• facebook
  • whatsapp
  • telegram

ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు

అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం!

విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకు బోధన లక్ష్యాలు తెలియాలి. బోధించాల్సిన అంశాలు, తీరు గురించి స్పష్టత ఉండాలి. ఇందుకోసం అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కావాలి. ప్రతి పాఠం బోధన ద్వారా పిల్లల్లో వృద్ధి చెందే శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. అందుకు అవసరమైన ఆచరణాత్మక కార్యక్రమాలను రూపొందించుకోవాలంటే అభ్యర్థులు బోధనా శాస్త్రంపై పట్టు పెంచుకోవాలి. అందుకోసం సంబంధిత సిద్ధాంతాలు, వాటిని ప్రతిపాదించిన పరిశోధకులు, వారు ఇచ్చిన వివరణలు, నిర్వచనాలను అధ్యయనం చేయాలి.


ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు విద్య ముఖ్య ఉద్దేశం సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం. 

*  బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యేవి మూడు ప్రశ్నలు. అవి.. 

1) ఏం బోధించాలి?  -  విద్యా ప్రణాళిక అంతటినీ

2) ఎలా బోధించాలి?  -  బోధనా పద్ధతులు

3) ఎందుకు బోధించాలి? -  విలువలు, ఉద్దేశాల కోసం; విద్యా ప్రమాణాల సాధనకు


*  గణితం, భాష, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం   ఒక్కొక్కటి కొన్ని శక్తి సామర్థ్యాలను అభివృద్ధిపరచగలిగిన శక్తులను కలిగి ఉంటాయి. ఈ శక్తులనే ‘విలువలు’ అంటారు.


* గణిత శాస్త్ర బోధనకు కొన్ని శక్తులున్నాయి. వాటిని ‘గణిత బోధనా విలువలు’ అంటారు.


* ఏ ప్రయోజనాలు ఆశించి గణితాన్ని బోధిస్తామో వాటిని ‘గణిత బోధనోద్దేశాలు’ అంటారు. వీటిని ఏకకాల ప్రమాణంలో, ఏక కార్యక్రమం ద్వారా యథాతథంగా పొందడం కుదరదు. 


* గణిత బోధనోద్దేశాలను సిద్ధింపజేయడానికి వీటిని చిన్నచిన్న ఆచరణాత్మక కార్యక్రమాలుగా విభజిస్తారు. వాటిని ఏకకాల ప్రమాణంలో, ఏక కార్యక్రమం ద్వారా పొందడం సాధ్యమవుతుంది. ఈ చిన్నచిన్న ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాన్నే ‘లక్ష్యాలు’ అంటారు.


* ఈ ఆచరణాత్మక కార్యక్రమాల ఫలితాలు విద్యార్థుల ప్రవర్తనలో కొన్ని మార్పులు తెస్తాయి. వాటినే ‘స్పష్టీకరణలు’ అంటారు.


మాదిరి ప్రశ్నలు

1. ‘‘గణిత అధ్యయనం ద్వారా విద్యార్థులు ఏకాగ్రత, సమయపాలన, పరిశుభ్రత, క్రమయుతం అలవరచుకుంటారు’’ దీని ద్వారా పెంపొందే విలువ?

1) కళాత్మక విలువ  2) క్రమశిక్షణ విలువ 

3) ప్రయోజన విలువ  4) సాంస్కృతిక విలువ


2. జ్ఞానాత్మక రంగానికి చెందిన లక్ష్యాలను వర్గీకరించినవారు?

1) దవే, అతడి అనుచరులు

2) హరే, అతడి అనుచరులు

3) బ్లూమ్, అతడి అనుచరులు

4) సింప్సన్, అతడి అనుచరులు


3.  ‘అన్ని విజ్ఞాన శాస్త్రాలకు మూలం, ద్వారం గణితం’అన్నది ఎవరు?

1) బేకన్‌  2) లైబ్నిజ్డ్‌ 

3) కార్లైల్‌   4) ప్లేటో 


4. కిందివాటిలో బ్రెస్లిచ్‌ ప్రకారం విద్యావిలువ  కానిది?

1) నైపుణ్యం     

2) సమస్యలు - పద్ధతులు 

3) అవగాహన   4) ఆలోచనాసరళిగా గణితం


5. ‘‘జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించకున్నాక దాన్ని చేరుకోవడానికి నీ  శక్తినంతా ఉపయోగించు.’’ అని అన్నవారు?

1) బాటియా  2) జె.కె.సూద్‌  

3) ప్రాస్ట్‌     4) కార్లైల్‌


6.  అభ్యాసకుడు వృత్తాన్ని గీసేందుకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు...  ఇది ఎలాంటి నైపుణ్యం?

1) గణన నైపుణ్యం     

2) పట్టికలను చదివే నైపుణ్యం 

3) హస్తలాఘవ నైపుణ్యం 

4) చిత్రలేఖన నైపుణ్యం


7.  ‘తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందింది?

1) వినియోగం  2) అవగాహన 

3) నైపుణ్యం  4) జ్ఞానం


8.  సవరించిన బ్లూమ్స్‌ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకు పెట్టిన పేరు ఏది?

1) జ్ఞాపకంలో ఉంచడం     

2) అవభేదం 

3) సృష్టించడం/ఉత్పత్తి చేయడం

4) మూల్యాంకనం చేయడం


9.  6, 11, 23, 15, 5, 20, 4, 3 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణం?

1) సమస్యా సాధన     

2) వ్యక్తపరచడం  

3) అనుసంధానం     

4) కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం


10. ‘‘సంఖ్యలతో వ్యవహరించినట్లు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం’’ అని అన్నవారు?

1) లైబ్నిజ్డ్‌   2) జి.హెచ్‌.హర్డీ 

3) బ్రహ్మగుప్త  4) ఐన్‌స్టీన్‌


11.  గణిత సమస్యలన్నీ దత్తాంశాల నుంచి సారాంశాన్ని కనుక్కునే పద్ధతిలో.. ఏ విలువ అలవడుతుంది?

1) సాంస్కృతిక విలువ  2) క్రమశిక్షణ విలువ

3) ప్రయోజన విలువ   4) బౌద్ధిక విలువ


12. కింది గణిత విలువల్లో యంగ్‌ సూచించనిది?

1) గణిత ప్రయోజన విలువ        

2) గణితం యొక్క ఇతర విధులు

3) ఒక ఆలోచనా సరళిగా గణితం    

4) సమస్యలు - పద్ధతులు


13. కిందివాటిలో మున్నిక్‌ వర్గీకరణకు సంబంధించని గణిత విద్యావిలువ ఏది?

1) క్రమశిక్షణ విలువ  2) సాంస్కృతిక విలువ

3) సమాచార విలువ  4) సిద్ధపరిచే విలువ


14. ‘ఆధునిక మానవుడి కార్యకలాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిన్నింటినీ గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు.’ అని తెలిపినవారు?

1) సింప్సన్‌  2) స్మిత్‌       

3) ఐన్‌స్టీన్‌   4) మిల్టన్‌


15. ‘విలువ కట్టడం’ అనే లక్ష్యం ఏ రంగానికి చెందుతుంది?

1) భావావేశ రంగం 

2) మానసిక చలనాత్మక రంగం 

3) జ్ఞానాత్మక రంగం           

4) 2, 3


16. లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు ఉండాలని తెలిపినవారు? 

1) జాన్‌ డ్యూయి  2) జాన్‌కీడ్స్‌    

3) ప్రాస్ట్‌  4) జె.కె.సూద్‌


17. భావావేశ రంగంలో అత్యున్నతస్థాయి లక్ష్యం?

1) అనుకరణం  2) లాక్షణీకరణం     

3) వ్యవస్థాపన 4) సహజీకరణం 


18. ‘‘విద్యార్థి గ్రాఫ్‌లు, 2D, 3D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు’’ అనేది కింది ఏ  విద్యాప్రమాణాన్ని సూచిస్తుంది?

1) వ్యక్తపరచడం  2) దృశ్యీకరణ-ప్రాతినిధ్యపరచడం

3) అనుసంధానం  4) కారణాలు - నిరూపణలు


19. కిందివాటిని జతపరచండి.

ఎ) గణితం అంటే సూత్రయుక్తమైన శాస్త్రం.      1) పావులూరి మల్లన్న 
బి) విద్యాలక్ష్యాలే విద్యా విలువలు. 2) కన్నింగ్‌ హామ్‌ 
సి) ఉద్దేశాలు వ్యూహాన్నితెలియజేస్తాయి. 3) ఎగ్లెస్టన్‌
డి) ఉద్దేశం అనేది మన కళ్లముందు ఎప్పుడూ కనిపిస్తూ దిశానిర్దేశనం చేస్తుంది.       4) జాన్‌ డ్యూయి 

1) ఎ-1, బి-2, సి-3, డి-4    

2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-2, బి-1, సి-4, డి-3                 

4) ఎ-3, బి-2, సి-1, డి-4


20. ‘‘సమాజంలోని ఏ వ్యక్తికైనా, వృత్తికైనా గణిత జ్ఞానం అవసరం.’’ అనేది ఏ విద్యా విలువకు చెందింది?

1) కళాత్మక విలువ   2) క్రమశిక్షణ విలువ     

3) సమాచార విలువ  4) ప్రయోజన విలువ


21. ‘2‘గణితంలో రిడిల్స్, ఆటలు, పజిల్స్, వింత  చదరాలతో సమస్యలను సాధించడం ద్వారా  విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు.’’ ఇక్కడ పెంపొందే విలువ?

1) కళాత్మక విలువ    2) సాంఘిక విలువ    

3) క్రమశిక్షణ విలువ  4) ఆచరణాత్మక విలువ


22. ‘తెలుసుకోవడం, ఇష్టపడటం, నియంత్రిత అవధానం’ అనేవి స్థాయులుగా ఉన్న లక్ష్యం?

1) విలువ కట్టడం    2) గ్రహించడం    

3) ప్రతిస్పందించడం  4) వ్యవస్థాపక


23. ‘రాంబస్‌కు, సమాంతర చతుర్భుజానికి మధ్య ఉన్న సామ్య విభేదాలను విద్యార్థి తెలుపుతాడు.’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?

1) నైపుణ్యం   2) వినియోగం    

3) అవగాహన   4) జ్ఞానం


24. భావావేశ రంగంలో ‘వ్యవస్థాపనం’ లక్ష్యం కంటే ఉన్నతస్థాయి లక్ష్యం?

1) సహజీకరణం    2) శీలస్థాపనం

3) విలువ కట్టడం    4) ప్రతిస్పందించడం


25. 5 × 6 = 30ను సంఖ్యారేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణం?

1) అనుసంధానం    

2) ప్రాతినిధ్యపరచడం - దృశ్యీకరణ

3) వ్యక్తపరచడం        

4) కారణాలు చెప్పడం - నిరూపణలు చేయడం 


26. భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను వర్గీకరించినవారు?

1) క్రాత్‌వాలా 2) మాసియా

3) ఆర్‌.హెచ్‌.దవే    4) 1, 2


27. ‘విద్యార్థి కారణాంకాలు కనుక్కోవడంలో మౌఖిక గణనలు వేగంగా, కచ్చితంగా చేస్తాడు’. ఈ వాక్యం సూచించే లక్ష్యం?

1) నైపుణ్యం    2) వైఖరి        

3) అవగాహన    4) వినియోగం


28. దీర్ఘచతురస్రం : (lxb) : చతురస్రం : ....... ఇది ఏ రకానికి చెందిన ప్రశ్న?

1) మాస్టర్‌లిస్ట్‌ రూపం    2) వర్గీకరణ రూపం

3) సాదృశ్య రూపం       4) సంసర్గం


29. జ్ఞానాత్మక రంగంలో నాలుగో లక్ష్యం ఏది?

1) వినియోగం 2) విశ్లేషణ

3) సంశ్లేషణ 4) వ్యవస్థాపనం


30. కిందివాటిలో మానసిక చలనాత్మక రంగానికి  చెందనిది ఏది

1) అనుకరణ  2) సున్నిశితత్వం

3) విలువ కట్టడం    4) సహజీవనం


సమాధానాలు
 

 1-2; 2-3; 3-1; 4-4; 5-4; 6-3; 7-4; 8-3; 9-4; 10-1; 11-2; 12-4; 13-3; 14-2; 15-1; 16-3;  17-2; 18-2; 19-1; 20-4; 21-1; 22-2; 23-3;  24-2; 25-2; 26-4; 27-1; 28-3; 29-2; 30-3.

రచయిత : సి మధు

Posted Date : 07-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌