• facebook
  • whatsapp
  • telegram

కొలతలు - ప్రమాణాలు

రాజు ముక్కు నుంచి మధ్య వేలు వరకు గజం!
 


తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రామాణిక ప్రమాణంతో కొలవడం లేదా లెక్కకట్టడాన్నే కొలత అంటారు. కొలవాల్సిన పదార్థాల లక్షణాలపై ఆధారపడి వేర్వేరు కొలతల ప్రమాణాలున్నాయి. వస్తువు పొడవు, వెడల్పు, ఎత్తు, బరువు వంటి భౌతిక రాశులతో పాటు కాలం, దూరం, వేగం, ధ్వని, నాణ్యత వంటి వాటిని కొలిచేందుకు ఉన్న ప్రమాణాలు, అందుకు వినియోగించే పరికరాల గురించి పోటీ పరీక్షార్థులు  తెలుసుకోవాలి. మన దేశంలో పూర్వకాలం నుంచి అమలవుతున్న కొలతల  ప్రమాణాలు, కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సంబంధిత పరిజ్ఞానం,  సాంకేతికతల గురించి అవగాహన పెంచుకోవాలి. 



 

1. కొలతల ప్రాముఖ్యతను తెలియజేసిన శాస్త్రవేత్త?

1) గెలీలియో   2) ఐన్‌స్టీన్‌  

3)  న్యూటన్‌    4) లార్డ్‌ కెల్విన్‌



2. ఆటస్థలం, పొడవు, వెడల్పులను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?

1) జాన   2) మూర   3)  అంగ   4) అడుగు



3. పొలం వైశాల్యాన్ని కొలిచే పరికరాన్ని గుర్తించండి.

1)  స్కేలు       2) సర్వేయస్‌ గొలుసు 

3) తాడు      4) తీగ



4. బంగారం, వజ్రాల నాణ్యతను కొలిచే ప్రమాణం-

1)  క్యారెట్స్‌   2) గ్యాలెన్‌    3)  బ్యారెల్‌    4) లక్స్‌


5. పూర్వం మొగలుల పరిపాలనా కాలంలో భూమిని ఏ ప్రమాణాల్లో కొలిచేవారు?

1)  అడుగు   2) గుంట     3)సెంటు    4) గజం



6. సముద్రాల్లో ప్రయాణించే వస్తువుల దూరాలను నాటికల్‌ మైళ్లలో కొలుస్తారు. ఒక నాటికల్‌ మైలు అంటే..?

1) 1.852 కి.మీ.       2) 1.61 కి.మీ.  

3)  2.42 కి.మీ.         4) 1.22 కి.మీ.



7. ఒక మైలు అంటే..?

1)  1.81 కి.మీ.   2) 1.61 కి.మీ.   

3)  0.5 కి.మీ.     4) 1.24  కి.మీ.



8. కిందివాటిలో కొలతకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి.

1)  సంఖ్యాత్మక విలువ X ప్రమాణం       

2) సంఖ్యాత్మక విలువ X సంఖ్య 

3) ప్రమాణం X సంఖ్యాత్మక విలువ      

4) సంఖ్యాత్మక విలువ ∻ ప్రమాణం



9. పెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే  ప్రమాణాలు?

1) మీటర్లు      2) సెంటీమీటర్లు  

3)  కిలోమీటర్లు     4) మిల్లీమీటర్లు



10. వక్రతలాల పొడవులను కొలవడానికి ఉపయోగించే పరికరాలు?

1) స్క్రూగేజీ      2) వెర్నియర్‌ కాలిపర్స్‌      3) స్పెరామీటర్‌      4) దారం



11. అడుగు అంటే గజంలో ఎన్నో వంతు?

1)  1/5     2) 1/6    3)  1/3     4) 1/4



12. ఒక అంగుళం అడుగులో ఎన్నో వంతు?

1)  1/3       2) 1/12      3)  1/10       4) 1/14



13. ప్రస్తుతం ఉపయోగించే మీటర్‌ స్కేలును ఏ పదార్థంతో తయారు చేస్తారు?

1)  ప్లాటినం, కాపర్‌     

2) అల్యూమినియం, కాపర్‌

3) ప్లాటినం, ఇరిడియం 

4) అల్యూమినియం, ఇరిడియం


14. ప్రస్తుతం ఉపయోగించే మీటర్‌ స్కేలు, కిలోగ్రామ్‌ రాయిని ఏ దేశ మ్యూజియంలో భద్రపరిచారు?

1)  ఇంగ్లండ్‌     2) ఫ్రాన్స్‌     3) అమెరికా    4) జపాన్‌


15. పూర్వకాలంలో రాజులు గజం కొలతను కింది విధంగా నిర్ణయించేవారు?

1)  రాజు ముక్కు దగ్గర నుంచి చేతి మధ్యవేలు వరకు ఉండే పొడవ

2) రాజు ముక్కు దగ్గర నుంచి చేతి చిటికెన వేలు వరకు ఉండే పొడవు

3) రాజు ముక్కు దగ్గర నుంచి చేతి మణికట్టు వరకు ఉండే పొడవు

4) రాజు ముక్కు దగ్గర నుంచి కాలి పాదం వరకు ఉండే పొడవు 


16. కిందివాటిలో ప్రాథమిక భౌతిక రాశి కానిది?

1)  పొడవు    2) ద్రవ్యరాశి    3)  కాలం   4) ఉష్ణోగ్రత



17. కిందివాటిలో ఉత్పన్న భౌతికరాశి కాని దాన్ని గుర్తించండి.

1)  ద్రవ్యరాశి      2) బలం  

3)  పీడనం      4) విద్యుత్తు ప్రవాహం


18. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

1)  పొడవులను కొలవడానికి పొడవు వెంబడి స్కేలు ఉంచాలి.

2) పొడవులను కొలిచేటప్పుడు స్కేలు చివర్లు అరిగిపోయి లేదా విరిగిపోయి ఉండరాదు.

3)  పొడవులను కొలిచేటప్పుడు స్కేలు రీడింగ్‌ తీయడానికి కంటిని స్కేలుపై నిటారుగా ఉంచాలి.

4) వక్రతలాల పొడవులను కొలవడానికి టేపును ఉపయోగిస్తారు.


19. కిందివాటిలో మెట్రిక్‌ పద్దతులను గుర్తించండి.

1) MKS, CGS    2) CGS, FPS

3) FPS, SI     4) MKS, SI



20. భారతదేశం మెట్రిక్‌ పద్ధతులను ప్రవేశపెట్టిన తేదీని గుర్తించండి.

1)  1956, ఏప్రిల్‌ 10      2)  1957, ఏప్రిల్‌ 1

3) 1971, నవంబరు 1      4) 1971, ఏప్రిల్‌ 10



21. కిందివాటిలో బ్రిటిష్‌ పద్ధతి గుర్తించండి.

1) MKS      2) CGS   3) FPS      4) SI


22. SI పద్ధతిని భారత్‌ పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?

1) 1986     2) 1971   3)  1992    4) 2004


 

23. అంతర్జాతీయ పద్ధతి (SI)ని ఏ పద్ధతి ఆధారంగా రూపొందించారు?

1)  FPS       2) CGS    3) MKS    4) పైవన్నీ 

24. SI పద్ధతిలో ఏర్పాటు చేసిన ప్రాథమిక భౌతిక రాశుల సంఖ్య?

1)  9     2)  8      3)  6    4) 7 


25. అంతర్జాతీయ పద్ధతిలో కోణం ఆధారంగా రూపొందించిన సంపూరక భౌతిక రాశుల సంఖ్య?

1) 4       2) 3        3)  2       4) 5



26. కోణం ఆధారంగా రూపొందించిన సంపూరక భౌతిక రాశిని గుర్తించండి.

1) పదార్థ పరిమాణం     2) ఉష్ణోగ్రత  

3) సమతల కోణం      4) విద్యుత్తు ప్రవాహం



27. క్యారీ బ్యాగుల మందాన్ని ఎలా కొలుస్తారు?

1)  నానోమీటర్లు      2) సెంటీమీటర్లు  

3)  ఫెర్మి      4) మైక్రాన్‌ 



28. నది వెడల్పు కొలవడానికి ఉపయోగించే సరైన పద్ధతి-

1) వృత్తాకార      2) దీర్ఘ చతురస్రాకార  

3) చతురస్రాకార    4) త్రిభుజాకార 



29. రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని దేనిలో కొలుస్తారు?

1) టీఎమ్‌సీలు     2) క్యూసెక్‌లు

3)  క్యూబిక్‌లు      4) గ్యాలన్‌లు



30. ఒక అడుగు పొడవు ఎన్ని సెంటీమీటర్లకు సమానం?

1) 31.72     2) 30.72    3) 29.72    4) 28.72


31. కిందివాటిలో అంతరిక్ష దూరాలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) కాంతి సంవత్సరం      2) నాటికల్‌ మైళ్లు  

3)  ఆంగ్‌స్ట్రామ్‌     4) కిలోమీటర్లు



32. అన్వంతర దూరాలను కొలిచే ప్రమాణాలను గుర్తించండి.

1) ఫెర్మి      2) నానోమీటర్‌ 

3)  డెసిమీటర్‌      4) మైక్రోమీటర్‌



33. కావాల్సిన స్థిర ఘనపరిమాణం ఉండే ద్రవాల ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) పిప్పెట్‌      2) కొలజాడి 

3)  బ్యూరెట్‌     4) నానోమీటర్‌



34. పెట్రోల్‌ ఘనపరిమాణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) గ్యాలన్లు      2) లీటర్లు  

3) మిల్లీలీటర్లు    4) బ్యారెల్స్‌ 



35. స్థిర ఘనపరిమాణ ద్రవాన్ని ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి మార్చడానికి ఉపయోగించే పరికరం?

1) పిప్పెట్‌     2) కొలపాత్ర 

3) బ్యూరెట్‌      4) కోనికల్‌ ఫ్లాస్క్‌ 


36. అంతరిక్ష దూరాలను కొలిచే ప్రమాణాలన్నింటిలోకి అతి పెద్ద ప్రమాణం?

1) కాంతి సంవత్సరం      2) పార్‌లాక్టిక్‌ సెకండ్‌ 

3) ఆంగ్‌స్ట్రామ్‌ యూనిట్‌     4) కిలోమీటర్‌ 


37. దూరానికి అతి చిన్న ప్రమాణాన్ని గుర్తించండి.

1) మీటర్‌    2) మిల్లీమీటర్‌    3) కిలోమీటర్‌    4) ఫెర్మీ


38. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం?

1) గంటలు      2) నిమిషాలు  

3) కాస్మిక్‌ సంవత్సరం     4) సెకన్‌


39. కాలాన్ని అత్యంత కచ్చితంగా కొలవడానికి ఉపయోగించే గడియారాలు?

1) లోలక గడియారం     2) స్టాప్‌ వాచ్‌  

3) పరమాణు గడియారం     4) క్వార్ట్జ్‌ గడియారం


 

40. ద్రవాల తారతమ్య సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) హైగ్రోమీటర్‌     2) హైడ్రోమీటర్‌ 

3) అనిమోమీటర్‌      4) యూడోమీటర్‌ 

41. గాలి వేగాన్ని, దిశను కొలిచే పరికరం?

1) అనిమోమీటర్‌    2) పల్వనోమీటర్‌  

3) అల్టీమీటర్‌   4) పాథోమీటర్‌



42. సముద్రాల లోతును కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని గుర్తించండి?

1) ఆంత్రోమీటర్‌      2) పల్వనోమీటర్‌  

3) పాథోమీటర్‌     4) అనిమోమీటర్‌


 

43. కిందివాటిలో వర్షపాతాన్ని కొలిచే పరికరం?

1) బారోమీటర్‌     2) హైడ్రోమీటర్‌ 

3) పాథోమీటర్‌     4) యూడో మీటర్‌ 



44. విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) పాథోమీటర్‌      2) పల్వనోమీటర్‌ 

3) అల్టీమీటర్‌      4) రెయిన్‌గేజ్‌ 



45. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) లాక్టోమీటర్‌     2) హైడ్రోమీటర్‌ 

3) బారోమీటర్‌      4) అనిమోమీటర్‌ 



46. పాల స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పరికరం?

1) హైడ్రోమీటర్‌     2) లాక్టోమీటర్‌ 

3) హైగ్రోమీటర్‌      4) బారోమీటర్‌ 


47. మెమొరి కార్డులో కెపాసిటీని దేనిలో కొలుస్తారు?

1) GB     2) MB    3) TB    4) PB


48. నదుల వరద ప్రవాహాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?

1) టీఎంసీలు     2) క్యూసెక్‌లు 

3) గ్యాలన్లు      4) లీటర్లు


49. ఒక డెసీమీటర్‌ ఎన్ని మీటర్లకు సమానం?

1) 1 కి.మీ.      2) 1 సెం.మీ.  

3) 1 మీ.     4) 1 మి.మీ.


50. ఆట స్థలంలో కాలాన్ని కచ్చితంగా కొలవడానికి ఉపయోగించే గడియారం?

1) లోలక గడియారం  2) స్టాప్‌ వాచ్‌

3) చేతి గడియారం    4) పరమాణు గడియారం


సమాధానాలు


1-4; 2-3; 3-2; 4-1; 5-4; 6-1; 7-2; 8-1; 9-3; 10-4; 11-3; 12-2; 13-3; 14-2; 15-1; 16-4; 17-1; 18-4; 19-1; 20-2; 21-3; 22-2; 23-3; 24-4; 25-3; 26-3; 27-4; 28-4; 29-1; 30-2; 31-1; 32-1; 33-3; 34-4; 35-1; 36-2; 37-4; 38-3; 39-4; 40-2; 41-1; 42-3; 43-4; 44-3; 45-3; 46-2; 47-1; 48-2; 49-3; 50-2.


 

 

రచయిత: చంటి రాజుపాలెం


 

Posted Date : 20-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌