• facebook
  • whatsapp
  • telegram

ఖనిజ వనరులు

రాజస్థాన్‌లో ‘మంగళ’ ప్రధాన చమురు క్షేత్రం!


 


ఒక దేశ సహజ వనరుల్లో ఖనిజాలు అత్యంత విలువైనవి. దేశ నిర్మాణం, పారిశ్రామిక ప్రగతిలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. విశాల భూభాగం, విభిన్న భౌగోళిక పరిస్థితులు ఉన్న భారతదేశంలో బొగ్గు, మైకా, ఇనుపుధాతువు, బాక్సైట్, రాగి, సహజ వాయువు, థోరియం లాంటి ఎన్నోరకాల ఖనిజాలు విస్తృతంగా, పుష్కలంగా ఉన్నాయి. వీటి లభ్యత, ఉత్పత్తి, నాణ్యత, వినియోగం తీరుపై పరీక్షార్థులకు సమగ్ర అవగాహన అవసరం. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా లభిస్తున్న ఖనిజాలు, ప్రధాన గనులు, సంబంధిత కర్మాగారాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలను తెలుసుకోవాలి. భూపటలంలోని మూలకాల్లో ఏ ఖనిజం ఎంత శాతం ఉంటుందనే పరిజ్ఞానమూ ఉండాలి.

1.    మధ్యప్రదేశ్‌లోని మలాజ్‌ఖండ్‌ ఏ ఖనిజానికి ప్రసిద్ధి?

1) బంగారం  2) వెండి  3) రాగి  4) వజ్రాలు 


2.     కింది బొగ్గు క్షేత్రాలను జతపరచండి. 

బొగ్గు క్షేత్రం రాష్ట్రం
ఎ) కరన్‌పుర 1) మధ్యప్రదేశ్‌
బి) ఉమారియా 2) ఛత్తీస్‌గఢ్‌
సి) వార్థా 3) ఝార్ఖండ్‌
డి) జిలిమిలి 4) మహారాష్ట్ర

 1) ఎ-4, బి-3, సి-2, డి-1        2) ఎ-3, బి-1, సి-4, డి-2

3) ఎ-4, బి-2, సి-3, డి-1        4) ఎ-1, బి-2, సి-3, డి-4


3.    కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.  

1) తాల్చేర్‌ - ఒడిశా    2) ఝరియా - పశ్చిమ బెంగాల్‌

3) చిరిమిరి- ఛత్తీస్‌గఢ్‌    4) కాంప్టీ - మహారాష్ట్ర


4. లిగ్నైట్‌ బొగ్గు క్షేత్రాలు అధికంగా ఉన్న రాష్ట్రం?

1) కర్ణాటక     2) తమిళనాడు 

3) మహారాష్ట్ర     4) ఆంధ్రప్రదేశ్‌


5. దారంగిర్‌ బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? 

1) ఝార్ఖండ్‌     2) పశ్చిమ బెంగాల్‌ 

3) మేఘాలయ      4) అరుణాచల్‌ ప్రదేశ్‌


6. కిందివాటిలో దేనిని Oil City of Assam అని అంటారు?

1) గువహటి 2) దిగ్బోయ్‌ 3) జోర్హాట్‌ 4) సిల్చేరు


7.     ‘మంగళ’ ప్రధాన చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది?

1) గుజరాత్‌ 2) మహారాష్ట్ర 3) అస్సాం 4) రాజస్థాన్‌


8. ఆలియ బెట్‌ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర 2) కేరళ  3) కర్ణాటక 4) గుజరాత్‌


9.     కిందివాటిలో చమురుశుద్ధి కర్మాగారాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి.

1) హల్దియా - పశ్చిమ బెంగాల్‌ 2) నారీమనం- తమిళనాడు 

3) బరౌని - ఝార్ఖండ్‌    4) కోయాలి - మహారాష్ట్ర

1) 1, 2    2) 3, 1  3) 2, 4   4) 3, 4


10. ‘బిన’ చమురుశుద్ధి కర్మాగారం ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర     2) మధ్యప్రదేశ్‌ 

3) గుజరాత్‌     4) తమిళనాడు


11. గురుగోబింద సాగర్‌ రిఫైనరీ ఏ ప్రాంతంలో ఉంది?

1) పంజాబ్‌ - భటిండా            2) వాడినార్‌ - గుజరాత్‌

3) జామ్‌నగర్‌ సెజ్‌ - గుజరాత్‌      4) మంగళూరు - కర్ణాటక


12. కిందివాటిలో తూర్పు తీరంలో ఏర్పాటు చేసిన మొదటి చమురుశుద్ధి కర్మాగారం ఏది?

1) నారీమనం     2) మనాలి 

3) విశాఖపట్నం     4) తాటిపాక


13. ‘యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?    

1) 1957   2) 1967   3) 1977  4) 1987


14. ‘మినరల్‌ హార్ట్‌ లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని దేనిని పిలుస్తారు?    

1) తెలంగాణ పీఠభూమి      2) మాల్వా పీఠభూమి

3) చోటానాగ్‌పుర్‌ పీఠభూమి  4) భాగెల్‌ఖండ్‌ పీఠభూమి


15. కిందివాటిలో హెచ్‌బీజే పైప్‌లైన్‌కు సంబంధించని రాష్ట్రం ఏది?    

1) మధ్యప్రదేశ్‌      2) గుజరాత్‌   

3) ఉత్తర్‌ప్రదేశ్‌      4) ఛత్తీస్‌గఢ్‌


16. మాంగనీస్‌ గనులకు సంబంధించి కిందివాటిని జతపరచండి.

గనులు రాష్ట్రం
ఎ) చిత్రదుర్గ 1) గోవా
బి) పెర్నెం 2) కర్ణాటక
సి) బాలాఘాట్‌ 3) ఒడిశా
డి) కియోంజహర్‌ 4) మధ్యప్రదేశ్‌

1) ఎ-2, బి-1, సి-4, డి-3  2) ఎ-1, బి-2, సి-3, డి-4   

3) ఎ-3, బి-2, సి-4, డి-1       4) ఎ-4, బి-3, సి-2, డి-1


17. కింది రాగి గనుల్లో సరికాని జతను గుర్తించండి.

ఎ) ఝార్ఖండ్‌ - హజారీభాగ్‌  

బి) హిమాచల్‌ ప్రదేశ్‌ - అల్మోరా   

సి) రాజస్థాన్‌ - ఖేత్రి   

డి) మహారాష్ట్ర - బాలాఘాట్‌

1) బి, డి   2) సి, డి   3) ఎ, సి   4) ఎ, బి


18. ‘సఖాలిన్‌’ చమురు క్షేత్రం ఏ దేశంలో ఉంది?    

1) చైనా  2) జపాన్‌   3) రష్యా  4) అమెరికా


19. ఒడిశాలోని ‘సుకింద’ దేనికి ప్రసిద్ధి?

1) క్రోమైట్‌  2) బాక్సైట్‌  3) కాపర్‌  4) బొగ్గు


20. మార్గేరీటా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించండి.

1) అస్సాం      2) మేఘాలయ  

3) మణిపుర్‌       4) కర్ణాటక


21. నాణ్యత ఆధారంగా ఇనుప ధాతువు రకాల ఆరోహణ క్రమం-

ఎ) మాగ్నటైట్       బి) హెమటైట్  

సి) లియోనైట్‌      డి) సిడరైట్‌

1) ఎ, బి, సి, డి      2) సి, డి, బి, ఎ   

3) డి, సి, బి, ఎ      4) ఎ, బి, డి, సి


22. ప్రతిపాదన (ఎ): జవార్‌ గనులు రాజస్థాన్‌లో ఉన్నాయి.

కారణం (ఆర్‌): జవార్‌ గనులు రాగి ఉత్పత్తికి ముఖ్యమైనవి.

1) ఎ, ఆర్‌ లు రెండూ సరైనవి. ఎ కు ఆర్‌ సరైన వివరణ.

2) ఎ, ఆర్‌ లు రెండూ సరైనవి. ఎ కు ఆర్‌ సరైన వివరణ కాదు.

3) ఎ సరైంది, ఆర్‌ సరికాదు.    4) ఎ సరైంది కాదు, ఆర్‌ సరైంది.


23. ‘కరగండ’ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది?

1) దక్షిణాఫ్రికా      2) కజకిస్థాన్‌  

3) జపాన్‌       4) చైనా


24. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) పన్నా - వజ్రాల గని      2) కోలార్‌ - బంగారు గని

3) నైవేలి - బొగ్గు గని      4) కొడెర్మా - రాగి గని


25. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ - చింద్వారా ప్రాంతం దేనికి ప్రసిద్ధి?

1) వెండి  2) రాగి  3) వజ్రాలు  4) మాంగనీస్‌


26. విశాఖపట్నం ఓడరేవు నుంచి నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని కింది ఏ దేశానికి ఎగుమతి చేస్తారు?    

1) జపాన్‌      2) ఇండొనేసియా   

3) రష్యా      4) మలేసియా


27. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? 

1) జిప్సం 2) వెండి 3) అల్యూమినియం 4) మాంగనీస్‌


28. మయూర్‌భంజ్, కియోంజహర్‌ ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 

1) ఝార్ఖండ్‌ 2) కర్ణాటక  3) ఒడిశా 4) గోవా


29. హెచ్‌బీజే పైప్‌లైన్‌ ఎన్ని రాష్ట్రాల మీదుగా వెళుతుంది?

1) 4       2) 3      3) 5     4) 2


30. హెచ్‌బీజే పైప్‌లైన్‌ మొత్తం పొడవెంత?

1) 3670 కి.మీ.      2) 3474 కి.మీ.   

3) 3674 కి.మీ.      4) 4774 కి.మీ.


31. 2008 నూతన ఖనిజ విధానాన్ని సూచించిన కమిటీ?

1) ముకుల్‌ కమిటీ      2) దీపక్‌ కమిటీ    

3) మిశ్రా కమిటీ      4) హుడా కమిటీ


32. మాంగనీస్‌ను ప్రధానంగా ఏ పరిశ్రమల్లో వినియోగిస్తారు?

1) సిమెంట్‌      2) చమురు  

3) బ్యాటరీ       4) విద్యుత్తు


33. భారతదేశంలో థోరియం అధికంగా లభించే రాష్ట్రం?

1) కర్ణాటక  2) కేరళ 3) ఆంధ్రప్రదేశ్‌ 4) మహారాష్ట్ర


34. భారతదేశంలో ఉప్పును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం? 

1) మహారాష్ట్ర      2) రాజస్థాన్‌    

3) గుజరాత్‌       4) కర్ణాటక


35. టంగ్‌స్టన్‌ ఏ రకానికి చెందిన ఖనిజం?

1) ఉల్ఫ్రామైట్‌       2) మాస్కోవైట్‌   

3) స్టెఫోనైట్‌       4) రస్కోలైట్‌


36. బిహార్‌ స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజాన్ని సరఫరా చేసే ఇనుప గని?

1) కోర్బా 2) దల్లా రాజహర్‌ 3) ఉమారియా    4) గిరిద్‌


37. ఈశాన్య భారతదేశంలో యురేనియం ఏ కొండల్లో లభిస్తుంది?

1) మిరిక్‌        2) నాగా కొండలు   

3) ఖాసీ కొండలు      4) మిజో కొండలు


38. విద్యుత్తు రంగంలో ఇన్సులేటర్‌గా వాడే ఖనిజం?

1) కాపర్‌  2) సీసం  3) మైకా   4) బెరైటీస్‌


39. భారతదేశంలో అధికంగా లభించే ఇనుపధాతువు?

1) హెమటైట్‌        2) లియోనైట్‌     

3) సిడరైట్‌         4) మాగ్నటైట్‌


40. మాంగనీస్‌ కిందివాటిలో ఏ శిలల్లో లభిస్తుంది?

1) టెర్షియోరీ       2) గోండ్వానా   

3) కడప       4) థార్వార్‌


41. భూగోళంలో మొత్తం మూలకాల్లో సరాసరి ఆక్సిజన్‌ ఎంతశాతం ఉంటుంది?

1) 30%  2) 25%  3) 46%  4) 20%


42. భూగోళంపై ఉన్న భూపటలంలోని మూలకాల్లో సిలికాన్‌ సరాసరి ఎంత శాతం ఉంటుంది?    

1) 29%   2) 27%   3) 50%  4) 15%


43. భూమి లోపల ఉండే మొత్తం మూలకాల్లో నికెల్‌ ఎంత శాతం ఉంటుంది?

1) 2.9%  2) 1.8%  3) 15%  4) 20%


44. భూమి లోపల ఉండే మూలకాల్లో క్యాల్షియం ఎంత శాతం ఉంటుంది?

1) 1.5%   2) 1.9%   3) 2%  4) 3%


45. భూపటలంలోని మూలకాల్లో సోడియం శాతం?

1) 3.8% 2) 1.5% 3) 2.8% 4) 8.1%


46. భూమిలోని మొత్తం మూలకాల్లో సల్ఫర్‌ శాతం ఎంత?    

1) 1.8%  2) 2.9%  3) 1.5%  4) 13%


47. భూపటలంలోని మూలకాల్లో అల్యూమినియం ఎంత శాతం ఉంటుంది?

1) 27%   2) 28%  3) 15%  4) 8.1%


48. భూపటలంలోని మూలకాల్లో మెగ్నీషియం ఎంత శాతం ఉంటుంది?

1) 3.6%  2) 1.5%   3) 8%  4) 1.9%


49. కిందివాటిలో దేన్ని ఎలక్ట్రోప్లేటింగ్, ఫొటోగ్రఫీ పరిశ్రమలో ఉపయోగిస్తారు?

1) సీసం   2) బాక్సైట్‌   3) వెండి   4) రాగి


50. రుద్రసాగర్, శిభ్‌సాగర్‌ చమురు బావులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) పశ్చిమ బెంగాల్‌            2) అస్సాం   

3) మహారాష్ట్ర            4) గుజరాత్‌




సమాధానాలు

1-3; 2-2; 3-2; 4-2; 5-3; 6-2; 7-4; 8-4; 9-4; 10-2; 11-1; 12-3; 13-2; 14-3; 15-4; 16-1; 17-1; 18-3; 19-1; 20-1; 21-3; 22-3; 23-2; 24-4; 25-4; 26-1; 27-3; 28-3; 29-2; 30-2; 31-4; 32-3; 33-2; 34-3; 35-1; 36-2; 37-3; 38-3; 39-1; 40-4; 41-1; 42-2; 43-2; 44-1; 45-3; 46-2; 47-4; 48-2; 49-3; 50-2.


 


రచయిత: బండ్ల శ్రీధర్‌ 

 

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌