• facebook
  • whatsapp
  • telegram

Education: ప్రభుత్వ పాఠశాలల్లో బీటెక్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

ఈనాడు, అమరావతి: ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ప్యానల్స్‌ వినియోగంపై ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు. 

కార్యక్రమం ముఖ్య అంశాలు:

* అర్హత: ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్థులు

* ఉపకారవేతనం: రూ.12 వేలు

* రవాణా భత్యం: కళాశాల నుంచి బడి వరకు ఉండే దూరానికి కి.మీ.కు రూ.2

* నియమించబడే విద్యార్థుల సంఖ్య: 2,379

* పాఠశాలల సంఖ్య: 7,094

* ప్రతి విద్యార్థికి కేటాయించే పాఠశాలల సంఖ్య: మూడు

* ఎంపిక ప్రక్రియ: జూన్‌ 12 నుంచి వివిధ స్థాయిల్లో ఎంపిక

* ఈ కార్యక్రమం ద్వారా ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ప్యానల్స్‌ వంటి డిజిటల్‌ సాంకేతికతలను పాఠశాల విద్యలో సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
 

Some more information 
  "A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"

Published Date : 15-05-2024 13:10:32

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం