* జూన్ 18కు రీషెడ్యూల్
దిల్లీ: యూజీసీ నెట్ పరీక్ష (UGC NET 2024) షెడ్యూల్ మారింది. ఈ పరీక్షను జూన్ 18కు రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్‌కుమార్ సోమవారం (ఏప్రిల్ 29) సాయంత్రం ప్రకటించారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 16న జరగాల్సి ఉంది. అయితే, అదేరోజు సివిల్స్ (ప్రిలిమినరీ) పరీక్ష కూడా ఉంది. ఈనేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకొని యూజీసీ నెట్ పరీక్షను జూన్ 18 (మంగళవారం) నిర్వహించాలని ఎన్టీఏ, యూజీసీ నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఎన్టీఏ(NTA) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే పెన్ను, పేపర్ (ఓఎంఆర్ షీట్) ఆధారిత పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.