• facebook
  • whatsapp
  • telegram

గణితం - స్వభావం, పరిధి

మాదిరి ప్ర‌శ్న‌లు

1. ఆర్స్‌ మేథమెటికా అనేది ఏ భాషా పదం?
జ: లాటిన్‌

 

2. ‘గణితం ఆత్మ యొక్క ఉత్తమోత్తమమైన అభ్యసనం... ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది!’ అని పేర్కొన్నది?
జ: పాస్కల్‌

 

3. ఒక విషయాన్ని అనేకసార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ అదే ఫలితాన్నిస్తుందని నమ్మడమే
జ: ఆగమన హేతువాదం

 

4. కిందివాటిలో ప్రాథమికోన్నత స్థాయిలో గణితశాస్త్ర ఉద్దేశం కానిది
1) తార్కికతను అభివృద్ధి చేయడం.                         
2) శాస్త్రీయ, అన్వేషణా దృక్పథాన్ని కలిగించడం.
3) ఆధునిక ప్రపంచంలో గణిత ప్రాముఖ్యాన్ని, స్థానాన్ని తెలియజేయడం.    
4) సహజత్వాన్ని అలవరచడం.
జ: 4 (సహజత్వాన్ని అలవరచడం.)

5. తార్కికవాదంలో భాగంగా పరిగణించే గణిత వివేచన
జ: సమర్థనాత్మక వివేచన

 

6. 'Going beyond information given' అనే గ్రంథంలో నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సోదాహరణంగా వివరించినవారు
జ: బ్రూనర్‌

 

7. 'Π' విలువను 3.1416 గా మొదట తెలియజేసినవారు
జ: ఆర్యభట్ట

 

8. ‘డేటా’ గ్రంథ రచయిత
జ: యూక్లిడ్‌

 

9. భాస్కరాచార్యుడు రాసిన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథంలో మొదటి భాగం
జ: లీలావతి

 

10. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అన్నది
జ: బెర్ట్రాండ్‌ రస్సెల్‌

 

11. కిందివాటిలో వ్యక్తి స్వీయ మూల్యాంకనా జ్ఞానం?
1) వాస్తవానికి సంబంధించిన జ్ఞానం      2) భావనకు సంబంధించిన జ్ఞానం
3) విధానపరమైన జ్ఞానం                       4) అధి అభిజ్ఞ జ్ఞానం
జ: 4 (అధి అభిజ్ఞ జ్ఞానం) 

 

12. సవరించిన బ్లూమ్స్‌ వర్గీకరణలో రెండో అత్యున్నత స్థాయి మూల్యాంకనం
జ: మూల్యాంకనం చేయడం

 

13. a = l × b అనే సూత్రాన్ని దీర్ఘచతురస్ర వైశాల్యం; దాని పొడవు, వెడల్పుల లబ్ధానికి సమానమని చెప్పిన జాహ్నవి అనే విద్యార్థినిలో నెరవేరిన లక్ష్యం
జ: అవగాహన

 

14. గణితపరమైన ఆలోచనలను సొంత మాటల్లో వివరించగలిగిన నిహాల్‌ అనే విద్యార్థిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: భావవ్యక్తీకరణ

 

15. సంధ్యారాణి అనే విద్యార్థిని ఒక గణిత సమస్య సాధనా పద్ధతిని అర్థం చేసుకోగలిగింది. ఆమెలో నెరవేరిన విద్యాప్రమాణం
జ: కారణాలు - నిరూపణలు

 

16. ఆర్‌.హెచ్‌.దవే సూచించిన కనీస అభ్యసన స్థాయిలో గణితంలో గల ఉపసామర్థ్యాలు?
జ: 207

 

17. భావావేశ రంగంలో అతిక్లిష్టమైన లక్ష్యం?
జ: లాక్షణీకరణం

 

18. ‘వైశాల్యం’ పాఠం విన్న రవి అనే విద్యార్థి తన ఇంటి స్థలం వైశాల్యాన్ని కనుక్కోగలిగాడు. అతడిలో నెరవేరిన విద్యా ప్రమాణం
జ: సంధానాలు

 

19. ‘విద్యార్థి ప్రవర్తన అతడి ఆలోచనలు, అనుభూతులు, చర్యల కలయిక’ అని పేర్కొన్నవారు
జ: బి.ఎస్‌.బ్లూమ్స్‌

 

20. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను ప్రధానంగా కింది ఏ లక్షణాల ఆధారంగా వర్గీకరించారు?
1) అంతర్‌వృద్ధి                      2) అంతర ప్రేరణ        
3) బహిర్గత సమన్వయం        4) సమన్వయీకరణ
జ: 4 (సమన్వయీకరణ)

 

21. 5E నమూనాలో ఏ దశలో విద్యార్థులు అభ్యసించిన అంశాలను నిత్య జీవితంలో అన్వయిస్తారు?
జ: విశదీకరించడం

 

22. ఒక సిద్ధాంతం నుంచి మరో సిద్ధాంతాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడే బోధనా పద్ధతి
జ: నిగమన పద్ధతి

 

23. విద్యార్థికి జీవన నైపుణ్యాలు పెంపొందించే బోధనా పద్ధతి
జ: ప్రాజెక్టు పద్ధతి

 

24. కిండర్‌గార్టెన్‌ పద్ధతిలో బోధనలో వివిధ ప్రక్రియలు చేపట్టే సరైన క్రమం
జ: కథలు − పాటలు − ఆటలు − నిర్మాణాత్మక పని

 

25. మాంటిస్సోరి విధానంలో విద్యార్థులు చేయని ఏకైక పని
జ: వంటపని

 

26. సమస్యా పరిష్కార పద్ధతిలో సమస్య పరిధిని తెలుసుకునే సోపానం
జ: సమస్యను నిర్వచించడం

 

27. చింతగింజలను కుప్పలుగా ఉంచడం ద్వారా విద్యార్థులతో ఎక్కాలు రాయించడం ఏ పద్ధతి?
జ: అన్వేషణ

 

28. అన్వేషణ పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికే ప్రథమ ప్రాధాన్యం, జ్ఞానానికి ద్వితీయ ప్రాధాన్యం అన్నది
జ: వెస్టేవే

 

29. చింతగింజలను లెక్కించడం ద్వారా కూడికలను నేర్పడం... ఏ బోధనా నియమం?
జ: మూర్తం నుంచి అమూర్తానికి

 

30. ‘సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం’ అని నిర్వచించినవారు?
జ: బేకన్‌

 

గణితం − బోధనోపకరణ సామగ్రి

31. సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడే గణితశాస్త్ర బోధనా పేటిక బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు

 

32. కిందివాటిలో గణిత వనరు కానిది?
    1) గణిత పత్రిక     2) గణిత గ్రంథాలయం     3) గణిత ఫోరం     4) గణిత రికార్డు
జ: 4 (గణిత రికార్డు)

 

33. నిర్ణీత కాల వ్యవధిలో సమాధానాలు చెప్పే విధంగా ఉండే ప్రశ్నలు అడిగే పద్ధతి లేదా పరీక్ష విధానం
జ: గణిత క్విజ్‌

 

34. ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1987

 

35. దశాంశ సంఖ్యలను చూపడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: పూసల చట్రం

 

36. సమబాహు, సమద్విబాహు, విషమబాహు త్రిభుజ ఆకారాలను ఏర్పరచడానికి ఉపయోగపడే బోధనోపకరణం
జ: ఘనాకార కడ్డీలు

 

37. పాఠ్య పుస్తకం అంటే ప్రధాన మార్గదర్శక సూత్రాలను కలిగి ఉన్న ప్రామాణిక గ్రంథం అని తెలియజేసింది
జ: ఛాంబర్స్‌ ఇంగ్లిష్‌ డిక్షనరీ

 

38. Library అనే పదం Libar నుంచి వచ్చింది. Libar ఏ భాషా పదం?
జ: లాటిన్‌

 

39. ఎడ్గార్‌డేల్‌ అనుభవ శంకువులో నాటకీకరణాల కంటే ఎక్కువ అమూర్త స్వభావాన్ని అందించేవి?
జ: ప్రదర్శితాలు

 

40. పాఠ్య పుస్తకం సమర్థతను లెక్కించే హంటర్స్‌ స్కోరు కార్డులో పాఠ్యపుస్తకం ఉపయోగపడేవిధం, భౌతిక రూపం, విషయానికి ఇవ్వాల్సిన పాయింట్లు వరుసగా
జ: 50, 100, 250

 

గణితం - విద్యాప్రణాళిక

41. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గణిత పాఠ్యాంశాలను అమర్చడానికి ఉపయోగించిన విద్యాప్రణాళిక నిర్వహణ రీతి
జ: సర్పిలాకార, ఏకకేంద్ర వృత్తాకార

 

42. విషయ కాఠిన్యం, విషయ పరిపూర్ణక సూత్రాధారమైన పద్ధతి
జ: శీర్షిక పద్ధతి

 

43. కిందివాటిలో పునరుక్తి ఎక్కువగా ఉండే విద్యాప్రణాళికా నిర్వహణ రీతి
    1) శీర్షిక పద్ధతి                   2) ఏకకేంద్ర వృత్తాకార పద్ధతి    
    3) వర్తులాకార విధానం     4) ప్రకరణాల పద్ధతి
జ: 3 (వర్తులాకార విధానం)

 

44. ప్రస్తుతం 3 నుంచి 5వ తరగతి వరకు గల గణిత పాఠ్యాంశాల్లోని కింది ఏ కృత్యం పిల్లలకు అదనపు అభ్యసనంగా తోడ్పడుతుంది?
    1) ఇవి చేయండి                            2) ప్రయత్నించండి    
   3) ఆలోచించండి - చర్చించండి     4) అభ్యాసాలు
జ: 3 (ఆలోచించండి - చర్చించండి)

 

45. సంవత్సరానికి ఒకసారి శీర్షిక మాత్రమే పునరావృతమై విషయం పునరావృతం కాని పద్ధతి
జ: ఏకకేంద్ర వృత్తాకార

 

46. హెర్బార్ట్‌ సోపానాల్లో దేనిలో ఉపాధ్యాయుడు బోధనా సామగ్రిని ఎక్కువగా ఉపయోగిస్తాడు?
జ: ప్రదర్శన

 

47. పాఠ్యపుస్తకమనేది ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అన్నవారు
జ: లాంగ్‌

 

48. పాఠ్యపుస్తక మూల్యాంకనానికి ఉపయోగించే హంటర్‌ స్కోరు కార్డులో ఏ అంశానికి అతి తక్కువ స్కోరు కేటాయించారు?
జ: ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధం

 

49. కిందివాటిలో వోగల్స్‌ స్పాట్‌ చెక్‌లిస్టులో ముఖ్యాంశం కానిది?
    1) పుస్తక రచనా పద్ధతి     2) బోధనోపకరణాలు    3) పటాలు     4) అభ్యాసాలు
జ: 4 (అభ్యాసాలు)

 

50. కిందివాటిలో హంటర్‌ స్కోరు కార్డులో ఏ అంశానికి ఎక్కువ స్కోరు కేటాయించారు?
    1) విషయం     2) పుస్తక బౌద్ధికరూపం    3) అభ్యాసాలు     4) భాషా శైలి
జ: 1 (విషయం)

గణితం - మూల్యాంకనం

51. విద్యార్థి భవిష్యత్‌ విద్యా విజ్ఞాన ప్రగతిని తెలియజేసే మూల్యాంకనం
జ: ప్రాగుక్తీకరణ మూల్యాంకనం

 

52. కిందివాటిలో సాధన పరీక్ష ప్రయోజనం కానిది?
    1) విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేయడం.    
    2) తరగతిని సెక్షన్‌లుగా విభజించడం.
    3) విద్యార్థులను తుది పరీక్షలకు ప్రేరేపించడం.          
    4) విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.
జ: 4 (విద్యార్థుల అభ్యసనంలో బలహీనతలు తెలుసుకోవడం.)

 

53. ఆర్‌టీఈ - 2009లో నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి వివరించే అధ్యయనం ఎన్నోది?
జ: 5

 

54. నిర్మాణాత్మక మదింపులో ‘రాత అంశాలు’ అనే సామర్థ్యానికి కేటాయించిన మార్కుల శాతం?
జ: 10%

 

55. సంగ్రహణాత్మక మదింపులో 1, 2 తరగతుల గణితంలో మౌఖిక పరీక్షకు కేటాయించాల్సిన మార్కుల శాతం?
జ: 40%

 

56. 3 - 5వ తరగతుల గణిత సంకలనాత్మక మదింపులో ‘కారణాలు నిరూపణ’ అనే సామర్థ్యానికి కేటాయించాల్సిన మార్కులు?
జ: 10

 

57. గ్రేడ్‌ అనే పదానికి మూలమైన ‘గ్రాడ్యూస్‌’ ఏ భాషా పదం?
జ: గ్రీకు

 

58. పాండిత్యరంగంలో విద్యార్థుల వికాస మాపనానికి ఉపయోగించే సాధనం?
    1) నియోజనాలు     2) పరీక్షలు     3) ప్రాజెక్టులు     4) అన్నీ
జ: 4 (అన్నీ)

 

59. వ్యక్తి లక్షణాంశ ఉనికిని తెలిపేవి?
జ: పరిశీలన పట్టికలు

శ్రీ ప్రజ్ఞ కాంపిటీటివ్‌ స్టడీసర్కిల్, తిరుపతి.


 

Posted Date : 05-09-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు