సమయాన్ని దేశమంతటికీ వర్తింపజేస్తారు. దీన్నే ఆదేశ ప్రామాణిక సమయం అంటారు.
 భారతదేశానికి ఉండే ప్రామాణిక సమయాన్ని 'భారతదేశ ప్రామాణిక సమయం (IST)' అని, పాకిస్థాన్‌కు ఉండే ప్రామాణిక సమయాన్ని 'పాకిస్థాన్ ప్రామాణిక సమయం (IST లేదా PKT)' అని అంటారు.

Posted Date : 12-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌