• facebook
  • whatsapp
  • telegram

మొక్కల్లో ఖనిజ పోషణ - పదార్థాల రవాణా

బాష్పోత్సేకం.. ఒక ఆవశ్యక అనర్థం!


జీవులకు పోషణ అందించే రసాయన పదార్థాలు పోషకాలు. జీవావరణంలో అతి ముఖ్యమైన మొక్కల పెరుగుదలకు, జీవక్రియలకు, పునరుత్పత్తికి నిర్దిష్ట ఖనిజ పోషకాలు అవసరం. నేల, నీరు, గాలి నుంచి వివిధ రకాల మొక్కలకు కావాల్సిన స్థూల, సూక్ష్మ పోషకాలు, జీవక్రియల్లో అవి నిర్వర్తించే పాత్ర గురించి పోటీ పరీక్షార్థులకు ప్రాథమిక అవగాహన ఉండాలి. అంతర్గతంగా పోషకాల సరఫరా వ్యవస్థ, గ్లూకోజ్, ఆక్సిజన్‌ తయారయ్యే ప్రక్రియలు, పోషకాల లోపాలతో వచ్చే సమస్యలు, వీటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవాలి.



1.    మొక్కలకు ప్రాణం ఉందని మొదటగా కనుక్కున్నది?

1) లిన్నేయస్‌     2) అరిస్టాటిల్‌ 

3) జె.సి.బోస్‌     4) పరాశరుడు 


2.     మొక్కల్లో స్థానాంతరణకు ఉపయోగపడే కణజాలం? 

1) నాళికాపుంజాలు     2) పోషక కణజాలం 

3) దారువు     4) విభాజ్యం


3.     కిందివాటిలో ఏ రవాణాకు ప్రత్యేక త్వచ ప్రొటీన్లు అవసరం లేదు?

1) సులభతర రవాణా     2) సామాన్య రవాణా 

3) సక్రియా రవాణా     4) 1, 3 


4.     కిందివాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.

ఎ) ఆవ మొక్క 5 గంటల్లో తన బరువుకు సమాన మైన నీటిని గ్రహిస్తుంది.

బి) విసరణ అనేది ఘనపదార్థాల మధ్య కంటే, వాటి లోపల జరిగే అవకాశాలు ఎక్కువ.

సి) గాఢత ప్రవణత వల్ల ఏర్పడే విసరణను సులభతర విసరణ అంటారు.

డి) పదార్థాలను గాఢతా ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడాన్ని సక్రియా రవాణా అంటారు.

1) ఎ, బి 2) ఎ, సి, డి 3) ఎ, బి, సి, డి 4) ఎ, సి 


5.     జతపరచండి. 

1) ద్రవాభిసరణ పీడనం ఎ) సంసంజన - అసంజన బాష్పోత్సేకం
2) ద్రవాభిసరణ శక్మం బి) కొయ్య నీటిలో ఉబ్బడం
3) నిపానం సి) ధనాత్మకం
4) డిక్సన్‌ డి) రుణాత్మకం

1) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ     2) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి 

3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి     4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


6.     గడ్డి జాతి మొక్కల పత్రాల ఈనెల చివర ఉండే సూక్ష్మరంధ్రాల ద్వారా జరిగే ప్రక్రియ-

1) ద్రవాభిసరణ     2) విసరణ 

3) బిందుస్రావం     4) నిపానం 


7. కిందివాటిలో సహజ బాష్పోత్సేక నిరోధకం? 

1) అబ్సిసిక్‌ ఆమ్లం     2) ఇథలిన్‌ 

3) వాలిన్‌     4) 1, 2 


8.     హైడ్రోపోనిక్స్‌ను పరిచయం చేసిన వ్యక్తి- 

1) వాన్‌సాక్స్‌     2) బాప్టిస్టా 

3) ప్రీస్ట్లే     4) లెవోయిజర్‌ 


9. మొక్కల్లో రైబోసోమ్‌ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడేది-

1) నైట్రోజన్‌     2) ఫాస్ఫరస్‌ 

3) మెగ్నీషియం     4) సల్ఫర్‌ 


10. కిందివాటిలో 17వ ఆవశ్యక మూలకం- 

1) నికెల్‌   2) కాపర్‌     3) ఇనుము     4) సల్ఫర్‌ 


11. ఆకుపచ్చని మొక్కల్లో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని కనుక్కున్న వ్యక్తి-

1) లెవోయిజర్‌     2) జాన్‌ ఇంజిన్‌ హౌజ్‌ 

3) ఎంగల్‌మన్‌     4) ప్రీస్ట్లే


12. ఆక్సిజన్‌కు పేరు పెట్టిన వ్యక్తి?    

1) జాన్‌ ఇంజిన్‌ హౌజ్‌     2) ఎంగల్‌మన్‌ 

3) లెవోయిజర్‌     4) ప్రీస్ట్లే


13. ‘మొక్కల్లో బాష్పోత్సేకం ఒక ఆవశ్యక అనర్థం’ అన్నది?    

1) నిక్సన్‌  2) కర్టస్‌  3) ప్రీస్ట్లే 4) ఎంగల్‌మన్‌


14. కిందివాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. 

1) మొక్కల్లో ఆకుపచ్చని భాగాలు మాత్రమే O2ను విడుదల చేస్తాయి.

2) ‘మొక్కలు పెరుగుదలలో గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తాయి’ అని నిరూపించింది జాన్‌ ఇంజిన్‌ హౌజ్‌.

3) కార్బాక్సిలేషన్‌ అంటే - CO2ను స్థిరమైన మాధ్యమిక యౌగికంగా రూపొందించడం.

4) హరితరేణువులో త్వచవ్యవస్థ కాంతి శోషణకు ఉపయోగపడుతుంది.


 15. మొక్కల్లో కాంతి చర్యలో హైడ్రోజన్‌ దాతలు-

1) CO2  2) కాంతి  3) నీరు  4) పత్రహరితం


16. ఆకుపచ్చటి కషాయానికి పత్రహరితం అని పేరు పెట్టింది?     

1) ఎంగల్‌మన్‌     2) పెల్లిటియర్‌ 

3) కావోన్షో     4) 2, 3


17. వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు?

1) స్టీఫెన్‌ హేల్స్‌     2) పెల్లిటియర్‌ 

3) జాన్‌ ఇంజిన్‌ హౌజ్‌     4) వాన్‌నీల్‌ 


18. కిందివాటిలో సత్యమైంది?

 


19. జతపరచండి.

1) వాన్‌నీల్‌ ఎ) క్లోరోఫిల్, హరితరేణువు
2) వాన్‌సాక్స్‌ బి) ఆక్సిజన్‌కు నామకరణం
3) జాన్‌ ఇంజిన్‌ హౌజ్‌ సి) పర్పుల్‌ బ్యాక్టీరియాపై పరిశోధన
4) లెవోయిజర్‌ డి) కాంతి సమక్షంలో O2 విడుదల

1) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి     2) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి 

3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి     4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ


20. కాంతిదశ జరిగే భాగం-

1) గ్రానా  2) స్ట్రోమా   3) మాత్రిక   4) 2, 3 


21. కాంతి ఫాస్ఫారిలేషన్‌ అంటే...

1) కాంతి సమక్షంలో నీరు ఆక్సిజన్‌గా మారడం

2) కాంతి సమక్షంలో హైడ్రోజన్‌ దాత ఏర్పడటం 

3) కాంతి సమక్షంలో హైడ్రోజన్‌ గ్రహించడం 

4) కాంతి సమక్షంలో ADP, ATPగా మారడం


22. కెల్విన్‌ వలయంలో లేని దశ-

1) కార్బాక్సిలేషన్‌     2) కాంతి ఫాస్ఫారిలేషన్‌ 

3) క్షయకరణ దశ     4) పునరుత్పత్తి దశ


23. గ్లూకోజ్‌ ఏ దశలో అంత్యఉత్పన్నం?

1) కాంతిదశ     2) నిష్కాంతి దశ 

3) కాంతి శ్వాసక్రియ     4) 1, 2 


24. కిందివాటిలో అసత్యవాక్యాన్ని ఎన్నుకోండి.

1) హైడ్రిల్లా ప్రయోగం - O2 విడుదలను నిరూపించడానికి

2) క్రోటాన్‌ పత్రప్రయోగం - క్లోరోఫిల్‌ అవసరమని నిరూపించడానికి

3) ఆకు అర్ధ పత్రప్రయోగం - O2 అవసరమని నిరూపించడానికి

4) లైట్‌ స్క్రీన్‌ ప్రయోగం - కాంతి అవసరమని నిరూపించడానికి


25. టమాటాలో ఎరుపు రంగుకు కారణం

1) బీటా కెరోటిన్‌     2) లైకోపిన్‌ 

3) జాంథోఫిల్‌     4) 1, 2 


26. క్లోరోఫిల్‌ ఉత్పత్తిని ప్రేరేపించేది?

1) మెగ్నీషియం     2) క్యాల్షియం 

3) ఫెర్రస్‌     4) ఫాస్ఫరస్‌ 


27. కిందివాటిలో అతి తక్కువగా జరిగే బాష్పోత్సేక రకం?

1) వాయురంధ్ర బాష్పోతేకం     2) పత్రరంధ్ర బాష్పోత్సేకం 

3) అవభాసిని బాష్పోత్సేకం     4) కణజాల బాష్పోత్సేకం 


28. కిందివాటిలో క్లోరోప్లాస్ట్‌లు అధికంగా ఉన్న ప్రాంతం-

1) రక్షక కణాల్లో     2) సంధాయక కణజాలంలో 

3) అవభాసినిలో     4) 1, 2 


29. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి నుంచే ఆహారపదార్థాలు తయారవుతాయని నమ్మిన వ్యక్తి?

1) అరిస్టాటిల్‌     2) జాన్‌ బాప్టిస్టా 

3) స్టీఫెన్‌ హేల్స్‌     4) ప్రీస్ట్లే 


30. కిందివాటిలో మాంసాహార మొక్క కానిది-

1) వీనస్‌ ఫ్లైట్రాప్‌     2) డ్రాసిరా 

3) యుట్రిక్యులేరియా     4) క్రైసాంథిమమ్‌


31. ఆక్సాలో ఎసిటిక్‌ ఆమ్లంలోని కర్బన పరమాణువుల సంఖ్య?     

1) 4      2) 3     3) 5    4) 2 


32. కెల్విన్‌ వలయంలో బయటకు వచ్చే NADPల సంఖ్య- 

1) 18     2) 6     3) 12    4) 16 


33. ఒక గ్లూకోజ్‌ అణువు తయారవడానికి కెల్విన్‌ వలయం ఎన్నిసార్లు జరగాలి?

1) 2     2) 6     3) 8     4) 10 


34. కిందివాటిలో ప్రపంచంలో అధికంగా ఉండే ఎంజైమ్‌?

1) కార్బాక్సిలేజ్‌     2) రుబిస్కో 

3) ఫాస్ఫోగ్లిజరాల్‌     4) ఆక్సీజనేజ్‌ 


35. C4 మొక్కలకు ఉదాహరణ- 

1) వరి     2) గోధుమ 

3) మొక్కజొన్న     4) పైవన్నీ 


36. కాంతి శ్వాసక్రియ ఏ మొక్కల్లో జరుగుతుంది?

1) అన్ని మొక్కలు  2) C2  3) C4  4) C3 


37. రసాయన స్వయంపోషితానికి చెందింది-

1) శిలీంధ్రం     2) శైవలం 

3) మొక్కలు     4) కొన్ని బ్యాక్టీరియాలు 


38. పరాన్నజీవనం గడిపే మొక్క-

1) కస్క్యుటా     2) క్రైసాంథిమమ్‌ 

3) నెపంథిస్‌     4) డయోనియా 


39. పరాగరేణువులు మొలకెత్తడానికి ఉపయోగపడే మూలకం- 

1) కాపర్‌     2) మాంగనీస్‌ 

3) బోరాన్‌     4) సల్ఫర్‌ 


40. జతపరచండి.

1) క్యాల్షియం ఎ) O2 విడుదల
2) మాంగనీస్‌ బి) నీటి కాంతి విచ్ఛేదనం
3) నైట్రోజన్‌ సి) కేంద్రకామ్లాల ఏర్పాటు
4) జింక్‌ డి) ఆక్సిన్‌ల సంశ్లేషణం

1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి        2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి 

3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ     4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి


సమాధానాలు

1-3; 2-1; 3-2; 4-3; 5-1; 6-3; 7-1; 8-1; 9-3; 10-1; 11-4; 12-3; 13-2; 14-4; 15-3; 16-4; 7-1; 18-3; 19-2; 20-1; 21-1; 22-2; 23-2; 24-3; 25-2; 26-3; 27-1; 28-4; 29-1; 30-4; 31-1; 32-3; 33-2; 34-2; 35-3; 36-4; 37-4; 38-1; 39-3; 40-1. 


రచయిత: వట్టిగౌనళ్ల పద్మనాభం 
 

Posted Date : 11-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌