• facebook
  • whatsapp
  • telegram

విశిష్ట అలోహంతో విభిన్న ప్రయోజనాలు

కర్బన రసాయన శాస్త్రం

సృష్టిలో అత్యధిక సమ్మేళనాలు, రూపాంతరాలను ఏర్పరిచే మూలకం కార్బన్‌. ఆ సమ్మేళనాల నిర్మాణం, లక్షణాలు, కూర్పు, ప్రతిచర్యల అధ్యయనమే కర్బన రసాయన శాస్త్రం. దీనికి నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మొక్కలు, జంతువుల పోషణకు ప్రధానమైన కార్బోహైడ్రేట్‌లు కర్బన సమ్మేళనమే. బొగ్గు, వజ్రం, గ్రాఫైట్‌ లాంటి అలోహాలతో పాటు పెట్రోలియం, నానోట్యూబులు, గ్రాఫిన్‌ వంటి పారిశ్రామిక ఉత్పత్తులు కూడా కార్బన్‌ రూపాంతరాలే. ఈ మూలకపు రూపాలు, వాటిలోని అణుబంధాలు, ప్రదర్శించే ధర్మాలు, భిన్న ప్రయోజనాలు, సంబంధిత ఫార్ములాలను పోటీ పరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.


1.     కార్బన్‌ అనేది ఒక?

1) లోహం     2) అలోహం 

3) అర్ధలోహం     4) పైవన్నీ


2.     కిందివాటిలో కార్బన్‌ ఐసోటోపు కాని దాన్ని గుర్తించండి.

1) 12C6     2) 13C6     3) 14C6     4) 11C6


3.     కార్బన్‌ సంయోజకత ఎంత? 

1) 4     2) 2     3) 3     4) 1


4.     ప్రకృతిలో వైవిధ్యమైన, అత్యధిక సమ్మేళనాలు ఉన్న మూలకం కావడం వల్ల దేన్ని ‘మూలకాలకు రారాజు’ అని పిలుస్తారు?

1) అయోడిన్‌        2) ఫాస్ఫరస్‌   

3) కార్బన్‌         4) సల్ఫర్‌


5.     కిందివాటిలో అత్యధిక కాటనేషన్‌ సామర్థ్యం ఉన్న మూలకం? 

1) సల్ఫర్‌  2) కార్బన్‌  3) క్లోరిన్‌  4) ఫ్లోరిన్‌


6.     కిందివాటిలో కార్బన్‌ రూపాంతరం కానిది?

1) గ్రాఫైట్‌         2) వజ్రం  

3) గ్రాఫిన్‌       4) ఆప్టికల్‌ ఫైబర్‌


7.     కిందివాటిలో 19వ శతాబ్దం మూలకంగా పిలిచే పదార్థం?

1) అయోడిన్‌      2) ఆస్టాటిన్‌ 

3) వజ్రం      4) బొగ్గు


8.     కిందివాటిలో కార్బన్‌ స్ఫటిక రూపాంతరం కానిది?

1) వజ్రం        2) కోక్‌  

3) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌     4) నానో ట్యూబ్స్‌


9.     కిందివాటిలో కార్బన్‌ అస్ఫటిక రూపాంతరం కానిది? 

1) వృక్ష చార్‌కోల్‌        2) జంతు చార్‌కోల్‌  

3) పెట్రోలియం        4) గ్రాఫిన్‌ 


10. ప్రకృతిసిద్ధంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైంది?

1) కార్బన్‌  2) టంగ్‌స్టన్‌  3) వజ్రం  4) కోక్‌


11. వజ్రం సంకరీకరణాన్ని గుర్తించండి.

1) sp        2) sp1      3) sp2      4) sp3


12. వజ్రం వక్రీభవన గుణకం ఎంత? 

1) 1.54  2) 2.42  3) 1.24   4) 4.24


13. క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌లో ఉపయోగించే అలోహం?

1) గ్రాఫైట్‌  2) గ్రాఫిన్‌  3) డైమండ్‌  4) కోక్‌


14. కార్బన్‌ రూపాంతరాల్లో అధిక స్థిరమైన రూపాంతరం?

1) కోక్‌      2) గ్రాఫైట్‌  

3) గ్రాఫిన్‌     4) పెట్రోలియం


15. ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రోటైపింగ్‌లలో పూత పూయడానికి ఉపయోగించే మూలకం?

1) గ్రాఫైట్‌       2) గ్రాఫిన్‌   

3) నల్లని మసి       4) కోల్‌తార్‌


16. లెడ్‌ పెన్సిల్‌లో ఉపయోగించే మూలకం?

1) గ్రాఫిన్‌       2) కోల్‌తార్‌   

3) గ్రాఫైట్‌       4) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌


17. గ్రాఫైట్‌లోని బంధకోణం?

1) 180°  2) 120°  3) 109°28'  4) 107°


18. బక్‌ మినిస్టర్‌ ఫుల్లరిన్‌లో ఉండే కార్బన్‌ పరమాణువుల సంఖ్య?

1) 50    2) 60    3) 45    4) 65


19. బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌లో ఉండే కార్బన్‌ పరమాణువుల మధ్య బంధ దూరం?

1) 1.4 A°   2) 2.4 A°   3) 1.7 A°   4) 2.7 A°


20. అత్యధిక నిరోధకత ఉన్న బ్యాక్టీరియాను అంతమొందించే విశిష్ట రోగ నిరోధక ఔషధంగా ఉపయోగించే కార్బన్‌ రూపాంతరం?

1) వజ్రం       2) గ్రాఫైట్‌   

3) గ్రాఫిన్‌       4) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌


21. నానో ట్యూబ్స్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) సుమియో లీజిమా       2) హెచ్‌.డబ్ల్యూ.క్రోటో  

3) స్మాలి       4) కార్ల్‌


22. అతిచిన్నదైన కణంలోకి ఏదైనా జీవాణువులను ప్రవేశపెట్టడానికి ఉపయోగించే కార్బన్‌ రూపాంతరం?

1) గ్రాఫైట్‌       2) వజ్రం    

3) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌     4) నానో ట్యూబ్స్‌


23. కిందివాటిలో రాగి కంటే మంచి విద్యుత్‌ వాహకం, స్టీల్‌ కంటే 200 రెట్లు బలమైన కార్బన్‌ రూపాంతరం?

1) గ్రాఫైట్‌       2) వజ్రం   

3) నానో ట్యూబ్స్‌       4) గ్రాఫిన్‌


24. కార్బన్‌ పరమాణువుల మధ్య ఏకబంధాలున్న హైడ్రోకార్బన్‌లు?

1) ఆల్కీన్‌లు       2) ఆల్కైన్‌లు   

3) ఆల్కేన్‌లు       4) ఈథీన్‌లు


25. కార్బన్‌ పరమాణువుల మధ్య కనీసం ఒక త్రికబంధం ఉన్న హైడ్రోకార్బన్‌లు?

1) ఆల్కీన్‌లు       2) ఆల్కైన్‌లు   

3) ఆల్కేన్‌లు       4) ఈథీన్‌లు


26. కిందివాటిలో ఎమీన్‌ల ప్రమేయ సమూహాన్ని గుర్తించండి.

1) -NH2 2) -OH 3) -C  C- 4) -NO2


27. కిందివాటిలో ఆల్డీహైడ్‌ల ప్రమేయ సమూహాన్ని గుర్తించండి.


28. ఆల్కేన్‌ల సాధారణ ఫార్ములా?

1) CnH2n+2      2) CnH2n

3) CnH2n−2       4) CnH2n−1


29. ఫ్రక్టోజ్‌లో ఉండే తియ్యదనపు సంఖ్య?

1) 100    2) 74    3) 32    4) 173


30. గెలాక్టోజ్‌లో ఉండే తియ్యదనపు సంఖ్య?

1) 74     2) 16    3) 100   4) 32


31. వరి, గోధుమ, మొక్కజొన్న, బంగాళాదుంపల నుంచి లభించే పిండిపదార్థం?

1) సెల్యులోజ్‌       2) సుక్రోజ్‌   

3) స్టార్చ్‌       4) ఫ్రక్టోజ్‌


32. బార్లీ గింజల నుంచి లభించే పిండిపదార్థం?

1) సుక్రోజ్‌ 2) గెలాక్టోజ్‌ 3) స్టార్చ్‌  4) మాల్టోజ్‌


33. చల్లని నీటిలో కరిగిన ఆక్సిజన్‌ పరిమాణం?

1) 5 ppm 2) 10 ppm 3) 15 ppm 4) 3 ppm


34. నీటి స్వచ్ఛతను తెలుసుకునే అంశాలు గుర్తించండి.

1) BOD 2) COD 3) DO    4) పైవన్నీ


35. సముద్రపు నీటి pH విలువ?

1) 5.6    2) 6.7   3) 7.8   4) 4.2


36. నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించే పద్ధతుల్లో సరికానిది?

1) సోడా పద్ధతి           2) కాల్గన్‌ పద్ధతి   

3) అయాన్‌ వినిమయ పద్ధతి   4) క్లార్క్‌ పద్ధతి


37. తైల వర్ణ చిత్రాల రంగులను పునరుద్ధరించడానికి ఉపయోగించే పదార్థం?

1) H2O2 2) HO 3) HNO3 4) N2O


38. పర్‌ హైడ్రల్‌ అంటే?

1) 20% H2O2     2) 30% H2O2

3) 10% H2O2      4) 15% H2O2


39. వాటర్‌ గ్యాస్‌ రసాయన ఫార్ములా? 

1) CO + H2        2) CO + N2

3) CO + NH3    4) C2H2


40. ఎప్సమ్‌ లవణం రసాయన ఫార్ములా?

1) CaSO4.2H2O 2) CaCO3.10H2O

3) CuSO4.-5H2O 4) MgSO4.7H2O


41. నీటి తాత్కాలిక కాఠిన్యతకు సంబంధించి సరైంది?

1) కాల్గన్‌ పద్ధతి    2) సోడా పద్ధతి   

3) క్లార్క్‌ పద్ధతి    4) అయాన్‌ వినిమయ పద్ధతి


42. నిత్యజీవితంలో జుట్టు విరంజనకారిగా ఉపయోగించే పదార్థం?

1) H2O2 2) HNO3 3) HO 4) HNO2


43. దేన్ని గాలిలో మండిస్తే కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడుతుంది?

1) వజ్రం       2) గ్రాఫైట్‌   

3) గ్రాఫిన్‌       4) నానో ట్యూబ్స్‌


44. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక విపత్తు అయిన భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన ఎప్పుడు జరిగింది? 

1) 1984  2) 1965  3) 1995  4) 1978


45. ఆల్కైన్‌ల సాధారణ ఫార్ములాను తెలపండి. 

1) CnH2n      2) CnH2n+2

3) CnH2n−2    4) CnH2n−1


46. ఒక రసాయనిక చర్యావేగాన్ని పెంచడానికి తోడ్పడుతూ అది మాత్రం ఎలాంటి రసాయనిక మార్పునకు గురికాని ఉత్ప్రేరకం?

1) Zn 2) Mg 3) Al 4) Ni


47. బొమ్మలు, విగ్రహాల తయారీ, విరిగిన ఎముకలకు కట్టు కట్టడానికి ఉపయోగించే పదార్థం?

1) మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా  2) ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌   

3) జిప్సం        4) క్విక్‌ సిల్వర్‌


48. తేనెతుట్టెను పోలిన షణ్ముఖ నిర్మాణంలో ఉన్న కార్బన్‌ రూపాంతరం?

1) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌     2) నానో ట్యూబ్స్‌   

3) గ్రాఫిన్‌       4) వజ్రం 


49. మూత్రపిండాల్లో రాళ్లు అంటే రసాయనికంగా అవి...

1) కాల్షియం ఆగ్జలేట్‌       2) కాల్షియం ఫాస్ఫేట్‌  

3) యూరిక్‌ ఆమ్ల స్ఫటికాలు   4) పైవన్నీ


50. సబ్బులో ఎంత శాతం వరకు స్వేచ్ఛా ఫ్యాటీ ఆమ్లం, పొటాషియం లవణం ఉంటాయి?

1) 5% - 6%       2) 7% - 10%       

3) 10% - 15%       4) 1% - 5%


51. యూరియాను కనుక్కున్న శాస్త్రవేత్త?

1) ఎఫ్‌.వోలర్‌     2) హెచ్‌.డబ్ల్యూ.క్రోటో

3) స్మాలి        4) సుమియో లీజిమా


52. కిందివాటిలో అసంతృప్త హైడ్రోకార్బన్‌లు అంటే?

1) రెండు కార్బన్‌ పరమాణువుల మధ్య ద్విబంధం లేదా త్రిబంధం

2) రెండు కార్బన్‌ పరమాణువుల మధ్య ఏకబంధం

3) రెండు కార్బన్‌ పరమాణువుల మధ్య ద్విబంధం

4) రెండు కార్బన్‌ పరమాణువుల మధ్య త్రిబంధం


53. ఈథర్‌ ప్రమేయ సమూహాన్ని గుర్తించండి.

1) -OH 2) -C  C-

3) -C-O-C 4) -NH2


54. క్యాన్సర్‌ కణాలను అంతమొందించే ఔషధాల తయారీలో ఉపయోగించే కార్బన్‌ రూపాంతరం?

1) నానోట్యూబ్స్‌      2) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌

3) గ్రాఫిన్‌          4) గ్రాఫైట్‌


55. ఏ పదార్థాన్ని గాలిలో 900°C - 1000°C వరకు వేడిచేస్తే CO2 వాయువు ఏర్పడుతుంది?

1) వజ్రం       2) గ్రాఫైట్‌   

3) గ్రాఫిన్‌       4) బక్‌మినిస్టర్‌ ఫుల్లరిన్‌ 


56. సముద్రపు నీటి pH విలువ?

1) 7.1    2) 7.8    3) 6.8    4) 5.6


57. రసాయనికంగా సబ్బు ఒక?

1) ఆమ్లం  2) క్షారం  3) లవణం  4) తటస్థం


58. కఠినజలంతో కూడా నురగను ఇచ్చే పదార్థం? 

1) సబ్బులు 2) భారజలం 3) ఆమ్లాలు  4) డిటర్జెంట్లు


59. కిందివాటిలో మార్ష్‌ వాయువును గుర్తించండి.

1) ఇథైన్‌       2) కాల్షియం ఫాస్ఫేట్‌  

3) మీథేన్‌      4) గంధకామ్లం


60. చక్కెర పరిశ్రమలో చెరకు రంగును వివర్ణం చేయడానికి ఉపయోగించే పదార్థం?

1) బొగ్గు       2) సున్నపురాయి

3)     4) కాల్షియం ఫాస్ఫేట్‌


సమాధానాలు 


1-2; 2-4; 3-1; 4-3; 5-2; 6-4; 7-4; 8-2; 9-4; 10-3; 11-4; 12-2; 13-3; 14-2; 15-1; 16-3; 17-2; 18-2; 19-1; 20-4; 21-1; 22-3; 23-4; 24-3; 25-2; 26-1; 27-2; 28-1; 29-4; 30-2; 31-3; 32-4; 33-2; 34-4; 35-3; 36-4; 37-1; 38-2; 39-1; 40-4; 41-3; 42-1; 43-2; 44-1; 45-3; 46-4; 47-2; 48-3; 49-4; 50-2; 51-1; 52-1; 53-3; 54-2; 55-1; 56-2; 57-3; 58-4; 59-3. 60-1. 


రచయిత: చంటి రాజుపాలెం
 

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెకండరీ గ్రేడ్ టీచర్స్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌