• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం (LEARNING)

గాలి పటాలను చూసి పక్షులుగా భావిస్తే!

నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. పిల్లల్లో ఈ సామర్థ్యాన్ని పెంపొందించాలంటే తగిన అనుభవ జ్ఞానాన్ని కలిగించాలి. ఆ విధంగా చేయడాన్నే సైకాలజీలో సాంకేతికంగా అభ్యసనం అంటారు. విద్యార్థిలో స్వతహాగా ఆలోచనలను పెంచి, విశ్లేషణ సామర్థ్యాన్ని విస్తృతపరుస్తూ అవగాహనతో కూడిన విజ్ఞానాన్ని అందించేదే అభ్యసనం. ఇందుకోసం పలు రకాల బోధనాభ్యాస ప్రక్రియలు, ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు ఉన్నాయి. వాటిపై ఉపాధ్యాయులు కాబోయే అభ్యర్థులకు అవగాహన ఉండాలి. 


1.     అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం?

1) శారీరకాభివృద్ధి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు

2) శిక్షణ ద్వారా ప్రవర్తనలో కలిగే మార్పు

3) ప్రవర్తనలో ఏదైనా మార్పు

4) అనుభవం ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వత మార్పు


2.     అభ్యసనం చేసే విషయాల పట్ల అభ్యాసకుడికి ఎలాంటి దృక్పథం ఉండాలి?

1) వ్యతిరేక వైఖరి         2) అనుకూల వైఖరి

3) వైఖరిలో మార్పు        4) వైఖరి అంతరం


3.     అభ్యాసకుడి సంసిద్ధత, ఉపాధ్యాయుడి వైఖరి,  ప్రవర్తన, తరగతి గది నైతికత లాంటివి కింద ఇచ్చిన బోధనా శాస్త్రాంశాల్లోని దేన్ని సూచిస్తాయి?

1) అభ్యసన నిష్పాదన  2) అభ్యసన మూల్యాంకనం

3) అభ్యసన ప్రక్రియ   4) అభ్యసన స్థితి


4.     కిందివాటిలో ఏ అంశం అభ్యసనం చక్కగా,   సమర్థంగా సాగేందుకు తోడ్పడదు?

1) అభ్యసనం చేసే వ్యక్తి    2) అభ్యసన విషయం

3) అభ్యసన సన్నివేశం   4) అభ్యసన వైకల్యం


5.     కింది శాఖలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి.

1) పరిపక్వత ఫలితంగా వ్యక్తిలో వచ్చే మార్పులను శాశ్వత అభ్యసనంగా పరిగణించడం.

2) అభ్యసనం ప్రత్యక్ష, పరోక్ష అనుభవాల ఫలితం.

3) మాదకద్రవ్యాల వల్ల ఒక వ్యక్తి ప్రవర్తనలో గమనించే మార్పులను అభ్యసనంగా పరిగణించడం.

4) సంసర్గం, అనుభవాల ఫలితంగా కలిగే అభ్యసనానికి ఎప్పుడూ ధనాత్మక స్వభావం ఉంటుంది.


6.     కిందివాటిలో అభ్యసన ప్రక్రియ సోపానం కానిది?

1) అవసరం ఏర్పడటం లేదా ప్రేరణ కలగడం.

2) లక్ష్యాన్ని, గమ్యాన్ని స్థిరపరచుకోవడం.

3) గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవడం.

4) లక్ష్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించకపోవడం.


7.     వైగోట్‌స్కీ విశ్వాసం ప్రకారం-

1) భాషా సముపార్జన, సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది.

2) సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా  వికాసానికి వీలు కల్పిస్తుంది.

3) భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు.

4) భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు.


8.     కిందివాటిలో అభ్యసనానికి ప్రభావంతమైన ప్రేరణ?

1) బహుమతుల కోసం అభ్యసనం

2) శిక్షను తప్పించుకునేందుకు అభ్యసనం

3) ర్యాంకు కోసం అభ్యసనం

4) ఆత్మసంతృప్తికి అభ్యసనం


9.     అభ్యసనంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం?

1) మార్గదర్శకత్వం    2) లక్ష్యాలు

3) బోధన    4) అనుభవం


10. కిందివాటిలో అత్యంత ప్రభావంతమైంది?

1) ట్యూషన్‌ మాస్టర్‌ ద్వారా అభ్యసనం

2) అభ్యసనం కోసం అభ్యసించడం

3) పాఠశాల ఉపాధ్యాయుడి ద్వారా అభ్యసనం

4) పాఠ్యపుస్తకాల ద్వారా అభ్యసనం


11. కిందివాటిలో అభ్యసన లక్షణం కానిది?

1) అభ్యసనం సార్వత్రికమైంది.

2) అభ్యసనానికి సంచిత స్వభావం ఉంటుంది.

3) పెరుగుదల లాగా అభ్యసనం కూడా ఒక దశ తర్వాత ఆగిపోతుంది.

4) అభ్యసనం శారీరక పెరుగుదల, మానసిక పరిణతిపై ఆధారపడి ఉంటుంది.


12. అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతోపాటు ఏం ఉండాలి?

1) సర్దుబాటు    2) వైషమ్యం     

3) ఆనందం    4) సంసిద్ధత


13. సరైన వయసు రానందువల్ల ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారణం?

1) జ్ఞానాత్మక    2) వ్యక్తిగత

3) మానసిక    4) పైవన్నీ


14. అభ్యసన లక్షణం కానిది?

1) అభ్యసనం జీవితాంతం జరిగే ప్రకియ 

2) అభ్యసన ప్రక్రియ గమ్యనిర్దేశికమైంది

3) అభ్యసనం బదలాయింపు అవుతుంది

4) అభ్యసనానికి సంచిత స్వభావం ఉండదు 


15. కిందివాటిలో అభ్యసన ఫలితం వేటిపై ఆధారపడుతుంది?

1) అభ్యాసకుడు, అభ్యసనా సామగ్రి, అభ్యసనా ప్రక్రియ, ఉపాధ్యాయుడు.

2) అభ్యసనా సామగ్రి, అభ్యసనా ప్రక్రియ, ఉపాధ్యాయుడు.

3) అభ్యాసకుడు, అభ్యసనా సామగ్రి, ఉపాధ్యాయుడు.

4) అభ్యసనా ప్రక్రియ, ఉపాధ్యాయుడు.


16. అభ్యసనం సమర్థంగా జరిగితే దాని ప్రభావం కిందివాటిలో దేనిపై ఉంటుంది?

1) ఉన్నత అభ్యసనం    2) స్మృతి

3) శిక్ష బదలాయింపు    4) పైవన్నీ


17. సాధారణంగా అభ్యసన మదింపు జరిగే బోధనా స్థాయి?

1) ప్రియాక్టివ్‌ స్థాయి    2) పోస్ట్‌ యాక్టివ్‌ స్థాయి

3) ఏ స్థాయిలోనైనా    4) ప్రేరణా స్థాయి


18. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం?

1) వ్యాకులత    2) మనసు

3) అవధానం     4) ఉద్వేగం


19. కిందివాటిలో ఒకటి అభ్యసనాన్ని పెంపొందిస్తుంది?

1) ఆర్జన కోసం అభ్యసనం    2) బహుమతుల కోసం అభ్యసనం

3) పరీక్షల కోసం అభ్యసనం    4) నేర్చుకోవడం కోసం అభ్యసనం


20. అభ్యసనాన్ని ప్రభావితం చేసే ఉపాధ్యాయుడికి సంబంధించిన అంశం?

1) మెరుగైన సీటింగ్‌ వసతి    2) బోధన - అభ్యసన సామగ్రి లభ్యత

3) విషయం, అభ్యసన అనుభవాల స్వభావం    4) సబ్జెక్టులో ప్రావీణ్యం


21. అన్ని విధాలుగానూ సమానులుగా ఉన్న బాలురు బాలికల సమూహంలో, బాలికల్లో అభ్యసనం   అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం?

1) వ్యక్తిగత        2) పరిసరాత్మక

3) భౌతిక        4) అభిరుచి


22. కిందివాటిలో అభ్యాసకుడి అభ్యసనను ప్రభావితం చేసే కారకాలు?

1) అభ్యాసకుడి శారీరక, మానసిక ఆరోగ్యం  2) ఆకాంక్ష స్థాయి, సాధనా ప్రేరణ

3) సంసిద్ధత, సంకల్పశక్తి         4) పైవన్నీ


23. ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైన ప్రజ్ఞాత్మక కృత్యంగా చెప్పింది?

1) అంతర్‌దృష్టి అభ్యసనం        2) యత్నదోష అభ్యసనం

3) కార్యసాధన నిబంధనం     4) పరికరాత్మక నిబంధనం


24. తరగతి గదిలోని పిల్లవాడి ఆసక్తిని ప్రభావితం చేసే బహిర్గత కారకాలు?

1) సంవేదనలు, అభిమానం 2) సంస్కృతి, శిక్షణ

3) విద్యార్థుల వైఖరులు     4) లక్ష్యాలు, అవసరాలు 


25. అభ్యసనానికి అనుకూలమైన వాతావరణం   కల్పించాలంటే కిందివాటిలో దేనిని తొలగించాలి?

1) భయం లేని వాతావరణం    2) సహచరులతో విపరీతమైన పోటీ

3) తక్షణ పునర్భలనం    4) ఎంపిక చేసుకునే అవకాశం


26. ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో అభ్యసనం పట్ల అనుకూల వైఖరి?

1) ఏకరీతిగా అలవర్చాలి    2) అలవర్చవచ్చు

3) అలవర్చలేం - ఎందుకంటే వారు అప్పటికే ఎదిగినవారు కాబట్టి    4) స్థిరంగా ఉంటుంది


27. ఒక తండ్రి అతడి కుమార్తెను విహారయాత్రకు తీసుకెళ్లాడు. ఆమెకు గతంలో పక్షులను గురించిన భావన ఏర్పడి ఉంది కానీ గాలిపటాల గురించి  తెలియదు. గాలిపటాలను చూడటంతో ఆమె తన తండ్రితో ‘పక్షులను చూడండి’ అని అన్నది. తండ్రి ‘అవి గాలిపటాలు’ అని అన్నాడు. పై ఉదాహరణ దేనిని తెలుపుతుంది?

1) సాంశీకరణం       2) అనుగుణ్యం   

3) పదిలపరచడం        4) వస్తు ప్రదర్శన 


28. ‘సినిమాల్లో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు’. అనే ముగింపును కింది ఏ మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు?

1) థారన్‌డైక్‌     2) వాట్సన్‌ 

3) ఆల్బర్ట్‌ బండూరా     4) జీన్‌ పియాజే


29. వైగోట్‌స్కీ సిద్ధాంతం సూచించేది-

1) భాగస్వామ్యయుత సమస్యా పరిష్కారం. 

2) ప్రతి వ్యక్తికి వైయుక్తిక నియోజనాలివ్వడం.

3) ప్రారంభంలో వివరణ ఇచ్చిన తర్వాత కఠినమైన సమస్యలు సాధించేప్పుడు పిల్లలకు ఏ విధంగానూ సహకరించకూడదు.

4) తన కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్నవారితో కలిసి పిల్లల ఎక్కువ అభ్యసించగలరు.


30. ఫ్యాషన్‌ షోల్లోని మోడల్స్‌ను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నిస్తారు. ఇది ఏ విధమైన అనుకరణ?

1) ప్రాథమిక అనుకరణ      2) గౌణ అనుకరణ 

3) సాంఘిక అభ్యసనం    4) సామాన్యీకరణం


31. కిందివాటిలో పునర్బలన నియమంతో సంబంధం కలిగింది?

1) పావ్‌లోవ్‌     2) థారన్‌ డైక్‌ 

3) కోల్‌బర్గ్‌      4) స్కిన్నర్‌


32. కిందివాటిలో వైగోట్‌స్కీ సాంఘిక - సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంది-

1) కార్యసాధక నిబంధనం 

2) పరస్పర చర్యా బోధన  

3) తటస్థ సాంస్కృతిక సంజ్ఞానాత్మక వికాసం 

4) అంతరదృష్టి అభ్యసనం


33. పియాజే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక నిర్మితిలోని మార్పు ప్రక్రియను ఏమంటారు?    

1) సాంశీకరణం     2) స్కీమా 

3) ప్రత్యక్షం      4) అనుగుణ్యం


34. ‘పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు’. అని ప్రకటించింది?

1) కోల్‌బర్గ్‌      2) స్కిన్నర్‌ 

3) పియాజే      4) పావ్‌లోవ్‌


35. పిల్లల అభ్యసనంలో కింది ఏ పరిసరానికి వైగోట్‌స్కీ అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు?

1) అనువంశికత      2) నైతికత   

3) శారీరక       4) సామాజిక


36. నిర్మాణాత్మక వాదం దేనికి ప్రాధాన్యం ఇస్తుంది?

1) అభ్యసనంలో అనుకరణ పాత్ర.

2) పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ స్వీయ అవగాహన పెంచుకోవడం.

3) సమాచారాన్ని కంఠస్థం చేసి అవసరమైనప్పుడు పునఃస్మరణ.

4) ఉపాధ్యాయుడు ప్రబలమైన  పాత్ర పోషించడం.




సమాధానాలు

1-4; 2-2; 3-4; 4-4; 5-2; 6-4; 7-1; 8-4; 9-4; 10-2; 11-3; 12-4; 13-2; 14-4; 15-1; 16-4;  17-2; 18-4; 19-4; 20-4; 21-1; 22-4; 23-1; 24-2; 25-2; 26-2; 27-1; 28-3; 29-1; 30-3; 31-4; 32-2; 33-4; 34-3; 35-3; 36-2.


రచయిత: కోటపాటి హరిబాబు
 

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌